
అమీర్‌పేట: అక్కా తమ్ముడు కలిసి తీసిన టిక్‌టాక్ వీడియో పోస్టు చేయటాన్ని ఆసరాగా చేసు కుని ఓ యువతి వారిని బెదిరింపులకు గురి చే స్తుండటంతో పోలీసులను ఆశ్రయించారు. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. బల్కంపేటకు చెందిన అక్కా తమ్ముడు కలిసి టిక్‌టాక్ వీడియో తీసి వాట్సప్‌లో పోస్టు చేశారు. దీనిని చూసిన మరో యువతి తన మొ బైల్ నంబరు నుంచి వాట్సప్ గ్రూపుల్లో పోస్టు చేసింది. డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతోంది. బాధిత యువతి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment