wife suicide
-
క్షణికావేశం.. ఇద్దరు మహిళల ప్రాణం తీసింది!
సిర్పూర్(టి): క్షణికావేశం ఇద్దరు మహిళల ప్రాణాలు తీసింది. భార్యాభర్తల మధ్య గొడవతో భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు కారణమంటూ ఆమె భర్త కుటుంబ సభ్యులు దూషించడంతో ఎదురింట్లో ఉండే మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సిర్పూర్(టి) ఎస్సై డికొండ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని బెస్తకాలనీకి చెందిన గాజిరెడ్డి రమ(35)ను భర్త గాజిరెడ్డి సురేష్ గత కొంతకాలంగా అనుమానంతో వేధిస్తున్నాడు. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో రమ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం వేకువజామున మృతిచెందింది.ఆత్మహత్యకు కారణమంటూ..ఇదే కాలనీలో దోని సరిత(30) రమ ఎదురు ఇంట్లో నివాసం ఉంటుంది. రమ, సరిత ఇళ్లు ఎదురెదురుగా ఉండడంతో పరిచయస్తులు. కాగా, తన భార్య రమకు సరిత మాయమాటలు చెబుతుండడంతోనే రోజు గొడవలు జరుగుతున్నాయని, ఈ గొడవల కారణంగానే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని సురేష్, కుటుంబ సభ్యులు సరితను అసభ్యకరంగా దూషించారు. దీంతో మనస్తాపం చెందిన సరిత శనివారం ఉదయం క్షణికావేశంలో వెంట్రుకలకు వేసుకునే కలర్ తాగింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించింది. వైద్యుల సూచన మేరకు కాగజ్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది.కేసు నమోదుగాజిరెడ్డి సురేష్ గత ఏడాది కాలంగా తన కూతురు రమను అనుమానిస్తూ చిత్రహింసలకు గురి చేయడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లి ఒడ్డెటి పోశక్క పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గాజిరెడ్డి సురేష్, ఆయన తల్లి గుండమ్మ, చెల్లె పద్మ అవమానకరంగా దూషించడంతోనే తన భార్య దోని సరిత ఆత్మహత్య చేసుకుందని భర్త దోని రాజేందర్ ఫిర్యాదు చేశారు. ఇరువురి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
మీర్పేట్లో దారుణం.. కన్న బిడ్డలపై తల్లి కర్కశం, ఇద్దరు పిల్లల్ని చంపి..
సాక్షి, రంగారెడ్డి: మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మదర్స్‌డే రోజే ఓ తల్లి ఘోరానికి పాల్పడింది. క్షణికావేశంలో 9 నెలలు మోసి కన్న పేగు బంధాన్ని తెంచుకుంది. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను వాటర్ బకెట్లో ముంచి వారిని తిరిగిరాని లోకాలకు పంపించింది. అనంతరం తను కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే.. మీర్పేట్లో నివాసముంటున్న శ్రీను నాయక్‌కు తన భార్య భారతి(26)తో ఇటీవల గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి భార్యభర్తల మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. దీంతో విసిగిపోయిన భారతి భర్త మీద కోసం ఆదివారం తన ఇద్దరు పిల్లల్ని వాటర్ బకెట్లో ముంచి ప్రాణాలు తీసింది. తను ఆత్మహత్యాయత్నం చేయగా.. పక్కనే ఉన్న స్థానికులు గమనించి హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వివాహిత పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చదవండి: ఓ భార్య ఘనకార్యం.. భర్తను హత్య చేసి అతడిపైనే పుస్తకం రాసింది..చివరికి.. -
తల్లి కాటికి.. తండ్రి కటకటాల్లోకి.. ఒంటరిగా మిగిలిన చిన్నారులు
సాక్షి, మంచిర్యాల: ఏం జరిగిందో తెలియదు గానీ ఆ తల్లి ఉరేసుకుని ఊపిరి తీసుకుంది. కన్నపిల్లలపై మమకారాన్ని చంపుకుని కాటికి చేరింది. తండ్రిపై కేసు నమోదు కావడంతో కటకటాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. తల్లిని కోల్పోయి.. తండ్రికి దూరమైన ఇద్దరు చిన్నారులు ఒంటరిగా మిగిలారు. తల్లి మృతదేహం వద్ద దిగాలుగా నిలబడిన పిల్లలను చూసి అక్కడున్నవారు చలించిపోయారు. మంచిర్యాల మున్సి పల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి (32) మంగళవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బుధవారం ప్రభుత్వ ఆస్పత్రిలో జ్యోతి మృతదేహం వద్ద బంధువులు రోదిస్తుండగా.. ఆమె పిల్లలు రిత్విక్(8), భవిష్య(6) బిక్కుబిక్కుమంటూ అమాయకపు చూపులు చూస్తుండడం అక్కడున్న వారిని కలిచివేసింది. జ్యోతి ఆత్మహత్యకు భర్త బాలకృష్ణ వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మంగళవారం రాత్రి 12గంటల ప్రాంతంలో జ్యోతి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాలకృష్ణపై వరకట్న వేధింపులు 498(ఏ), ఆత్మహత్యకు ప్రేరేపణ 306 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని మంచిర్యాల కోర్టులో హాజరుపర్చగా 14రోజుల రిమాండ్ విధించారు. పోస్టుమార్టం అడ్డగింత మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో జ్యోతి మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా ఆమె తల్లిదండ్రులు, బంధువులు అడ్డుకున్నారు. ఆత్మహత్యకు కారణమైన వారిపై కేసు నమోదు చేయాలని పట్టుబట్టా రు. దీంతో పోలీసులు జ్యోతి భర్త బాలకృష్ణ, అతడి తండ్రి నల్లమల్ల మురళి, తల్లి కన్నమ్మ, తమ్ముడు హరికృష్ణ, అక్కాచెల్లెలు కృష్ణకుమారి, జ్యోతిపై కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టానికి మృతురాలి అంగీకరించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని బాలకృష్ణ స్వగ్రామం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవపురం తరలించారు. అక్కడ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. పిల్లలతో జ్యోతి(ఫైల్) మెసేజ్ చేసి డిలీట్ జ్యోతి ఆత్మహత్యకు ముందు వాట్సాప్‌లో ఓ మెసేజ్ చేసి డిలీట్ చేసిందని బాలకృష్ణ రోదించడం, ఉదయం 9.30గంటలకు తన తల్లికి ఫోన్ చేసిన జ్యోతి చనిపోయే ముందు ఏదైనా చెప్పాలనే ప్రయత్నం చేసి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లిన సమయంలో బాలకృష్ణతోపాటు ఇంటి పక్కన ఉండే అతడు మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో ఆధారాలు కనిపించకుండా చేసి ఉండొచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు ముందు రోజు రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు, జ్యోతిని బాలకృష్ణ కొట్టిన తీరును కూతురు భవిష్య మంచిర్యాల సీఐ నారాయణ్‌నాయక్‌కు వివరించింది. దర్యాప్తు కోసం పోలీసులు జ్యోతికి సంబంధించిన రెండు ఫోన్లు, బాలకృష్ణ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అమ్మమ్మ చెంతకు చిన్నారులు.. బాలకృష్ణను రిమాండ్‌కు తరలించడంతో ఇద్దరు చిన్నారులు రిత్విక్, భవిష్యలను అమ్మమ్మ గంగవరం రవీంద్రకుమారి, తాత రాంబాబు చెంతకు చేరారు. తల్లి మృతదేహంతో మంచిర్యాల నుంచి వెళ్లిపోయారు. కాగా, ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని స్థానిక బీజేపీ నాయకుడు తులా మధుసూదన్‌రావు డిమాండ్ చేశారు. ఆమె మృతిలో అనుమానాలెన్నో ! ఆరు నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవ చివరికి ఓ నిండు ప్రాణం బలి తీసుకుంది. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య జ్యోతి(32) మరణం వెనక రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘అమ్మా నన్ను చంపేసేలా ఉన్నాడు’ అని మృతురాలు తన తల్లితో చనిపోయే రోజే బాధగా ఫోన్లో చెప్పడం, ‘నాన్న అమ్మను తరచూ కొడుతూ, తిడుతున్నారని’ చిన్నారి భవిష్య చెప్పడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. వీటితోపాటు గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలపై పంచాయతీలు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. మృతురాలి తల్లితండ్రులు పలుమార్లు కమిషనర్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు. ఇతర మహిళలతో సంబంధాలు నెరపడంపైనా ఆరోపణలు ఉన్నాయి. గతంలో నిర్మల్ పని చేసినప్పుడు కంటే మంచిర్యాలకు వచ్చాక, ఆర్థికంగా బలపడినట్లుగా చెబుతున్నారు. మొదట కానిస్టేబుల్ ఉద్యోగంతో మొదలై, గ్రూప్ వచ్చి కమిషనర్ స్థాయికి చేరడంతో తన హోదాకు తగిన భార్య కాదని, అతనితోపాటు కుటుంబీకులు కూడా మృతురాలిపై ఆరోపణలు చేయడం పట్ల ఆత్మహత్యనా? లేక హత్యనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఓ ఉన్నతాధికారి భార్య మరణం కావడంతో పోలీసు ఉన్నతాధికారులు సైతం ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి సారించారు. సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని, కాల్‌డేటా, వాట్సాప్ చాట్, చనిపోవడానికి ముందు రోజు జరిగిన వాటిపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఆత్మహత్యకు ప్రేరేపణ, వరకట్న వేధింపుల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని స్థానికులు కోరుతున్నారు. -
ఏడు నెలల క్రితమే పెళ్లి.. వివాహేతర సంబంధం కారణంగా..
దొడ్డబళ్లాపురం: వివాహేతర సంబంధాలు కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. భర్త వివాహేతర సంబంధం కారణంగా నవ వివాహిత అత్తవారింట్లో మృతిచెందింది. ఈ ఘటన కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా హందిగద్దె గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. ఏడు నెలల క్రితమే మృతురాలు యమున (20)కు విఘ్నేశ్వర గౌడ అనే వ్యక్తితో వివాహమైంది. అయితే విఘ్నేశ్వర్‌కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉండేది. ఈ విషయమై యమున భర్తతో నిత్యం గొడవపడేది. ఈ క్రమంలో మంగళవారం ఉరివేసుకున్న స్థితిలో యమున శవమై తేలింది. అయితే తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని యమున తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంకోలా పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇంత మోసమా.. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత..
దొడ్డబళ్లాపురం: నిండు గర్భిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు ఉత్తర తాలూకా శివనపుర గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ నివాసి సౌందర్య (19) ఆత్మహత్య చేసుకుంది. మూడు రోజుల క్రితమే ఈమెకు సీమంతం కూడా జరిగింది. అయితే, గార్మెట్స్ ఫ్యాక్టరీలో పనిచేసే సౌందర్య, సంతోష్ అనే వ్యక్తిని ప్రేమించి పెద్దలను ఎదురించి 10 నెలల క్రితం వివాహం చేసుకుంది. కాగా, వివాహం తరువాత సంతోష్ అసలు రంగు బయటపడింది. సౌందర్యతో వివాహానికి ముందే ఒక యువతిని వివాహం చేసుకుని ఆమెను వదిలేసి నిజం దాచి సౌందర్యను మోసం చేసి చేసుకున్నాడు. అంతేకాకుండా నిత్యం మద్యం తాగి వచ్చి సౌందర్యను హింసించేవాడు. ఇక, 8 నెలల నిండు గర్భిణి ఆత్మహత్యకు పాల్పడటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ కుమార్తె మృతికి సంతోష్ కారణమని సౌందర్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న మాదనాయకనహళ్లి పోలీసులు సంతోష్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దంపతులిద్దరూ ఐటీ ఉద్యోగులే.. పిల్లలు లేకపోవడంతో భర్త..
కృష్ణరాజపురం: వేధింపుల భర్తతో విరక్తి చెందిన మహిళ అపార్ట్మెంటు 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన కర్నాటక రాజధాని బెంగళూరు మహాదేవపురలో వర్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. టెక్కీలుగా పనిచేస్తూ.. వివరాల ప్రకారం.. ఉపాసన(30), ఆమె భర్త రంజన్ రావత్ దంపతులు ఉత్తరాది నుంచి వలస వచ్చారు. దిశా అపార్ట్మెంటులో 9వ అంతస్తులో అద్దె ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి 9 సంవత్సరాల క్రితం పెళ్లయింది. వేర్వేరు ఐటీ కంపెనీల్లో టెక్కీలుగా ఉద్యోగం చేస్తున్నారు. వీరికి సంతానం కలగకపోవడంతో ఆ విషయమై తరచూ గొడవ పడేవారు. చివరికి విడాకులు తీసుకోవడానికి కూడా సిద్ధమైనట్లు తెలిసింది. తన జీవితం ఏమాత్రం బాగాలేదని విరక్తి చెందిన ఉపాసనా రావత్.. డెత్‌నోట్ రాసి బుధవారం సాయంత్రం తన ఫ్లాటు వరండా నుంచి కిందికి దూకేసింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కన్నుమూసింది. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి భర్త రంజన్ రావత్‌ను అరెస్టు చేశారు. డెత్‌నోట్‌లో ఏముంది? ఆమె ఆరు లైన్లలో ఆంగ్లంలో క్లుప్తంగా రాసిన డెత్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నా భర్త నన్ను మానసికంగా, భౌతికంగా వేధిస్తున్నాడు. అందుకనే నేను చనిపోతున్నా. లైంగికంగా అతడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అతన్ని కఠినంగా శిక్షించాలి అని లేఖలో రాసి ఉంది. -
ఇద్దరు పిల్లలున్నా వివాహేతర సంబంధం.. చివరకు ఇలా..
కృష్ణరాజపురం: వివాహేతర సంబంధాలు కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. తాజాగా భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా భర్త పరాయి మహిళతో తిరగడంతో ఆవేదనకు లోనైన మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కృష్ణరాజపురంలోని రామ్మూర్తి నగర పోలీసు స్టేషన్ పరిధిలో 8వ తేదీన జరగగా, ఆలస్యంగా వెలుగు చూసింది. ఆత్మహత్య చేసుకున్న మహిళ చందా పురోహిత్ (35) కాగా, తల్లికి ఏమైందో తెలియక మృతదేహం వద్ద ఇద్దరు పిల్లలు ఏడుస్తూ ఉండడం చూసి చుట్టుపక్కల వారు కంటతడి పెట్టారు. రాజస్థాన్ నుంచి వలస వచ్చి.. రాజస్థాన్‌కు చెందిన చందా పురోహిత్, భర్త నరేందర్ సింగ్‌లు బెంగళూరులో స్థిరపడ్డారు. 12 సంవత్సరాల క్రితం వీరికి పెళ్లి జరగ్గా.. 9, 4 సంవత్సరాల ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. నరేందర్‌సింగ్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో కలిసి టూర్లకు వెళ్లేవాడు. అది తెలిసి భార్య స్థానిక పోలీసులకు మొరపెట్టుకోగా ఘరానా భర్తకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ మారని భర్త.. మళ్లీ ప్రియురాలితో తిరుగుతూ ఉన్నాడు. ఇదేమని ప్రశ్నిస్తే భార్యపై దౌర్జన్యం చేసేవాడు. నాటు తుపాకీతో బెదిరించేవాడని సమాచారం. ఇతని వేధింపులను తట్టుకోలేక ఆమె ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. మరుసటి రోజు వరకూ పిల్లలు ఏడుస్తూ ఉండడంతో ఇరుగు పొరుగు ఏమైందో చూడగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. చందా పురోహిత్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామ్మూర్తినగర పోలీసులు కేసు నమోదు చేసి నరేందర్ సింగ్‌ను అరెస్టు చేశారు. -
మరో యువతితో భర్త షికార్లు.. ఫొటోలు భార్యకు పంపించి..
చిక్కబళ్లాపురం: భార్యను పుట్టింటిలో వదిలేసిన భర్త, ప్రియురాలితో టూర్లు వేశాడు, పైగా ఆ ఫోటోలను పంపించడంతో భార్య విరక్తి చెంది ప్రాణాలు తీసుకుంది. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హెణ్ణూరు కదిరేనహళ్లిలో నివాసమున్న మునిరాజు, దేవమ్మల కుమార్తె మోనిక (20)కు, చిక్కబళ్లాపురం నగరం ప్రశాంతనగరలో నివాసమున్న భార్గవ్ (25)తో 8 నెలల కిందట ఘనంగా పెళ్లి చేశారు. ఇద్దరూ సఖ్యతగానే ఉండేవారు. దసరా పండుగకు భార్యను ఆమె పుట్టింటికి పంపించాడు. తరువాత మళ్లీ తీసుకెళ్లడానికి రాలేదు. డెత్‌నోట్ రాసి ఉరి.. మోనిక భర్తకు ఫోన్ చేసి నన్ను తీసుకెళ్లు అని అడిగితే అతడు పట్టించుకోలేదు. మరో యువతితో షికార్లు చేస్తున్న ఫోటోను బుధవారం అతడు పంపించడంతో మోనిక నిర్ఘాంతపోయింది. ఈ పరిణామాలతో తీవ్రంగా కలత చెందిన మోనిక ఇంటి పై అంతస్తు గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు భర్త భార్గవ్ కారణమని డెత్ నోట్ రాసింది. చిక్కబళ్లాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. డిగ్రీ చదివించి, ఘనంగా పెళ్లి చేస్తే విధి మాకు ఇలా చేసిందా అని తల్లిదండ్రులు విలపించారు. కూతురి జీవితాన్ని నాశనం చేసిన భార్గవ్‌ను శిక్షించాలని కోరారు. -
మరో మహిళతో సంబంధం.. భర్త కొట్టడంతో మనస్తాపం చెంది
సాక్షి, సిద్దిపేట: భర్త వేధింపులు తాళలేక భార్య ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం జిల్లాలోని చిన్నకోడూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేటకు చెందిన దాసరి రాజ్యలక్ష్మి (24)ని 2015లో చిన్నకోడూరుకు చెందిన శ్రీశైలంతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా శ్రీశైలం మూడేళ్లుగా అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇరువురికి నచ్చజెప్పి సముదాయించారు. ఆదివారం రాజ్యలక్ష్మిని భర్త కొట్టడంతో మనస్తాపం చెంది రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అల్లుడు వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి దేవవ్వ ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: దసరాకి కొత్త దుస్తులు నాన్నా.. ఈ రోజే తెద్దాంలే కన్నా’.. అంతలోనే -
పిల్లల్ని ఒంటరి చేసి వెళ్లిపోయావా.. ఎందుకిలా చేశావ్ మమత!
గుడివాడరూరల్: వివాహిత కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మందపాడుకు చెందిన తాడి మమత (26) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ క్రమంలో ఆ ఇబ్బందులు తాళలేక శుక్రవారం రాత్రి పామర్రు రోడ్డులోని పెదకాల్వలో దూకింది. స్థానికులు చూసి వెంటనే టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్ల సాయంతో వెతుకులాట ప్రారంభించినా ఫలితం లేకుండా పోయింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో శనివారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టగా 10 గంటల తర్వాత బాపూజీనగర్ లాకుల వద్ద మమత మృతదేహం లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త తాడి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు టూటౌన్ ఎస్ఐ వి.రాజేంద్రప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మూడేళ్ల క్రితం రెండో పెళ్లి.. భర్త వేధింపులు భరించలేక..
బనశంకరి: అందంగా లేవంటూ భర్త పెట్టే వేధింపులు భరించలేక యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన కర్నాటకలో డీజే హళ్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడేళ్ల క్రితం నిజాముద్దీన్ అనే వ్యక్తిని అనిశా(33) రెండో వివాహం చేసుకుంది. వీరికి రెండేళ్లు, ఆరు నెలల వయసు కలిగిన ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో అందంగా లేవంటూ అనిశాను భర్త శారీరకంగా, మానసికంగా వేధించేవాడని ఆమె బంధువులు ఆరోపించారు. కాగా, సోమవారం మధ్యాహ్నం కూడా ఇదే విషయంపై గొడవ పడ్డారు. దీంతో, భర్త వేధింపులతో మనోవేదనకు గురైన అనిశా.. ఒంటిగంట సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు విక్టోరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు డీజే హళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: నెల రోజుల క్రితమే పెళ్లి.. లవర్‌తో కలిసి.. -
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భర్త చేసిన పనికి..
మైసూరు: ప్రేమించి పెళ్లాడిన భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు కట్నం కోసం పెడుతున్న వేధింపులను తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైసూరు జిల్లాలోణి హెచ్.డి.కోటె తాలూకాలోని మచ్చూరుకి చెందిన ఆనంద్ భార్య జ్యోతి (22). వీరు నాలుగేళ్ల కిందట ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. దానిని మనసులో పెట్టుకొని అత్తమామలు కట్నం తీసుకురావాలని జ్యోతిని వేధించేవారు. ఈ విషయం ఆమె.. భర్తకు చెప్పినా పట్టించుకునే వాడు కాదు. ఈ క్రమంలో జ్యోతి విరక్తి చెంది రెండు రోజుల క్రితం ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆస్పత్రికి తరలించగా ఆదివారం ఉదయం మృతి చెందింది. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరకుని పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: విహారంలో విషాదం.. పడవ బోల్తాపడి ఒకే ఫ్యామిలీలో 8 మంది మృతి -
భర్త వేధింపులు.. యువ వైద్యురాలు ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యోదయనగర్‌లో వరకట్న వేధింపులకు యువ వైద్యురాలు బలైంది. వివరాల ప్రకారం.. వైద్యురాలు వంగా భారతితో డాక్టర్ కొండగట్టు రమేష్‌కు గత డిసెంబర్లో వివాహమైంది. కాగా, అదనపు కట్నం తేవాలని రమేష్.. భారతిని వేధింపులకు గురిచేశాడు. కొత్తగా మరో ఆసుపత్రి పెడదామంటూ కట్నం కోసం ఆమెను వేధించాడు. ఈ క్రమంలో రమేష్ వేధింపులు భరించలేక యువ వైద్యురాలు భారతి ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు బాధితురాలు తండ్రి శంకరయ్య పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి రమేష్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భర్త అలా చేస్తున్నాడని వందన..
దొడ్డబళ్లాపురం: మత్తు పదార్థాలకు బానిసైన భర్త వేధింపులను తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన దొడ్డ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని త్యాగరాజనగర్‌లో చోటుచేసుకుంది. కోర్టు రోడ్డులో నివసిస్తున్న గౌతమ్ (28), వందన (24)ను ఒకటిన్నర ఏడాది క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కాగా, వందనా అమెజాన్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, గౌతమ్ సిమెంటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. వీరిది కులాంతర వివాహం కావడంతో అత్తగారింట్లో వేధింపులు మొదలయ్యాయి. భర్త మత్తు పదార్థాలకు బానిసై వేధించేవాడు. దీంతో విసిగిపోయిన వందనా రెండు నెలల క్రితం భర్తను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. కానీ భర్తలో మార్పు రాలేదు. మంగళవారంనాడు ఇంట్లో గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దొడ్డ పట్టణ పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్ శివారులో నగ్నంగా మృతదేహాలు, వివాహేతర సంబంధమే కారణమా? -
భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం.. వేధింపులతో
సాక్షి, హుస్నాబాద్(మెదక్): అదనపు వరకట్నం వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన అక్కన్నపేట మండలం కేశనాయక్‌తండా గ్రామపంచాయతీ పరిధి గొల్లపల్లిలో జరిగింది. శుక్రవారం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బెజ్జంకి మండలానికి చెందిన ధనూజకు అక్కన్నపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బండి సంజీవ్‌తో ఏడాది క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో వధువు తల్లిదండ్రులు సంజీవ్‌కు రూ.12 లక్షల కట్నం, బంగారు ఆభరణాలు ఇచ్చారు. కొన్ని నెలలు వీరి సంసారం ససజావుగా సాగింది. ఇటీవల భర్త సంజీవ్, అతడి తల్లిదండ్రులు అదనపు కట్నం తీసుకోరావాలని ధనూజను వేధిస్తున్నారు. అంతేకాకుండా సంజీవ్‌కు గ్రామంలోని మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో తరచూ భార్యను వేధించేవాడు. ఈ విషయంపై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలి తల్లి కల్లూరి అయిలవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి తెలిపారు. చదవండి: మహిళపై కన్నేసిన హెడ్ కానిస్టేబుల్.. కంప్లైట్ ఇచ్చేందుకు వస్తే లోబర్చుకొని -
పాపం ఏమైందో గానీ పెళ్లయిన నెలకే జవాను, భార్య ఆత్మహత్య
మద్దిపాడు: పెళ్లయిన 38 రోజులకే భార్య ఆత్మహత్య చేసుకుంది.. విషయం తెలుసుకున్న ఆర్మీ జవాను అయిన భర్త ఢిల్లీ నుంచి వచ్చి మరీ రిజర్వాయర్‌లో దూకి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన ప్రకాశం జిల్లాలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామానికి చెందిన పొదిలి మహానంది (30)కి ఒంగోలు సమీపంలోని ముక్తినూతలపాడు గ్రామానికి చెందిన తురకపల్లి ప్రియాంకతో గత డిసెంబర్ 29న వివాహమైంది. సంక్రాంతి పండుగ తరువాత తాను పనిచేస్తున్న సీఐఎస్ఎఫ్ క్యాంప్‌కు చేరుకున్నాడు. శుక్రవారం రాత్రి ప్రియాంక ఉరేసుకుని చనిపోయిందని సమాచారం రావడంతో హుటాహుటిన ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి రైలులో ఒంగోలు వచ్చాడు. ఒంగోలు నుంచి ఆటోలో మల్లవరం వద్ద ఉన్న గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్దకు చేరుకుని అక్కడ ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద బ్యాగ్, ఇతర లగేజ్ ఉంచి, రిజర్వాయర్ 14వ గేటు వద్ద తన దుస్తులు, చెప్పులు, సెల్‌ఫోన్, పర్స్ వదిలేసి రిజర్వాయర్‌లోకి దూకేశాడు. అంతకు ముందు 4 గంటల సమయంలో ఇంటికి ఫోన్ చేసి తాను చనిపోవడానికి రిజర్వాయర్ వద్దకు వచ్చినట్లు తెలపడంతో బంధువులు వెంటనే బయలుదేరి రిజర్వాయర్ వద్దకు వచ్చి పరిశీలించగా ఫోన్, దుస్తులు కనిపించడంతో మద్దిపాడు ఎస్ఐ శ్రీరామ్‌కు సమాచారం అందించారు. గజఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది సాయంతో గాలించగా సాయంత్రం 5 గంటల సమయంలో మృతదేహం బయటపడింది. మహానంది తల్లిదండ్రులు, బంధువులు రిజర్వాయర్ వద్దకు వచ్చి మృతదేహాన్ని చూసి విలపించారు. ఎస్ఐ కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. -
వంటలు రుచిగా లేవు, బట్టలు సరిగా ఉతకడం లేదని భర్త వేధింపులు.. భరించలేక
సాక్షి, మెట్పల్లి (కరీంనగర్): వంటలు రుచిగా తయారు చేయడంలేదని, బట్టలు సరిగ్గా ఉతకడంలేదంటూ తన భర్త పెట్టే మానసిక వేధింపులు తాళలేక ఫర్హానా బేగం(31) బలవన్మరణానికి ఒడిగట్టింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని గాజులపేటకు చెందిన ఫర్హానాబేగంకు నిజామాబాద్‌కు చెందిన వాజిద్దాన్తో 2016లో వివాహం జరిగింది. కొంతకాలం అక్కడే ఉన్నవారు.. ఆ తర్వాత మెట్‌పల్లికి వచ్చి స్థానిక వెల్లుల్ల రోడ్డులో నివాసం ఉంటున్నారు. వీరికి చిన్నారి(15నెలలు) ఉంది. అయితే, వంటలు రుచిగా తయారు చేయడం లేదని, బట్టలు సరిగ్గా ఉతకడం లేదని వాజిద్దాన్ తన భార్యను తరచూ మానసికంగా వేధించేవాడు. దీనిపై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. అయినా అతడి వైఖరిలో మార్పు రాలేదు. దీంతో శనివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఫర్హానా బేగం చనిపోయింది. తన బావపై అనుమానం వ్యక్తం ఫార్హానాబేగం సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. చదవండి: మూడు రోజుల్లో ముగ్గురు ఎస్సైలు.. కారణమేంటంటే -
మరో మహిళతో వివాహేతర సంబంధం.. భర్తకు ఎన్నిసార్లు చెప్పినా..
సాక్షి, రఘునాథపల్లి(వరంగల్): భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఓ వివాహిత మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం రామన్నగూడెంలో గురువారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వాకిటి నర్సిరెడ్డి– సునీత(38) దంపతులకు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. భర్త నర్సిరెడ్డి ఏడాదిగా ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని సునీత గొడవ పడుతుండేది. ఈ విషయంలో గురువారం ఉదయం దంపతుల మధ్య గొడవ జరిగింది. నర్సిరెడ్డి వ్యవసాయ బావివద్దకు వెళ్లాక భర్త ప్రవర్తనలో మార్పు రావడం లేదని జీవితంపై విరక్తి చెందిన సునీత ఇంట్లో దూలానికి ఉరివేసుకుంది. సాయంత్రం భర్త ఇంటికి రాగా తలుపులు గడియ వేసి ఉండటంతో కిటికీలో నుంచి చూడగా సునీత దూలానికి ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. నర్సిరెడ్డి రోదిస్తుండటంతో స్థానికులు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి బంధువులు ఘటన స్థలికి చేరుకుని ఆందోళన చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని తమ కూతురును నర్సిరెడ్డి పొట్టన పెట్టుకున్నాడని ఆరోపించారు. ఆస్తులు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా ఎస్సై రాజేష్‌నాయక్ వారికి నచ్చజెప్పారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని చెప్పడంతో వారు శాంతించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ మార్చురీకి తరలించారు. చదవండి: పేదింటి పెళ్లికి పెద్ద కొడుకు.. -
భర్త కళ్లేదుటే పురుగుల మందు తాగిన భార్య..
రాజేంద్ర నగర్(హైదరాబాద్): నెల్లూరు జిల్లాలో భర్త కళ్లేదుటే.. భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరువక ముందే హైదరాబాద్‌లోనూ అదే తరహా ఘటన జరిగింది. వివరాలు.. రాజేంద్ర నగర్లో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎం.ఎం. పహాడీలో ఈ దారుణం చోటుచేసుకుంది. మద్యానికి అలవాటు పడిన భర్త సాజీద్ వేధింపులు తాళలేక భార్య షబానా బేగం అనే వివాహిత పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, ఆ వివాహిత.. భర్త కళ్లేదుటే.. తాను విషం సేవించి ఆత్మహత్య చేసుకుంటున్నాను.. నీవు ఇక నుంచి ప్రశాంతంగా ఉండు.. అంటూ భర్తతో చెప్పి పురుగుల మందు సేవించింది. అయితే, భార్యను కాపాడాల్సింది పోయి... సాజీద్ పైశాచికంగా ప్రవర్తించాడు. తన ముందే భార్య విషం తాగి గిల గిలా కొట్టుకుంటున్నా.. ఆసుపత్రికి తీసుకొని వెళ్లకుండా ఆలస్యం చేశాడు. దీంతో పాపం.. ఆ అభాగ్యురాలు ప్రాణాలు విడిచింది. షబానా మృతితో ఆమె ఐదుగురు పిల్లలు అనాథలుగా మారారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: Property Disputes: కన్నవారికే ‘ప్రాణ భయం’ .. -
భర్తకు వీడియో కాల్ చేసి భార్య ఆత్మహత్య
సాక్షి, రాజేంద్రనగర్: ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ భర్తకు వీడియో కాల్ చేసి భార్య ఉరివేసుకున్న ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నల్గొండ ప్రాంతానికి చెందిన సాయిశివ(28), రాజమండ్రికి చెందిన నాగదేవి(24) ప్రేమించుకున్నారు. 8 నెలల క్రితం కుటుంబ సభ్యులకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. సాయిశివ బెంగళూర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా నాగదేవి బ్యూటీషియన్. ఇరువురు హైదర్‌గూడ చైతన్య విలాస్ ప్రాంతంలోని అపార్ట్మెంట్లో కాపురం పెట్టారు. సాయిశివ వారానికి రెండు రోజులు ఇక్కడే ఉండి అయిదు రోజులు బెంగళూర్‌లో విధులు నిర్వహించే వాడు. అతడి కుటుంబం ఎల్బీనగర్ ప్రాంతంలో నివసిస్తోంది. సోదరి వివాహం ఉండటంతో అతడు మూడు రోజుల క్రితం నగరానికి వచ్చాడు. ఎల్బీనగర్లో పెళ్లి పనులు చూసుకుంటున్నాడు. మంగళవారం రాత్రి నాగదేవి వీడియో కాల్ చేసి వెంటనే ఇంటికి రావాలని అతడిని కోరింది. వివాహం అనంతరం వస్తానని తెలపడంతో ఫోన్లో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వీడియో కాల్‌లోనే ఉరి వేసుకుంటున్నానంటూ నాగదేవి తెలిపింది. అపార్ట్మెంట్ పక్కన ఉండే వారికి సాయిశివ ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. వాచ్మెన్ సాయంతో తలుపులను బద్దలు కొట్టి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందింది. ఘటన స్థలానికి చేరుకున్న సాయిశివ రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందజేశాడు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: స్పా ముసుగులో వ్యభిచారం: ఏడుగురి రిమాండ్ రోడ్డు ప్రమాదంలో ఎంపీటీసీ దంపతుల మృతి -
నాగార్జున సాగర్: ప్రైవేట్ టీచర్ రవి భార్య ఆత్మహత్య
సాక్షి, నల్లగొండ: లోకం తెలియని చిన్నారులు.. అమ్మ చేతి గోరు ముద్దలు తింటూ.. నాన్నతో కలిసి ఆడుతూ పాడుతూ పెరగాల్సిన వారు. పట్టుమని పదేళ్లు కూడా నిండని ఆ చిన్నారులపై విధి పగబట్టింది. కరోనా రూపంలో వారిని కాటేసింది. కోవిడ్ వల్ల ఏడాదిగా ఉద్యోగం లేక.. ఆర్థిక సమస్యలు పెరగడంతో తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజులుగా ఇంట్లో ఒకటే ఏడుపు. ఏమైందో ఆ చిన్న బుర్రలకు అర్థం కావడం లేదు. ఒక్కటి మాత్రం తెలిసింది. నాన్న ఇక ఎన్నిటికి రాడని. ఈ బాధ నుంచి కోలుకోక ముందే వారి ఇంటి మరో విషాదం చోటు చేసుకుంది. చిన్నారుల తల్లి కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. తల్లిదండ్రులిద్దరిని కోల్పోయిన ఆ చిన్నారులను చూస్తే ప్రతి ఒక్కరి హృదయం ద్రవిస్తోంది. బిడ్డల ముఖం చూసైన బతుకకపాయే అంటూ విలపిస్తున్నారు బంధువులు. నాగార్జున సాగర్‌లో చోటు చేసుకుంది ఈ విషాద ఘటన. రెండు రోజుల క్రితం ఆర్థిక సమస్యలు తట్టుకోలేక సాగర్ హిల్ కాలనీకి చెందిన ప్రైవేట్ టీచర్ రవి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా నేడు వారి ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. రవి కుమార్ భార్య అక్కమ్మ కూడా ఆత్మహత్య చేసుకుని మరణించింది. భర్త మరణాన్ని జీర్ణించుకోలేని అక్కమ్మ గురువారం నాగార్జున సాగర్ కుడి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. దంపతులిద్దరి మరణంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. పసి బిడ్డలను చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెడుతున్నారు. బిడ్డల ముఖం చూసైనా బతుకకపాయే అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ప్రైవేట్ టీచర్ ఆవేదన: సీఎం సారూ.. పస్తులుంటున్నం -
భర్త వివాహేతర సంబంధం: భార్య, పిల్లలు జలసమాధి
సాక్షి, బళ్లారి: కుటుంబ కలహాలను తట్టుకోలేక ఓ తల్లి ఇద్దరు పిల్లలతో కలిసి వ్యవసాయ కుంట(ఫారంపాండ్)లోకి దూకి ప్రాణాలు తీసుకున్న ఘటన బాగలకోటె జిల్లా బాదామి తాలూకా హళకుర్కిలో మంగళవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఫక్కీరమ్మ(35), కుమారుడు నీలకంఠ (12), కుమార్తె కల్పన(10)అనే ముగ్గురు ఇంటి నుంచి గుడికి వెళ్లి అనంతరం ఇంటికి తిరిగి వస్తూ ఓ పొలంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. భార్యాపిల్లలు కనిపించకపోవడం భర్త గాలించినా ఆచూకీ దొరకలేదు. మృతదేహాలు నీటి మీద తేలడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఫక్కీరమ్మను హింసించేవాడని, అందువల్లే ఆమె ప్రాణాలు తీసుకుందని సమాచారం. కొడుకు నీలకంఠ పుట్టుమూగ. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాదామి పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చదవండి: జీవితంపై విరక్తి.. నవవధువు ఆత్మహత్య -
వివాహిత ఆత్మహత్య
-
భర్త ఫోన్ రిసీవ్ చేయలేదని భార్య ఆత్మహత్య
కణేకల్లు: భర్త తన ఫోన్ రిసీవ్ చేయలేదని మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... కణేకల్లు మండలం సొల్లాపురం గ్రామానికి చెందిన రాజశేఖర్, లక్ష్మీ అలియాస్ ధనలక్ష్మీ (28) దంపతులు. ఇద్దరూ కూలిపని చేసి జీవనం సాగిస్తున్నారు. రాజశేఖర్ తల్లిదండ్రులు మణెమ్మ, ప్రకాష్‌లు బతుకుతెరువు కోసం కర్నూలుకెళ్లారు. వారు అక్కడే పని చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రాజశేఖర్‌కు డబ్బు అవసరం కావడంతో తల్లిదండ్రుల వద్దకెళ్లి తెచ్చుకొనేందుకు మంగళవారం కర్నూలుకు వెళ్లాడు. అదే రోజు ఇంటికి తిరిగి వస్తానని భార్యకు చెప్పాడు. అయితే అక్కడ డబ్బు సర్దుబాటు కాలేదు. తల్లిదండ్రులు డబ్బు సమకూరగానే మేమే ఊరికొస్తాం... వెళ్లు అని కొడుక్కు చెప్పారు. డబ్బు అత్యవవసరం కావడంతో సర్దుబాటయ్యాకే ఊరికెళ్తానని అతను అక్కడే ఉండిపోయాడు. ఇంటికి వెంటనే తిరిగొస్తానని చెప్పిన భర్త మరుసటి రోజైనా రాలేదు. లక్ష్మీ ఫోన్ చేసి అడిగితే డబ్బు సర్దుబాటు కాలేదు.. అయ్యాక వస్తా... నీవేమీ ఫోన్ చేయొద్దని చెప్పాడు. అయితే మనసు ఆగలేక లక్ష్మీ గురు వారం ఉదయం అనేక మార్లు భర్తకు ఫోన్ చేసింది. రాజశేఖర్ ఫోన్ రిసీవ్ చేయలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మీ విషపుగుళికలు మింగింది. ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను స్థానికులు ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు అనంతపురానికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె మృతి చెందింది. -
భర్త సరిగా చూసుకోవడం లేదని.. నెలరోజుల క్రితమే పెళ్లి
అమీర్‌పేట: మొదటి భార్య ఉండగా ఓ వ్యక్తి నెల రోజుల క్రితం మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమెను సరిగా చూడక పోవడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది.ఈ సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ అశోక్ తెలిపిన మేరకు.. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన చెన్నకేశవుల మొదటి భార్యను సొంత ఊరిలో ఉంచి బతుకుదేరువు కోసం కొంత కాలం క్రితం నగరానికి వచ్చాడు. మోతీనగర్‌లో ఉంటూ కూలిపని చేసుకునే చెన్నకేశవులు లక్ష్మీ (24)తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో నెల రోజుల క్రితం వివాహం చేసుకున్నారు. కాగా మొదటి భార్యతో చనువుగా ఉంటూ తనను నిర్లక్ష్యం చేస్తున్నావంటూ లక్ష్మీ చెన్నకేశవులుతో గొడవ పడుతూ వస్తుంది. శనివారం రాత్రి ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది.దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన లక్ష్మీ ఇంట్లోకి వెళ్లి చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.లక్ష్మీ లోపలికి వెళ్లిన విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు తలుపులు విరగగొట్టి చూడా లక్ష్మీ అప్పటికే మృతిచెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరిపి పోస్టుమార్టం నిమిత్తం మృత దేహన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
వేరు కాపురానికి భర్త ఒప్పుకోలేదని..
కర్నూలు, చాగలమర్రి: క్షణికావేశం ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది. తెలిసీతెలియని ఇద్దరి చిన్నారులూ అందులో పావులు కావడం పలువురిని కలిచివేసింది. మండల పరిధిలోని డి.వనిపెంట గ్రామంలో బుధవారం చోటుచేసుకున్న ఘటన వివరాలు ఎస్ఐ శరత్‌కుమార్‌రెడ్డి తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన చిన్నసుబ్బరాయుడికి తిరుపాల్, భైరవ, కొండయ్య కుమారులు. పెద్ద కుమారుడు తిరుపాల్‌కు మొదటి భార్య అనారోగ్యంతో మృతిచెందడంతో ఆరేళ్ల క్రితం రుద్రవరం మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన ఆకుల రాధ(25)ను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి కూతురు తేజ(5), కుమారుడు ఈశ్వర్(3) ఉన్నారు. ఉమ్మడి కుటుంబం కావడంతో రాధ ఇమడలేక కొంతకాలంగా వేరుకాపురం పెడదామని కోరుతున్నా భర్త సర్దిచెబుతూ వస్తున్నాడు. ఇదే విషయమై బుధవారం తెల్లవారుజామున భార్య, భర్తల మధ్య చిన్నపాటి వివాదం చోటుచేసుకుంది. మనస్తాపం చెందిన రాధ కూతురు తేజకు, కుమారుడు ఈశ్వర్‌కు గడ్డి మందు తాపి తానూ తాగింది. ముగ్గురూ అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చాగలమర్రి కేరళా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
భర్తే లోకమని..
‘మూడుముళ్లు’ ఏకం చేశాయి..‘అగ్నిసాక్షి’గా ఏడడుగులు నడిచారు.. ఎన్నికష్టాలొచ్చినా ఒకరికొకరం తోడూనీడగా ఉందామనుకున్నారు. దర్జాగా బతకలేకున్నా ఉన్నంతలో ఆదర్శంగా బతుకుతున్నారు. అన్యోన్య దాంపత్యానికి ప్రతి‘రూపాలు’ను బాగా చదివించి ప్రయోజకులను చేయాలనుకున్నారు.. ఆ దాంపత్యాన్ని చూసి విధి ఓర్వలేకపోయింది. అంతలోనే అనారోగ్యమనే మిత్తి.. గుండెను నులిమింది. భార్య నుంచి భర్తను వేరు చేసింది. భర్తలేని లోకం శూన్యమని ఆమె భావించింది.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ విషాద ఘటనతో అభంశుభం తెలియని చిన్నారులు దిక్కులేని వారయ్యారని అందరి కళ్లు చెమర్చగా.. గార్లదిన్నె శోకసంద్రమైంది. అనంతపురం , గార్లదిన్నె: జ్వరంతో బాధపడుతున్న భర్త గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డాడు. భర్త లేని జీవితం శూన్యమని భార్య ఆత్మహత్య చేసింది. వివరాల్లోకెళ్తే.. మండల కేంద్రం గార్లదిన్నెలో కిరాణా అంగడి నిర్వహిస్తున్న నాగరాజు (45) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున ఉన్నపళంగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నాగరాజు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగానే భర్త లేని ఈ లోకంలో తాను జీవించలేనని భార్య పద్మావతి ఇంట్లోకెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసింది. కుటుంబ సభ్యులు 108లో ఆమెను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటికే ఆమె కూడా మృతి చెందింది. ఇదిలా ఉండగా నాగరాజు నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. అయోమయంలో పిల్లలు.. నాగరాజు, పద్మావతి దంపతులకు ఆరో తరగతి చదువుతున్న గౌతమ్, తొమ్మిదో తరగతి చదువుతున్న చైతన్య కుమారులు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో పిల్లలు బోరున విలపించారు. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. -
వేధింపులకు తాళలేక బలవన్మరణం
పెద్దేముల్: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పెద్దేముల్ ఎస్ఐ సురేశ్, గ్రామస్తుల కథనం ప్రకారం.. మంబాపూర్ గ్రామానికి చెందిన చాకలి మంజుల (31), శ్రీనివాస్ దంపతులు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తుండేవారు. అయితే వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. రోజు భర్త శ్రీనివాస్ మద్యం సేవించి భార్య మంజులను వేధిస్తుండేవాడు. ఆదివారం కూడా భర్త వేధించడంతో మనస్తాపానికి గురైన మంజుల అర్ధరాత్రి ఇంట్లో దులానికి కట్టుకున్న చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటికి కుటుంబసభ్యులు మంజుల కోసం చూడగా దూలానికి వేలాడుతూ కనిపించింది. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని కిందకుదించి పోస్ట్‌మార్టం నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి పాండయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్త వేధింపులతోనే తన కూతురు మంజుల ఆత్మహత్య చేసుకుందని పాండయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతురాలికి కుమారులు అభిషేక్, విష్ణువర్దన్ ఉన్నారు. -
భర్త కళ్లెదుటే మహిళ..
చెన్నై ,తిరువొత్తియూరు: వివాహేతర సంబంధం వ్యవహారంపై మైలాపూర్ పోలీసుస్టేషన్లో పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో భర్త కళ్లెదుటే భార్య ఆత్మహత్యకు యత్నించిన సంఘటన సంచలనం కలిగించింది. చెన్నై మైలాపూర్‌కు చెందిన నరేష్ (36) ప్రైవేటు సంస్థ ఉద్యోగి. అతని భార్య కలైవాణి (30). ఈమెకు అదే ప్రాంతానికి చెందిన ఒకరితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంగతి తెలియడంతో నరేష్ భార్యను మందలించాడు. అయినప్పటికీ కలైవాణి తన ప్రవర్తనను మార్చుకోలేదు. దీంతో ఆగ్రహం చెందిన నరేష్ భార్య వివాహేతర సంబంధంపై మైలాపూర్ మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కలైవాణిని శనివారం రాత్రి పోలీసుస్టేషన్‌కు పిలిపించి విచారణ చేశారు. ఆ సమయంలో కలైవాణి ప్రియుడు, భర్త పోలీసుస్టేషన్‌కు వచ్చారు. ఈ ఘటనతో అవమానానికి గురైన కలైవాణి స్టేషన్ నుంచి బయటకు పరుగుతీసింది. ఆమెను పోలీసులు, భర్త నరేష్ వెంబడించారు. పరిగెత్తుకుంటూ వెళ్లిన కలైవాణి లజ్‌కార్నర్ వద్ద కూవం నదిలోకి దూకారు. పోలీసులు ఆమెను బయటకు తెసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. -
ఎంపీ గన్‌మ్యాన్ భార్య ఆత్మహత్య
-
వివాహేతర సంబంధం నేరం కాదనడంతో..
చెన్నైలోని భారతీనగర్‌కు చెందిన పుష్పలత రెండేళ్ల క్రితం జాన్‌పాల్ ఫ్రాంక్లిన్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకుంది. ఈ పెళ్లిని ఇద్దరి కుటుంబాలూ వ్యతిరేకించాయి. దీంతో వీరిద్దరు వేరేచోట కాపురం పెట్టారు. వీరికి ఓ సంతానం కూడా కలిగింది. చెన్నైలోని ఓ పార్కులో ప్రస్తుతం ఫ్రాంక్లిన్ సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. భార్య పుష్పలతకు క్షయవ్యాధి సోకడంతో ఆమె ప్రస్తుతం చికిత్సపొందుతోంది. వ్యాధిసోకిన నాటి నుంచీ భార్యతో అన్యోన్యంగా ఉండటం మానేసిన ఫ్రాంక్లిన్.. ఆమెకు కనీస అవసరాలకు సైతం డబ్బు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో ఈ విషయాన్ని అతని స్నేహితులకు చెప్పడానికి పుష్పలత వెళ్లినపుడు ఫ్రాంక్లిన్‌కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు స్నేహితులు చెప్పారు. పార్కులో సెక్యూరిటీ గార్డు డ్యూటీ సమయం పూర్తయినా చాలా లేటుగా ఇంటికొస్తున్న భర్తను నిలదీసింది. ఆ మహిళతో వివాహేతర బంధాన్ని తెంచుకోవాలని తెగేసిచెప్పింది. అందుకు ఫ్రాంక్లిన్ తిరస్కరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. వివాహేతర బంధాలు నేరం కాదంటూ తాజాగా సుప్రీంకోర్టు తీర్పుచెప్పిందని, పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశమే లేదంటూ ఫ్రాంక్లిన్ సమర్థించుకున్నాడు. దీంతో తీవ్ర నిరాశకు గురైన పుష్పలత శనివారం ఒంటరిగా ఉన్నపుడు ఉరి వేసుకుని ఆత్మహత్యచేసుకుంది. విషయం తెల్సిన పోలీసులు ఫ్రాంక్లిన్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తుచేస్తున్నారు. భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని 497వ సెక్షన్ కింద వివాహేతర (ఇరువురి సమ్మతితో) సంబంధాలు నేరం కాదని తాజాగా సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చిన తర్వాత ఈ అంశానికి సంబంధించిన తొలికేసుగా పుష్ప మరణాన్ని పరిగణిస్తున్నారు. అయితే ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం.. ఆత్మహత్యకు ప్రేరేపించిన ఎలాంటి వివాహేతర సంబంధమైనా శిక్షార్హమైన నేరమే అవుతుంది. -
భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య
గంట్యాడ : మండలంలోని వసాది గ్రామానికి చెందిన వర్రి అర్జునమ్మ(30) భర్త వేధింపులు భరించలేక మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి సంబంధించి గంట్యాడ ఎస్ఐ పి.నారాయణరావు తెలిపిన వివరాలు...వసాది గ్రామానికి చెందిన అర్జునమ్మ తన ఇంట్లో ఫ్యాన్ హుక్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపారు. జామి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన అర్జునమ్మకు వసాది గ్రామానికి చెందిన వర్రి సర్వారావుతో 2013 మే 31న వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరూ ఆడ పిల్లలు కావడంతో కొన్నాళ్లుగా భర్త సర్వారావుతో పాటు ఆడపడుచు వర్రి దేవుడమ్మను వేధిస్తున్నట్టు మృతురాలి సోదరుడు సబ్బవరపు శ్రీను తమకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అందిన ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ డి.రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి భర్తతో పాటు ఆడపడుచును అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. తహసీల్దార్ నీలకంఠరావు సమక్షంలో మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం కేంద్ర ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. విచారణలో రూరల్ ఎస్ఐ రామకృష్ణ, నెల్లిమర్ల ఎస్ఐ ఉపేంద్ర పాల్గొన్నారు. -
కొత్త దుస్తుల కోసం దంపతుల మధ్య గొడవ
కెలమంగలం(డెంకణీకోట): జీవితంలో కొత్త ఉషస్సులు నింపాల్సిన నూతన సంవ్సర వేడుకలు ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపాయి. కొత్త దుస్తులు కొనాలని భర్తతో గొడవ పడిన ఓ వివాహిత తన ముగ్గురు పిల్లలతో కలిసి బావిలో దూకింది. ఘటనలో తల్లి మృతి చెందగా పిల్లలు ప్రాణాలతో బయట పడ్డారు. ఈ ఘటన కెలమంగలం పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకొంది. డెంకణికోట పోలీసుల కథనం మేరకు.. డెంకణీకోట సమీపంలోని దడికల్ గ్రామంలో కాళియప్ప లక్ష్మి(32) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కలైయరసి(13), సుజాత(11), పెరుమాల్(5) పిల్లలు న్నారు. కాళియప్ప కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పిల్లలకు కొత్త దుస్తులు కొనిపెట్టాలని లక్ష్మి ఒత్తిడి చేసింది. ఈ విషయంలో దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. జీవితంపై విరక్తి చెందిన లక్ష్మి తన ముగ్గురు పిల్లలను వెంట తీసుకెళ్లి బావిలో తోసి అనంతరం తానూ అందులోకి దూకింది. కేకలు విన్న స్థానికులు బావిలోకి దిగి ముగ్గురు పిల్లలను సురక్షితంగా బయటకు తీశారు. అయితే లక్ష్మి మాత్రం ప్రాణాలు కోల్పోయింది. కెలమంగలం పోలీసులు లక్ష్మి మృతదేహాన్ని శవపరీక్ష కోసం డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
అత్తింటి వేధింపులతో కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య
శ్రీకాకుళం జిల్లా / పద్మనాభం(భీమిలి): అత్తింటి వేధింపులు తాళలేక కానిస్టేబుల్ భార్య ఉరిపోసుకుని అత్మహత్య పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని ఐనాడ పంచాయతీ సత్యనారాయణపురంలో సోమవారం చోటుచేసుకుంది. పద్మనాభం ఎస్ఐ ఎస్.రామమూర్తి అందించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కొండంపేట గ్రామానికి చెందిన కెల్ల అన్నాజీరావు కుమార్తె శిరీషాతో చింతవలస ఐదో బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చింతలూరి శ్రీనివాసరావుకు వివాహమైంది. వివాహమై నాలుగేళ్లు కావస్తుంది. వీరు సత్యనారాయణపురంలో సొంత ఇళ్లు కట్టుకుని నివాసముంటున్నారు. ఇంట్లో పనిచేయడంలేదని శిరీషాను అత్త రోజూ వేధిస్తుంది. మామ తాగి వచ్చి భోజనం పెట్టలేడందని దుర్పాషలాడుతున్నాడు. భర్త శ్రీనివాసరావు శారీరకంగా,మానసికంగా వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపం చెందిన శిరీషా ఇంట్లో ఫ్యాన్ హుక్కు ఉరి పోసుకుని మృతి చెందింది. మృతురాలి తండ్రి కెల్ల అన్నాజీరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్త, మామ, భర్త శ్రీనివాసరావులపై 306, 498ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. శిరీషా మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం భీమునిపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. -
ఆడపిల్ల పుట్టిందని..
కర్నూలు / రాంకొండ(తుగ్గలి): నిండు నూరేళ్లు తోడుగా ఉంటానని బాస చేసిన భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. రెండోసారి ఆడబిడ్డకు జన్మినిచ్చిందని వేధింపులకు గురి చేయడంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆ అబల ఉరి వేసుకుని తనువు చాలించిన ఘటన సోమవారం తుగ్గలి మండలం రాంకొండ గ్రామంలో చోటు చేసుకుంది. తుగ్గలి ఎస్ఐ కేశవ తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని రాంకొండకు చెందిన కాశీం కూతురు చామంతి అలియాస్ లావణ్యను (22) మూడేళ్ల క్రితం డోన్ మండలం కొచ్చెర్వుకు చెందిన రామాంజనేయులుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి మొదట సంతానం కూతురు. అప్పటి వరకు దంపతులు అన్యోన్యంగా ఉండేవారు. మూడు నెలల క్రితం పుట్టింట్లో చామంతి రెండో కాన్పులోనూ ఆడపిల్లకు జన్మినిచ్చింది. దీంతో జీర్ణించుకోలని భర్త రామాంజనేయులు భార్యను వేధింపులకు గురి చేశాడు. సోమవారం ఊరికి వచ్చిన భర్త ఇంటికి కూడా రాకపోవడంతో తీవ్ర మానసిక క్షోభకు గురై ఎవరూ లేని సమయంలో తాడుతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన ఇంటి చుట్టు పçక్కల వారు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతురాలి తండ్రి కాశీం ఫిర్యాదు మేరకు రామాంజనేయులుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
ఆయన లేని జీవితంలో నేనుండలేను...
♦ భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య ♦ బాగా చదువుకొని ఉద్యోగం చేయాలని సూసైడ్ నోట్ మంథని: విధి ఆకుటుంబాన్ని వెంటాడింది. నెలరోజుల క్రితం కుటుంబ యజమాన్ని గుండెపోటుతో మృతి చెందగా మనస్థాపానికి గురైన భార్య ఉరేసుకొని తనువు చాలించిన సంఘటన సోమవారం పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో చోటుచేసుకుంది. మంథనిలోని గాంధీచౌక్‌కు చెందిన గుడిమల్ల నాగరాజు(44) గతనెల 26న గుండెపోటుతో మృతి చెందాడు. ఈయనకు భార్య స్వరూప(40), ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే భర్త మరణంతో స్వరూప తీవ్రంగా కుంగిపోయింది. ఆయన లేని జీవితంలో నాకేందుకని నెలరోజులుగా మదన పడుతోంది. ఈ క్రమంలో సోమవారం తెల్ల వారుజామున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చెల్లి రమ్యను బాగా చదివించాలని, నీవు కూడా ఉద్యోగం వచ్చాకే పెళ్లి చేసుకోవాలని పెద్దకూతురు శృతిని కోరుతూ సూసైడ్ నోట్ రాసింది. స్వరూప చిన్న కూతురు రమ్య బీటెక్, పెద్దమ్మాయి ఎంబీఏ చదువుతోంది. నెలరోజుల వ్యవధిలోనే అమ్మా..నాన్నలు దూరం కావడంతో ఆ బిడ్డల రోదన మిన్నంటింది. ఈ సంఘటన చూపరులను కలిచివేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్‌రావు తెలిపారు. -
భర్త దుబారా ఖర్చు: భార్య ఆత్మహత్య
రాచర్ల: భర్త దుబారా ఖర్చులు పెడుతుండటంతో అనవసర ఖర్చులు వద్దని వారిస్తు వస్తున్న భార్య చివరకు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా రాచర్ల మండలం యడవల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి దాటాక చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బైళ్ల సాల్మాన్ ఆర్మీలో జవానుగా విధులు నిర్వహిస్తున్నాడు. రెండు రోజుల క్రితం సెలవు నిమిత్తం వచ్చిన సాల్మాన్ తన తండ్రి జ్ఞాపకార్థం గ్రామంలో బండలాగుడు పోటీలు నిర్వహించాడు. ఈ విషయమై గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోమని.. భార్య పలుమార్లు చెప్పిన పట్టించుకోని సాల్మాన్ నిన్న అట్టహాసంగా పోటీలు నిర్వహించాడు. దీంతో రాత్రి భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మనస్తాపానికి గురైన పుష్ప(32) వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించే లోపే మృతి చెందింది. వీరికి రెండేళ్ల పాప ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నా -
భార్య ఆత్మహత్య రహస్యాన్ని చేధించిన భర్త
బెంగళూరు: ప్రేమించిన వాడికి పెళ్లి నిశ్చయమైందనే వార్తతో గత ఏడాది వివాహిత ఆత్మహత్య చేసుకున్న కేసుకు సంబంధించిన చిక్కుముడి వీడింది. తన భార్య ఆత్మహత్యకు గల కారణాలను స్వయంగా ఆమె భర్తే శోధించి పోలీసులకు అందించడం ఇక్కడ మరో విశేషం. వివరాల్లోకి వెళితే...ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వెంకట్ జగదీశ్‌కు అదే ప్రాంతానికి చెందిన జోత్స్నా వైశ్యరాజుతో 2015 మార్చిలో వివాహమైంది. బెంగళూరులో సాప్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న వెంకట్ జగదీశ్ పెళ్లయిన అనంతరం భార్య జోత్స్నను తన వెంట తీసుకొని బెంగళూరులోని కాపురం పెట్టాడు. జోత్స్న కూడా ఇంజనీరింగ్ చదవగా తనకు ఉద్యోం చేయడం ఇష్టం లేకపోవడంతో ఇంట్లోనే ఉండేది. పెళ్లయిన కొద్ది నెలల వరకు వైవాహిక జీవితం సజావుగా సాగుతున్న వెంకట్‌కు అదే ఏడాది డిసెంబర్లో జోత్స్న ఆత్మహత్యకు పాల్పడడంతో ఊహించని షాక్ తగిలింది. అప్పటి వరకు తనను సొంత కొడుకులా భావించిన జోత్స్న తల్లితండ్రులు కుమార్తె ఆత్మహత్యకు తమ అల్లుడైన వెంకట్ కారణమని, అతడి చిత్రహింసలు భరించలేకే తమ జ్యోత్స్న ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంకట్‌ను అరెస్ట్ చేసారు. అనంతరం ఈ ఏడాది జనవరిలో బెయిల్‌పై విడుదలైన వెంకట్ అప్పటి నుండి తన భార్య ఆత్మహత్యకు గల కారణాలపై పరిశోధించడం ప్రారంభించాడు.ఆమె కాలేజీ నాటి ఫోటోలు,పరిచయాలు, ఫేస్బుక్, వాట్సాప్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన వెంకట్‌కు తన భార్య జోత్స్నకు,ఆమె సీనియర్ గిరీశ్ పట్నాయక్‌లకు మధ్య ప్రేమ వ్యవహారం బయటపడింది. ఆమె ఫేస్బుక్ అకౌంట్ తెరచి చూడగా అందులో 60వేల మెసేజ్లున్నాయని అందులో ఎక్కువగా గిరీశ్ పట్నాయక్‌తోనే ఛాటింగ్ చేసేదని,అందులో ఇద్దరం కలసి ఎక్కడికైనా పారిపోదామని మాట్లాకున్నట్లు వెంకట్‌కు తెలిసింది.అంతే కాకుండా తన ఆఫీస్‌కు వెళ్లిన అనంతరం ఆమె మొబైల్ నుండి ఎక్కువగా గిరీశ్ పట్నాయక్‌కే కాల్స్ వెళ్లినట్లుగా వెంకట్ తెలుసుకున్నాడు. కాలేజీ నుండి నడుస్తున్న జోత్స్న,గిరీశ్ పట్నాయక్ల ప్రేమ వ్యవహారం జోత్స్నకు వివాహమైన అనంతరం కూడా కొనసాగించినట్లు తెలుసుకున్నాడు. ఈ క్రమంలో గిరీశ్పట్నాయక్కు మరో యువతితో వివాహం నిశ్చయమైందని తెలియడంతో దీనిపై జోత్స్న ప్రశ్నించగా అతడు ఆమెను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు. దీంతో గిరీశ్పట్నాయక్ తీరుతో మనస్థాపం చెందిన జోత్స్న ఆత్మహత్యకు పాల్పడింది. ఈ వ్యవహారాన్ని అంతా వెంకట్ సాక్ష్యాలతో సహా పోలీసులకు అందించారు. ఆ సాక్ష్యాల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు జోత్స్న ఆత్మహత్యకు కారకుడైన గిరీశ్ పట్నాయక్‌ను శ్రీకాకుళంలో అరెస్ట్ చేసి బెంగళూరు తరలించి విచారణ చేస్తున్నారు. -
భార్య ఆత్మహత్య కేసులో భర్త అరెస్ట్
జ్యోతినగర్: భార్య ఆత్మహత్య కేసులో పరారీలో ఉన్న ఓ డాక్టర్ ను ఎన్టీపీసీ పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ ఎన్టీపీసీ పరిధిలోని కృష్ణానగర్‌లో నివాసముంటున్న వాణి(28), శ్యాంకుమార్‌లు భార్యాభర్తలు. శ్యాంకుమార్ ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా అదనపుకట్నం కోసం శ్యాంకుమార్, అతని కుటుంబసభ్యులు వేధిస్తుండటంతో మనస్తాపం చెందిన వాణి ఈ నెల 7న తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాల పాలైన వాణి చికిత్సపొందుతూ 9వ తేదీన మరణించింది. అప్పటి నుంచి భర్త శ్యాంకుమార్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం అతనిని అరెస్ట్ చేసి మీడియా ఎదుట హాజరుపరిచారు. -
నా చావుకు కారణం హౌస్ ఓనర్స్
-
నా చావుకు కారణం హౌస్ ఓనర్స్
అద్దె ఇంటి యజమానుల వేధింపులతోవివాహిత ఆత్మహత్య - పిల్లలు అల్లరి చేస్తున్నారని ఐదు నెలల నుంచి గొడవలు, బెదిరింపులు - మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఇల్లాలు - తన చావుకు ఇంటి యజమానులే కారణమని గోడపై సూసైడ్‌నోట్ - పరారీలో యజమాని.. పోలీసుల అదుపులో యజమాని భార్య - కూకట్పల్లి శ్రీనివాసకాలనీలో ఘటన హైదరాబాద్: అద్దెకున్న ఇంట్లో తన పిల్లలు అల్లరి చేయడమే ఆమె పాలిట శాపంగా మారింది. పిల్లలు ఆడుకున్నా.. చివరికి ఇంట్లో కుర్చి కదిపినా ఇంటి యజమానులు బెదిరింపులు, వేధింపులకు పాల్పడటంతో ఆమె ఉక్కిరిబిక్కిరైంది. ఐదు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ఇల్లాలు చివరికి బలవన్మరణానికి పాల్పడింది. తన చావుకు ఇంటి యజమానులు ప్రసన్నకుమార్‌రెడ్డి, స్నేహలతలే కారణమని ఇంటి గోడలు, తలుపులపై రాసి వివాహిత సుజాత (28) ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున కూకట్‌పల్లిలో ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన గోనుగొంట్ల రామకృష్ణ, సుజాత దంపతులు రెండున్నరేళ్లుగా కూకట్పల్లి శ్రీనివాస కాలనీ మెడికల్ సొసైటీలోని ప్లాట్ నం28/బీలో నివాసం ఉంటున్నారు. మాదాపూర్‌లోని ఐవీవైటు కంపాక్ట్లో రామకృష్ణ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, సుజాత ఇంటి వద్దనే ఉంటోంది. వీరికి కుమారుడు రిషి(3), కూతురు అమిత్యసారుు(ఏడాదిన్నర) పిల్లలు ఉన్నారు. అరుుతే పిల్లలిద్దరు అల్లరి చేస్తుండటంతో శబ్ధం వస్తోందని, ఇంటిపైన ఆరబెట్టిన బట్టల నీరు కిందకు వస్తోందని తరచూ ఇంటి యజమానులు వీరితో గొడవపడేవారు. ఐదు నెలల నుంచి ఇల్లు ఖాళీ చేయమని వేధింపులకు దిగారు. అరుుతే సుజాత భర్త రామకృష్ణ బంధువుల పెళ్లి ఉండటంతో శుక్రవారం సాయంత్రం పాలకొల్లు వెళ్లాడు. కుర్చీలు జరిపారని గొడవకు దిగారు.. కాగా, ఆదివారం సాయంత్రం ఇంట్లో పిల్లలు కుర్చీలు జరపడంతో శబ్ధం వచ్చిందంటూ ఇంటి యజమానులు స్నేహలత, ప్రసన్నకుమార్ సుజాతతో గొడవకు దిగి.. ఆమెపై దాడికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న రామకృష్ణ తమ్ముడు నరేష్ వారిని వారించాడు. దీంతో రామకృష్ణకు ప్రసన్నకుమార్ ఫోన్ చేసి తక్షణమే ఇల్లు ఖాళీ చేసి వెళ్లి పోవాలని చెప్పాడు. తాను ఊరు వెళ్లానని వచ్చాక ఇల్లు ఖాళీ చేస్తానని, ఏదైనా ఉంటే తనతో మాట్లాడాలి తప్ప ఇంట్లో ఉన్న తన భార్యతో గొడవ పడవద్దని కోరాడు. గొడవ సద్దుమణిగాక నరేష్వెళ్లిపోవటంతో సుజాత పిల్లలతో ఇంట్లోనే నిద్రించింది. ఇంటి యజమానుల వేధింపులతో మనస్తాపం చెందిన సుజాత ఆదివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు వైరుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లికి వెళ్లిన భర్త గొడవ విషయం తెలిసి.. ఆదివారం రాత్రే పాలకొల్లులో బయలుదేరి.. సోమవారం తెల్లవారుజామున నాలుగున్నరకు కూకట్పల్లి చేరుకున్నాడు. ఆ సమయంలో భార్యకు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోకపోవటంతో సమీపంలోని సోదరుని ఇంటికి వెళ్లాడు. తిరిగి ఉదయం 6.30 గంటలకు వచ్చి మళ్లీ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి యజమానిని నిలదీశాడు. ఆ తర్వాత కార్పెంటర్ సహాయంతో వంట గది గడియ తీరుుంచి ఇంట్లోకి వెళ్లాడు. బెడ్రూం తలుపు కొట్టగా కుమారుడు గడియ తీసి నాన్నా.. అమ్మ నిద్రపోరుుంది. లేవడం లేదంటూ ఏడుస్తూ చెప్పాడు. గదిలోకి వెళ్లి చూడగా సుజాత ఆత్మహత్య చేసుకుని కనిపించింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇంటి యజమానురాలు స్నేహలతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె భర్త ప్రసన్న కుమార్ పరారీలో ఉన్నాడు. సుజాత మృతికి కారకులైన వారిని శిక్షించాలని ఆమె భర్త రామకృష్ణతో పాటు బంధువులు డిమాండ్ చేశారు. చీటికిమాటికి ఇంటి యజమానులు మాటలతో వేధించటంతో తీవ్ర మనస్తాపానికి గురై సుజాత ఆత్మహత్యకు చేసుకుందని ఆరోపించారు. -
రోహిత్ కు 2 రోజుల పోలీస్ కస్టడీ
న్యూఢిల్లీ: భార్య ఆత్మహత్యలో అరెస్టైన జాతీయ కబడ్డీ ఆటగాడు రోహిత్ కుమార్ చిల్లర్ కు ఢిల్లీ కోర్టు రెండు రోజుల పాటు పోలీసు కస్టడీ విధించింది. ఆదివారం అతడిని డ్యూటీ మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. అక్టోబర్ 25 వరకు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరగా న్యాయమూర్తి అంగీకరించారు. రెండు రోజుల పాటు అతడిని పోలీసులు ఇంటరాగేట్ చేయనున్నారు. నావికా దళంలో పనిచేస్తున్న అతడిని ఈనెల 21న ముంబైలో అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి ఢిల్లీకి తీసుకొచ్చారు. ఇదే కేసులో లొంగిపోయిన రోహిత్ తండ్రి విజయ్ సింగ్ కు కోర్టు నవంబర్ 4 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. రోహిత్ భార్య లలిత అక్టోబర్ 17న పశ్చిమ ఢిల్లీలోని తన అపార్టుమెంటులో దుపట్టాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వరకట్న వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్ లో ఆమె పేర్కొంది. ఆత్మహత్యకు పురిగొల్పారన్న ఆరోపణలతో రోహిత్, అతడి తండ్రిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
భార్య ఆత్మహత్య: రోహిత్ అరెస్టు
వరకట్న వేధింపులతో భార్య ఆత్మహత్య చేసుకోవడంతో జాతీయ కబడ్డీ చాంపియన్ రోహిత్ చిల్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రో కబడ్డీ లీగ్‌లో మంచి ఆటగాడిగా పేరున్న రోహిత్ భార్య లలిత ఢిల్లీలోని తమ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు ఆమె ఒక సూసైడ్ నోట్, ఆడియో మెసేజ్ కూడా పెట్టింది. ''నేను ఇవి తట్టుకునేంత బలమైనదాన్ని కాను. అందుకే వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా'' అని అందులో ఉంది. దాంతో ఆత్మహత్యకు ప్రేరేపించారంటూ చిల్లర్ మీద కేసు నమోదైంది. అతడిని ముంబైలోని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముంది. ఇంతకుముందే ఈ కేసులో లొంగిపోయిన రోహిత్ తండ్రి విజయ్ సింగ్‌ను ఢిల్లీలోని కోర్టులో ప్రవేశపెడతారు. సోమవారం సాయంత్రం పశ్చిమ ఢిల్లీలోని తన అపార్టుమెంటులో లలిత దుపట్టాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన భర్త కోసం రెండు గంటల ఆడియో మెసేజిని, కుటుంబం కోసం ఓ చిన్న మెసేజిని ఆమె రికార్డు చేసింది. తనను కట్నం కోసం చిల్లర్, అతడి కుటుంబ సభ్యులు వేధిస్తూ కొట్టేవారని అందులో ఆమె ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు బుల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే రోహిత్ చిల్లర్‌కు లలితతో మార్చి నెలలో పెళ్లయింది. తన భర్త తరచు తిరుగుతూ ఉంటుండగా, తనను మాత్రం ఢిల్లీలో ఒంటరిగా ఫ్లాట్‌లో ఉంచారని లలిత ఆరోపించింది. -
ఆమె ఆత్మహత్య.. పరారీలో రోహిత్!
రోహిత్‌కుమార్ చిల్లర్.. ఇటీవల బాగా ప్రజాదరణ పొందిన ప్రో కబడ్డీ లీగ్ చూసేవారికి ఈ ఆటగాడు బాగా తెలిసినవాడే. జాతీయ కబడ్డీ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న రోహిత్ కుమార్ భార్య ఆత్మహత్య చేసుకోవడంతో.. అతను చిక్కుల్లో పడ్డాడు. రోహిత్‌కు వ్యతిరేకంగా పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేయడంతో.. అతను, అతని కుటుంబం పరారయింది. దీంతో నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. 26 ఏళ్ల రోహిత్‌కుమార్ భార్య లలిత దబాస్ సోమవారం రాత్రి ముంబైలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో రోహిత్‌కుమార్ ఢిల్లీలో ఉన్నాడు. రోహిత్ కుటుంబం ఢిల్లీ శివారులో నివసిస్తోంది. గత మార్చిలో తన కన్నా రెండేళ్లు పెద్దదైన లలితను రోహిత్ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో రోహిత్‌తో వేరయి గతకొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న లలిత తన ఆత్మహత్యకు ముందుకు ఓ లేఖ, రెండున్నర గంటల వాయిస్ మెసేజ్ రికార్డు చేసింది. కట్నం కోసం రోహిత్‌కుమార్, అతని కుటుంబసభ్యులు తనను తీవ్రంగా వేధించారని, వారితో వేగలేక ఒంటరిగా ఉంటున్నట్టు పేర్కొంది. లలిత ఆత్మహత్య గురించిన సమాచారం అందించినా రోహిత్గానీ, అతని కుటుంబసభ్యులుగానీ పోలీసుల ముందు హాజరుకాలేదని, దీంతో పరారీలో ఉన్న వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు రెండు బృందాలను ఏర్పాటుచేసినట్టు పోలీసులు తెలిపారు. -
జాతీయ కబడ్డీ ఆటగాడి భార్య ఆత్మహత్య
-
జాతీయ కబడ్డీ ఆటగాడి భార్య ఆత్మహత్య
న్యూఢిల్లీ: జాతీయ కబడ్డీ ఆటగాడు రోహిత్ కుమార్ చిల్లర్ భార్య లలిత సోమవారం రాత్రి పడమర జిల్లా అశోక్ మొహల్లా నంగ్లోయ్ ప్రాంతంలోని తన తండ్రి నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఒంటరిగా ఉండటంతో పాటు భర్తతో విభేదాల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. ఆమె రాసిన ఆత్మహత్య లేఖలో బలవంతంగా ఒంటరిగా ఉండటంతో పాటు, ఇటీవల నగరంలో జరిగిన కబడ్డీ ప్రీమియర్ లీగ్ సందర్భంగా ఆటగాడైన తన భర్త రోహిత్‌ను చూసేందుకు వెళ్లగా జరిగిన పరిణామాలకు అసంతృప్తితో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డీసీపీ) విజయ్ కుమార్ తెలిపారు. గతేడాది మార్చిలో లలిత.. చిల్లర్‌ను రెండో వివాహం చేసుకుంది. అయితే ఆమె ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోంది. లేఖలో తన భర్త ఆనందం కోసమే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె పేర్కొంది. సమాచారాన్ని రోహిత్‌కు తెలియజేయగా, ఆయన ముంబైలో ఉన్నాడని డీసీపీ పేర్కొన్నారు. -
భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని..
భాగ్యనగర్ కాలనీ: భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవటంతో మనస్తాపానికి గురైన ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నగరంలోని కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అశోక్, లావణ్య (23)లకు మూడేళ్ల కిందట వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కొంత కాలం నుంచి అశోక్ మరో మహిళతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవటంతో ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే లావణ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రి షిప్టులో ఉద్యోగం చేసి ఇంటికి వచ్చిన అశోక్ తన భార్య లావణ్య ఉరివేసుకోవటం చూసి పోలీసులకు సమాచారం అందజేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త గొడవపడ్డాడని భార్య ఆత్మహత్య
నంగునూరు: మెదక్ జిల్లా నంగునూరు మండలం బద్దిపాడలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భీమా(35), మాలోతు కవిత(30) భార్యాభర్తలు. మద్యానికి బానిసైన భర్త భీమా తరచూ భార్యతో గొడవపడుతూ ఉండేవాడు. శుక్రవారం రాత్రి కూడా మద్యం తాగి వచ్చి కవితతో గొడవ పెట్టుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన భార్య కవిత శనివారం ఉదయం 4 గంటల సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య మృతికి కారణమైన భర్త అరెస్ట్
కైకరం(ఉంగుటూరు) : భార్య మృతికి కారణమైన గుండు మాల రవి కుమార్‌ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించినట్లు చేబ్రోలు ఎస్ఐ చావా సురేష్ చెప్పారు. ఆయన కథనం ప్రకారం.. తల్లాపురం గ్రామానికి చెందిన లతకు, కైకరం గ్రామానికి చెందిన గుండుమాల రవి కుమార్‌తో 15 ఏళ్ల కిందట వివాహమైంది. మూడేళ్ల నుంచి రవి కుమార్ అనుమానంతో లతను వేధిస్తూ ఉండటంతో విసుగు చెందిన ఆమె ఈనెల 4న భర్త ఎదుటే ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ఆమె అక్కడ చికిత్స పొందుతూ.. ఈనెల 15న మృతి చెందింది. నిందితుడైన రవి కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించినట్లు ఎస్ఐ చెప్పారు. -
దంపతుల మధ్య ‘ఆమిర్’ చిచ్చు!
- భర్తతో గొడవపడి భార్య ఆత్మహత్య ముంబై/జబల్పూర్: అసహనంపై ఆమిర్‌ఖాన్ వ్యాఖ్యలు ఓ కుటుంబంలో చిచ్చురేపాయి! మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు చెందిన అయాంక్ పాండే, సోనల్ పాండే దంపతుల మధ్య అసహనంపై ఆమిర్ చేసిన వ్యాఖ్యలపై జరిగిన చర్చ.. ముదిరి వ్యక్తిగతంగా తిట్టుకునే పరిస్థితికి దారితీసింది. దీంతో మనోవేదనకు గురైన సోనల్ పక్క గది లోకి వెళ్లి లోపలినుంచి గడియ పెట్టుకుని విషం తాగిందని.. కాసేపటికి తలుపులు బద్దలు కొట్టి చూడగా సోనల్ అపస్మారక స్థితిలో పడి ఉందని అయాంక్ పోలీసులకు తెలిపారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చల్లారని దుమారం.. అసహనానికి సంబంధించి ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. బీజేపీ నేత శతృఘ్నసిన్హా ఆమిర్ తనకు సన్నిహితుడని, అయితే దేశంలో అసహనం పెరుగుతోందంటూ అతను చేసిన వ్యాఖ్యలను మాత్రం తాను సమర్థించలేనని ట్విటర్లో పేర్కొన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ స్పందిస్తూ.. ఆమిర్‌ఖాన్ తన పూర్వీకులు నివసించిన అఖ్తియార్‌పూర్‌లో పర్యటించి, అక్కడి ప్రజల మధ్య ప్రేమ, సామరస్యం ఎలా ఉందో తెలుసుకోవాలన్నా రు. కాగా, ఆమిర్ తాను ఏం భావించాడో అదే చెప్పాడని, ప్రజాస్వామ్య దేశంలో తనకు నచ్చినది చెప్పే హక్కు అతనికి ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరిపరంథామన్ ఆమిర్‌కు మద్దతుగా నిలిచారు. తన వ్యాఖ్యలకు సంబంధించి వచ్చిన విమర్శలపై ఆమిర్ స్పందించిన తీరును బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ప్రశంసించారు. ఆమిర్‌పై రాజ్‌నాథ్ వ్యంగ్యాస్త్రాలు: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లోక్‌సభలో జరిగిన చర్చ సమయంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆమిర్‌ఖాన్‌పై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ తీవ్రమైన అవమానాలను ఎదుర్కొన్నా.. ఎప్పుడూ ఆయన దేశాన్ని విడిచి వెళ్లాలని భావించలేదన్నారు. తాను ఎదుర్కొన్న పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఆయన రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. రాజ్‌నాథ్ వ్యాఖ్యలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. -
కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య
చాంద్రాయణగుట్ట: ఓ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....చాంద్రాయణగుట్ట గాంధీబొమ్మ ప్రాంతంలో నివాసం ఉండే జి.ప్రవీణ్ కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా కొనసాగుతున్నాడు. ఉద్యోగం రాకముందు సీఆర్పీఎఫ్ క్యాంపస్‌లో ఉండే ప్రవీణ్ తమ పక్క క్వార్టర్లో ఉండే పూజ (21)ను 2014 ఫిబ్రవరి 13న ప్రేమ వివాహం చేసుకొని గాంధీ బొమ్మ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇదిలా ఉండగా బుధవారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో ప్రవీణ్ ఇంటికి వచ్చి తలుపు తట్టగా తీయకపోవడంతో అనుమానించి పక్కింటి పై నుంచి ఇంట్లోకి ప్రవేశించి చూడగా పూజ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. కొనఊపిరితో ఉంటుందని భావించి ప్రవీణ్ కిందికి దించి చూడగా అప్పటికే మృతి చెంది కనిపించింది. వెంటనే సమాచారం అందుకున్న ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ అబ్దుల్ బారీ ఘటనా స్థలానికి చేరుకొని ఆత్మహత్య జరిగిన తీరును పరిశీలించారు. కాగా విషయం తెలుసుకున్న వెంటనే పూజ తల్లిదండ్రులు సుకన్య, సంగయ్యలు అక్కడికి చేరుకొని బోరున విలపించారు. కాగా కళాశాలకు ఎందుకు వెళ్లడం లేదని పూజను ఆమె తల్లి సుకన్య బుధవారం ఉదయం ఇంటికి వచ్చి మందలించినట్లు తెలిసింది. తమ అల్లుడు కట్నం కోసం వేధించేవాడని ఈ సందర్బంగా పూజ తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
భర్తలేని జీవితం వద్దంటూ ఓ భార్య..
చిట్యాల: ఓ వ్యక్తి ఆనారోగ్యంతో మృతి చెందగా, భర్త మరణాన్ని తట్టుకోలేక అతడి భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తిలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు... చొల్లేటి జయశ్రీ (33) భర్త చంద్రశేఖర్‌కు మద్యం వ్యసనం ఉంది. దీంతో అతడు అనారోగ్యం పాలై ఐదు రోజుల క్రితం మృతి చెందాడు. భర్త లేక తాను జీవించలేనంటూ, మనస్తాపానికి గురైన జయశ్రీ ఆదివారం ఉదయం విషం సేవించింది. ఆమెను చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. -
భర్త వివాహేతర సంబంధం.. భార్య ఆత్మహత్య
ఎల్లనూరు (అనంతపురం జిల్లా): భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని తనను నిర్లక్ష్యం చేస్తుండటంతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లా ఎల్లనూరులో గురువారం జరిగిన ఈ సంఘటన వివరాలు.. ఎల్లనూరుకు చెందిన మిడిగంటి రామతులసి(21), అదే గ్రామానికి చెందిన అరవిందు ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇటీవల ఒక చిన్నారి పుట్టింది. అయితే అరవిందు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడని రామతులసి తల్లిదండ్రుల వద్ద వాపోయేది. ఎన్నిసార్లు నచ్చజెప్పినా భర్త వినకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తె మరణానికి తన అల్లుడు అరవిందు కారణమని రామతులసి తండ్రి రంగడు ఎల్లనూరు పోలీసులకు ఫిర్యాదుచేశారు. రామతులసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు. -
అబల బలి
♦ భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య ♦ చిచ్చు రేపిన భర్త వివాహేతర సంబంధం ♦ కన్నీరుమున్నీరైన మృతురాలి బంధువులు భర్త వివాహేతర సంబంధం భార్య ప్రాణాలు తీసింది.. కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.. పర్యవసానంగా పిల్లల ఆలనాపాలనా చూసే వారెవరనే విషయం ప్రశ్నార్థకమైంది.. తమ కూతురిని కట్టుకున్న భర్తే పొట్టన పెట్టుకున్నాడని, వాడికి ఇవ్వకపోతే కళ్లెదుటే ఉండేదని మృతురాలి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణంలోని పుష్పగిరి మాన్యంలో నివాసముంటున్న మలిగిరి సాలమ్మ(23) అనే వివాహిత గురువారం ఇంటిలోనే తన చీరెతోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఉస్సేనయ్య మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, తరుచూ వేధింపులకు గురి చేయడంతో తట్టులేక ఈ అఘాయిత్యం చేసుకుంది. మృతురాలి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీకి చెందిన దూదేకుల నాగమ్మకు ఆరుగురు సంతానం. వీరిలో నాలుగో సంతానం సాలమ్మ. సాలమ్మకు ఎర్రగుంట్ల పుష్పగిరి మాన్యంలో ఉన్న సుభాన్ కుమారుడు మలిగిరి ఉస్సేనయ్యకు ఆరేళ్ల క్రితం వివాహం అయింది. ఆయన బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ద స్తగిరి, సుభాన్ అనే చిన్నారులు ఉన్నారు. ఉస్సేనయ్య తల్లిదండ్రులు పక్కన సంసారం ఉంటున్నారు. ఉస్సేనయ్య తన భార్య పిల్లలతో నివాసం ఉంటున్నారు. అయితే ఉస్సేనయ్యకు మరో మహిళతో వివాహేతర సంబంధం కల్గి ఉండడంతో, ఈ విషయంపై ఆయనను భార్య తరుచూ అడుగుతుండేది. దీంతో ఉస్సేనయ్య భార్యను వేధింపులకు గురి చే సే వాడని మృతురాలి బంధువులు ఫిర్యాదులో పేర్కొన్నారు. వేధింపులు తాళలేకనే సాలమ్మ ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పునకు ఉన్న కొక్కికి చీరె కట్టి ఉరి వేసుకొని మృతి చెందింది. బయట ఆడుకుంటున్న చిన్నారులు ఇంటిలోకి వెళ్లడానికి వేసి ఉన్న వాకిలి వద్ద ఏడుస్తూ ఉండడం గమనించిన స్థానికులు పోయి ఇంటిలోకి తొంగి చూశారు. అప్పటికే సాలమ్మ ఉరి వేసుకొని వేలాడుతూ ఉండడం గమనించారు. వెంటనే తలుపులు తీసి లోనికి వెళ్లి వేలాడుతున్న ఆమెను కిందికి దించారు. తర్వాత ప్రైవేటు వైద్యాధికారిని పిలిపించారు. ఆయన పరీక్షించి అప్పడికే మృతి చెందినట్లు చెప్పారు. బంధువులు వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ సంజీవరెడ్డి పరిశీలించారు. అమ్మా.. లేవమ్మా... అమ్మ చనిపోయిందనే విషయం పిల్లలకు తెలియదు. ఎంత పిలిచినా పలకక పోవడంతో సాలమ్మ నిద్రపోతుందేమోనని భావించారు. అమ్మా.. లేవమ్మా.. ఇదిగో బిస్కెట్ తెచ్చినాను తినమ్మా అంటూ ఆమె చిన్న కుమారుడు సుభాన్ తల్లి మృతదేహాన్ని పట్టుకుని పిలుస్తున్న తీరు చూపరుల హృదయాన్ని కలిచి వేసింది. పెద్ద కుమారుడు దస్తగిరి బయట ఇంటి ముందు గుమికూడిన జనాలను చూస్తూ ఏం జరిగిందో తెలియని స్థితిలో ఒంటరిగా కూర్చోని ఉండిపోయాడు. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు చిన్నారులకు ఎంత కష్టం వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. -
వేధింపుల ‘ముడి’ వేశాడు!
నాలుగు నెలల క్రితమే మూడుముళ్లు వేశాడు. కట్నకానుకల రూపంలో సుమారు రూ.12 లక్షలు జేబులో వేసుకున్నాడు. జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా బాసలు చేశాడు. అవన్నీ మరచిపోయాడు. రెండో పెళ్లిపై ఆశలు పెంచుకున్నాడు. భార్య స్వల్ప అనారోగ్యానికి గురైతే దాన్నే ఫిట్స్‌గా భూతద్దంలో చూపాడు. తనే భూతంలా మారిపోయి విడాకులు ఇవ్వాలని, చచ్చిపోవాలని వేధింపులు మొదలెట్టాడు. అక్కడితో ఆగకుండా భార్యకు ఫోన్ చేసి రెండో పెళ్లి చేసుకుంటున్నానని తెగేసి చెప్పాడా భర్త నారాయణరావు. దాంతో కుంగిపోయిన అమాయకురాలు సుజాత లావేరు మండలం బుడతవలసలోని తాతగారింట్లో ఉరేసుకుని తనువు చాలించింది. ఆగ్రహించిన స్థానికులు నయవంచక భర్తపై దాడి చేసి దేహశుద్ధి చేశారు. పోలీసులు అడ్డుపడటంతో అతను బతికిపోయాడు. లావేరు, న్యూస్‌లైన్: పెళ్లై నాలుగు నెలలే అయింది. ఏ ముచ్చటా తీరలేదు. ఇంతలో భర్తకు అనుమాన పిశాచం పట్టుకుంది. భార్యకు ఫిట్స్ ఉందని, విడాకులు ఇస్తే వేరే పెళ్లి చేసుకుంటానని వేధించడం మొదలుపెట్టాడు. దీన్ని తట్టుకోలేక ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆగ్రహం చెందిన మృతురాలి బంధువులు, గ్రామస్తులు భర్తపై దాడి చేశారు. లావేరు మండలం బుడతవలసలో జరిగిన సంఘటన వివరాలు ఇవీ... రణస్థలం మండలం నగరంపాలెంకు చెందిన కెల్ల దాలమ్మ కుమారుడు సత్యనారాయణకు విజయనగరం జిల్లా గరివిడి మండలం అర్తమూరుకు చెందిన పున్నాన నారాయణరావు, వరలక్ష్మి దంపతుల(ప్రస్తుతం విజయవాడలో నివాసముంటున్నారు) కుమార్తె సుజాత(19)తో గత ఏడాది ఆగస్టు 30న పెళ్లయింది. ఆ తర్వాత పది రోజులకు సుజాత కాళ్లు, చేతులు కొట్టుకుంటూ స్పృహతప్పి పడిపోవడంతో ఫిట్స్ ఉందని భర్త, అత్త భావించారు. అప్పటి నుంచి ఆమెను వేధించసాగారు. దీన్ని తట్టుకోలేకపోయిన సుజాత కొద్ది రోజులకే పుట్టింటికి వెళ్లిపోయింది. గత నవంబర్‌లో పెద్దమనుషులు నచ్చజెప్పడంతో సుజాత అత్తారింటికి వచ్చింది. అయితే వేధింపులు తగ్గలేదు. ఈ నేపథ్యంలో నవంబర్ 23న సుజాతను ఆమె తండ్రి నారాయణరావు శ్రీకాకుళం తీసుకువెళ్లి పరీక్షలు చేయించగా ఫిట్స్ లేదని తేలింది. ఈ విషయాన్ని సత్యనారాయణకు చెప్పినా వినిపించుకోకుండా వేధింపులు కొనసాగించారు. విసిగిపోయిన సుజాత కొద్ది రోజులకే బుడతవలసలో ఉంటున్న తాతయ్య రౌతు అప్పలనరసయ్య, అమ్మమ్మ ఆదిలక్ష్మి ఇంటికి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే డిసెంబర్ 31న సుజాతకు ఫోన్ చేసిన సత్యనారాయణ జనవరి 1న రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో ఆమె రణస్థలం మం డలం వేల్పురాయికి చెందిన రమణమూర్తి(వరుసకు సోదరుడు)తో కలిసి రణస్థలంలో భర్త నడుపుతున్న సెల్ పాయింట్‌కు వెళ్లి ఆయనతో మాట్లాడి సాయంత్రం తిరిగి బుడతవలస వెళ్లిపోయింది. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఉన్న సుజాతను చూసిన మేనమామ కూతురు సంధ్య కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. గ్రామస్తుల సహకారంతో గది తలుపులు తెరిచి చూడగా సుజాత మృతి చెందినట్లు గుర్తించి విజయవాడలో ఉంటున్న నారాయణరావు, వరలక్ష్మికి సమాచారం అందించారు. శుక్రవారం ఉదయం ఆయన వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రణస్థలం సీఐ అశోక్‌కుమార్, లావేరు ఎస్ఐ రామారావు, ఎచ్చెర్ల ట్రైనీ ఎస్ఐ కృష్ణ సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. సత్యనారాయణ వేధింపులు తాళలేక సుజాత ఉరివేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులు చెప్పారు. డిప్యూటీ తహశీల్దార్సుధాప్రకాష్, ఆర్ఐ శ్రీనివాసరావు, గ్రామ పెద్దల సమక్షంలో శవపంచానామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామని సీఐ, ఎస్ఐ తెలిపారు. మృతురాలి భర్తపై బంధువులు, గ్రామస్తుల దాడి ఇదిలా ఉండగా సుజాత మృతికి కారకుడని సత్యనారాయణపై మృతురాలి బంధువులు, బుడతవలస గ్రామస్తులు దాడికి దిగారు. సుజాత గురువారం సాయంత్రం మృతి చెందితే శుక్రవారం ఉదయం వరకూ భర్త రాకపోవడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది.దీంతో పోలీసులు రక్షణగా నిలిచి సత్యనారాయణను ఓ ఇంట్లోకి తీసుకువెళ్లారు. సుమారు రెండు గంటల తర్వాత పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళుతుండగా గ్రామస్తులు వెంటాడారు. ముఖ్యంగా మహిళలు శాపనార్థాలు పెట్టారు. ఓ దశలో గ్రామస్తులు పోలీసులతో వాదనకు దిగడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు సుజాత జీవితం బాగుంటుందని పెళ్లి సమయంలో కట్నకానుకల కింద *12 లక్షలు ఇచ్చామని నారాయణరావు, వరలక్ష్మి చెప్పారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె జీవితం పెళ్లి ముచ్చట్లు తీరకముందే ఇలా అవుతుందని అనుకోలేదని రోదిస్తూ చెబుతున్న వారిద్దరినీ ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. సత్యనారాయణను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ఇదిలా ఉండగా సత్యనారాయణకు రణస్థలంలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న యువతితో సబంధం ఉన్నట్లు తెలిసింది. ఆమెను పెళ్లి చేసుకోడానికే భార్య సుజాతకు ఫిట్స్ ఉన్నట్లు ప్రచారం చేసి వేధిస్తుండేవాడని సమాచారం. రణస్థలానికి చెందిన యువతిని పెళ్లిచేసుకుంటానని సత్యనారయణ చెప్పాడని అతని స్నేహితుడు రమణమూర్తి చెప్పడం గమనార్హం.