ఇందూరు : జిల్లాకు మంజూరు అయిన 66 పంచాయతీ కా ర్యదర్శుల పోస్టుల భర్తీకి పంచాయతీ శాఖ అధికారులు చేసిన కసరత్తులో తీవ్రంగా త ప్పులు దొర్లాయి. కొందరి కులా ల పేర్లు మారగా, ఇంకోచోట మహిళలకు కేటాయించిన పోస్టులో మగవారు ఎంపికయ్యారు. నియామకాల విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నామని, అందుకే జాబితా వెల్లడిలో జాప్యం జరుగుతోందని అధికారులు చెప్పినప్పటికీ ఈ తప్పులు చోటు చేసుకోవడం గమనార్హం. తప్పులను గుర్తించినా, సరిదిద్దకుండా ఈ నెల 21న ధ్రువీకరణ పత్రాల పరిశీలన కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితాను బహిర్గతం చేశారు.
పరీక్ష రాసి మెరిట్ మార్కులు సాధించినా ఉద్యోగం దక్కకపోవడంతో అనుమా నం వచ్చిన పలువురు అభ్యర్థులు మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి వచ్చారు. తమకు ఎందుకు ఫోన్ చేయలేదని సంబంధిత అధికారులను ఆ రా తీశారు. కార్యాలయం వెల్లడించిన జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో అసంతృప్తి చెంది, తమకు న్యాయం చేయాలని డీపీఓను కోరారు.
ఇదీ జరిగింది
పంచాయతీ అధికారులు ప్రకటించిన 66మంది అభ్యర్థుల జాబితాలో తప్పులు దొర్లాయని స్పష్టంగా కనిపిస్తోంది. ఓసీ కులానికి చెందిన బి. నవనీత అనే అభ్యర్థికి 208 మార్కులు వచ్చాయి. కానీ ఆమెను బీసీ-ఏలో చేర్చారు. రాజేశ్‌కుమార్ అనే అభ్యర్థి మహిళా విభాగంలో ఎంపికైనట్టు జాబితాలో చేర్చారు. దీంతో అక్కడ ఎంపిక కావలసిన జయశ్రీ అనే అభ్యర్థికి అన్యాయం జరిగింది.
దీనిని బట్టి అధికారులు ఎంత నిర్లక్ష్యంగా జాబితాను తయారు చేశారో ఊహించుకోవచ్చు. జనరల్ కేటగిరీలో 19 పోస్టులు, ఎస్‌సీ కేటగిరీలో 6 పోస్టులు ఉన్నాయి. జనరల్ కేటగిరీ పోస్టులకు మెరిట్ మార్కులు సాధించిన మొదటి 19 మందిని ఎంపిక చేశారు. ఇందులో ఒక ఎస్‌సీ అభ్యర్థి కూడా ఉన్నారు. ఎస్‌సీ కేటగిరీలో కూడా ఆయన ఎంపిక అయినట్టు చూపించారు. రెండు కేటగిరీలలో ఒకే అభ్యర్థి ఎలా ఎంపిక అవుతాడో అధికారులకే తెలియాలి. ఫలితంగా తరువాత మెరిట్ మార్కులు కలిగిన వేల్పూర్ మండలం పడిగెల గ్రామానికి చెందిన లోలం రాజేష్‌కు అన్యాయం జరిగింది. వికలాంగుల కోటాలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను కార్యాలయంలో ప్రదర్శించలేదు. తమకు జరిగిన అన్యాయం విషయంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని బాధిత అభ్యర్థులు పేర్కొన్నారు.
తప్పుల తడక
Published Wed, Jul 16 2014 4:41 AM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM
Advertisement
Advertisement