
మైసూరు: ప్రేమించి పెళ్లాడిన భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు కట్నం కోసం పెడుతున్న వేధింపులను తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైసూరు జిల్లాలోణి హెచ్.డి.కోటె తాలూకాలోని మచ్చూరుకి చెందిన ఆనంద్ భార్య జ్యోతి (22). వీరు నాలుగేళ్ల కిందట ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.
దానిని మనసులో పెట్టుకొని అత్తమామలు కట్నం తీసుకురావాలని జ్యోతిని వేధించేవారు. ఈ విషయం ఆమె.. భర్తకు చెప్పినా పట్టించుకునే వాడు కాదు. ఈ క్రమంలో జ్యోతి విరక్తి చెంది రెండు రోజుల క్రితం ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆస్పత్రికి తరలించగా ఆదివారం ఉదయం మృతి చెందింది. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరకుని పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి: విహారంలో విషాదం.. పడవ బోల్తాపడి ఒకే ఫ్యామిలీలో 8 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment