
సాక్షి, సిటీబ్యూరో: టిక్‌టాక్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి డ్యాన్స్ మాస్టర్ రాజాతో పాటు అతడిని టిక్‌టాక్‌లో అనుసరించే మహిళలపై అభ్యంతరకరంగా పోస్టులు పెడుతూ వేధింపులకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం పట్టణానికి చెందిన నిమేష్ చౌదరి తన స్నేహితులు పది మందితో కలిసి లవర్ బాయ్, నిమేష్ చౌదరి పేరుతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్‌లు సృష్టించాడు.
టిక్‌టాక్‌లో చురుగ్గా ఉన్న హైదరాబాద్‌కు చెందిన జనార్దన్ దేవేళ్ల డ్యాన్స్ మాస్టర్ రాజాను టార్గెట్ చేయాలని గ్రూప్ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా రాజాతో పాటు, అతడిని అనుసరించే యువతులను అసభ్యంగా దూషిస్తూ గ్రూప్‌లో షేర్ చేసేవారు. ఈ వాట్సాప్ గ్రూప్‌లకు అడ్మిన్‌గా టిక్‌టాక్ ద్వారా పరిచయమైన అతని స్నేహితుడు కరీంనగర్ జిల్లా మెట్‌పల్లికి చెందిన అరవింద్ పటేల్ వ్యహరించేవాడు. వీరి గ్రూప్ సభ్యుల్లో ఒకరు ఈ పోస్టులు, అడియోలను డ్యాన్స్ మాస్టర్ రాజాకు పంపాడు. దీంతో అతను గత నెల 6న సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నికల్ డాటా ఆధారంగా నిందితులు నిమేష్ చౌదరి, అరవింద్ పటేల్‌లను గురువారం అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment