చెన్నై ,టీ.నగర్: సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌లో పరిచయమై వ్యక్తి ఎనిమిది సవర్ల బంగారు నగలను మోసం చేసి కాజేశాడని బుధవారం ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. చెన్నై రెడ్‌హిల్స్ పొత్తూరు, శరత్‌కండ్రిగైమేడు ప్రాంతానికి చెందిన మీనాక్షి (26)కి టిక్‌టాక్‌లో శాంథామస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీరు తరచూ తమ వీడియోలను షేర్ చేసుకునేవారు. ఆ పరిచయంతో శాంథామస్ మీనాక్షిని కొంత డబ్బు కావాలని సాయం కోరాడు. అయితే తన దగ్గర నగదు లేదని చెప్పింది.
తన నగలు కుదువపెట్టి డబ్బు తీసుకోమని చెప్పింది. కోయంబేడు బస్టాండ్‌లో శాంథామస్‌కు ఎనిమిది సవర్ల నగలు ఇచ్చింది. ఆ తర్వాత అతని ఆచూకీ తెలియలేదు. సెల్‌ఫోన్‌లో సంప్రదించే ప్రయత్నం చేయగా స్విచాఫ్ చేసి ఉంది. దీంతో తాను మోసపోయానని గుర్తించిన మీనాక్షి బుధవారం కోయంబేడు బస్‌స్టేషన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు శాంథామస్ కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment