సినిమా: నటి వనితా విజయకుమార్ మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యారనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. నటుడు విజయకుమార్, మంజుల దంపతుల పెద్ద కూతురు వనిత. 1995లో నటుడు విజయ్‌కు జంటగా చంద్రలేఖ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన వనిత ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించింది. కాగా 2000 సంవత్సరంలో నటుడు ఆకాష్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కొడుకు, కూతురు పుట్టారు. అయితే ఆకాష్‌తో మనస్పర్థల కారణంగా 2005లో విడిపోయి విడాకులు తీసుకున్నారు.
ఆ తరువాత 2007లో ఆనంద్ జయదర్షన్ అనే వ్యాపారవేత్తను రెండోపెళ్లి చేసుకుంది. వీరికి ఒక కూతురు పుట్టింది. ఆ తరువాత ఆనంద్‌తోనూ విడాకులు తీసుకుంది. కాగా నృత్య దర్శకుడు రాబర్ట్‌తో వనిత కొంత కాలం సహజీవనం సాగించిందనే ప్రచారం జరిగింది. కాగా ఇటీవల బిగ్‌బాస్–3లో పాల్గొని వార్తల్లోకి ఎక్కిన వనిత తాజాగా మూడో పెళ్లికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా ఈ నెల 27న చెన్నైలోని తన ఇంటి వద్దే సింపుల్గా పీటర్ పాల్ అనే వ్యక్తితో వనిత వివాహం జరగనున్నట్లు పెళ్లి పత్రిక సహా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఆ విషయం గురించి నటి వనిత తరఫు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.
మళ్లీ పెళ్లికి సిద్ధం!
Published Thu, Jun 18 2020 8:04 AM | Last Updated on Thu, Jun 18 2020 10:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment