
కుమార్, ప్రియాంక జంట
సాక్షి, బెంగళూరు: టిక్‌టాక్ ద్వారా ఒక్కటయ్యిందో జంట. టిక్‌టాక్ పరిచయంతో ప్రేమ మొగ్గతొడిగి, తర్వాత కులాంతర వివాహం చేసుకున్నారు. బాగలకోటె జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జమఖండికి చెందిన ప్రియాంక, హుణసూరుకు చెందిన కుమార్‌లు టిక్‌టాక్ ద్వారా ఒకరినొకరు పరిచయం అయ్యారు. టిక్‌టాక్‌లో పాటలు పాడి కుమార్ అప్‌లోడ్ చేయడం, వాటిని ప్రియాంక చూసి లైక్ కొట్టేది. తర్వాత ఇద్దరూ మొబైల్‌ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. తరచూ మాట్లాడేవారు, ఇలా వారిరువురి మధ్య ప్రేమ చిగురించింది. పేద కుటుంబానికి చెందిన ప్రియాంక తల్లిదండ్రులు వయసు రీత్యా వృద్ధాప్యంలో ఉన్నారు. ఇక కుమార్ కుటుంబం కూడా పెళ్లికి అంగీకరించారు. దళిత సంఘర్ష సమితి కార్యకర్తల సహాయం ఈ ప్రేమ జంట మూడుముళ్లు వేసుకుంది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment