Tick tock
-
ట్రంప్.. చైనాతో దోస్తీనా? కుస్తీనా?.. ఐదు పాయింట్లలో స్పష్టం
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడైన తర్వాత చైనా విషయంలో ఆయన వైఖరి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రపంచంలోని ఈ రెండు శక్తిమంతమైన దేశాల మధ్య సంబంధాల్లో ఇప్పటికే ఉద్రిక్తతలున్నాయి. అయితే వాషింగ్టన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే ఈ రెండు దేశాలు పరస్పర చర్చలపై ఎంతో ఆసక్తి చూపించాయి. భవిష్యత్తులో అమెరికా-చైనా మధ్య సంబంధాలలో సానుకూల మార్పును సూచించే ఐదు పరిణామాలు ఇవేనంటూ విశ్లేషకులు చెబుతున్నారు.1. ఇటీవల ట్రంప్‌తో జరిగిన ఫోన్ సంభాషణలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అమెరికా-చైనా సంబంధాలలో ‘కొత్త ప్రారంభ స్థానం’ కోసం పిలుపునిచ్చారు. ఇరుదేశాల ‘విస్తృత ఉమ్మడి ప్రయోజనాలను’ ప్రస్తావించారు.2. ఈ సంభాషణలో టిక్‌టాక్‌పై కూడా చర్చ జరిగిందని ట్రంప్ అన్నారు. నిజానికి అమెరికా టిక్‌టాక్‌ను నిషేధించడానికి సిద్ధమయ్యింది. అయితే ట్రంప్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే టిక్‌టాక్ ప్లాట్‌ఫామ్‌పై నిషేధాన్ని 75 రోజుల పాటు వాయిదా వేశారు.4. జీ జిన్‌పింగ్.. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌ను పంపారు. అమెరికా అధ్యక్షుని ప్రమాణ స్వీకారోత్సవానికి బీజింగ్ నుంచి పంపిన అత్యంత సీనియర్ అధికారి హాన్ జెంగ్.5. ట్రంప్ వైట్ హౌస్‌లో తన మొదటి రోజు (జనవరి 20)ప్రకటనల్లో చైనా వస్తువులపై సుంకాల విషయాన్ని ప్రస్తావించలేదు. మొదటి రోజే ఆయన దీనిని ప్రకటిస్తారని చాలా మంది పరిశీలకులు భావించారు. కానీ అలా జరగలేదు.పన్నుల గురించి మీడియా ట్రంప్‌ను అడిగినప్పుడు తన మునుపటి అధ్యక్షుని కాలంలో విధించిన పన్నులు ఇప్పటికీ అమలులో ఉన్నాయని అన్నారు. మెక్సికన్, కెనడియన్ వస్తువులపై సుంకాలు ఫిబ్రవరి ఒకటి నుండి అమల్లోకి వస్తాయని చెప్పారు. టిక్‌టాక్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం మంచి విషయమే అవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఇది కూడా చదవండి: Delhi Elections-2025: 12 ఎస్సీ సీట్లు.. విజయానికి కీలకం -
గుడ్‌న్యూస్ : టిక్‌టాక్ బ్యాన్పై వెనక్కి..
వాషింగ్టన్ : జాతీయ భద్రతను కాపాడటానికి చైనా సామాజిక యాప్‌లు టిక్ టాక్, వీ చాట్ లను ఆదివారం నుంచి నిషేధిస్తూ అమెరికా జారీచేసిన ఆదేశాలపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అమెరికాలో బహుళజాతి కంప్యూటర్ టెక్నాలజీ సంస్థ ఒరాకిల్‌తో టిక్‌టాక్ జట్టు కట్టేందుకు గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. అగ్రరాజ్యంలో తమ కార్యకలాపాల కోసం సాంకేతిక భాగస్వామిగా కొనసాగించేందుకు ఒరాకిల్-వాల్‌మార్ట్ టిక్‌టాక్ యాజమాన్యం వేదికగా ఎంచుకుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో టిక్‌టాక్‌ను సొంతం చేసుకోవాలన్న మైక్రోసాఫ్ట్-వాల్‌మార్ట్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాగా టిక్‌టాక్, వీ చాట్ యాప్‌ల యాజమాన్యాలు అమెరికా చేతికి రాకపోతే, వాటిపై నిషేధం విధిస్తున్నట్టు ట్రంప్ గతనెలలోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారం సెప్టెంబర్ 20 నుంచి నిషేదం అమల్లోకి రానుంది. అయితే తాజా ఒప్పందం ప్రకారం.. ఈ గడువును సెప్టెంబర్ 27 వరకు పెంచినట్లు తెలుస్తోంది. టిక్‌టాక్, ఒరాకిల్ మధ్య డీల్‌కు అమెరికా ప్రభుత్వం త్వరలోనే అధికారిక ఆమోదముద్ర పడనుంది. దీనిపై ట్రంప్ ఇదివరకే తుది నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. టిక్‌టాక్, వీచాట్‌ల బ్యాన్.. చైనా స్పందన) జాతీయ భద్రతకు ముప్పుగా చూపుతూ దేశీయ కార్యకలాపాలను అమెరికా సంస్థకు అమ్ముకోకపోతే ఈ నెల 20 నుంచి టిక్‌టాక్ యాప్‌పై నిషేధం విధిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒరాకిల్ చేతికి అమెరికా టిక్‌టాక్ ఆపరేషన్స్ వచ్చాయి. అయితే ఈ డీల్ విలువ, టిక్‌టాక్‌లో ఒరాకిల్‌కు మెజారిటీ వాటా ఏదైనా దక్కబోతున్నదా? అన్న వివరాలపై మాత్రం స్పష్టత లేదు.. అమెరికాలో టిక్‌టాక్ వ్యాపారాన్ని సుమారు రూ.1.84 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ డీల్‌కు అమెరికా ప్రభుత్వం అనుమతి కూడా రావాల్సి ఉన్నది. మరోవైపు టిక్‌టాక్ యుఎస్ కార్యకలాపాలను సంపాదించడానికి ఆసక్తి ఉందని మైక్రోసాఫ్ట్ ఆగస్టు ప్రారంభంలో తెలపగా.. దానిని టిక్‌టాక్ యాజమాన్యం సున్నితంగా తిరస్కరించింది. చివరికి ఒరాకిల్ సంస్థ టిక్ టాక్ కొనుగోలుకు సిద్ధమైంది. దీంతో పూర్తి హక్కులు అమెరికా సంస్థదై ఉండాలన్న తన వాదనకు ఒరాకిల్ కట్టుబడి ఉంది. అంతేకాదు ఈ ఒప్పందం ద్వారా గణనీయమైన వాటా ప్రభుత్వ ఖజానాకు చేరాలనేది ట్రంప్ ప్రధాన ఉద్దేశం కూడా నెరవేరనుంది. -
టిక్‌టాక్ మహిళలతో ఎస్ఐ హంగామా..
చెన్నై ,టీ.నగర్: టిక్‌టాక్ యాప్ ద్వారా అనేక కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. అనేక హత్యలు చోటుచేసుకుంటున్నాయి. టైంపాస్ కోసం వీటిని పోస్టు చేస్తున్న వారు క్రమంగా టిక్‌టాక్ వ్యామోహంలో మునిగి తమ ఉద్యోగాలు, కుటుంబ సంబంధాలు అన్నింటినీ కోల్పోయి వీధినపడుతున్నారు. ప్రస్తుతం ఇదే కోవలో చెన్నై సెక్రటరియేట్ కాలనీ పోలీసు స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న కల్యాణ సుందరం (53) చేరారు. ఇతను టిక్‌టాక్‌లో పలువురి మహిళలతో ద్వంద్వార్థ సంభాషణలు చేస్తూ వందలాది వీడియోలను అప్లోడ్ చేస్తున్నారు. 2019 ఏప్రిల్ నుంచి మహిళలతో డ్యూయెట్లు పాడడం, నృత్యాలు చేయడం వంటి వేలాది వీడియోలను అప్లోడ్ చేశారు. అన్ని పాటలు, సంభాషణలు ద్వందార్థాలతో ఉంటున్నాయి. (టిక్‌టాక్ స్టార్ ఆత్మహత్య.. అనుమానాలు) పోలీసుశాఖలో ముఖ్యంగా ప్రస్తుతం కరోనా వైరస్ అధికంగా వ్యాపిస్తున్నా రోజుకు సగటున 20కి పైగా పాటలను అప్లోడ్ చేస్తున్నారు. ఈ వీడియోలన్నీ పోలీసుస్టేషన్ లోపలే తీస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసుల మధ్య అసంతృప్తి కలిగిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈయన విధుల్లో ఉన్నప్పుడు అనేక సమయాల్లో సెల్ఫోన్లలో మాట్లాడుతునే ఉంటాడని, అనేకసార్లు ఉన్నతాధికారుల మందలింపులకు గురైనట్లు సమాచారం. అందుచేత పోలీసు వృత్తికి ఇటువంటి కళంకం ఏర్పరిచే వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు పోలీసులు కోరుతున్నారు. -
క్వారంటైన్లోకి వెళ్లనంటున్న ‘రౌడీ బేబీ’
సాక్షి, చెన్నై : టిక్‌టాక్ ద్వారా ఇటీవల కాలంగా సెలబ్రటీలుగా మారిన యువతులు, యువకులు, మహిళలు ఎందరో. వీరిలో రౌడీ బేబీగా తమిళనాట టిక్‌టాక్‌లో వివాదాల కేంద్ర బిందువుగా మారిన సూర్య అలియాస్ సుబ్బలక్ష్మి క్వారంటైన్లోకి నెట్టబడింది. తాను వెళ్లబోనంటూ మొండి కేసిన ఆమెను బుజ్జగించడం అధికారులకు శ్రమగా మారింది. చివరకు ఆమె డిమాండ్లకు అంగీకరించి సకల వసతులు కల్పించాల్సి వచ్చింది.(లాడ్జ్‌లో మహిళ హత్య.. యువకునితో వీడియోలపై) టిక్‌టాక్ యాప్ ద్వారా తమలోని ప్రతిభను చాటుకునేందుకు ఎందరో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు తమ అందాలను ఆర బోస్తుంటారు. ఇంకొందరు వివాదాలు, రచ్చ, చర్చ అంటూ ముందుకు సాగుతున్నారు. ఈ యాప్‌ను మంచికి ఉపయోగించే వాళ్లు ఏ మేరకు ఉన్నా, స్వలాభం కోసం ఉపయోగించుకునే వాళ్లు అదేస్థాయిలో ఉన్నారు. ఆ దిశగా తమిళనాటు టిక్ టాక్ రౌడీ బేబి అంటూ సుర్యా అలియాస్ సుబ్బలక్ష్మి ఆ యాప్‌ను ఉపయోగించే వాళ్లు, చూసే వాళ్లకు సుపరిచితురాలే. టిక్‌టాక్‌లో ఆమె అందాలను చూసి సింగపూర్‌కు ఆహ్వానించి మర్యాదలు చేసిన వాళ్లూ ఉండటం గమనార్హం. లాక్డౌన్ ముందుగా ఈ రౌడీ బేబీని సింగపూర్‌కు ఎవరో సొంత ఖర్చులతో రప్పించుకున్నారు. లాక్డౌన్ అమల్లోకి రావడంతో ఈ మూడున్నర నెలలు సింగపూర్‌కే పరిమితం అయ్యింది. అక్కడకు వెళ్లినా, టిక్‌టాక్‌ను వదలి పెట్టలేదు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం లాక్డౌన్ సడలింపులో భాగంగా విదేశాల్లో ఉన్న వాళ్లను స్వదేశానికి రప్పించేందుకు తగ్గ చర్యలు చేపట్టి ఉన్నారు. దీంతో ఈ రౌడీ బేబీని సింగపూర్ నుంచి పంపించేశారు. క్వారంటైన్లోకి వెళ్లనని పట్టు సింగపూర్ నుంచి మంగళవారం కోయంబత్తూరుకు విమానంలో ఈ బేబీ వచ్చింది. ఆమెను పరిశోధించిన అధికారులు 14 రోజుల స్వీయ నిర్భంధం అంటూ క్వారంటైన్‌కు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే, విమానాశ్రయ అధికారుల కళ్లగప్పి తప్పించుకున్న ఈ సూర్య, తిరుప్పూర్ అయ్యం పాళయంలోకి తన ఇంటికి వచ్చేసింది. అది అద్దె ఇల్లు కావడం, ఐదు ఇళ్లకు కామన్ బాత్రూం ఉపయోగించాల్సి ఉండడంతో పక్కనే ఉన్న వారిలో ఆందోళన బయలు దేరింది. క్వారంటైన్‌కు తరలించకుండా, ఎలా ఈ రౌడీ బేబీని వదలి పెట్టేశారంటూ పక్కంటి వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడకు వచ్చిన అధికారులకు ఈ రౌడీబేబీ నుంచి బెదిరింపులు తప్పలేదు. క్వారంటైన్లోకి వెళ్లాల్సిందేనని అధికారులు ఒత్తిడి తెచ్చినా ఏ మాత్రం ఆమె తగ్గ లేదు. చివరకు పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తారేమో అన్న ఉత్కంఠ అక్కడ నెలకొని ఉన్నా, ఓ పోలీసు రూపంలో పరిస్థితి మారింది. సూర్యను చూడగానే, రౌడీ బేబీ అంటూ పలకరించడం, కాస్త పొగడ్తల పన్నీరు అద్దడంతో ఆమె మెట్టు దిగింది. ఇక్కడే ఉండి పక్కింటి వాళ్లను ఇబ్బంది పెట్టవద్దని, క్వారంటైన్లోకి వెళ్లమంటూ ఆయన సూచించడంతో అంగీకరించింది. అయితే, ఆ తర్వాత ఆమె పెట్టిన డిమాండ్లు అధికారులకు షాక్‌కు గురి చేశాయి. జీహెచ్‌లో తనకంటూ ప్రత్యేక గది ఉండాలని, టిక్ టాక్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని, తాను పిలిస్తే పలికేందుకు , తనకు కావాల్సినవన్నీ సమకూర్చేందుకు సిబ్బంది ఉండాలని డిమాండ్ పెట్టగా, పోలీసులు, వైద్య అధికారులు అంగీకరించారు. -
లాడ్జ్‌లో మహిళ హత్య.. యువకునితో వీడియోలపై
మండ్య: టిక్‌టాక్ వీడియోలు ప్రాణాలు తీస్తున్నాయి. మరో యువకునితో టిక్‌టాక్ వీడియోలు తీస్తోందని మహిళపై ఆగ్రహం పెంచుకున్న ప్రియుడు ఆమెను అంతమొందించాడు. మండ్య జిల్లాలోని శ్రీరంగ పట్టణంలో ఉన్న మైరూమ్ గెస్ట్‌హౌస్‌లో మహిళను కత్తితో పొడిచి హత్య చేశాడు. హతురాలిని మైసూరు కనకనగరకు చెందిన జ్యోతి (35)గా, నిందితున్ని మైసూరు ఇలవాల ప్రాంతానికి చెందిన అనిల్‌గా పోలీసులు గుర్తించారు. బుధవారం అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన ప్రకారం వీరిద్దరూ దగ్గరి బంధువులు. ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది. మంగళవారం మండ్యలోని శ్రీరంగపట్టణంకు వచ్చిన ఈ జంట అక్కడి మైరూమ్ గెస్ట్‌హౌస్‌లో భార్యభర్తలం అని చెప్పి రూం తీసుకున్నారు. (ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య ) 17 సార్లు కత్తితో పొడిచి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మద్యపానం చేశారు. ఇంతలో జ్యోతిని అతడు కత్తితో17 సార్లు పొడిచి చంపి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గదికి తాళం వేసి వెళ్లిపోయాడు. సాయంత్రం ఆరు గంటలైనా అలికిడి లేకపోవడంతో పనివాళ్లు గది తలుపులు కొట్టగా తీయలేదు. వారు అనిల్‌కు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ అని వచ్చింది. వెంటనే డూప్లికేట్ కీతో గది తలుపు తీసి చూడగా గదిలో రక్తం మడుగులో వివస్త్రగా మహిళ మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిశీలించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. ఒప్పుకున్న నిందితుడు బుధవారం అనిల్‌ను మైసూరులో పట్టుకుని విచారించగా అసలు విషయం బయట పెట్టాడు. తమ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని, జ్యోతి ఇటీవల ఒక యువకునితో కలిసి టిక్‌టాక్ వీడియోలు చేయడం చూసి ఓర్వలేకపోయినట్లు చెప్పాడు. దీంతో ఆమెను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. -
టిక్‌టాక్.. తీసింది ప్రాణం!
హోసూరు: టిక్‌టాక్‌లో పేరుపొందాలనే తపనతో వినూత్నంగా విన్యాసాలు చేస్తూ కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. టిక్‌టాక్ వీడియో తీస్తూ ప్రాణంతో ఉన్న చేపను మింగిన యువకుడు ఊపిరాడక చనిపోయిన సంఘటన గురువారం కర్ణాటక రాష్ట్రం హోసూరులో చోటు చేసుకొంది. హోసూరులోని కేలైకుంట పార్వతీనగర్‌కు చెందిన శరవణన్ కొడుకు వెట్రివేల్(22) డిగ్రీ విద్యార్థి. టిక్‌టాక్‌లో ప్రదర్శన కోసం ప్రాణంతో ఉన్న చేపను మింగాడు. అది గొంతులో ఇరుక్కుని శ్వాస ఆడక గిలగిల్లాడుతున్న వెట్రివేల్‌ను హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిశీలించిన డాక్టర్లు అప్పటికే అతడు మృతి చెందినట్లు ధృవీకరించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
టిక్‌టాక్ వద్దన్నందుకు తల్లీ కొడుకుపై దాడి
జూబ్లీహిల్స్: చీకటి పడిన తర్వాత కూడా బస్తీలో రాత్రి 9 గంటల వరకు ఉంటూ టిక్‌టాక్ వీడియోలు తీయవద్దని చెప్పినందుకు ఓ యువకుడిని, అతని తల్లిపై కొంత మంది దాడి చేసిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు.. బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని సింగాడికుంట దోభీఘాట్ బస్తీలో నివాసం ఉంటున్న సురేష్ సీఎం క్యాంప్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ విభాగంలో అటెండర్‌గా పని చేస్తుంటాడు. (టిక్‌టాక్ పిచ్చిలో పిల్లికి ఉరేసి చంపాడు) శనివారం రాత్రి కొంత మంది యువకులు సురేష్‌పై దాడి చేస్తుండగా వారిని ఆపేందుకు వెళ్లిన అతని తల్లిని కూడా కొట్టారు. రోజూ రాత్రి పొద్దుపోయే దాకా పది మంది వరకు యువకులు ఇక్కడే కూర్చొని టిక్‌టాక్ వీడియోలు తీస్తూ న్యూసెన్స్‌కు పాల్పడుతున్నారని, ఇలా చేయవద్దని సురేష్ ప్రశ్నించడంతో ఆ యువకులు ఆగ్రహం చెంది దాడి చేశారు. తనపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీని కూడా పోలీసులకు అందించడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వన్యప్రాణులను చంపి టిక్‌టాక్‌లో పోస్టు..
అనంతపురం, కంబదూరు: వన్యప్రాణులను చంపి టిక్‌టాక్‌లో పోస్టు చేసిన ఓ వ్యక్తిని అటవీ అధికారులు అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. రామగిరి మండలం పేరూరుకు చెందిన నాగార్జున అనే యువకుడు కంబదూరు మండలం అయ్యంపల్లికి చెందిన బోయ నరసింహులు అనే వ్యక్తి వద్ద జీతగాడిగా ఉన్నాడు. రోజూ గొర్రెలను మేపడానికి పొలాల్లోకి వెళ్లేవాడు. అయితే ఇటీవల నాగార్జున ఓ జింక పిల్లను పట్టుకొని దానిని అడిస్తూ మేక పాలను తాపడం, కుందేళ్లను చంపి దాని మాంసాన్ని కుక్కలను వేయడం వంటి పనులు చేస్తూ వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేశాడు. వీడియోలను జిల్లా ఫారెస్ట్ అధికారి జగన్నాథం చూసి వెంటనే నిందితుడిపై కేసు నమోదు చేయాలని కళ్యాణదుర్గం అటవీ అధికారులను ఆదేశించారు. సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు సెక్షన్ ఆఫీసర్ రామచంద్రనాయక్ తెలిపారు. -
ఉడుము బిర్యానీ అదరహో!
సాక్షి, చెన్నై: లాక్డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో చాలామంది వంటిట్లో దూరి కొత్తకొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నారు. చికెన్, మటన్, రొయ్యలు, చేపలు, నాన్‌వెజ్ బిర్యానీల పేర్లు ఇన్నాళ్లు విన్నాం. అయితే, కొందరు యువకులు ఏకంగా ఉడము బిర్యానీ తయారు చేసి అదరగొట్టారు. అంతే కాదు, టిక్ టాక్‌లో తమ కొత్త ప్రయత్నాన్ని వీడియో రూపంలో ఎక్కించి అడ్డంగా బుక్కయ్యారు. ప్రస్తుతం ఆ యువకులు తిరుచ్చి కేంద్ర కారాగారంలో ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి. తిరుచ్చి జిల్లా మనప్పారై సమీపంలోని సోలయాం పట్టి గ్రామానిక చెందిన యువకులు లాక్డౌన్ పుణ్యమా ఏకం అయ్యారు. ఎక్కడెక్కడ పనులు చేసుకుంటూ వచ్చిన మిత్రులు ఒక చోట చేరడంతో సందడి మొదలైంది. తమ గ్రామానికి కూత వేటు దూరంలో అడవులు ఉండడంతో ఈ మిత్ర బృందం బుధవారం బ్లాక్ మార్కెట్లో లభించిన మద్యం బాటిళ్లను తీసుకుని పరుగులు తీశారు. అడవుల్లోకి వెళ్తూ వంటా వార్పునకు కావాల్సిన వస్తువుల్ని పట్టుకెళ్లారు. మద్యానికి చిత్తైన ఈ బృందం తమకు కనిపించిన ఉడమును పట్టేశారు. దాన్ని కోసి పడేసి, శుభ్రం చేసి, బిర్యానీ తయారు చేసి ఆరగించారు. మద్యానికి చిత్తై మిత్రులు వేసిన చిందు, హంగామా అంతా ఇంతా కాదు. ఇంత వరకు బాగానే వీరి పార్టీ సాగినా, ఉడుమ బిర్యానీ ప్రయోగాన్ని వీడియో చిత్రీకరించిన మిత్ర బృందంలోని ఒకరు ఇంటికి రాగానే టిక్‌టాక్‌లోకి అప్లోడ్ చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారి చివరకు తిరుచ్చి అటవీ శాఖ అధికారుల కంట పడింది. ఇంకే ముంది పదుల సంఖ్యలో ఆ గ్రామంలోకి గురువారం వచ్చిన అటవీ అధికారులు ఆ మిత్ర బృందాన్ని తమ వలలో వేసుకున్నారు. ఏడుగురు తమ చేతికి చిక్కడంతో వారిని న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి, తిరుచ్చి కేంద్ర కారాగారంలో ఊచలు లెక్కించేందుకు పంపించారు. -
టిక్‌టాక్‌తో ఒత్తిడి చిత్తు!
సాక్షి, హైదరాబాద్: పరీక్షలు మొదలయ్యాయి. విద్యార్థుల్లో టెన్షన్.. టెన్షన్.. సరిగ్గా చదవకపోవడం, తల్లిదండ్రుల ఒత్తిడి, క్లాస్‌మేట్స్‌తో పోటీ.. ఇలా ఒత్తిడికి కారణాలు బోలెడు! అనుకున్న మార్కులు రాకపోతే అఘాయిత్యాలకు పాల్పడేది కూడా ఒత్తిడి వల్లే.. జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2014–2016 మధ్యకాలంలో దేశం మొత్తం మీద 26 వేల మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడితే.. వీరిలో పరీక్షల్లో ఫెయిలైన కారణంగా తనువు చాలించిన వారు 7,462 మంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. పరీక్షల చుట్టూ ఉన్న ఒత్తిడిపై ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అవగాహన పెంచేందుకు ‘సేవ్ ది చిల్డ్రన్’స్వచ్ఛంద సంస్థ ఓ వినూత్నమైన ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. వీడియో అప్లికేషన్ ‘టిక్‌టాక్’ఈ ప్రయత్నానికి తనవంతు సాయం అందిస్తోంది. వీడియోల రూపంలో చిట్కాలు.. పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. వీటి గురించి తెలిస్తే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. సేవ్ ది చిల్డ్రన్, టిక్‌టాక్‌లు ఇదే పనిచేస్తున్నాయి. "# BeatTheStress’ కార్యక్రమం కింద సేవ్ ది చిల్డ్రన్ కార్యకర్తలు ఒత్తిడిని జయించే చిట్కాలను వీడియోల రూపంలో అందిస్తారు. పరీక్షకు ఎలా సిద్ధమవ్వాలి? ఏ రకమైన ఆహారం తీసుకోవాలి? వంటి అనేక అంశాలపై టిక్‌టాక్ ద్వారా వీడియో సందేశాలు అందిస్తారు. ఉదాహరణకు సమాధానాలు బాగా వచ్చిన ప్రశ్నలకు ముందు సమాధానాలు రాయడం. తద్వారా ప్రశ్నపత్రాలు దిద్దే వారిలో ఆ విద్యార్థిపై సానుకూల దృక్పథం ఏర్పడుతుందని, తద్వారా మంచి మార్కులు సాధించొచ్చని ఓ నిపుణుడు చెప్పడం ఒక వీడియోలో ఉంటే.. మరో వీడియోలో పరీక్షలు ముఖ్యమే గానీ.. జీవితం అంతకంటే ఎక్కువ విలువైందన్న సందేశం కూడా ఉంటుంది. చిన్నచిన్న పాటలు, గేయాలు, సరదా సన్నివేశాలు, యానిమేషన్లు, జీఐఎఫ్లన్నింటినీ వాడుతూ విద్యార్థులు ఒత్తిడికి దూరంగా ఉంచేందుకు బీట్ ది స్ట్రెస్ కార్యక్రమం ద్వారా ప్రయత్నిస్తున్నట్లు టిక్‌టాక్ ఫర్ గుడ్ ఇండియా అధ్యక్షురాలు డాక్టర్ సుబి చతుర్వేది తెలిపారు. చదువును ఒక వేడుకగా చేసేందుకు, తద్వారా విద్యార్థుల విపరీత ఆలోచనలను నివారించేందుకే తాము ఈ ప్రయత్నం చేస్తున్నామని సేవ్ ది చిల్డ్రన్కు చెందిన జ్యోతి నాలే తెలిపారు. -
టిక్‌టాక్‌లో బాసలు చేశాడు.. ఆశలు రేపాడు
బంజారాహిల్స్: టిక్‌టాక్‌లో పరిచయం.. ఆపై స్నేహం.. ఇంకాస్త ముందుకు వెళితే ప్రేమ.. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు.. పెళ్లి చేసుకుంటానని ప్రియుడు నమ్మించడంతో ఆ యువతి నమ్మింది. తీరా పెళ్లి చేసుకోమని అడిగేసరికి ముఖం చాటేశాడు. దీంతో బాధిత యువతి పోలీసుల ముందే గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన యెల్లపు వీరబాబు అలియాస్ వీర (21) కారు డ్రైవర్‌గా పని చేస్తూ జూబ్లీహిల్స్‌రోడ్ నంబర్ 46లోని మస్తాన్‌నగర్‌లో ఉంటున్నాడు. టిక్‌టాక్ ద్వారా అయిదు నెలల క్రితం బీహెచ్ఈఎల్కు చెందిన ఓ యువతితో (22) పరిచయం ఏర్పడింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. రెండుమూడుసార్లు మాదాపూర్ ఓయో రూమ్‌కు కూడా తనను తీసుకెళ్లాడని అక్కడ అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు అయిదు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వీరబాబును పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయితే తనకు న్యాయం జరగలేదని వీరబాబుతో పెళ్లి చేయాలంటూ ఈ నెల 8న బాధితురాలు మళ్లీ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. వీరబాబును ఎస్ఐ యాదగిరిరావు పిలిపించి పెళ్ళి చేసుకోవాలని సూచించారు. అందుకు వీరబాబు ససేమిరా అన్నాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి పోలీసుల ముందే తనతో పాటు తెచ్చుకున్న బ్లేడ్‌తో గొంతు కోసుకుంది. రక్తం కారుతుండగా వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువతిని మోసగించిన ఘటనలో వీరబాబుపై ఐపీసీ సెక్షన్ 417, 420, 376 కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
కటకటాల్లో టిక్‌టాక్
కర్ణాటక, బనశంకరి: పలు నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లిన ఇద్దరు రౌడీలు పరప్పన అగ్రహార జైలులో టిక్‌టాక్ చేయడం జైల్లో లోపాలకు అద్దం పడుతోంది. పలు నేరాల్లో జైలులో శిక్ష అనుభవిస్తూ తన ప్రియురాలి ఫోటో పెట్టి రౌడీలు టిక్‌టాక్ వీడియో చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతోంది. ఈ సంఘటనతో జైలులో భద్రత పట్ల అనుమానం వ్యక్తమౌతోంది. పోలీసుల కాల్పుల్లో గాయపడి జైలుకెళ్లిన రౌడీలు వసీం, ఫయాజ్ ఇద్దరు జైలు నుంచి తమ ప్రియురాళ్లతో టిక్‌టాక్ చేశారు. టిక్‌టాక్‌లో చాకు, కడ్డీ వంటివి ప్రదర్శిస్తూ వీరిద్దరూ రౌడీయిజం ప్రదర్శించారు. ఖైదీ వసీం శ్యాండల్‌వుడ్ నటుడు డైలాగ్‌తో వీడియో చేశాడు. జైలులో సిగరెట్ తాగుతూ కూర్చున్న ఫోటోకు కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ డైలాగ్ తో టిక్‌టాక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఫయాజ్ అనే ఖైదీ ఓ యువతితో ఫోటో పెట్టి తేరీమేరీ కహాని అంటూ టిక్‌టాక్ చేశాడు. జైలులోపలకు సెల్ఫోన్లు, సిగరెట్లు ఎలా వెళ్లాయి అనేది తేలాల్సి ఉంది. -
టిక్‌టాక్‌లో పరిచయం, యువతితో రెండో పెళ్లి
చెన్నై ,అన్నానగర్: తనను, తన బిడ్డను మానసికంగా వేధించి టిక్– టాక్ ద్వారా పరిచయమైన యువతిని రెండో వివాహం చేసుకున్న భర్తపై మొదటి భార్య మంగళవారం ఎస్పీకి ఫిర్యాదు చేసింది. వివరాలు.. పన్రూటి సమీపంలోని మేల్ ఇరుప్పు వీధికి చెందిన రాజశేఖర్ (26), సుకన్య (25) దంపతులు. సుకన్య ప్రస్తుతం కొల్లుకారన్ కుటైలోని ప్రైవేటు కళాశాలలో బీఎడ్ చదువుతోంది.మంగళవారం తన మూడేళ్ల కుమార్తెతో కడలూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ అభినవ్‌కు ఓ ఫిర్యాదు చేసింది. తనకు 2014లో రాజశేఖర్‌తో వివాహం జరిగిందని, తమకు మూడేళ్ల కుమార్తె ధర్నిక ఉందని తెలిపింది. తన భర్తకి కొంతమంది మహిళలతో సంబంధం ఉందని.. ప్రశ్నించినందుకు భర్త, అతని తల్లి, తండ్రి, ఆడబిడ్డ హింసించేవారని చెప్పింది. దీని గురించి కాడంబులియూర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశానని.. ఇద్దరిని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారని పేర్కొంది. టిక్‌టాక్ ద్వారా తన భర్త కొందరు మహిళలతో సంబంధం పెట్టుకుని హింసిస్తూ వచ్చేవాడని తెలిపింది. ఈ క్రమంలో తన భర్త టిక్‌టాక్ ద్వారా పరిచయమైన యువతిని రెండో వివాహం చేసుకున్నాడని వివరించింది. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. -
అక్కాతమ్ముడు కలిసి టిక్‌టాక్ వీడియో.. బెదిరింపులు
అమీర్‌పేట: అక్కా తమ్ముడు కలిసి తీసిన టిక్‌టాక్ వీడియో పోస్టు చేయటాన్ని ఆసరాగా చేసు కుని ఓ యువతి వారిని బెదిరింపులకు గురి చే స్తుండటంతో పోలీసులను ఆశ్రయించారు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. బల్కంపేటకు చెందిన అక్కా తమ్ముడు కలిసి టిక్‌టాక్ వీడియో తీసి వాట్సప్‌లో పోస్టు చేశారు. దీనిని చూసిన మరో యువతి తన మొ బైల్ నంబరు నుంచి వాట్సప్ గ్రూపుల్లో పోస్టు చేసింది. డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతోంది. బాధిత యువతి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
టిక్‌టాక్ వైపరీత్యం..ప్రేమించలేదని..
చెన్నై, టీ.నగర్: ప్రేమించలేదని ఓ పాఠశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ప్రేమికుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. కేరళ రాష్ట్రం ఎర్నాకుళం సమీపానగల కలూరు ప్రాంతానికి చెందిన ఇవా డేనియల్ ప్లస్‌టూ విద్యార్థిని. ఈమెకు అతే ప్రాంతానికి చెందిన సబర్షా అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇలావుండగా వారి మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడడంతో ఆమె అతనితో మాట్లాడడం నిలిపేసింది. ఇలావుండగా మంగళవారం పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఇవా డేనియల్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వారు విచారణ జరపగా సబర్షా పనిచేస్తున్న వర్క్‌షాపులో నిలిపి ఉంచిన కారు మాయమైంది. దీంతో ఇవా డేనియల్ను సబర్షా కిడ్నాప్ చేసి ఉండొచ్చని భావించిన పోలీసులు కారు తమిళనాడుకు వస్తున్నట్లు తెలుసుకున్నారు. మంగళవారం సాయింత్రం కారు వాల్పారై వద్ద వస్తుండగా పోలీసులు కారును అటకాయించారు. అయితే కారులో విద్యార్థిని కనిపించలేదు. దీంతో సబర్షా వద్ద విచారణ జరపగా ఆమెను హత్య చేసి ఓ ప్రాంతంలో పారేసినట్లు తెలిపారు. దీంతో సబర్షాను అరెస్టు చేసిన పోలీసులు ఘటనా ప్రాంతానికి అతన్ని తీసుకువెళ్లి ఇవా డేనియల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. టిక్‌టాక్ వైపరీత్యం: టిక్‌టాక్ వైపరీత్యం కారణంగా ప్రియురాల్ని హత్య చేసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కన్యాకుమారి జిల్లా కేరళ సరిహద్దులో కారకోణం ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయిని 19 ఏళ్ల కుమార్తె ఆసికా. ఈమె టిక్‌టాక్‌లో పోస్టులు చేస్తుంటుంది. దీనిద్వారా అను అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తర్వాత కొంతకాలానికి అతనితో సంబంధాన్ని తెంచుకుంది. సెల్‌ఫోన్ నెంబర్ బ్లాక్ చేసింది. దీంతో అను నేరుగా ఆసికాకు బెదిరిస్తూ వచ్చాడు. సంఘటన జరిగిన రోజున ఆసికను కత్తితో హతమార్చిన అతను తను కూడా గొంతుకోసుకుని మృతిచెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
నెట్టింటి వెరైటీ
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుతం యువతని ఉర్రూతలూగిస్తున్న అధునాతన వేదిక సోషల్ మీడియా. ఇది కోట్లాది మందికి వినోదాన్ని విజ్ఞానాన్ని పంచుతుంటే.. వేలాది మందికి ఉపాధిగానూ మారుతోంది. ఈ నేపథ్యంలో సిటీ యువత తమలోని ప్రతిభకు సానబెడుతూ సోషల్ మీడియా వేదికగా విజయాలు సాధిస్తున్నారు. యూట్యూబ్, టిక్‌టాక్.. ఇలా ఏదైనా సరే తమకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్‌ను క్రియేట్ చేసుకుంటూ లక్షలాది ఫాలోవర్లుగా మార్చుకుంటూ సోషల్ మీడియా స్టార్స్‌గా నిలుస్తున్నారు. సంగీతాన్ని వండుతూ... ఆనందంగా తింటే ఆరోగ్యంగా ఉంటాం అన్నట్టుగా.. నవ్వుతూ తుళ్లుతూ వంట చేస్తూ ఆయన రూపొందించే టిక్‌టాక్ వీడియోలు విశేషాదరణ పొందాయి. ఆహారాన్ని ఆస్వాదిస్తే అదో వినూత్న అనుభూతి అని చెప్పకనే చెబుతూ, అసలు తినడానికి కూడా ఒక అర్హత ఉండాలి అంటాడు సైనిక్‌పురిలో నివసించే కల్యాణ్ నాయక్. తన వీడియోల ద్వారా తనకంటూ ఒక స్టైల్‌ని ఏర్పరచుకున్నాడు. ప్రకృతి ప్రేమికుడు కావడం వల్లనేమో ఆయన వీడియోల్లో సహజత్వం ఉట్టిపడుతుంది. ఒక్కమాటలో జీవితమంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆర్ట్ ఆఫ్ కేరింగ్ అంటున్నాడు. తను మ్యూజిక్ కంపోజ్ చేసిన పిల్లా పిలగాడు ఆల్బమ్ వైరల్‌గా మారి ఏకంగా 5.4 మిలియన్స్ హ్యాష్‌ట్యాగ్స్‌ని సొంతం చేసుకుంది. ఉత్తరాది నుంచి కూడా పెద్ద సంఖ్యలో హ్యాష్‌ట్యాగ్స్ పొందడం విశేషం. ‘దీని ద్వారా వచ్చిన ప్రాచుర్యం 4 సినిమాలకు సంగీత దర్శకునిగా అవకాశాలను తెచ్చిపెట్టింది’ అని కల్యాణ్ నాయక్ చెప్పాడు. బీటెక్ పూర్తి చేసి ఇంట్లో వాళ్లు ఉద్యోగం చేయమని పోరుతున్నా వినకుండా.. ప్రముఖ సంగీత దర్శకుడు రెహ్మాన్ మ్యూజిక్ ఇనిస్టిట్యూట్‌లో సంగీతం నేర్చుకున్నానని వివరించాడు. లాఫ్.. రాయల్ నవ్వించడమే పనిగా పెట్టుకున్నాడు నగరవాసి రాయల్ శ్రీ. హాస్య ప్రధానమైన డబ్‌స్మాష్‌లు, టిక్‌టాక్‌లు చేస్తూ తన ఫన్నీ గెటప్‌లతో క్రేజ్ తెచ్చుకున్నాడు. నాలుగో తరగతి మాత్రమే చదువుకున్నానని చెప్పే రాయల్.. అన్ని తరగతుల అన్ని వర్గాల మెప్పునూ పొందుతున్నాడు. ఓ వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూనే యూట్యూబ్ చానల్లో వైరల్ అవుతున్నాడు. ఆరోగ్యకరమైన హాస్యం, ఎంటర్టైన్మెంట్ ఉండటంతో తనకు చాలా మంది అభిమానులుగా మారారని, నవ్వటం ఒక యోగం, అందరినీ నవ్వించగలగడం తన అదృష్టం అని అంటున్నాడు రాయల్ శ్రీ. ఫ్రాంక్‌గా.. తన యూట్యూబ్ చానల్లో 5 లక్షలకుపైగా అభిమానులతో వినోదాన్ని మేళవించి సందేశాత్మక వీడియోలతో స్టార్‌గా నిలిచాడు దిల్సుఖ్నగర్ వాసి వినయ్. అకస్మాత్తుగా ఎదురై అల్లరి పెట్టే ఫ్రాంక్ వీడియోలకు ఈయన ఫేమస్. 200కు పైగా ఫ్రాంక్ వీడియోలతో పాపులరై లక్షలాదిగా వ్యూస్‌ని కొల్లగొట్టాడు. సందేశాత్మకంగానూ, వినోదాత్మకంగానూ ఉండేలా కనీసం వారానికి 2 వీడియోలు చేస్తుంటాడు. యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులో కొంత భాగం అనాథ బాలలకు, చారిటీలకు అందిస్తుంటానని ఆయన చెప్పాడు. ప్రస్తుతం ఒక టెలివిజన్ చానల్లో క్రియేటివ్ డడైరెక్టర్గా పని చేస్తూన్న ఆయన తన వీడియోస్‌కి వచ్చిన కామెంట్లలోని సూచనల ఆధారంగా తదుపరి ఫ్రాంక్స్ ప్లాన్ చేస్తుంటాడు. -
టిక్‌టాక్‌లో అసభ్యకర సందేశాలు
సాక్షి, సిటీబ్యూరో: టిక్‌టాక్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి డ్యాన్స్ మాస్టర్ రాజాతో పాటు అతడిని టిక్‌టాక్‌లో అనుసరించే మహిళలపై అభ్యంతరకరంగా పోస్టులు పెడుతూ వేధింపులకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం పట్టణానికి చెందిన నిమేష్ చౌదరి తన స్నేహితులు పది మందితో కలిసి లవర్ బాయ్, నిమేష్ చౌదరి పేరుతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్‌లు సృష్టించాడు. టిక్‌టాక్‌లో చురుగ్గా ఉన్న హైదరాబాద్‌కు చెందిన జనార్దన్ దేవేళ్ల డ్యాన్స్ మాస్టర్ రాజాను టార్గెట్ చేయాలని గ్రూప్ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా రాజాతో పాటు, అతడిని అనుసరించే యువతులను అసభ్యంగా దూషిస్తూ గ్రూప్‌లో షేర్ చేసేవారు. ఈ వాట్సాప్ గ్రూప్‌లకు అడ్మిన్‌గా టిక్‌టాక్ ద్వారా పరిచయమైన అతని స్నేహితుడు కరీంనగర్ జిల్లా మెట్‌పల్లికి చెందిన అరవింద్ పటేల్ వ్యహరించేవాడు. వీరి గ్రూప్ సభ్యుల్లో ఒకరు ఈ పోస్టులు, అడియోలను డ్యాన్స్ మాస్టర్ రాజాకు పంపాడు. దీంతో అతను గత నెల 6న సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నికల్ డాటా ఆధారంగా నిందితులు నిమేష్ చౌదరి, అరవింద్ పటేల్‌లను గురువారం అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
చిన్ని తెర తారలకు టిక్‌టాక్ క్రేజ్
‘ఆయన్ను నేనెంతో ప్రేమించా..నాకింత అన్యాయం చేస్తారనుకోలేదు’ అంటూ కన్నీళ్లు కుమ్మరించి వీక్షకుల కళ్లూ చెమర్చేలా చేస్తారు టీవీ స్టార్స్. ఇప్పుడు వీరికి ఏడుపు సన్నివేశాల విరామాల్లో వినోదాన్ని పండించేందుకు, తమ పాపులారిటీకి పదును పెట్టుకునేందుకు అందివచ్చిందో అవకాశం.. అదే టిక్ టాక్...వీమేట్..హలో యాప్స్. బుల్లితెర నటులు ఈ మధ్య షూటింగ్ గ్యాప్‌లో ఫన్నీ వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తున్నారు. వీటికి వీక్షకులు, ఫాలోవర్స్ సంఖ్య కూడా బాగానే ఉంటోంది. కంటతడి పెట్టించే అభినయంలో నిష్ణాతులైన చిన్నితెర స్టార్స్ వైవిధ్య భరిత అంశాల్లో ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకోవడానికి టిక్ టాక్ వీడియాలను ఎంచుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని, ఫాలోయర్స్‌ని సాధించుకుంటున్నారు. గ్యాప్‌లో.. టాక్‌షో సిటీలో ఎప్పుడూ ఏదో ఒక స్టూడియోలోనో, ఇంట్లోనో చిన్నితెర షూటింగ్స్ సర్వసాధారణం. నిన్నా మొన్నటి దాకా ఆయా షూటింగ్స్‌లో పాల్గొంటున్న తారలు షాట్ గ్యాప్స్‌లో పిచ్చాపాటీ మాట్లాడుకోవడంతో సరిపెట్టుకునేవారు. ఇప్పుడా ముచ్చట్ల స్థానాన్ని టిక్ టాక్ షూటింగ్స్ ఆక్రమించాయి. షూటింగ్ గ్యాప్స్‌లో మేకప్ సైతం తీయకుండానే సెకన్లు, నిమిషాల వ్యవధి వీడియోలను రూపొందించేస్తున్నారు. ఎవరితో అయినా కలిసి లేదా ఒంటరిగా వచ్చిన ఐడియా మేరకు వీడియోలు చేస్తున్నారు. ‘షూటింగ్ గ్యాప్స్‌లో లాంగ్ బ్రేక్స్ ఏర్పడినప్పుడు బోర్డమ్ పోగొట్టుకోవడానికి ఈ బుల్లి వీడియోలు. చాలా ఉపకరిస్తాయి’అని జీ తెలుగు సూర్య వంశం సీరియల్ ద్వారా పాపులరైన మీనా వాసు చెప్పారు. పాటపై ఇష్టమే బాట వేసింది చిన్నితెర మెగా నటిగా ఉన్న హరిత టిక్‌టాక్‌పై కూడా టాప్‌ప్లేస్‌లో ఉండడం విశేషం. జీ తెలుగులో వస్తున్న ముద్ద మందారంతో పాటు పలు సీరియల్స్‌లో ప్రేక్షకుల్ని మెప్పించే పాత్రలు పోషిస్తున్న హరిత 3 లక్షలకు పైగా ఫాలోయర్స్‌తో టిక్‌టాక్‌లో పీక్స్‌లో ఉన్నారు. ‘పాటలంటే చాలా ఇష్టం. అయితే సీరియల్స్‌లో పాటలకి పెద్దగా ఆస్కారం ఉండదు కదా. అందుకే టిక్‌టాక్ ద్వారా నచ్చిన పాటలకు అభినయాన్ని జోడిస్తున్నా. నటిగా మన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవడానికి, ఎన్నో భావోద్వేగాలను పలికించడానికి, వినోదం అందుకోవడానికి సహకరిస్తాయీ వీడియోలు’ అంటున్నారు హరిత. రొటీన్ నుంచి రిలీఫ్ కెమెరాలు, డైరెక్టర్లు, దట్టంగా మేకప్పులు, చాంతాడంత డైలాగులు, కట్స్, కష్టాలు, కన్నీళ్లు, .. వీటన్నింటికీ భిన్నంగా దర్శకత్వం నుంచి సర్వం మనమే అయి రూపొందించుకునే ఈ వీడియోల ద్వారా బోలెడంత రిలీఫ్ లభిస్తోందని ఈ తారలు అంటున్నారు. పెద్దగా వ్యయ ప్రయాసలేవీ లేకుండా నిమిషాల్లో తీసేసి క్షణాల్లో సోషల్ మీడియాలోకి అప్లోడ్ అయిపోతూ చిన్నితెర కన్నా మిన్నగా పాపులారిటీ దక్కించుకుంటున్నారు. ‘బిజీ షూటింగ్స్ సమయంలో షాట్ గ్యాప్స్‌లో తీసే ఈ వీడియోలు ఒత్తిడి నివారిణిలాగా వినోదాన్ని పంచుతాయి’ అని రక్త సంబంధం, కళ్యాణ వైభోగమే సీరియల్ నటి మేఘనా లోకేష్ అంగీకరించారు. నైపుణ్యాలకు సాన.. ఓ వైపు నటిస్తూనే మరోవైపు తమ అభినయ సామర్థ్యానికి మరింత సాన బెట్టడానికి ఇది చక్కని అవకాశంగా స్మాల్స్క్రీన్స్టార్స్ భావిస్తున్నారు. ‘ఇన్‌స్టిట్యూట్స్‌కి వెళ్లకుండానే టిక్‌టాక్ ద్వారా నటనానుభవంతో పాటూ వినోదమూ లభిస్తుంది’ అన్నారు ముద్దమందారం ఫేమ్ తనూజ గౌడ్. ‘ఇది మన ప్రతిభ ప్రదర్శనకు వేదిక. దీని ద్వారా మరింత మందికి నేను చేరువ అవగలుగుతున్నా’ అని చెప్పారు గంగ మంగ సీరియల్ నటి ప్రణవి, ‘తొలుత ట్రెండ్‌ను అనుసరిస్తూ వీడియోలు చేశా. ఇప్పుడు అది అలవాటైంది. మీనా అక్కతో కలిసి వీడియోలు జంటగా రూపొందించడం అంటే ఇష్టం’ అని చెప్పారు సీరియల్స్ నటి గీతాంజలి. భార్యతోనే జోడీ.. టైమ్ పాస్ కోసం ఎప్పుడైనా ఫ్రీ టైమ్‌లో, షూట్ గ్యాప్‌లో టిక్ టాక్స్ చేస్తాం. నేనూ నా వైఫ్ విష్ణుప్రియ చేసిన టిక్‌టాక్స్ ఎక్కువే. మా సీరియల్ హీరోయిన్ మేఘన నేను కూడా టిక్‌టాక్‌లు చేస్తుంటాం. టిక్టాక్స్కి ఫాలోవర్స్ ఎక్కువ. ఫన్ ఉండటంతో వర్క్ స్ట్రెస్ ఏదైనా.. రిలాక్స్ అయినట్టూ ఉంటుంది. – సిద్ధార్థ్ వర్మ -
టిక్‌టాక్ వీడియో వైరల్‌తో మనస్తాపం..
సాక్షి, రాజోలు(తూర్పుగోదావరి జిల్లా): పేదరికంతో బాధ పడుతున్న కుటుంబానికి అండగా నిలవాలని ఉపాధి కోసం కువైట్ వెళ్లిన శివకోడు గ్రామానికి చెందిన పుచ్చకాయల మోహనకుమార్ (30) ఈ నెల 3వ తేదీన అక్కడ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితులు వేసుకున్న చీటీ పాట సొమ్ము చెల్లించలేదని అతడి ఫొటోలతో టిక్‌టాక్‌లో పెట్టిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మనస్తాపం చెందిన అతడు కువైట్‌లో నివాసం ఉంటున్న కాంప్లెక్స్‌లో ఉరి వేసుకున్నాడు. వారం తర్వాత ఆదివారం అతడి మృతదేహం శివకోడు చేరుకుంది. చేతికి అందివచ్చిన కొడుకు కువైట్ వెళ్లి విగతజీవిగా రావడంతో తల్లి విజయకుమారి, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. శివకోడు చేరుకున్న మృతదేహాన్ని చూసేందుకు గ్రామస్తులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రెండేళ్ల క్రితం కువైట్ వెళ్లిన అతడు ఐరన్ షాపులో పనికి చేరాడు. అక్కడే ఒక రూమ్‌లో స్నేహితులతో కలసి ఉన్న అతడు రెండు వేల దినార్లు (రూ.4.60 లక్షలు) చీటీ పాటలో సభ్యునిగా చేరాడు. పాడుకున్న చీటీ సొమ్ము కట్టకుండా పారిపోయాడని, ఫొటోల్లో ఉన్న వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ అతడి స్నేహితులు వడ్డి దుర్గారావు, మధు కలసి అతడి ఫొటోలతో చేసి వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. అయితే అతడు చీటీ పాట పాడుకోకుండా నెల వారీ సొమ్ము చెల్లిస్తున్నాడని, కొంత సొమ్ము స్నేహితుల నుంచి అప్పుగా తీసుకుని చీటీ సొమ్ము చెల్లిస్తున్నా ఈ వీడియో పెట్టారని మృతుడి బావ కందికట్ల రాజబాబు తెలిపారు. తను కూడా కువైట్‌లోనే ఉంటున్నానని, భారత రాయబార కార్యాలయం ద్వారా కువైట్ రాయబార కార్యాలయంతో సంప్రదించి బావమరిది మృతదేహాన్ని ఇండియాకు తీసుకుని వచ్చామన్నారు. నెలరోజుల్లో ఇంటికి వస్తానన్నాడు.. రెండేళ్లుగా కువైట్‌లో ఉంటున్న కొడుకు నెల రోజుల్లో వచ్చేస్తానని తల్లి విజయకుమారికి ఫోన్ చేశాడు. అయితే అతడు విగతజీవిగా వచ్చాడని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. కువైట్ వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటే కనీసం ప్రాణాలతో ఉండేవాడని ఆమె రోదిస్తున్న తీరు చూపరులను కంట తడి పెట్టించింది. -
‘టిక్ టాక్’ ద్వారా ప్రజల్లోకి: తెలంగాణ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ‘టిక్ టాక్’ను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా టిక్ టాక్ ఇండియా–తెలంగాణ ఐటీశాఖ, డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హోటల్ హరి తప్లాజాలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన ప్రజా సంబంధాల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిక్ టాక్ ఇండియా పాలసీ డైరెక్టర్ నితిన్ సాలూజా, యువరాజ్, ఐటీ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ ప్రకటించారు. సీఎం పీఆర్వో రమేశ్ హజారి, రాచకొండ కమిషనర్ పీఆర్వో దయాకర్, సైబరాబాద్ కమిషనర్ పీఆర్వో కిరణ్ కుమార్, డీజీపీ సీపీఆర్వో హర్ష భార్గవి పాల్గొన్నారు. -
టిక్‌టాక్ హీరో.. సినీ స్టార్స్ ఫాలోయింగ్
సెలబ్రిటీస్‌కి ఒక రేంజ్ ఉంటుంది. వాళ్లు టీవీలో, పేపర్లో కనిపిస్తే ఫ్యాన్స్‌కి పండగే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి వాటిలో ప్రత్యక్షమవుతూ.. ఫ్యాన్స్‌ను పలకరిస్తున్నారు. అయితే, ప్రస్తుతం వాటన్నింటిలోనూ ‘టిక్‌టాక్’ హావానే నడుస్తోంది. పిల్లలు నుంచి పెద్దల వరకు తమక నచ్చిన వీడియోలు చేస్తూ ఈ యాప్‌లో తమ ప్రతిభతో సందడి చేస్తున్నారు. పైగా ఈ టిక్‌టాక్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వారిని ఫాలో అవుతున్నారు మన టాలీవుడ్ స్టార్స్. వారివారి సినిమా ప్రమోషన్స్‌ని టిక్‌టాక్ స్టార్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. ఇదే కోవలో సిటీకి చెందిన ‘మెహబూబ్’ సినీ సెలబ్రిటీలు మెచ్చిన సెలబ్రిటీ అయిపోయాడు. సాక్షి, సిటీబ్యూరో: మణికొండకు చెందిన మెహబూబ్ షేక్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే మహాపిచ్చి. ఫ్రెండ్స్‌తో కలసి సరదగా డ్యాన్స్ చేస్తుండేవాడు. ఇదే సమయంలో ‘టిక్‌టాక్’ యాప్ సోషల్ మీడియాలోకి వచ్చింది. ఆ యాప్ సాయంతో ఇతడు చిన్న చిన్న డైలాగ్‌లు చేస్తూ వాటిని పోస్ట్ చేయడంతో నెటిజన్లు హిట్స్ కొట్టడం మొదలు పెట్టారు. ఇదేదో బాగుందని ఇప్పుడు పూర్తిగా ఇందులోనే మునిగిపోయాడు. ఇప్పుడు మహబూబ్‌ను టిక్‌టాక్‌లో 12 లక్షల మంది ఫాలో అవుతున్నారు. అంతేకాదు.. యూట్యూబ్‌లో 2.90 లక్షల మంది, ఇన్‌స్ట్రాగామ్‌లో 2.28 లక్షల మంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నాడు. సినీ స్టార్స్ ట్రెండీ ప్రమోషన్ టాలీవుడ్ సెలబ్రిటీలు తమ సినిమా ప్రమోషన్స్ కోసం టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ సైట్లలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వారిని ఆశ్రయిస్తున్నారు. సిటీలో మెహబూబ్‌కు టిక్‌టాక్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉండడంతో సినిమా ప్రొడ్యూసర్లు మెహబూబ్‌ని తమ సెలబ్రిటీగా ఎంచుకుంటున్నారు. అతడి ద్వారా వీడియోస్ చేసి ‘సోషల్’ సైట్లలో అప్లోడ్ చేస్తూ.. నెటిజన్లును మెప్పిస్తున్నారు. ఓ పక్క తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీని సినిమా ప్రొడ్యూసర్లు సొంతం చేసుకుంటుండగా.. మరోపక్క సినీసార్టు సోషల్ మీడియా సెలబ్రిటీస్‌తో కలసి నయా ట్రెండ్‌కు శ్రీకారం చుట్టడం విశేషం. యూట్యూబ్‌లోనూ రారాజే ఇప్పటి వరకు 20కి పైగా షార్ట్ ఫిల్మ్స్‌లో హీరోగా చేసిన మెహబూబ్.. యూట్యూబ్‌లోనూ తన సత్తా చాటుతున్నాడు. ఇతడు చేసిన ‘మారీ–2’ సినిమాలోని ‘రౌడీబేబీ’ పాటకు యూట్యూబ్‌లో 1.60 కోట్ల మంది(16ఎం) వీక్షించడం విశేషం. ఇతడు చేసే ప్రతి వీడియో పది లక్షలకు పైగా వ్యూస్, వేలల్లో కామెంట్స్, లక్షల్లో హిట్స్‌ని సొంతం చేసుకోవడం మెహబూబ్‌కే సాధ్యమైంది. సినిమా, కార్పొరేట్, ఫ్యాషన్, వైద్యం ఇలా ప్రతి రంగం మెహబూబ్ స్టార్‌డమ్‌ని కోరుకుంటున్నారు. అతని ద్వారా వారి వారి ఉత్పత్తులకు ప్రచారకర్తగా వాడుకుంటున్నారు. మహబూబ్ సరదాగా టిక్‌టాక్‌లో పోస్ట్ చేసిన చిన్న వీడియోలు ఇప్పుడు అతడిని స్టార్‌ను చేశాయంటే విశేషమే మరి. నాని.. కాజల్.. నిధి.. నభా.. అగ్ర సినీ తారలు సైతం తమ చిత్ర ప్రమోషన్‌కు ఈ మార్గం ఎంచుకుంటున్నారు. ఇటీవల విడుదలైన అగ్రహీరో నాని ‘గ్యాంగ్‌లీడర్’ సినిమా ప్రమోషన్ని మెహబూబ్‌తో కలిసి చేశాడు. ఆ సినిమాలో బాగా పాపులర్ అయిన ‘హోయిన హోయినా’ అనే సాంగ్‌ని టిక్‌టాక్ యాప్‌తో మెహబూబ్ చేస్తుండగా.. మధ్యలో నాని వచ్చి అతడితో కలిసి స్టెప్పులేశాడు. శర్వానంద్, కాజల్ అగర్వాల్ నటించిన ‘రణరంగం’ సినిమా ప్రమోషన్లో భాగంగా మెహబూబ్.. కాజల్‌కు ఐలవ్యూ చెప్పి ప్రొపోజ్ చేస్తాడు. ‘ఇస్మార్ట్ శంకర్’లో నభా నటేష్‌తో కలసి డ్యాన్స్ చేశాడు. నిధి అగర్వాల్‌తో కలసి కాన్సెప్ట్ వీడియో చేశాడు. ఇతడో బ్రాండ్ అంబాసిడర్ కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాదు.. ప్రపంచ టాప్ దుస్తుల షోరూంలు సైతం మెహబూబ్ స్టార్‌డమ్‌ని వాడుకుంటున్నాయి. ఇటీవల ‘ఫ్లైయింగ్ మిషన్’ సంస్థ ఆఫర్లు, డిస్కౌంట్స్ ఉన్నాయంటూ మెహబూబ్‌తో ఓ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు సిటీలోని టాప్ మోస్ట్ డిజైనర్స్ తమ దుస్తులకు మెహబూబ్‌నే మోడల్‌గా పెట్టుకున్నారు. ఇతడే తమ బ్రాండ్ అంబాసిడర్ అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. ‘పక్కా లోకల్’.. హుషార్ రోడ్డుపై సడన్‌గా వెళ్తున్న వ్యక్తిని ఎదురుగా వస్తున్న ఓ వ్యక్తి సడన్‌గా ఆపి మైక్ పెడతాడు. ‘మీ ఫస్ట్ కిస్’ ఎప్పుడంటూ ప్రశ్నిస్తాడు. ఏం అడుగుతున్నాడో అని మనం ఆలోచించే లోపే మరో ప్రశ్న వేస్తాడు. చెప్పాలనుకునేవారు సమాధానం ఇస్తారు.. లేదంటే లేదు.. ఇలాంటి అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. సిటీకి రిలేటెడ్‌గా ఉన్న ‘పక్కా లోకల్ టీం’ యూట్యూబ్ చానెల్ రోజుకో కొత్త రకమైన థీమ్‌తో ప్రజల్లోకి వస్తోంది. ఆ థీమ్ ఆధారంగా పార్కు, రెస్టారెంట్స్, ట్యాంక్‌బండ్, చార్మినర్ వంటి ప్రాంతాల్లోయుతను టార్గెట్ చేస్తుంది. చానెల్‌కి చెందిన యాంకర్ అమ్మాయిలు, అబ్బాయిలకు ప్రశ్నలు వేస్తాడు. ఆ క్వశ్చన్‌కి పగలబడీ మరీ నవ్వుతూ సమాధానం చెప్పడం విశేషం. ఒక్కోసారి ఆ క్వశ్చన్స్ డబల్ మీనింగ్‌ను తలపిస్తాయి. ఫైనల్‌గా ఆన్సర్ మాత్రం ఆదర్శంగా, తెలివిగా ఉంటుంది. యూట్యూబ్‌లో వీరు చేస్తున్న డిఫ్రెంట్ ప్రొగ్రామ్స్‌కు నెటిజన్లు లక్షల్లో హిట్స్, లైక్‌లు ఇవ్వడం గమనార్హం. -
టిక్‌టాక్ స్నేహితురాలితో వివాహిత పరార్
చెన్నై,టీ.నగర్: టిక్‌టాక్‌లో స్నేహితురాలితో సన్నిహితంగా ఉండడాన్ని భర్త ఖండించడంతో వివాహిత పరారైన సంఘటన దేవకోట్టై సమీపంలో సంచలనం కలిగించింది. ఈ వివరాలు మంగళవారం వెల్లడయ్యాయి. శివగంగై జిల్లా కాళయారుకోవిల్ సమీపం సానాఊరణికి చెందిన వ్యక్తి ఆరోగ్య లియో. ఇతని భార్య వినీత. వీరికి గత జనవరిలో వివాహం జరిగింది. వివాహమైన 45 రోజుల్లో ఆరోగ్య లియో ఉద్యోగం కోసం సింగపూర్ వెళ్లాడు. తరువాత వినీతకు తిరువారూరుకు చెందిన అభి అనే యువతితో టిక్‌టాక్ వీడియో ద్వారా పరిచయం ఏర్పడింది. వీరి టిక్‌టాక్ వీడియోలు గమనించిన ఆరోగ్యలియో తన భార్యకు ఫోన్ చేసి మందలించాడు. అయితే ఆమె పట్టించుకోలేదు. తర్వాత కూడా అభితో స్నేహం చేస్తూ వచ్చింది. వీరి స్నేహం క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అంతేకాకుండా వినీత, అభి ఫొటోను తన భుజంపై టాటూగా చిత్రించుకుంది. ఈ వీడియో చూసిన ఆరోగ్యలియో దిగ్భ్రాంతి చెందాడు. అతను సింగపూర్ నుంచి అత్యవసరంగా తన ఊరుకు చేరుకున్నాడు. ఇంటిలో అభి పంపిన అనేక బహుమతులు కనిపించాయి. వివాహ సమయంలో వినీత ధరించిన 20 సవర్ల నగలు మాయమయ్యాయి. దీని గురించి వినీతను ప్రశ్నించగా తగిన సమాధానం ఇవ్వలేదు. దీంతో తన తల్లిదండ్రుల ఇంటిలో వినీతను వదిలిపెట్టాడు. ఇలా ఉండగా ఇంటిలో వున్న వినీత ఈ నెల 19న హఠాత్తుగా మాయమైంది. పోలీసుల విచారణలో అభితో వినీత పరారైనట్లు తేలింది. -
టిక్‌టాక్ వద్దన్నందుకు మనస్తాపంతో..
సాక్షి, చిత్తూరు(పలమనేరు) : పొద్దస్తమానం టిక్‌టాక్ చూస్తుంటే చదువేం కావాలని కుటుంబీకులు మందలించడంతో మనస్థాపానికి గురైన బాలిక ఇంటినుంచి పరారైన సంఘటన పలమనేరు పట్టణంలో బుధవారం వెలుగుచూసింది. స్థానిక బజారువీధిలో కాపురముండే రవి, శాంతి దంపతుల కుమార్తె భూమిక(16) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈమధ్య ఎక్కువగా మొబైల్లో టిక్‌టాక్‌కు చూస్తోంది. రెండ్రోజుల క్రితం తన సోదరుడు నవీన్‌తో కలసి టిక్‌టాక్ వీడియో చేస్తుండగా ఇద్దరిమధ్య గొడవ జరిగింది. దీన్ని గమనించిన వారి తల్లి స్మార్ట్‌ఫోన్‌ను లాక్కుని వారి దుకాణానికి వెళ్లింది. సాయంత్రం వచ్చి చూడగా ఇంట్లో కుమార్తె కనిపించకపోవడంతో బంధువుల ఇళ్లలో విచారించినా లాభం లేకపోవడంతో బుధవారం సాయంత్రం స్థానిక పోలీసులకు తన బిడ్డ ఆచూకీ తెలపాలంటూ శాంతి ఫిర్యాదు చేసింది. పట్టణ సీఐ శ్రీధర్ దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
టిక్‌టాక్‌లో యువకుడి మోసం
చెన్నై ,టీ.నగర్: సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌లో పరిచయమై వ్యక్తి ఎనిమిది సవర్ల బంగారు నగలను మోసం చేసి కాజేశాడని బుధవారం ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. చెన్నై రెడ్‌హిల్స్ పొత్తూరు, శరత్‌కండ్రిగైమేడు ప్రాంతానికి చెందిన మీనాక్షి (26)కి టిక్‌టాక్‌లో శాంథామస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీరు తరచూ తమ వీడియోలను షేర్ చేసుకునేవారు. ఆ పరిచయంతో శాంథామస్ మీనాక్షిని కొంత డబ్బు కావాలని సాయం కోరాడు. అయితే తన దగ్గర నగదు లేదని చెప్పింది. తన నగలు కుదువపెట్టి డబ్బు తీసుకోమని చెప్పింది. కోయంబేడు బస్టాండ్‌లో శాంథామస్‌కు ఎనిమిది సవర్ల నగలు ఇచ్చింది. ఆ తర్వాత అతని ఆచూకీ తెలియలేదు. సెల్ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేయగా స్విచాఫ్ చేసి ఉంది. దీంతో తాను మోసపోయానని గుర్తించిన మీనాక్షి బుధవారం కోయంబేడు బస్‌స్టేషన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు శాంథామస్ కోసం గాలిస్తున్నారు. -
టిక్‌టాక్ మాయ.. ఉద్యోగం గోవిందా!
బొల్లారం: ఆధునిక ప్రపంచం చేతిలో ఇమిడిపోవడంతో యువత మైమరచిపోతున్నారు. ఏం చేస్తున్నారో తెలియకుండానే హద్దుమీరుతున్నారు. నేడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో అందరికీ ‘టిక్‌టాక్’ వీడియోలకు బానిసలైపోతున్నారు. సమయం దొరికితే చాలు టిక్ టాక్ వీడియోలు చూడడం.. లేదా అందులోని వీడియోలను చూస్తూ అనుకరించడం, పాటలు పాడడం వీడియోలు తీస్తూ పోస్టు చేయడం మితిమీరి పోయింది. విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు ఇలా అన్ని వర్గాల వారు టిక్‌టాక్ మోజులో పడిపోతున్నారు. ఈ పోస్టులకు వచ్చే లైక్‌లు, కామెంట్స్ మోజులో పడిపోతున్నారు. ఈ క్రమంలో కొంత మంది ఎక్కువ లైక్‌లు, కామెంట్లు కోసం సాహసాలు చేస్తూ వీడియోలు చిత్రీకరిస్తున్న క్రమంలో ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. ఈ విష సంస్కృతి ఇప్పుడు ఉద్యోగులకు సైతం సోకడంతో వారూ విధి నిర్వహణ మరిచిపోయి వీడియోలు చేసేస్తున్నారు. ఇటీవల కొంతమంది ఉద్యోగులు కార్యాలయాల్లో వీడియోలు చిత్రీకరించి టిక్ టాక్‌లో పోస్టులు చేయగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వారి ఉద్యోగాలకు పోయే పరిస్థితి వచ్చింది. అలాంటి వాటిలో వచ్చుకు కొన్ని.. మనవడితో కలిసి వృద్ధురాలు ఇలా.. ♦ నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఫిజియోథెరపీ విద్యార్థులు ఆస్పత్రిలోనే టిక్‌టాక్ వీడియోలు చేసి పోస్టు చేశారు. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వారిని విధుల నుంచి తొలగించారు. ఇక్కడ సరదా కాస్తా నిర్లక్ష్యంగా మారి ఉపాధికే ఎసరు వచ్చింది. ♦ విశాఖపట్నంలో శక్తి టీం విధులు నిర్వహిస్తూనే టిక్ టాక్ వీడియోలు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. వీటిని వీక్షించిన యాజమాన్యం వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ♦ బిహార్‌లో ఓ యువకుడు మిత్రులతో కలిసి వరదలో దూకుతూ టిక్ టాక్ వీడియో చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు వరద తాకిడికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ♦ తమిళనాడులో ఓ మహిళ తన భర్త టిక్ టాక్‌లు చేయడానికి అంగీకరించడం లేదని ఆత్మహత్యకు పాల్పడింది. మితిమీరితే ప్రమాదమే.. సామాజిక మాధ్యమాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. మొన్నటి వరకు ఫేస్బుక్లో లీనమైన యువత కికీ చాలెంజ్‌ను పట్టుకున్నారు. నేడు పబ్జి, హలో, టిక్ టాక్లతో హల్చల్ చేస్తున్నారు. వీటిని ఆనందం పొందేందుకు కొంతమేర ఉపయోగిస్తే ఫర్వాలేదు గానీ మితిమీరితే ఇబ్బందేనని మానసిక వైద్యనిపుణులు, పోలీసులు సైతం హెచ్చరిస్తున్నారు. ఒకరిని చూసి ఒకరు వీడియోలు చిత్రీకరిస్తూ లైకులు, కామెంట్ల కోసం టిక్‌టాక్‌లో పోస్టు చేస్తున్నారు. ఇలా వీడియోల చిత్రీకరణ మోజులో పడితే కెరీర్ చెడిపోతుందని, కామెంట్లలో తేడా వస్తే గొడవలు, దాడులు సైతం జరుగుతున్నాయంటున్నారు. కొన్ని సందర్భాల్లో విచక్షణ కోల్పోయి విధి నిర్వహణలో ఉన్నా అన్నీ మరిచిపోయి ఉద్యోగాలకు ఎసరు తెచ్చుకుంటున్నారు. ఒక్కోసారి భర్తకు తెలియకుండా టిక్ టాక్‌లు చేయడం మూలంగా భార్య, భర్తల మధ్య వివాదాలు పొడచూపుతున్నాయి. అవి విడాకుల దాకా తీసుకెళుతున్నాయి. కొంత మంది యువకులు పాటలకు తమ డ్యాన్సులు చేసేందుకు తమ కుటుంబ సభ్యులను సైతం భాగస్వామ్యుల్ని చేస్తున్నారు. ఈ వీడియోలు చూసిన వారు పెడుతున్న కామెంట్లకు అనుబంధాల గోడలు బీటలు వారుతున్నాయని చెబుతున్నారు. ఇలాంటి వాటితో కుటుంబాల్లో సైతం పొరపొచ్చాలు వస్తాయని, వీటికి దూరంగా ఉండడమే మంచిదని హెచ్చరిస్తున్నారు. హద్దు దాటితే ప్రమాదం ఉద్యోగులు విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలి. తనకు కేటాయించిన విధులపైనే దృష్టి పెట్టాలి. విధుల్లో ఉండి వీడియోలు చిత్రీకరించడం, చూడడం చేయకూడదు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలపై కన్నేసి ఉంచాలి. చరవాణిని దేనికోసం వాడుతున్నారు.. ఏవైనా ఉపయోగం లేని సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తున్నారా.. అనే కోణంలో పరీక్షించాలి. ఒక వేళ ఉపయోగించినట్లు తేలితే వాటికి దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. వీటి వినియోగం సరదాగా మొదలై, ఒక్కోసారి వ్యసనంగా మారవచ్చు. ఇది మానసిక రుగ్మతలకు దారి తీస్తుంది. – పి. మధుకర్‌స్వామి, సీఐ, కార్ఖానా