Jayasree
-
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి!
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలిక మీద జరిగిన అత్యాచారం అత్యంత ఘోరం! దానికి కారకులైన ప్రతి ఒక్కరికీ శిక్ష ఉంటుంది. పాలనా యంత్రాంగం, పోలీసు వ్యవస్థ, న్యాయస్థానాలు తమ పని తాము చేస్తాయి. కానీ, ఇంతలోనే చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని భయపెడుతూ... టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వందలాది మంది అనుచరులతో దౌర్జన్యంగా ఆమె బెడ్ దగ్గరకు వెళ్లి నినాదాలు చేయించడం, ఆసుపత్రిలో యుద్ధ వాతావరణం సృష్టించి... రోగులు, వారి అటెండెంట్లు భయపడేలా ప్రవర్తిం చడం ఎంతవరకు సమంజసం? ఆసుపత్రి మీద ఏదో దాడి జరుగుతోందనే భయాన్ని సృష్టించడం సబబేనా? అత్యాచార బాధితురాలిని పరామర్శించే విధానం ఇదేనా? 14 ఏళ్ళు ముఖ్య మంత్రిగా, 13 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కదా... ఈ మాత్రం తెలియదా? చంద్రబాబు వందలాది మందిని తీసుకు వెళ్ళటాన్ని పరామర్శ అంటారా, దొమ్మీ అంటారా? ఆ బాలిక దగ్గరకు ఏకంగా కెమెరాలను తీసుకుని, వందల మందితో వెళ్ళటాన్ని ఓదార్పు అంటారా? లేక దిగజారుడు రాజకీయం అంటారా? ఓ అత్యాచార బాధితురాలిని... అది కూడా సామూహిక లైంగిక దాడికి గురైన మానసికంగా ఎదగని ఒక పాపను పరామర్శించటానికి ఇలాగేనా వెళ్ళేది? ఏ చిన్న ఘటన జరిగినా ప్రభుత్వంపై బురద జల్లడానికి వాడుకోవడం బాబుకు వెన్నతో పెట్టిన విద్యే. అందుకే ఈ అమానవీయ అత్యాచార సంఘటననూ రాజకీయం చేయాలనే అక్కడికి వెళ్లారని ఆయన ప్రవర్తన చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. బాబు అనైతిక ప్రవర్తనను సభ్య సమాజం ఆమోదిస్తుందా? చట్టం ఒప్పు కుంటుందా? తాను ఇంత మందిని వెంటబెట్టుకుని చేసిన దౌర్జన్యం ప్రభావం ఆ పాపమీద ఎలా ఉంటుందో ఆయన ఆలోచించారా? అసలు ఆ పాప పరిస్థితి ఏమిటి? అత్యాచార బాధిత బాలికను వీడియో తీయటాన్ని ఆయన ఎలా అనుమతించారు? ఎందుకు ప్రోత్సహించారు? ఇది నేరం కాదా? ఆయన దుందుడుకు ఓదార్పు కార్యక్రమంలో ఒకటి కాదు... అనేక నేరాలు చోటుచేసుకున్నాయి. ఈ నేరాలన్నింటి మీదా కేసులు, విచారణలు తప్పనిసరిగా జరగాలి. అత్యాచార బాధితురాలి ఫొటో గానీ, పేరుగానీ ప్రచురించకూడదని మీడియాకు కూడా ఆంక్షలున్నాయే... మరి చంద్రబాబు బాధిత బాలిక ప్రైవసీని ఇలా తుంగలో తొక్కి తీరని వ్యధను మిగల్చడం క్షమార్హమేనా? ఆయనా, ఆయన అనుచరుల బాధ్యతా రహిత ప్రవర్తన వల్ల బాధితురాలికీ, ఆమె కుటుంబ సభ్యులకూ ఎదురయ్యే సమస్యలకు ఎవరు బాధ్యత వహిస్తారు? (చదవండి: శ్రమ విలువ తెలుసు కాబట్టే...) అక్కడే ఉన్న మహిళా కమిషన్ ఛైర్పర్సన్ మీద తన అనుచరులు నానా దుర్భాషలాడు తుంటే... వారిని వారించకపోగా చంద్రబాబే స్వయంగా ఆమెను బెదిరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంత జరిగినా చంద్రబాబు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయకపోవడం విడ్డూరం. రాజకీయంగా లబ్ధి పొందాలన్న యావ తప్ప, ఆ పాప యోగక్షేమాల పట్ల నిజంగా ఎటువంటి ఆత్రుతా ఆయనలో కనిపించకపోవడం బాధాకరం. మహిళా కమిషన్ నోటీసులు అందుకున్న చంద్రబాబు నేడు కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని ఆయన క్షమాపణ చెప్పాలి. (చదవండి: జగన్ స్కీములు చంద్రబాబుకు సవాలే!) - జయశ్రీ రెడ్డి ఏపీ ఉమెన్స్ కమిషన్ సభ్యురాలు -
మేనమామ వేధిస్తున్నాడు.. నటి
కర్ణాటక ,కృష్ణరాజపురం : ఆస్తి కోసం మేనమామ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ప్రముఖ కన్నడ నటి,నృత్యకారిణి జయశ్రీ రామయ్య బుధవారం సీకె అచ్చుకట్టె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం జయశ్రీ మీడియాతో మాట్లాడారు. ఆస్తికి సంబంధించి మేనమామ గిరీశ్ చాలా కాలంగా తనతో పాటు తల్లిని కూడా వేధింపులకు గురి చేస్తున్నాడని, ఇదే విషయమై ఈనెల 10వ తేదీన అర్ధరాత్రి హనుమంత నగర్లో ఉన్న తమ ఇంటికి వచ్చి గొడవ చేసి తన తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటేశాడని ఆరోపించారు. తన వస్త్రాధరణపై అసభ్య పదజాలాలతో దూషించాడని ఆరోపించారు. ఇదిలా ఉండగా విచారణకు హాజరు కావాలంటూ జయశ్రీతో పాటు గిరీశ్‌కు కూడా పోలీసులు సూచించారు.విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామన్నారు. నటి జయశ్రీ రామయ్య -
ఇటువైపు ఒక అడుగు
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరిదే!ఆ తర్వాత మరిన్ని అడుగులు పడతాయి. వాటికి మరికొన్ని అడుగులు జత కలిస్తే అద్భుతాలు జరుగుతాయి. అలాంటి ఓ అద్భుతం జరగడం కోసం డంప్‌యార్డ్ వైపు ఒక అడుగు వేశారు డాక్టర్ జయశ్రీ కిరణ్. తర్వాత అడుగు మనది కావాలి. మనందరిదీ కావాలి. డాక్టర్ జయశ్రీ కిరణ్ లెక్చరర్. సైఫాబాద్ సైన్స్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఉంటున్నది హైదరాబాద్‌లోని తార్నాక. గత ఐదు నెలలుగా ఆమె డంప్‌యార్డ్‌ల చుట్టూ ఉండే జనావాసాల్లోకి వెళ్లివస్తున్నారు. వాళ్లంతా డంప్‌యార్డే జీవనాధారం అయినవాళ్లు. డంప్‌యార్డ్‌కి వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జబ్బు చేస్తే క్రమం తప్పకుండా వాడాల్సిన మందుల గురించి ఆ సమీపంలోని ఇల్లిల్లూ తిరిగి, ముఖ్యంగా అక్కడి మహిళల్లో అవగాహన కల్పిస్తున్నారు. మున్సిపల్ అధికారులను కూడా కలిసి డంప్‌యార్డ్ వద్ద హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయమని కోరుతున్నారు. తను కూడా హెల్త్‌క్యాంపులను పెట్టి, అనారోగ్యం బారిన పడకుండా ఉండటానికి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ‘దయచేసి డంప్‌యార్డ్ వైపు ఒకసారి చూడండి’ అని నగరవాసులను కూడా కోరుతున్నారు! ఎందుకిలా జయశ్రీ ఏరి కోరి ప్రమాదంలోకి వెళుతున్నారు? ఇదే మాటను ఆమెను అడిగితే.. ‘నేను వెళ్లడం.. అంటుంచండి. వాళ్లంతా ప్రమాదంలోనే కదా ఉంటున్నారు!’ అంటారు ఆవేదనగా. జబ్బుల దిబ్బలు! పగిలిపోయిన ట్యూబ్‌లైట్లు, గాజు బాటిళ్లు, గ్లాసు ముక్కలు చెత్తబుట్టలోనే వేస్తుంటాం. డయాబెటిస్ పేషెంట్స్ రోజూ తీసుకునే ఇన్సులిన్ ఇంజెక్షన్లూ అదే బుట్టలోనే. ఆడవాళ్లు వాడేసే శానిటరీ న్యాప్కిన్లు, ఉపయోగంలో లేని బ్యాటరీలు, డిజిటల్ వేస్టేజ్.. ఒకటేమిటి హానికరమైన ఎన్నో వస్తువులు చెత్తలోకి చేరుతుంటాయి. అవన్నీ డంప్‌యార్డ్‌కి చేర్చి, ఉపాధి కోసం వాటిలోనే తిరిగేవారికి ఆ గాజు ముక్కలు, ఇంజెక్షన్లు గుచ్చుకుని.. వ్యాధుల పాలిట పడుతున్నారు. వాడిపడేసిన బ్యాటరీలు ఒక్కోసారి పేలుతుంటాయి కూడా! ఇదంతా డంప్‌యార్డ్ వద్ద హెల్త్‌క్యాంప్ ఏర్పాటు చేశాక, అక్కడి వారి పరిస్థితులు ప్రత్యక్షంగా చూశాక జయశ్రీకి మరింతగా స్పష్టం అయ్యింది. అసలు ఈ జబ్బుల దిబ్బల్లోకి వెళ్లాలన్న ఆలోచన జయశ్రీకి ఎలా వచ్చింది? ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. మూడు రోజులు బండి రాలేదు ‘ఉద్యోగానికి కొంతకాలం సెలవు పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు జరిగిందది! ఆ సమయంలో వరుసగా మూడు రోజుల పాటు చెత్త తీసుకువెళ్లే వాళ్లు రాలేదు. ఆ దుర్గంధాన్ని భరించలేకపోయాను. నాల్గవ రోజు చెత్త తీసుకెళ్లే ఆమె వస్తే ‘ఎందుకు రావట్లేదు?’ అని కోపగించుకున్నాను. ‘మా ఆయనకి ఒంట్లో బాగోలేదమ్మా! కడుపునొప్పి. పోయిన వారమే నాకూ ఆసుపత్రి ఖర్చు వెయ్యి రూపాయిలయ్యింది. ఇప్పుడు ఆయనకు..’ అంటూ లోపలికి వచ్చి చెత్త డబ్బా తీసుకెళ్లింది కుంటుకుంటూ. చెత్తను తను తెచ్చిన బండిలో వేసుకుని, చెత్తబుట్టను ఇవ్వడానికి తిరిగొచ్చింది. ‘నీకేమయ్యింది కుంటుతున్నావ్.. ’ అన్నాను. ‘కాలికి ఏదో గుచ్చుకుంది. ఇరవై రోజుల పైనే అయ్యింది. నొప్పి అస్సలు తగ్గడం లేదు’ అంది. ‘మీకిలా ఉంటే మీ పిల్లల్నెవరు చూస్తారు’ అన్నాను. ‘మా పిల్లోడికి ఐదేళ్లమ్మా! ఎక్కడేస్తే అక్కడే పడుంటాడు. పిలిచినా పలకడు. డాక్టర్లకు చూపిస్తే మెదడు ఎదుగుదల లేకుండానే పుట్టాడు అని చెప్పారు, ఏం చేస్తాం. మా తలరాత’ అంటూ ఆమె ఇంకో ఇంట్లో చెత్త తీసుకెళ్లడానికి వెళ్లబోయింది. ‘మీరెక్కడుంటారు.. ఈ చెత్తంతా ఎక్కడకు తీసుకెళతారు?’ అని అడిగాను. ‘డంప్‌యార్డ్ ఉందిగా అమ్మా! అక్కడకు తీసుకెళ్లి వేస్తాం.. మేం ఉండేది కూడా అక్కడి బస్తీలోనే’ అని చెప్పి, ముందుకు వెళ్లిపోయింది. నేరుగా డంప్యార్డుకే వెళ్లిపోయా! ఆ తర్వాత రోజు చెత్త తీసుకెళ్లడానికి ఆమె రాలేదు. మనసు మనసులో లేదు. ఏమై ఉంటుంది ఆమెకు. భర్తకు ఆరోగ్యం బాగోలేదు. పిల్లాడు ఎలా ఉన్నాడో.. ఆమె చెప్పిన స్థితి కళ్ల ముందు కదలాడుతోంది. ఇంట్లో ఉండబుద్ది కాలేదు. ఆమె చెప్పిన డంప్‌యార్డ్ ఎక్కడుంటుందో కనుక్కొని వెళ్లాను. ఇక్కడే ఉందన్నట్టు ముందుగా వచ్చిన దుర్వాసన చెప్పేసింది. వంద ఎకరాల్లో ఉండే ఆ డంప్‌యార్డ్‌ను కాసేపు అక్కడే ఉండే చూశా! కనుచూపుమేరంతా చెత్త. ముక్కులు పగిలిపోయే దుర్వాసన. భుజాలకు పెద్ద పెద్ద సంచులు వేసుకున్న కొందరు ఆడవాళ్లు, పిల్లలు, మగవాళ్లు చెత్తను కెలుకుతూ స్క్రాప్‌ని ఏరుకుంటున్నారు. వాళ్ల చేతులకు గ్లౌజులు లేవు. కొందరి కాళ్లకు చెప్పులు లేవు. పందులు, కుక్కలు ఆ ఏరియా మాదేనన్నట్టు తిరుగుతున్నాయి. అక్కడే ఉన్న ఒకట్రెండు చెట్లకు ఐదారు గుడ్డ ఊయలలు పసిపిల్లలను నిద్రపుచ్చుతున్నాయి. ఆ పిల్లల తల్లులు ఆ మురికి చేతుల్తోనే పిల్లలను ఎత్తుకుంటున్నారు. అలాగే పాలు పడుతున్నారు. అక్కడ వారికి చేతులు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు. వెంట తెచ్చుకున్న బాటిళ్ల నీళ్లతో గొంతులు తడుపుకుంటున్నారు. దాదాపు వందల మంది ఆ డంప్‌యార్డే ఆధారంగా జీవిస్తున్నారు. రెండు రోజులు ఇంట్లోని చెత్తను తీసుకెళ్లకపోతేనే విసుక్కుంటాం. అలాంటిది నిత్యం చెత్తలోనే బతుకుతున్న వారిని చూస్తుంటే కడుపులో దేవినట్టయ్యింది. నా భర్త కిరణ్‌కుమార్ డాక్టర్ కావడంతో నా ఆవేదనను వెంటనే అర్థం చేసుకున్నారు. హెల్త్ క్యాంపు ఏర్పాటులో తనూ ఓ చేయి కలిపారు. పర్మిషనిచ్చినా చాలు..! రోజూ వేల టన్నుల చెత్త ఒక డంప్‌యార్డ్‌కి చేరుతుందట! నగరంలో ఇలాంటి డంప్‌యార్డ్‌లు 24 ఉన్నాయి. వాటన్నింటినీ తిరిగాను. విదేశాలలో ఇళ్ల నుంచి చెత్తను సేకరించే పద్ధతులు, అక్కడ ప్రజలు తీసుకునే జాగ్రత్తలు, చెత్తను రీ సైక్లింగ్ చేసే విధానాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకున్నాను. వాటిలో మనం కనీసం 50 శాతం పాటించినా ప్రజల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందనిపించింది. అన్ని డంప్‌యార్డ్‌ల వద్ద హెల్త్‌క్యాంపుల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాను. రెండు రోజుల క్రితమే పటాన్చెరువు, మియాపూర్‌లలోని డంప్‌యార్డ్‌ల వద్ద హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశాం. తాగునీటి సౌకర్యం కోసం వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశాం. మిగతా డంప్‌యార్డ్‌ల వద్ద కూడా హెల్త్ క్యాంపులు పెట్టి, అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే, ఇందుకు తగినంత వైద్య సిబ్బంది, వాలంటీర్ల లేమి ఉంది. రాబోయేది వర్షాకాలం. ఈ కాలంలో ఆరోగ్య సమస్యల సంఖ్య ఇంకా ఎక్కువే. కాలుష్యం తగ్గడానికి డంప్‌యార్డ్ చుట్టూ ఔషధ మొక్కల పెంపకానికి చర్యలు తీసుకోవాలని, తాగునీటి వసతితో పాటు చేతులు, ఒళ్లు శుభ్రం చేసుకోవడానికి తగినన్ని నీళ్లను ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నాను. పర్మిషన్ ఇచ్చినా ఆ పనిని నేను కొద్ది కొద్దిగానైనా నెరవేర్చుకుంటూ వెళ్లగలననే నమ్మకం నాకుంది’’ అని చెప్పారు జయశ్రీ. ‘‘ఇన్నాళ్లు నేను చేసిన ఉద్యోగం పిల్లల భవిష్యత్తుకు మార్గం చూపేది. ఇప్పుడు డంప్‌యార్డ్ చుట్టూ పేరుకుపోయిన అనారోగ్య పరిస్థితుల్ని తొలగించడానికి నా చుట్టూ ఉన్న నలుగురిని తట్టిలేపాలని నిశ్చయించుకున్నాను’’ అంటున్నారు జయశ్రీ. ప్రతి ఇంటికీ బాధ్యత ఉంది మన దగ్గర తడి చెత్త–పొడి చెత్త అని, చెత్తను వేరు చేసే రెండు విధానాలు ఉన్నాయి. కానీ, వాటిని పట్టించుకునే వారే లేరు. ఇళ్ల వద్దే చెత్తను మనం చాలా రకాలుగా తగ్గించవచ్చు. తడి చెత్తను కంపోస్ట్ ఎరువుగా మార్చుకోవచ్చు. పొడి చెత్తలోనూ హానికారకమైన (సిరంజులు, సూదులు, గాజు ముక్కలు, బ్యాటరీల.. వంటివి) వస్తువులను విడిగా ఒక ప్యాకెట్లో వేసి ఇస్తే వాటిని వాళ్లు అంతే జాగ్రత్తగా తీసుకెళ్లగలరు. నివారణ మన ఇంటి నుంచి మొదలైతే సమాజ ఆరోగ్యం బాగుంటుంది. – జయశ్రీ – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అడవుల్లో మరగధకాడు
తమిళసినిమా: పూర్తిగా అడవుల్లో చిత్రీకరణను జరుపుకున్న చిత్రం మరగధకాడు అని ఆ చిత్ర దర్శకుడు మంగళేశ్వరన్ తెలిపారు. ఈయన తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్ఆర్.ఫిలింస్ పతాకంపై రఘునాథన్ నిర్మిస్తున్నారు. అజయ్, రంజనా, జయశ్రీ,మలయాళ దర్శకుడు ఇలియాస్ కాత్తవన్, జేపీ.మోహన్, పావాలక్ష్మణన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జయప్రకాశ్ సంగీతాన్ని, నక్షత్ర ప్రకాశ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది పూర్తిగా అడవుల్లో చిత్రీకరించిన మంచి సందేశంతో కూడిన కథా చిత్రంగా ఉంటుందన్నారు. నానాటికి నశించి పోతున్న అడవులు, వాటిని నమ్ముకుని జీవించే అటవీవాసుల జీవన విధానాన్ని ఆవిష్కరించే చిత్రంగా మరగధకాడు చిత్రం ఉంటుందన్నారు. నాగరికత, నగరాభివృద్ధి పేరుతో అడవులను ఎలా హరింపజేస్తున్నారు? దాని వల్ల ప్రకృతి ఎలా బాధింపునకు గురవుతోంది? అన్న అంశాలను ఆవిష్కరించే చిత్రం ఇదన్నారు. ఇప్పుడు నీరు కొనుక్కుంటున్నట్లే ఇకపై గాలిని కొనుక్కునే పరిస్థితి రాకుడదని చెప్పే చిత్రంగా మరగథకాడు చిత్రం ఉంటుందన్నారు. ఇందులో ఒక చక్కని ప్రేమ కథ కూడా ఉంటుందన్నారు. ఒక పరిశోధన నిమిత్తం అడవికి వెళ్లిన కథానాయకుడికి అక్కడ ఒక అందమైన అమ్మాయి తారస పడుతుందన్నారు. వారి పరిచయం ప్రేమగా మారగా,అది ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే ఆసక్తికరమైన సన్నివేశాలతో తెరకెక్కిస్తున్న చిత్రం మరగధకాడు అని చెప్పారు. చిత్రాన్ని తమిళనాడు, కేరళ ప్రాంతాల్లోని దట్టమైన అడవుల్లో చిత్రీకరించినట్లు దర్శకుడు తెలిపారు. -
భర్తలేని జీవితం వద్దంటూ ఓ భార్య..
చిట్యాల: ఓ వ్యక్తి ఆనారోగ్యంతో మృతి చెందగా, భర్త మరణాన్ని తట్టుకోలేక అతడి భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తిలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు... చొల్లేటి జయశ్రీ (33) భర్త చంద్రశేఖర్‌కు మద్యం వ్యసనం ఉంది. దీంతో అతడు అనారోగ్యం పాలై ఐదు రోజుల క్రితం మృతి చెందాడు. భర్త లేక తాను జీవించలేనంటూ, మనస్తాపానికి గురైన జయశ్రీ ఆదివారం ఉదయం విషం సేవించింది. ఆమెను చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. -
ఇద్దరి దారుణ హత్య
ప్రాణాలు బలిగొన్న వివాహేతర సంబంధం కత్తితో స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు రసూల్‌పురా: ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. వివాహేతర సంబంధం వారి ప్రాణాలు బలిగొంది. నిందితుడు కత్తితోవచ్చి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటన బోయిన్పల్లి, బేగంపేట పోలీస్స్టేషన్ల పరిధిలో శనివారం సంచలనం సృష్టించింది. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు.. తాడ్బంద్ కంటోన్మెంట్ సిబ్బంది క్వార్టర్స్‌లో నివసించే రాకేష్ (40) వృత్తిరీత్యా కారు డ్రైవర్. ఇతడికి భార్య జయశ్రీ (36), కుమారులు రోహిత్ (17) హేమంత్ (14) ఉన్నారు. బేగంపేట పాటిగడ్డలో ఉంటున్న రాకేష్ చిన్నాన్న కుమారుడు నరేన్(30)తో జయశ్రీ కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం నెరుపుతోంది. ప్రవ ర్తన మార్చుకోవాలని పలు మార్లు కౌన్సెలింగ్ ఇప్పించిన ఆమె మారలేదు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం భర్త నుంచి విడిపోయి బోడబండ కబీర్‌నగర్‌లో ఉంటున్న తల్లి హేమలత ఇంట్లో జయశ్రీ ఉంటోంది. కాగా గతంలో రాకేష్ అన్న పోతురాజు భార్య స్యరూపతో నరేన్‌కు అక్రమ సంబంధం ఉండేది. దీంతో మనస్తాపానికి గురైన పోతురాజు ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం నరేన్ స్యరూపను పెళ్లిచేసుకున్నారు. ప్రస్తుతం వారి మధ్య గొడవలు జరుగుతుండటంతో స్వరూప వేరుగా ఉంటుంది. కాగా శనివారం ఉదయం కబీర్‌నగర్‌కు రాకేశ్ వచ్చి తన యజమానితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుని కలిసిమెలసి ఉందామని బైక్‌పై జయశ్రీని తాడ్బంద్ తీసుకువచ్చాడు. సాయంత్రం వారి ఇంటికి సమీపంలో ఉన్న నల్లపోచమ్మ ఆలయ ప్రాంగణంలో వెంట తెచ్చుకున్న కత్తితో జయశ్రీ ఛాతీపై పొడిచి, గొంతు కోసి హతమార్చాడు. అక్కడినుంచి బైక్‌పై నేరుగా పాటిగడ్డ ఎన్బీటీ నగర్‌లోని నారాయణ అలియాస్ నరేన్ ఇంటికి వెళ్లి నిద్రలో నుంచి లేపి అదే కత్తితో అతడ్ని హతమార్చాడు. తిరిగి ఇంటికి చేరుకుని బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీంను రప్పించారు. ఆధారాలు సేకరించి జయశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. అదనపు డీసీపీ వీవైగిరి పీఎస్‌కు చేరుకుని హత్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
తప్పుల తడక
ఇందూరు : జిల్లాకు మంజూరు అయిన 66 పంచాయతీ కా ర్యదర్శుల పోస్టుల భర్తీకి పంచాయతీ శాఖ అధికారులు చేసిన కసరత్తులో తీవ్రంగా త ప్పులు దొర్లాయి. కొందరి కులా ల పేర్లు మారగా, ఇంకోచోట మహిళలకు కేటాయించిన పోస్టులో మగవారు ఎంపికయ్యారు. నియామకాల విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నామని, అందుకే జాబితా వెల్లడిలో జాప్యం జరుగుతోందని అధికారులు చెప్పినప్పటికీ ఈ తప్పులు చోటు చేసుకోవడం గమనార్హం. తప్పులను గుర్తించినా, సరిదిద్దకుండా ఈ నెల 21న ధ్రువీకరణ పత్రాల పరిశీలన కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితాను బహిర్గతం చేశారు. పరీక్ష రాసి మెరిట్ మార్కులు సాధించినా ఉద్యోగం దక్కకపోవడంతో అనుమా నం వచ్చిన పలువురు అభ్యర్థులు మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి వచ్చారు. తమకు ఎందుకు ఫోన్ చేయలేదని సంబంధిత అధికారులను ఆ రా తీశారు. కార్యాలయం వెల్లడించిన జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో అసంతృప్తి చెంది, తమకు న్యాయం చేయాలని డీపీఓను కోరారు. ఇదీ జరిగింది పంచాయతీ అధికారులు ప్రకటించిన 66మంది అభ్యర్థుల జాబితాలో తప్పులు దొర్లాయని స్పష్టంగా కనిపిస్తోంది. ఓసీ కులానికి చెందిన బి. నవనీత అనే అభ్యర్థికి 208 మార్కులు వచ్చాయి. కానీ ఆమెను బీసీ-ఏలో చేర్చారు. రాజేశ్‌కుమార్ అనే అభ్యర్థి మహిళా విభాగంలో ఎంపికైనట్టు జాబితాలో చేర్చారు. దీంతో అక్కడ ఎంపిక కావలసిన జయశ్రీ అనే అభ్యర్థికి అన్యాయం జరిగింది. దీనిని బట్టి అధికారులు ఎంత నిర్లక్ష్యంగా జాబితాను తయారు చేశారో ఊహించుకోవచ్చు. జనరల్ కేటగిరీలో 19 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 6 పోస్టులు ఉన్నాయి. జనరల్ కేటగిరీ పోస్టులకు మెరిట్ మార్కులు సాధించిన మొదటి 19 మందిని ఎంపిక చేశారు. ఇందులో ఒక ఎస్సీ అభ్యర్థి కూడా ఉన్నారు. ఎస్సీ కేటగిరీలో కూడా ఆయన ఎంపిక అయినట్టు చూపించారు. రెండు కేటగిరీలలో ఒకే అభ్యర్థి ఎలా ఎంపిక అవుతాడో అధికారులకే తెలియాలి. ఫలితంగా తరువాత మెరిట్ మార్కులు కలిగిన వేల్పూర్ మండలం పడిగెల గ్రామానికి చెందిన లోలం రాజేష్‌కు అన్యాయం జరిగింది. వికలాంగుల కోటాలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను కార్యాలయంలో ప్రదర్శించలేదు. తమకు జరిగిన అన్యాయం విషయంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని బాధిత అభ్యర్థులు పేర్కొన్నారు.