భర్తలేని జీవితం వద్దంటూ ఓ భార్య.. | wife suicide due to worried of husmands death | Sakshi
Sakshi News home page

భర్తలేని జీవితం వద్దంటూ ఓ భార్య..

Published Sun, Sep 13 2015 3:25 PM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM

wife suicide due to worried of husmands death

చిట్యాల: ఓ వ్యక్తి ఆనారోగ్యంతో మృతి చెందగా, భర్త మరణాన్ని తట్టుకోలేక అతడి భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తిలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు... చొల్లేటి జయశ్రీ (33) భర్త చంద్రశేఖర్‌కు మద్యం వ్యసనం ఉంది. దీంతో అతడు అనారోగ్యం పాలై ఐదు రోజుల క్రితం మృతి చెందాడు.

భర్త లేక తాను జీవించలేనంటూ, మనస్తాపానికి గురైన జయశ్రీ ఆదివారం ఉదయం విషం సేవించింది. ఆమెను చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement