కల్యాణ సుందరం
చెన్నై ,టీ.నగర్: టిక్‌టాక్ యాప్ ద్వారా అనేక కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. అనేక హత్యలు చోటుచేసుకుంటున్నాయి. టైంపాస్ కోసం వీటిని పోస్టు చేస్తున్న వారు క్రమంగా టిక్‌టాక్ వ్యామోహంలో మునిగి తమ ఉద్యోగాలు, కుటుంబ సంబంధాలు అన్నింటినీ కోల్పోయి వీధినపడుతున్నారు. ప్రస్తుతం ఇదే కోవలో చెన్నై సెక్రటరియేట్ కాలనీ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న కల్యాణ సుందరం (53) చేరారు. ఇతను టిక్‌టాక్‌లో పలువురి మహిళలతో ద్వంద్వార్థ సంభాషణలు చేస్తూ వందలాది వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు. 2019 ఏప్రిల్ నుంచి మహిళలతో డ్యూయెట్లు పాడడం, నృత్యాలు చేయడం వంటి వేలాది వీడియోలను అప్‌లోడ్ చేశారు. అన్ని పాటలు, సంభాషణలు ద్వందార్థాలతో ఉంటున్నాయి. (టిక్‌టాక్ స్టార్ ఆత్మహత్య.. అనుమానాలు)
పోలీసుశాఖలో ముఖ్యంగా ప్రస్తుతం కరోనా వైరస్ అధికంగా వ్యాపిస్తున్నా రోజుకు సగటున 20కి పైగా పాటలను అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ వీడియోలన్నీ పోలీసుస్టేషన్ లోపలే తీస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసుల మధ్య అసంతృప్తి కలిగిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈయన విధుల్లో ఉన్నప్పుడు అనేక సమయాల్లో సెల్‌ఫోన్లలో మాట్లాడుతునే ఉంటాడని, అనేకసార్లు ఉన్నతాధికారుల మందలింపులకు గురైనట్లు సమాచారం. అందుచేత పోలీసు వృత్తికి ఇటువంటి కళంకం ఏర్పరిచే వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు పోలీసులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment