ఆయన లేని జీవితంలో నేనుండలేను... | Nagaraju Wife suicide | Sakshi
Sakshi News home page

ఆయన లేని జీవితంలో నేనుండలేను...

Published Tue, Jul 4 2017 10:39 PM | Last Updated on Tue, Nov 6 2018 8:22 PM

ఆయన లేని జీవితంలో నేనుండలేను... - Sakshi

ఆయన లేని జీవితంలో నేనుండలేను...

భర్త మరణాన్ని  తట్టుకోలేక భార్య ఆత్మహత్య
బాగా చదువుకొని ఉద్యోగం చేయాలని సూసైడ్‌ నోట్‌


మంథని: విధి ఆకుటుంబాన్ని వెంటాడింది. నెలరోజుల క్రితం కుటుంబ యజమాన్ని గుండెపోటుతో మృతి చెందగా మనస్థాపానికి గురైన భార్య ఉరేసుకొని తనువు చాలించిన సంఘటన సోమవారం పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో చోటుచేసుకుంది. మంథనిలోని గాంధీచౌక్‌కు చెందిన   గుడిమల్ల నాగరాజు(44) గతనెల 26న గుండెపోటుతో మృతి చెందాడు. ఈయనకు భార్య స్వరూప(40), ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే భర్త మరణంతో స్వరూప తీవ్రంగా కుంగిపోయింది.

ఆయన లేని జీవితంలో నాకేందుకని నెలరోజులుగా మదన పడుతోంది. ఈ క్రమంలో సోమవారం తెల్ల వారుజామున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.  చెల్లి రమ్యను బాగా చదివించాలని, నీవు కూడా ఉద్యోగం వచ్చాకే పెళ్లి చేసుకోవాలని పెద్దకూతురు శృతిని కోరుతూ సూసైడ్‌ నోట్‌ రాసింది. స్వరూప చిన్న కూతురు  రమ్య బీటెక్, పెద్దమ్మాయి ఎంబీఏ చదువుతోంది. నెలరోజుల వ్యవధిలోనే అమ్మా..నాన్నలు దూరం కావడంతో ఆ బిడ్డల రోదన మిన్నంటింది. ఈ సంఘటన చూపరులను కలిచివేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్‌రావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement