ఫిర్యాదు చేయడానికి వచ్చిన మొదటి భార్య సుకన్య
చెన్నై ,అన్నానగర్: తనను, తన బిడ్డను మానసికంగా వేధించి టిక్– టాక్ ద్వారా పరిచయమైన యువతిని రెండో వివాహం చేసుకున్న భర్తపై మొదటి భార్య మంగళవారం ఎస్పీకి ఫిర్యాదు చేసింది. వివరాలు.. పన్‌రూటి సమీపంలోని మేల్ ఇరుప్పు వీధికి చెందిన రాజశేఖర్ (26), సుకన్య (25) దంపతులు. సుకన్య ప్రస్తుతం కొల్లుకారన్ కుటైలోని ప్రైవేటు కళాశాలలో బీఎడ్ చదువుతోంది.మంగళవారం తన మూడేళ్ల కుమార్తెతో కడలూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ అభినవ్‌కు ఓ ఫిర్యాదు చేసింది.
తనకు 2014లో రాజశేఖర్‌తో వివాహం జరిగిందని, తమకు మూడేళ్ల కుమార్తె ధర్నిక ఉందని తెలిపింది. తన భర్తకి కొంతమంది మహిళలతో సంబంధం ఉందని.. ప్రశ్నించినందుకు భర్త, అతని తల్లి, తండ్రి, ఆడబిడ్డ హింసించేవారని చెప్పింది. దీని గురించి కాడంబులియూర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశానని.. ఇద్దరిని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారని పేర్కొంది. టిక్‌టాక్ ద్వారా తన భర్త కొందరు మహిళలతో సంబంధం పెట్టుకుని హింసిస్తూ వచ్చేవాడని తెలిపింది. ఈ క్రమంలో తన భర్త టిక్‌టాక్ ద్వారా పరిచయమైన యువతిని రెండో వివాహం చేసుకున్నాడని వివరించింది. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment