వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడైన తర్వాత చైనా విషయంలో ఆయన వైఖరి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రపంచంలోని ఈ రెండు శక్తిమంతమైన దేశాల మధ్య సంబంధాల్లో ఇప్పటికే ఉద్రిక్తతలున్నాయి. అయితే వాషింగ్టన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే ఈ రెండు దేశాలు పరస్పర చర్చలపై ఎంతో ఆసక్తి చూపించాయి. భవిష్యత్తులో అమెరికా-చైనా మధ్య సంబంధాలలో సానుకూల మార్పును సూచించే ఐదు పరిణామాలు ఇవేనంటూ విశ్లేషకులు చెబుతున్నారు.
1. ఇటీవల ట్రంప్‌తో జరిగిన ఫోన్ సంభాషణలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అమెరికా-చైనా సంబంధాలలో ‘కొత్త ప్రారంభ స్థానం’ కోసం పిలుపునిచ్చారు. ఇరుదేశాల ‘విస్తృత ఉమ్మడి ప్రయోజనాలను’ ప్రస్తావించారు.
2. ఈ సంభాషణలో టిక్‌టాక్‌పై కూడా చర్చ జరిగిందని ట్రంప్ అన్నారు. నిజానికి అమెరికా టిక్‌టాక్‌ను నిషేధించడానికి సిద్ధమయ్యింది. అయితే ట్రంప్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే టిక్‌టాక్ ప్లాట్‌ఫామ్‌పై నిషేధాన్ని 75 రోజుల పాటు వాయిదా వేశారు.
4. జీ జిన్‌పింగ్.. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌ను పంపారు. అమెరికా అధ్యక్షుని ప్రమాణ స్వీకారోత్సవానికి బీజింగ్ నుంచి పంపిన అత్యంత సీనియర్ అధికారి హాన్ జెంగ్.
5. ట్రంప్ వైట్ హౌస్‌లో తన మొదటి రోజు (జనవరి 20)ప్రకటనల్లో చైనా వస్తువులపై సుంకాల విషయాన్ని ప్రస్తావించలేదు. మొదటి రోజే ఆయన దీనిని ప్రకటిస్తారని చాలా మంది పరిశీలకులు భావించారు. కానీ అలా జరగలేదు.
పన్నుల గురించి మీడియా ట్రంప్‌ను అడిగినప్పుడు తన మునుపటి అధ్యక్షుని కాలంలో విధించిన పన్నులు ఇప్పటికీ అమలులో ఉన్నాయని అన్నారు. మెక్సికన్, కెనడియన్ వస్తువులపై సుంకాలు ఫిబ్రవరి ఒకటి నుండి అమల్లోకి వస్తాయని చెప్పారు. టిక్‌టాక్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం మంచి విషయమే అవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Delhi Elections-2025: 12 ఎస్సీ సీట్లు.. విజయానికి కీలకం
Comments
Please login to add a commentAdd a comment