నంగునూరు: మెదక్ జిల్లా నంగునూరు మండలం బద్దిపాడలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భీమా(35), మాలోతు కవిత(30) భార్యాభర్తలు. మద్యానికి బానిసైన భర్త భీమా తరచూ భార్యతో గొడవపడుతూ ఉండేవాడు. శుక్రవారం రాత్రి కూడా మద్యం తాగి వచ్చి కవితతో గొడవ పెట్టుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన భార్య కవిత శనివారం ఉదయం 4 గంటల సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.