చిన్నా మృతదేహం , విలపిస్తున్న కుటుంబసభ్యులు
కుత్బుల్లాపూర్: ‘టిక్ టాక్’ యాప్ మరో ప్రాణం తీసింది.. లైక్‌ల కోసం ప్రమాదకరంగా వీడియో తీసుకుంటూ ఓ యువకుడు నీట మునిగి మృత్యువాత పడిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుం ది. సీఐ మహేశ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి. సంగారెడ్డి జిల్లా, కోహిర్ మండలం, సజ్జాపూర్ గ్రామానికి చెందిన కరణప్ప, బాలామణి దంపతుల కుమారుడు చిన్నా(22) బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చి దూలపల్లిలో ఉంటూ ఎర్రగడ్డలోని ఓ పళ్ల దుకాణంలో పని చేస్తున్నాడు.
మంగళవారం అతను తన పెద్దమ్మ కొడుకు ప్రశాంత్‌తో కలిసి దూలపల్లిలోని తూ మార్ చెరువు వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో సోష ల్ మీడియా యాప్ ‘టిక్ టాక్’ సభ్యుడిగా ఉన్న చిన్నా తాను నీటిలో ఉన్నప్పుడు వీడియో తీయాల్సిందిగా ప్రశాంత్‌ను పురమాయించాడు. ప్రశాంత్ వీడియో తీస్తుండగా చిన్నా చెరువు వద్ద నీటిలో టిక్‌టాక్‌కు అనుగూణంగా నటిస్తుండగా ప్రమాదవశాత్తు లోతుగా ఉన్న గుంతలో పడిపోయాడు. ప్రశాంత్ అతడిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. స్థానికులు అక్కడికి చేరుకునేలోగా చిన్నా నీటిలో గల్లంతయ్యాడు. బుధవారం చిన్నా మృతదేహాన్ని వెలికి తీసిన బషీరాబాద్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిన్నా తండ్రి కరణప్ప అతడి చిన్నతనంలోనే మృతి చెందగా, తల్లి బాలామణి సజ్జాపూర్‌లో ఒంటరిగా ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment