Rajesh kumar
-
రక్షణ శాఖ కార్యదర్శిగా రాజేశ్ కుమార్ సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: రక్షణ కార్యదర్శిగా నియమితులైన రాజేశ్ కుమార్ సింగ్ ఢిల్లీ సౌత్ బ్లాకులో శుక్రవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. కేరళ కేడర్ 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఆర్కే సింగ్ ఈ ఏడాది ఆగస్టు 20న రక్షణశాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (రక్షణ కార్యదర్శి పదవిలో)గా బాధ్యతలు చేపట్టారు. కాగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించే కంటే ముందు ఆర్కే సింగ్ నేషనల్ వార్ మెమోరియల్‌కు వెళ్లి, అమరులైన జవానులకు నివాళులు సమర్పించారు. ‘మాతృభూమికి సేవ చేయడంలో అత్యున్నత త్యాగానికి వెనుదీయని మన శూర జవానులకు ఈ దేశ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు. అమర జవానుల అసాధారణ ధైర్య సాహసాలు, వారి త్యాగాలు భారత్‌ను ఒక సురక్షిత, సమృద్ధ దేశంగా తీర్చిదిద్దడానికి మనకందరికీ శక్తిని, ప్రేరణను అందిస్తూనే ఉంటాయి’అని రాజేశ్ కుమార్ సింగ్ అన్నారు. అంతకు ముందు, ఆయన 2023 ఏప్రిల్ 24 నుంచి 2024 ఆగస్టు 20 మధ్య కాలంలో వాణిజ్య, పరిశ్రమ శాఖలోని అంతర్గత వాణిజ్యం–పరిశ్రమల ప్రోత్సాహక విభాగం కార్యదర్శిగా సేవలు అందించారు. కాగా రక్షణ కార్యదర్శిగా గురువారం పదవీ విరమణ చేసిన ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి గిరిధర్ అరమానే స్థానంలో ఆ పదవిని ఆర్కే సింగ్ చేపట్టారు. -
నా బిడ్డను పోలీసులు బలి తీసుకున్నారు
సత్తెనపల్లి: పల్నాడు జిల్లాలో పోలీసుల వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందిన రెంటపాళ్ల ఉపసర్పంచ్, వైఎస్సార్సీపీ క్రియాశీలక కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు మృతదేహానికి సోమవారం గుంటూరు జీజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తండ్రి కొర్లకుంట వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ నాయకులు, గ్రామస్తులు సత్తెనపల్లి రూరల్ పోలీస్‌స్టేషన్ ఎదుట మృతదేహంతో ఆందోళన నిర్వహిస్తారని తెలుసుకున్న పోలీసులు మేడికొండూరులో వారిని ఆపారు.సత్తెనపల్లి టౌన్, మేడికొండూరు సీఐలు పోలూరి శ్రీనివాసరావు, జయకుమార్.. వెంకటేశ్వర్లుతో మాట్లాడారు. ఎస్బీ సీఐ సురేష్ ఫోన్లో మాట్లాడుతూ జరిగిన విషయం బాధాకరమని, అన్ని విషయాలను పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గర్గ్‌కు వివరించి తప్పనిసరిగా న్యాయం జరిగేలా చూస్తామని అతడికి తెలిపారు. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు కారకుడైన సీఐ రాజేశ్ కుమార్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, ఎలాంటి ఆందోళన చేయకుండా అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు. పోలీస్ అధికారులు హామీ ఇవ్వడంతో మృతుడి తండ్రి వెంకటేశ్వర్లు మెత్తబడ్డారు. మృతదేహం ఉన్న వాహనంతో పాదయాత్రగా, ద్విచక్ర వాహనాలతో సత్తెనపల్లి, పాకాలపాడు మీదుగా రెంటపాళ్లకు చేరుకున్నారు.అక్కడ సత్తెనపల్లి డీఎస్పీ జి.గురునాథ్ బాబు నేతృత్వంలో పోలీస్ బలగాలు బందోబస్తు నిర్వహించాయి. ఈ సందర్భంగా మృతుడి తండ్రి కొర్లకుంట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అభం, శుభం తెలియని తన బిడ్డను పోలీసులు పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఊరు వదిలి పోవాలని బెదిరించారని ఆరోపించారు. లేకుంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపిస్తానని సత్తెనపల్లి రూరల్ సీఐ రాజేశ్ కుమార్ హెచ్చరించారని మండిపడ్డారు. తక్షణమే ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ఇంటిపై దాడి చేసి తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేందుకు కారకులైన టీడీపీ, జనసేన నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా నాగమల్లేశ్వరరావు మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు అల్లుడు ఉపే‹Ù, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చిట్టా విజయభాస్కర్‌రెడ్డి, తదితరులు సందర్శించి నివాళులు అరి్పంచారు. -
ఆటబొమ్మలకు త్వరలో పీఎల్ఐ
న్యూఢిల్లీ: ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద తోలు, పాదరక్షలు, ఆటబొమ్మలు, నూతన తరం సైకిళ్ల విడిభాగాలకు ప్రోత్సాహకాల ప్రతిపాదన పురోగతి దశలో ఉందని పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. వివిధ శాఖలు తమ పరిధిలో పీఎల్ఐ కింద ఆశించిన మేర పురోగతి లేకపోతే దిద్దుబాటు చర్యలు తీసుకుంటాయని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 14 రంగాల్లో ఉత్పత్తిని పెంచేందుకు, భారత్‌లో తయారీకి ఊతమిచ్చేందుకు పీఎల్ఐ కింద రూ.1.97 లక్షల కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. కానీ 2023 మార్చి నాటికి రూ.3,400 కోట్ల క్లెయిమ్‌లు రాగా, కేవలం రూ. 2,900 కోట్ల ప్రోత్సాహక నిధులనే కేంద్రం మంజూరు చేసిన నేపథ్యంలో రాజేష్ కుమార్ స్పందించారు. ఐటీ రంగం మాదిరే కొన్ని సవరణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఇతర రంగాలకూ ఏర్పడొచ్చన్నారు. ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తులకు సంబంధించి గత నెలలో కేంద్ర సర్కారు పీఎల్ఐ 2.0ని ప్రకటించడం గమనార్హం. ‘‘పీఎల్ఐ కింద రూ.1.97 లక్షల కోట్లు వినియోగం అవుతాయనే నమ్మకం ఉంది. కాకపోతే విడిగా ఒక్కో పథకంలో అవసరమైతే దిద్దుబాటు, సవరణలు ఉంటాయి’’అని రాజేష్‌కుమార్ సింగ్ వెల్లడించారు. మొబైల్స్ తయారీలో కావాల్సిన విడిభాగాల తయారీ దేశీయంగా 20 శాతమే ఉండగా, దాన్ని 50 శాతానికి తీసుకెళతామని రాజేష్ కుమార్ తెలిపారు. చైనాలో ఇది 49 శాతం, వియత్నాంలో 18 శాతమే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. -
పాల ఉత్పత్తుల దిగుమతులపై కేంద్రం దృష్టి!
న్యూఢిల్లీ: దేశంలో పాల ఉత్పత్తి మందగమనం నేపథ్యంలో కేంద్రం డెయిరీ ప్రొడక్టుల దిగుమతుల అవకాశాలను పరిశీలిస్తోంది. పశుసంవర్ధక, డెయిరీ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన అందించిన అధికారిక సమాచారం ప్రకారం, దేశంలో పాల ఉత్పత్తి 2021–22లో 221 మిలియన్ టన్నులు. ఇది అంతకు ముందు సంవత్సరం (2020–21)తో పోల్చితే (208 మిలియన్ టన్నులు) కేవలం 6.25 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయన వెల్లడించిన అంశాలు క్లుప్తంగా... ► ప్రస్తుతం ఫ్లషింగ్ (పీక్ ప్రొడక్షన్) సీజన్ ప్రారంభమైన దక్షిణాది రాష్ట్రాల్లో పాల నిల్వలను అంచనా వేసిన తర్వాత అవసరమైతే వెన్న, నెయ్యి వంటి పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ► పశువులలో గడ్డలు ఏర్పడడానికి సంబంధించిన చర్మవ్యాధి కారణంగా 2022–23 ఆర్థిక సంవత్సరంలోనూ దేశ పాల ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ వ్యాధి వల్ల గత ఏడాది దాదాపు 1.89 లక్షల పశువులు చనిపోయాయి. అదే సమయంలో దేశీయ డిమాండ్ 8–10% పెరిగింది. కరోనా మహమ్మారి అనంతరం డిమాండ్ పుంజుకుంది. ► పశువుల చర్మవ్యాధి ప్రభావం వల్ల 2022–23లో పాల ఉత్పత్తి కేవలం 1 నుంచి 2 శాతమే పెరిగింది. సాధారణంగా ఈ ఉత్పత్తి వృద్ధి ఏటా 6 శాతంగా ఉంటుంది. 2023–24పైనా అంచనాలు బలహీనంగానే ఉన్నాయి. ► దేశంలో పాల సరఫరాలో ఎటువంటి అడ్డంకు లు లేవు. స్కిమ్డ్ మిల్క్ పౌడర్ (ఎస్ఎంపీ) నిల్వ లు తగినంతగా ఉన్నాయి. కానీ పాల ఉత్పత్తులు ముఖ్యంగా కొవ్వులు, వెన్న, నెయ్యి మొదలైన వాటి విషయంలో నిల్వలు తక్కువగా ఉన్నాయి. ► అయితే ఇప్పుడు డెయిరీ ప్రొడక్టుల దిగుమతులు కూడా ఖరీదయిన వ్యవహారమే. ఇది దేశీయ దిగుమతుల బిల్లును పెంచుతుంది. అంతర్జాతీయ ధరలు ఇటీవల పెరగడం దీనికి కారణం. అందువల్లే ప్రస్తుతం ఫ్లషింగ్ (పీక్ ప్రొడక్షన్) సీజన్ ప్రారంభమైన దక్షిణాది రాష్ట్రాల్లో పాల నిల్వలను అంచనా వేయడానికి తొలుత ప్రాధాన్యత ఇస్తున్నాం. ► 20 రోజులుగా అకాల వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. వాతావరణ పరిస్థితులు కొంత అనుకూలించడంతో ఉత్తర భారతదేశంలో పాల కొరత కొంత తక్కువగానే ఉంటుందని భావిస్తున్నాం. ► పశుగ్రాసం ధరల పెరుగుదల డెయిరీ రంగంలో ద్రవ్యోల్బణానికీ దారితీస్తుంది. గత నాలుగేళ్లలో పశుగ్రాసం పంట విస్తీర్ణం భారీగా పెరగలేదు. సహకార రంగమే ప్రాతిపదిక... అయితే ఇక్కడ ఒక విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వం మొత్తం ప్రైవేట్, అసంఘటిత రంగాన్ని కాకుండా సహకార రంగం నుంచి వచ్చే పాల ఉత్పత్తి డేటాను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రభుత్వ అంచనాలు సహకార రంగం నుంచి అందే గణాంకాల ప్రాతిపదికనే ఉంటుంది. భారత్ 2011లో డెయిరీ ప్రొడక్టులను దిగుమతి చేసుకుంది. అటు తర్వాత ఈ పరిస్థితి రాలేదు. -
పుట్టుకతోనే ప్రేమలో పడ్డారు!
‘‘నేను చిరంజీవిగారికి పెద్ద ఫ్యాన్. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. మా ‘ప్రేమ అంత ఈజీ కాదు’ సినిమాలో కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చాం. తండ్రీ కొడుకుల మధ్య ఎలాంటి బంధం ఉంటుందో ఈ సినిమా అలాగే ఉంటుంది. మన జీవితాలను ప్రతిబింబిస్తుంది. ఇరుగు పొరుగున చూసే చాలా అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి’’ అని డైరెక్టర్ ఈశ్వర్ అన్నారు. రాజేష్ కుమార్, ప్రజ్వల్ జంటగా ఈశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమ అంత ఈజీ కాదు’. టి. అంజయ్య సమర్పణలో టి.నరేష్, టి.శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. టి. అంజయ్య మాట్లాడుతూ– ‘‘ఎప్పటి నుంచో సినిమా తీయాలని మా అబ్బాయిలు అనుకుంటున్నారు. ఈ సినిమా గురించి చెప్పినప్పుడు మంచి సినిమా తీయండి అన్నాను. ప్రేమకు సంబంధించి చాలా సినిమాలు వచ్చాయి. కానీ, మా సినిమాలో కొత్త కోణంలో ప్రేమను ఆవిష్కరించాం’’ అన్నారు. ‘‘ పుట్టుకతోనే ప్రేమలో పడతారు ఇద్దరు. వారు పెరిగే కొద్దీ వారి ప్రేమ పెరిగిన తీరును ఈ సినిమాలో చూపిస్తున్నాం’’ అన్నారు నరేష్, శ్రీధర్. ‘‘ఎవరైనా మా సినిమాకి రూ.100 పెట్టి టికెట్ కొంటే, వారికి రూ.1000 వినోదం దక్కుతుంది’’ అన్నారు రాజేష్. ‘‘ఈ చిత్రంలో ప్రేమ అనే మంచి పాత్ర చేశా’’ అన్నారు ప్రజ్వల్. -
ల్యాబ్‌లో మురిగిపోయే సినిమా అన్నారు!
రాజేష్‌కుమార్, ప్రజ్వాల్ జంటగా ఈశ్వర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రేమ అంత ఈజీ కాదు’. పారిజాత మూవీ క్రియేషన్స్ పతాకంపై టి.నరేష్, టి. శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 29న విడుదలవుతోంది. ఈ సినిమా టీజర్‌ని చిత్ర సమర్పకుడు, పారిజాత హోమ్స్ అండ్ డెవలపర్స్ చైర్మన్ టి.అంజయ్య విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి సెన్సార్ అధికారులు మంచి ప్రశంసలు ఇచ్చి, క్లీన్ యు సర్టిఫికెట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేలా మా సినిమాను రూపొందించాం’’ అన్నారు. ‘‘సినిమా తీయడం ఈజీ కాదని ఈ రంగంలోకి వచ్చాకే తెలిసింది. మా సినిమా మొదలైన తర్వాత ‘ప్రసాద్ ల్యాబ్‌లో మురిగిపోయే మరో సినిమా’ అని కొందరు వాగారు. ఎవరికైనా సహకరించక పోయినా ఫర్వాలేదు కానీ, ఇలా మనోధైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడొద్దు’’ అన్నారు ఈశ్వర్. ‘‘చాలా కష్టపడి ఈ సినిమా తీశాం. మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు రాజేష్ కుమార్. ‘‘ప్రేమ నేపథ్యంలో సాగే కథ ఇది. మనసుకి నచ్చిన వ్యక్తి ప్రేమను గెలుచుకోవడం ఎంత కష్టమో తెలుపుతుంది’’ అని శ్రీధర్, నరేష్ అన్నారు. ధనరాజ్, రాంప్రసాద్, ముక్తార్‌ఖాన్ నటించిన ఈ చిత్రానికి కెమెరా: చక్రి, సంగీతం: జై.యం. ∙రాజేశ్, ప్రజ్వాల్ -
ప్రేమ సులభం కాదు
‘‘ఖోఖో, ఫ్లా్లష్ న్యూస్, వెతికా నేను నా ఇష్టంగా’ వంటి చిత్రాలతో ప్రతిభ ఉన్న నటుడిగా నిరూపించుకున్న రాజేశ్‌కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ప్రేమ అంత ఈజీ కాదు’. కన్నడలో మూడు విజయవంతమైన సినిమాల్లో నటించిన ప్రజ్వాల్ పువ్వామా ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఈశ్వర్ దర్శకత్వం వహించారు. టి.అంజయ్య సమర్పణలో పారిజాత మూవీ క్రియేషన్స్ పతాకంపై టి.నరేశ్, టి.శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ప్రేమ నేపథ్యంలో సాగే కథ ఇది. మనసుకి నచ్చిన వ్యక్తి ప్రేమను గెలుచుకోవడం ఎంత కష్టమో తెలుపుతుంది. ప్రేమ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మధ్య సాగే డ్రామా ఇది. అవుట్‌పుట్ బాగా వచ్చింది. త్వరలో పాటల్ని విడుదల చేసి, ఈ నెలాఖరులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని అన్నారు. ధన్‌రాజ్, రాంప్రసాద్, ముక్తార్‌ఖాన్ నటించిన ఈ చిత్రానికి కెమెరా: చక్రి, సంగీతం: జై.యం. -
నా భర్తను చంపిన వారిని కఠినంగా శిక్షించాలి
కడప రూరల్: తన భర్త రాజేష్‌కుమార్ మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కడప నగరం, చిన్నచౌక్కు చెందిన మమత కోరారు. గురువారం స్ధానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన భర్త స్ధానిక ఎర్రముక్కపల్లెలోని ఒక షాపులో రాడ్ వెండర్‌గా పనిచేసేవాడని తెలిపారు. గతనెల ఆ షాపు యజమాని ప్రసాద్‌రెడ్డి తన భర్తను విందు పేరుతో కడప నగర సమీపంలోని వాటర్ గండి వద్దకు తీసుకెళ్లాడని తెలిపారు. తరువాత తన భర్త తిరిగి ఇంటికి రాలేదన్నారు. ఈ విషయమై స్ధానిక చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. తరువాత అదే నెల 26వ తేదీన ఆ ప్రాంతంలోనే తన భర్త మృతదేహం లభించిందన్నారు. తన భర్త మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తనకు ఒకటిన్నర ఏడాది పాప ఉందని, తాను తన తండ్రి వద్ద ఉంటున్నట్లు తెలిపారు. నిరుపేదనైన తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్కే నజీర్‌బాషా మాట్లాడుతూ మమతకు న్యాయం జరగకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మమత తండ్రి చిన్న కొండయ్య, బీఎస్పీ నాయకులు రవికుమార్, కానుగ దానం తదితరులు పాల్గొన్నారు. -
స్నేహితులకు అంకితం
రాజేశ్ కుమార్, ప్రజ్జు హీరో హీరోయిన్లుగా ఈశ్వర్ దర్శకత్వంలో తెరక్కెక్కుతున్న చిత్రం ‘ప్రేమ అంత ఈజీ కాదు’. టి. అంజయ్య సమర్పణలో టి. నరేశ్ కుమార్, టి. శ్రీధర్ నిర్మిస్తున్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని ఫ్రెండ్షిప్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ 80 శాతం కంప్లీట్ అయింది. రాజేశ్, ప్రజ్ఞు బాగా నటిస్తున్నారు. మా సినిమాలోని ఫ్రెండ్షిప్ సాంగ్‌ని ఫ్రెండ్స్ అందరికీ అంకితం ఇస్తున్నాం’’ అన్నారు. ఈ సినిమాలో ధనరాజ్, ‘జబర్దస్’ అవినాష్, రాంప్రసాద్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. -
ఎస్బీఐ కొత్త చైర్మన్ రజనీష్ కుమార్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త చైర్మన్‌గా రజనీష్ కుమార్ (59)నియమితులయ్యారు. ఈ నెల 7న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత చైర్ప ర్సన్ అరుంధతీ భట్టాచార్య పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆ స్థానంలో రజనీష్ కుమార్‌ని నియమిస్తూ క్యాబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల పాటు ఆయన ఈ హోదాలో కొనసాగుతారని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) వెల్లడించింది. రజనీష్ 2015 మే 26న ఎస్బీఐ బోర్డులో చేరారు. ప్రస్తుతం ఎస్బీఐ ఎండీగా ఉన్నారు. అంతకన్నా ముందు ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ సీఈవో, ఎండీగాను వ్యవహరించారు. అలాగే బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ స్ట్రాటెజిక్ బిజినెస్ యూనిట్)గా కూడా సేవలు అందించారు. బ్రిటన్, కెనడా విభాగాల్లోనూ పలు కీలక హోదాల్లో పనిచేశారు. మొండి బకాయిల భారంతో బ్యాంకింగ్ రంగం సతమతమవుతున్న పరిస్థితుల్లో రజనీష్ కుమార్ ఎస్బీఐ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం 2017 మార్చి ఆఖరు నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల మొండి బాకీలు ఏకంగా రూ. 6.41 లక్షల కోట్లకు పెరిగాయి. అంతక్రితం ఏడాది మార్చి ఆఖరు నాటికి వీటి పరిమాణం రూ. 5.02 లక్షల కోట్లు. మరోవైపు, ప్రస్తుత చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య తొలిసారిగా 2013లో బాధ్యతలు చేపట్టారు. తద్వారా ఈ హోదా దక్కించుకున్న తొలి మహిళగా రికార్డులకెక్కారు. ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ నిరాటంకంగా సాగాలనే ఉద్దేశంతో గతేడాది అక్టోబర్‌లో ఆమె పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు. 2017 ఏప్రిల్ 1న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనెర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్‌తో పాటు భారతీయ మహిళా బ్యాంకు కూడా ఎస్బీఐలో విలీనమైంది. 2016–17లో ఎస్బీఐ, గతంలో దాని అనుబంధ బ్యాంకులు రూ. 27,574 కోట్ల మేర నిరర్ధక ఆస్తులను (ఎన్పీఏ) రైటాఫ్ చేశాయి. -
అదృశ్యమైన డాక్టర్ శవమై తేలాడు
అన్నానగర్: కొద్ది రోజుల క్రితం మాయమైన డాక్టర్ మృతదేహంగా తాగునీటి తొట్టిలో లభించిన సంఘటన కొళత్తూరులో చోటు చేసుకుంది. వివరాలు.. చెన్నై సమీపం కొళత్తూరు పూంపుహార్నగర్ 2వ మెయిన్‌రోడ్డులో నివసిస్తున్న నాగరాజన్ భార్య శాంతి. వీరి కుమారుడు రాజేష్‌కుమార్(26). కుమార్తె శ్రీలేఖ. వీరి సొంత ఊరు శివగంగై జిల్లా తిరుప్పత్తూరు. డాక్టర్ అయిన రాజేష్‌కుమార్ మొగప్పేర్‌లో క్లినిక్, మందుల దుకాణం నడుపుతున్నాడు. మందుల దుకాణాన్ని ఇతని తండ్రి నాగరాజన్ చూసుకుంటాడు. డాక్టర్ రాజేష్‌కుమార్‌కి, కారైకుడికి చెందిన ఓ మహిళకు 3వ తేదిన కారైకుడిలో వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించారు. నాగరాజన్, శాంతి తమ బంధువులకు పెళ్లి కార్డు ఇవ్వడానికి సొంతూరు తిరుపత్తూరుకి వెళ్లారు. ఇంట్లో రాజేష్‌కుమార్, అతని చెల్లి శ్రీలేఖ మాత్రమే ఉన్నారు. గత 28వ తేదీన ఇంటి నుంచి బయటికెళ్లిన రాజేష్‌కుమార్ మాయమయ్యాడు. దిగ్భ్రాంతి చెందిన శ్రీలేఖ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. వెంటనే వారు చెన్నైకి వచ్చి స్నేహితులు, బంధువుల ఇంట్లో వెతికినా అతని ఆచూకి లభ్యం కాలేదు.నాగరాజన్ ఫిర్యాదు మేరకు కొళత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి రాజేష్‌కుమార్ కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం కొళత్తూరు పూంపుహార్ నగర్‌లోని చెన్నై తాగునీటి కార్యాలయంలో ఉన్న తాగునీటి తొట్టి నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.దీంతో అన్నానగర్ జాయింట్ కమిషనర్ సుధాకర్, విల్లివాక్కం జాయింట్ కమిషనర్ జయసింగ్, కొళత్తూరు ఇన్స్పెక్టర్ మునిశేఖర్, రాజమంగళం గోపీనాథ్ సంఘటన స్థలానికి చేరుకుని తాగునీటి తొట్టి మూతను కొర్లాన్యంత్రంతో తెరచి చూశారు. అందులో డాక్టర్ మృతదేహం కుళ్లిన స్థితిలో పడిఉంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి డాక్టర్ రాజేష్‌కుమార్‌ని ఎవరైనా హత్య చేసి మృతదేహాన్ని తాగునీటి తొట్టిలో విసిరేసి వెళ్లారా? లేదా అతనే ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. 3వ తేదీ వివాహం జరగాల్సిన స్థితిలో డాక్టర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
ఈ ఆదివారం ఎస్బీఐ పనిచేస్తుంది
చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహమందించే లక్ష్యంతో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా రానున్న ఆదివారాన్ని (జూలై 24) ఎస్ఎంఈ సండేగా ప్రకటించింది. హైదరాబాద్ పరిధిలోని శాఖలన్నీ ఆ రోజున పనిచేస్తాయని ఎస్బీఐ డీజీఎం రాజేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. స్టార్టప్ ఇండియా, స్టాండ్‌అప్ ఇండియా కార్యక్రమాలకు ఊతమిచ్చే లక్ష్యంతో దీన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. జూలై 24న ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ బ్యాంకు శాఖలు తెరిచి ఉంటాయని, స్టార్టప్‌లతోపాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అన్ని రుణాల వివరాలు తెలుసుకోవాలనుకునే వారు బ్యాంకు అధికారులను సంప్రదించవచ్చునని ఆయన చెప్పారు. విశాఖపట్నంలో ఈ తరహా కార్యక్రమాన్ని ఇటీవలే విజయవంతంగా నిర్వహించామని, హైదరాబాద్‌లోని ఔత్సాహికులు కూడా ఎస్ఎంఈ సండేను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
టాలెస్ట్ పోలీసుతో సెల్ఫీల పిచ్చి
చండీగఢ్: హర్యానాలోని గుర్గావ్లో ట్రాఫిక్ పోలీసు విధులు నిర్వహిస్తున్న అత్యంత పొడుగరి రాజేష్ కుమార్ ఇప్పుడు ఓ పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు. దారంటా పోయే బాటసారులే కాకుండా కార్లలో వెళుతున్న వారు కూడా దిగొచ్చి ఆయనతో సెల్ఫీలు దిగుతున్నారు. ఇప్పుడాయన డ్యూటీలో ఎక్కువ సమయాన్ని పర్యాటకులు, ప్రయాణికులతో సెల్ఫీలు దిగేందుకే కేటాయిస్తున్నారు. ఏడు అడుగుల నాలుగు అంగుళాల ఎత్తున్న 39 ఏళ్ల రాజేష్ కుమార్ భారత పోలీసు డిపార్ట్మెంట్లోనే అత్యంత పొడుగరి రికార్డుల్లోకి ఎక్కారు. తొలుత పంజాబ్‌లో పోలీసుగా చేరిన ఆయన ఇప్పుడు గుర్గావ్లో ట్రాఫిక్ పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ట్రాఫిక్ భద్రతా వారోత్సవాల కారణంగా ఆయన సెలబ్రిటీగా మారిపోయారు. తన అసాధారణ పొడుగు కారణంగా తాను ఎన్నడూ ఇబ్బంది పడలేదని, తన పొడుగుతనం తన విధులకు ఎంతో ఉపయోగపడిందని కూడా ఆయన చెబుతున్నారు. ట్రాఫిక్ జామైన సందర్భాల్లో తాను పొడుగు ఉండడం వల్ల చాలా దూరం వరకు చూసే అవకాశం లభిస్తోందని, ఫలితంగా ఎక్కడ సమస్య ఉందో తెలుస్తోందని చెప్పారు. తన పొడుగు కారణంగా చిన్నప్పుడు తనను స్కూల్లో కొంతమంది ఆకతాయిలు ఏడిపించే వారని, వాటిని ఎప్పుడూ లెక్క చేయలేదని ఆయన చెప్పారు. ఇప్పుడు తాను పొడుగు ఉన్న కారణంగానే సెలబ్రిటీగా మారిపోవడం, తనతో సెల్ఫీలు దిగేందుకు ప్రజలు పోటీ పడడం చూస్తుంటే ఆనందంగా ఉంటోందని చెప్పారు. వాస్తవానికి తనకు ‘వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టేన్మెంట్ (డబ్లూడబ్లూఈ)’లో పాల్గొనడం ఇష్టమని, ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలైనప్పుడల్లా విధులకు సెలవుపెట్టి రెజ్లింగ్ శిక్షణకు వెళుతున్నానని ఆయన తనను కలసుకున్న మీడియాకు తెలిపారు. తాను రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనడం ద్వారా కూడా ప్రజలను విశేషంగా ఆకర్షిస్తానన్న నమ్మకం కూడా తనకు ఉందని ఆయన చెప్పారు. -
శ్రీవారికి ఒడిశా భక్తుడి భారీ కానుక
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ఓ భక్తుడు భారీ కానుకను సమర్పించాడు. ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన ట్రిజాల్ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ రాజేష్ కుమార్ రెండు స్వర్ణ హారాలను విరాళంగా ఇచ్చాడు. 5.5 కిలోల బంగారంతో రెండు సుదర్శన సాలిగ్రామ హారాలను రాజేష్ తయారు చేయించారు. వాటిని టీటీడీ ఈవో సాంబశివరావుకు బుధవారం ఉదయం ఆయన అందజేశారు. వీటి విలువ సుమారు రూ.1.15కోట్ల ఉంటుందని తెలుస్తుంది. ఈ రెండు హారాలను ఉత్సవ సమయాల్లో ఒకటి మూలవిరాట్‌కు రెండోది మలయప్ప స్వామికి అలంకరించనున్నారు. -
ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నిక వివాదం కొత్త మలుపు
-
పోలీస్ బ్రదర్స్
ప్రత్తిపాడు : ‘గ్రామ పోలీసు వ్యవస్థ’ను పటిష్టం చేసేందుకు అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. దీని కోసం వినూత్నంగా, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు అంతంత మాత్రంగా అమలులో ఉన్న విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు నడుం బిగించారు. రాష్ట్రంలోనే ఏ జిల్లాలోనూ లేని విధంగా అర్బన్ జిల్లా విలేజ్ ఇన్ఫర్మేషన్ పేరుతో ప్రత్యేక పుస్తకాలను ముద్రించి అర్బన్ జిల్లా పరిధిలోని పోలీస్స్టేషన్లకు అందజేశారు. గ్రామ పోలీసు వ్యవస్థ అంటే.. నేరాలను నియంత్రించాలన్నా, నేరస్తులను పట్టుకోవాలన్నా ప్రజల భాగస్వామ్యం ఆశించిన స్థాయిలో లేకుంటే సత్ఫలితాలు తక్కువగా ఉంటాయి. అందుచేత పోలీసు వ్యవస్థను ప్రజలకు చేరువ చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే గ్రామ పోలీసు వ్యవస్థ. ప్రతి స్టేషన్ హౌసింగ్ అధికారి తన పరిధిలో ఉన్న ప్రతి గ్రామానికి ఒక పీసీ, హెచ్సీని గ్రామ పోలీసు అధికారిగా నియమించి వారి ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని వినియోగించుకోవడం ఈ గ్రామ పోలీసు వ్యవస్థ ఉద్దేశం. వ్యవస్థ ముఖ్య ఉద్దేశాలు.. పోలీసు సేవలను ప్రజలకు చేరువ చేయడం. చట్టాలపై అవగాహన కల్పించడం. స్వచ్ఛందంగా ప్రజలు పోలీసు విధులకు సహకరించేలా తయారుచేయడం. ప్రజలను నేరాల బారిన పడకుండా కాపాడటం. నేర నియంత్రణకు, నేరస్తులను గుర్తించుటకు ప్రజలను సంసిద్ధం చేయటం. గ్రామాల్లోని సంఘ వ్యతిరేక శక్తులపైనా, చెడు నడత కలిగిన వారిపైనా క్షేత్ర స్థాయిలో నిఘా ఏర్పాటు చేయడం. కులాలు, మతాలు, వర్గాల వారీగా విభేదాలు, గొడవలు రాకుండా ఐకమత్యంగా ఉండేలా చేయడం. గ్రామంలోకి వచ్చే కొత్త వారిపై, అనుమానితులపై, వారికి సహకరించే వారిపై నిఘా పెట్టడం. గతంలో శిక్ష పడిన వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టడం. నేరస్తులను త్వరితగతిన అరెస్టు చేసేలా సహకరించడం. గ్రామంలో జరిగే అన్ని విషయాల పట్ల సమాచారాన్ని సేకరించి దానిపై విశ్లేషణ చేసి, తదనంతరం ఎస్‌హెచ్‌వోతో చర్చించి తగు చర్యలు తీసుకోవడం. గ్రామ స్థాయిలో ఉన్న వివిధ శాఖల అధికారుల నుంచి పోలీసు విధులకు సహకారాన్ని తీసుకోవడం. వ్యవస్థ వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు.. పోలీసు సేవలను గ్రామస్థాయిలో ప్రజలు పొందడం. గ్రామస్థాయిలోనే ఫిర్యాదులను అందించడం. మధ్యవర్తి వ్యవస్థను నియంత్రించి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లేందుకు, నేర సమాచారాన్ని, నేరస్తుల వివరాలను తేలికగా ప్రజలు పోలీసులకు అందించేందుకు వీలుగా ఉంటుంది. మంచి ఫలితాలుంటాయి: గ్రామ పోలీసు వ్యవస్థ వల్ల మంచి ఫలితాలు ఉంటాయి, అటు ప్రజలకు, ఇటు ఎస్‌హెచ్‌వోలకు ఎంతగానో ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ప్రజలకు, పోలీసులకు మధ్య సన్నిహిత సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు, నేరాల నియంత్రణకు, నేర పరిశోధనకు, నేరగాళ్లను అరెస్టు చేసేందుకు దోహదపడుతుంది. - సీహెచ్ ప్రతాప్‌కుమార్,ప్రత్తిపాడు,ఎస్ఐ -
భూ మాఫియాపై ఉక్కుపాదం
అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ మంగళగిరి : గుంటూరు, మంగళగిరిలతో పాటు అర్బన్ జిల్లా పరిధిలో భూ మాఫియా ఎక్కువైందని, వీటికి పాల్పడేవారిపై రౌడీషీట్లు తెరిచి, పీడీ యాక్ట్ అమలు చేస్తామని అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ పేర్కొన్నారు. పట్టణ పోలీసుస్టేషన్‌ను గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ భూ మాఫియాను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. భూముల ఆక్రమణ, దౌర్జన్యాల్లో ఎంతటి వారున్నా కఠిన చర్యలు తప్పవన్నారు. అర్బన్ జిల్లా పరిధిలో సిబ్బంది కొరత వుందని, రోజు రోజుకి క్రైమ్‌రేటు పెరుగుతోందన్నారు. సిబ్బంది రిక్రూట్మెంట్ తోపాటు రూరల్ నుంచి కొంతమంది సిబ్బందిని తీసుకుని నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ మధ్య కాలంలో ప్రకాశం బ్యారేజి వద్ద చోటుచేసుకుంటున్న పలువురి ఆత్మహత్యల నేపథ్యంలో అక్కడ 24 గంటల నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. బ్యారేజ్‌పైన, దిగువన ప్రత్యేక లైటింగ్ , ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆత్మహత్యల నివారణతోపాటు అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రకాశం బ్యారేజి నుంచి కనకదుర్గవారధి వరకు ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సమన్వయంతో నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. చైన్‌స్నాచింగ్‌ల నియంత్రణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. గతంలో చైన్‌స్నాచింగ్‌లు పాతనేరస్తులు చేసేవారని.. ఇప్పుడు జల్సాలకు అలవాటుపడి ఉన్నత చదువులు చదివిన యువకులు ఈ తరహా నేరాలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. చైన్‌స్నాచింగ్‌లు, బ్యాంకుల వద్ద నగదు కాజేసే వారిని పట్టుకునేందుకు ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట పట్టణ సీఐ రావూరి సురేష్‌బాబు, ఎస్ఐలు జిలానిబాషా, కృష్ణయ్య, సిబ్బంది ఉన్నారు. -
కలెక్టర్, జేసీ బదిలీకి రంగం సిద్ధం
సాక్షి ప్రతినిధి, కాకినాడ :జిల్లాలో ఇద్దరు ఐఏఎస్‌ల బదిలీకి రంగం సిద్ధమవుతోంది. ఒకరు బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తికావడంతో బదిలీ అనివార్యమవుతుండగా, మరొకరు జిల్లాకు వచ్చి ఏడాది పూర్తి అయ్యిందో లేదో సాగనంపేందుకు నేతలు పావులు కదుపుతున్నారు. నిజాయితీగా పనిచేస్తుండడమే ఆ అధికారి చేసిన తప్పు అయింది. వీరిలో ఒకరు జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్. మరొకరు జాయింట్ కలెక్టర్ రేవు ముత్యాలరాజు. వీరిద్దరూ తాజాగా రూపొందించిన బదిలీల జాబితాలో ఉన్నారు.కలెక్టర్‌గా నీతూకుమారి జిల్లాకు వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అయింది. ఆమె 2012 ఫిబ్రవరి 25న జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. జిల్లాకు తొలి మహిళా కలెక్టర్‌గా ఆమె వచ్చారు. నీతూకుమారితో పాటు ఆమె భర్త రాజేష్‌కుమార్ ఏపీఎస్పీ కాకినాడ 3వ బెటాలియన్ కమాండెంట్‌గా వచ్చారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా ఆయన గుంటూరు అర్బన్ జిల్లాకు ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆయన ఇక్కడి నుంచి రిలీవ్ అయ్యారు. ఈ క్రమంలో కలెక్టర్ నీతూకుమారి కూడా బదిలీ కానున్నారని అధికారవర్గాల సమాచారం. భర్త గుంటూరు జిల్లాలో పనిచేస్తుండడంతో ఆమెను గుంటూరు లేదా, కృష్ణాజిల్లాకు బదిలీ చేయనున్నారని కలెక్టరేట్ వర్గాల ద్వారా తెలియవచ్చింది. రాష్ట్ర విభజనతో ఐఏఎస్‌ల నుంచి ఆప్షన్లు కోరిన సందర్భంలో నీతూకుమారి తెలంగాణ కోసం ఆప్షన్ ఇచ్చారని సమాచారం. ఇంతలో భర్త రాజేష్‌కుమార్ గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీగా వెళ్లడంతో ఆమె కూడా ఆ పరిసర జిల్లాలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారని తెలియవచ్చింది. ఇందుకు అనుగుణంగా గుంటూరు, కృష్ణాజిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం ఆరా తీస్తున్నారని చెబుతున్నారు. వారం, పది రోజుల్లో బదిలీపై స్పష్టత వస్తుందని సమాచారం.కాగా, కలెక్టర్ కంటే ముందే జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజును సాగనంపాలని అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఐఏఎస్‌లో టాప్ ర్యాంకర్, బీసీ సామాజికవర్గానికి చెందిన ముత్యాలరాజు అధికార పార్టీ నాయకులు చెప్పే అడ్డగోలు పనులు చేయడానికి అంగీకరించకపోవడంతోనే కక్షకట్టి ఆయన బదిలీ కోసం ప్రయత్నిస్తున్నారని కలెక్టరేట్ వర్గాలు కోడైకూస్తున్నాయి. జేసీగా ఇక్కడ బాధ్యతలు స్వీకరించి ఏడాది కాలం పూర్తి అయ్యిందో లేదో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతల ఆగ్రహానికి గురైన ఆయనకు బదిలీ వేటు తప్పేట్టు కన్పించడం లేదు. రంగారెడ్డి జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తూ జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా 2013 జూలై ఒకటిన ముత్యాలరాజు వచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చీరాగానే కాకినాడ, రాజమండ్రి సహా పలు ప్రధాన ప్రాంతాల్లో తెలుగుతమ్ముళ్లు సాగించిన భూ కబ్జాలపై కొరడా ఝుళిపించడంతో నేతలు జేసీపై గత కొంతకాలంగా గుర్రుగా ఉన్నారు. ఇటీవల జిల్లావ్యాప్తంగా రేషన్ డిపోలకు నిర్వహించిన రాతపరీక్ష, ఇంటర్వ్యూలలో కర్రపెత్తనం చేసి అనుయాయులకు రేషన్ షాపులు కట్టబెట్టాలనే నేతల ప్రయత్నాలకు జేసీ అడ్డుకట్ట వేశారు. రేషన్‌డిపోల భర్తీలో ‘చౌకడిపోలకు పచ్చముద్ర’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై జేసీ స్పందించి రాజమండ్రి, కాకినాడ రెవెన్యూ డివిజన్లలో చౌకధరల దుకాణాల నియామకాలను రద్దు చేశారు. ఈ పరిణామం అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేల ఆగ్రహానికి కారణమైంది. ఆ క్షణం నుంచి జాయింట్ కలెక్టర్‌ను సాగనంపేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. జేసీ ఇక్కడే ఉంటే తమ ఆటలు సాగవనే అభిప్రాయానికి వచ్చిన నేతలు కత్తికట్టి బదిలీ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. జేసీ కూడా వెళ్లిపోయేందుకైనా సిద్ధపడుతున్నారు తప్పితే వారు చెప్పే అడ్డగోలు పనులు చేసేందుకు సుముఖంగా లేరని కలెక్టరేట్ వర్గాలు చెబుతున్నాయి. -
జిల్లాకు కొత్త ఎస్పీలు
ఏటీఅగ్రహారం (గుంటూరు): జిల్లాలోని ముగ్గురు ఎస్.పిలు బదిలీ అయ్యారు. ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా గుంటూరు అర్బన్ ఎస్పీ జెట్టి గోపీనాథ్ తిరుపతి అర్బన్ ఎస్పీగా, గుంటూరు రూరల్ ఎస్పీ జక్కంశెట్టి సత్యనారాయణ హైదరాబాద్‌లోని ఇంటెలిజెన్స్ విభాగానికి వెళుతున్నారు. విజిలెన్స్,ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డిని బదిలీ చేసినా పోస్టింగ్ ఎక్కడనేది పేర్కొనలేదు. నూతన ఎస్పీలు వీరే... కాకినాడ 3వ ఏపీఎస్పీ బెటాలియన్‌లో కమాండెంట్‌గా పనిచేస్తున్న ఎస్పీ రాజేష్‌కుమార్‌ను గుంటూరు అర్బన్ ఎస్పీగా నియమించారు. చిత్తూరు జిల్లా ఎస్పీ సీహెచ్ రామకృష్ణను గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీగా నియమించారు. హైదరాబాద్‌లోని సీఐడీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఎస్పీ కేవీ మోహన్‌రావును గుంటూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మోహన్‌రావు 2011 మార్చి నుంచి 2012 ఏప్రిల్ వరకూ విజిలెన్స్ ఎస్పీగా ఇక్కడే పనిచేశారు. 2012లో ఐపీఎస్ గుర్తింపునిచ్చి మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కమాండెంట్‌గా పంపారు. 2009 బ్యాచ్‌కు చెందిన ఎస్పీ జెట్టి గోపీనాథ్ 2012 మార్చిలో అర్బన్ జిల్లా ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. గత ఏడాది నవంబర్‌లో ఎస్పీగా పదోన్నతి పొందారు. సమర్థ అధికారిగా గుర్తింపు పొందారు. 2003 బ్యాచ్‌కు చెందిన జె. సత్యనారాయణ 2012 ఏప్రిల్ 16న రూరల్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా సమర్థంగా పనిచేశారు. ఇటీవల నల్లమల అటవీప్రాంతంలో మావోయిస్టుల జిల్లాకమిటీ సభ్యుడు జానాబాబురావుతోపాటు మరో ఇద్దరు మావోయిస్ట్‌లను మట్టుబెట్టి కొత్త రిక్రూట్మెంట్లు జరగకుండా చూడటంలో కీలకపాత్ర పోషించారు. జిల్లాలోని రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన ఆర్.ఎన్. అమ్మిరెడ్డి 2012 నవంబర్ 5వ తేదీన నల్గొండ నుంచి బదిలీపై వచ్చి గుంటూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. విధుల్లో చేరినప్పటి నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. అనేక మంది ప్రజాప్రతినిధులు కలుగజేసుకుని చెప్పినప్పటికీ ఎక్కడా తొణక్కుండా విధులు నిర్వహించారు. -
తప్పుల తడక
ఇందూరు : జిల్లాకు మంజూరు అయిన 66 పంచాయతీ కా ర్యదర్శుల పోస్టుల భర్తీకి పంచాయతీ శాఖ అధికారులు చేసిన కసరత్తులో తీవ్రంగా త ప్పులు దొర్లాయి. కొందరి కులా ల పేర్లు మారగా, ఇంకోచోట మహిళలకు కేటాయించిన పోస్టులో మగవారు ఎంపికయ్యారు. నియామకాల విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నామని, అందుకే జాబితా వెల్లడిలో జాప్యం జరుగుతోందని అధికారులు చెప్పినప్పటికీ ఈ తప్పులు చోటు చేసుకోవడం గమనార్హం. తప్పులను గుర్తించినా, సరిదిద్దకుండా ఈ నెల 21న ధ్రువీకరణ పత్రాల పరిశీలన కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితాను బహిర్గతం చేశారు. పరీక్ష రాసి మెరిట్ మార్కులు సాధించినా ఉద్యోగం దక్కకపోవడంతో అనుమా నం వచ్చిన పలువురు అభ్యర్థులు మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి వచ్చారు. తమకు ఎందుకు ఫోన్ చేయలేదని సంబంధిత అధికారులను ఆ రా తీశారు. కార్యాలయం వెల్లడించిన జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో అసంతృప్తి చెంది, తమకు న్యాయం చేయాలని డీపీఓను కోరారు. ఇదీ జరిగింది పంచాయతీ అధికారులు ప్రకటించిన 66మంది అభ్యర్థుల జాబితాలో తప్పులు దొర్లాయని స్పష్టంగా కనిపిస్తోంది. ఓసీ కులానికి చెందిన బి. నవనీత అనే అభ్యర్థికి 208 మార్కులు వచ్చాయి. కానీ ఆమెను బీసీ-ఏలో చేర్చారు. రాజేశ్‌కుమార్ అనే అభ్యర్థి మహిళా విభాగంలో ఎంపికైనట్టు జాబితాలో చేర్చారు. దీంతో అక్కడ ఎంపిక కావలసిన జయశ్రీ అనే అభ్యర్థికి అన్యాయం జరిగింది. దీనిని బట్టి అధికారులు ఎంత నిర్లక్ష్యంగా జాబితాను తయారు చేశారో ఊహించుకోవచ్చు. జనరల్ కేటగిరీలో 19 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 6 పోస్టులు ఉన్నాయి. జనరల్ కేటగిరీ పోస్టులకు మెరిట్ మార్కులు సాధించిన మొదటి 19 మందిని ఎంపిక చేశారు. ఇందులో ఒక ఎస్సీ అభ్యర్థి కూడా ఉన్నారు. ఎస్సీ కేటగిరీలో కూడా ఆయన ఎంపిక అయినట్టు చూపించారు. రెండు కేటగిరీలలో ఒకే అభ్యర్థి ఎలా ఎంపిక అవుతాడో అధికారులకే తెలియాలి. ఫలితంగా తరువాత మెరిట్ మార్కులు కలిగిన వేల్పూర్ మండలం పడిగెల గ్రామానికి చెందిన లోలం రాజేష్‌కు అన్యాయం జరిగింది. వికలాంగుల కోటాలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను కార్యాలయంలో ప్రదర్శించలేదు. తమకు జరిగిన అన్యాయం విషయంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని బాధిత అభ్యర్థులు పేర్కొన్నారు. -
సివిల్స్ సర్వీస్ విజేతకు మోడీ అభినందన!
Congratulated Rajesh Kumar, son of a PMO staff member, on clearing civil services exam. A proud accomplishment! pic.twitter.com/wLlDEe4FQ7— Narendra Modi (@narendramodi) June 25, 2014 న్యూఢిల్లీ: సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణుడైన విద్యార్ధి రాజేశ్ కుమార్ ను ప్రధాని నరేంద్రమోడీ అభినందించారు. ప్రధానమంత్రి కార్యాలయంలో సేవలందిస్తున్న ఓ ఉద్యోగి కుమారుడు సివిల్స్ పరీక్షలో ఉత్తమ ర్యాంకును సంపాదించుకున్నారు. బుధవారం సౌత్ బ్లాక్ లోని ప్రధాని కార్యాలయంలో మోడీని రాజేశ్ కుమార్ కలుసుకున్నారు. గొప్ప ఘనతను సాధించావని, యువతకు సూర్తిని అందించేలా సేవలందించాలని రాజేశ్ కుమార్ ను అభినందించినట్టు ప్రధానమంత్రి కార్యాలయం ట్విటర్ లో ఓ సందేశంతోపాటు ఫోటోను పోస్ట్ చేసింది. -
ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం
పోచమ్మమైదాన్, న్యూస్‌లైన్ : తెలంగాణ ఉ ద్యోగులు ఐక్యతగా ఉన్నప్పుడే సమస్యల ప రిష్కారం సాధ్యమవుతుందని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు రాజేష్ కుమార్ అన్నారు. వరంగల్ ములుగు రోడ్డు సమీపంలోని ప్ర భుత్వ ఐటీఐలో టీఎన్జీవోస్ ఉపాధి శిక్షణ శా ఖ బ్రాంచ్ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశంలో ముఖ్యఅతిథిగా రా జేష్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగులకు రక్ష ణ కవచంగా టీఎన్జీవోస్ నిలుస్తుందని తెలి పారు. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన ఉద్యోగులు ఆవిర్భావ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. జిల్లా కార్యదర్శి రత్నావీచారి మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టి కి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో రత్నాకర్‌రెడ్డి, రాజేందర్, వెంకటేశ్వర్ రావు, సాంబారి సుదర్శన్ పాల్గొన్నారు. అనంతరం టీఎన్జీవోస్ ఉపాధి శిక్షణ శాఖ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ ఇదే... టీఎన్జీవోస్ ఉపాధి శిక్షణ శాఖ బ్రాంచ్ నూత న కమిటీ వివరాలిలా ఉన్నాయి. జిల్లా అధ్యక్షుడిగా కె.సమ్మయ్య, ఉపాధ్యక్షులుగా కుమారస్వామి, సీహెచ్.రవీందర్, రజిత, ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా శ్రీనివాసరావు, జగన్మోహన్ సింగ్, జయ, కోశాధికారిగా భాస్కర్, ఆర్గనైజింగ్ సె క్రటరీగా నరేందర్, ప్రచార కార్యదర్శిగా విజ య్‌కుమార్, ఈసీ మెంబర్లుగా ఆదిత్య, రమే ష్, రజిత, జాయికెరల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీ 2014 నుంచి 2017 సం వత్సరం వరకు అమలులో ఉంటుంది. కమిటీని ప్రకటించిన అనంతరం బాధ్యులు ఐటీఐల జిల్లా కన్వీనర్, వరంగల్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ సాంబారి సుదర్శన్‌ను మార్యదపూర్వకంగా కలిశారు. -
హెచ్‌డీఏఏ అధ్యక్షుడిగా రాజేష్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ (హెచ్‌డీఏఏ) నూతన అధ్యక్షుడిగా ఓయూ ప్రొఫెసర్ రాజేష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా బి.చంద్రభాస్కర్‌రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్‌గా బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి నియమితులయ్యారు. హెచ్‌డీఏఏ కార్యవర్గం సమావేశం మంగళవారం ఒలింపిక్ భవన్లో జరిగింది. ఈ కొత్త కార్యవర్గం 2018 వరకు కొనసాగుతుంది. కార్యవర్గం: ఎం.లక్ష్మణ్‌రెడ్డి(చీఫ్ ప్యాట్రన్), ఎ.నరసింహారెడ్డి (చైర్మన్), రాజేష్ కుమార్ (అధ్యక్షుడు), వై. శ్రీనివాస్‌రావు, ఎ.జేవియర్, టి.రమేష్ సింగ్, కె.లక్ష్మీపతి, ఎస్.జయరామ్, డి.వేణు గోపాల్ (వీరంతా ఉపాధ్యక్షులు), బి.చంద్ర భాస్కర్ (కార్యదర్శి), కె.ఎం. కిస్టీ (నిర్వాహక కార్యదర్శి), ఎస్,కె.మిశ్రా, బికాష్ కరార్, అమ్రాయిల్ సింగ్, కె.ప్రవీణ్ కుమార్, ఎం.ఎలీషా(సంయుక్త కార్యదర్శులు), ఎ.సోమేశ్వర్ రావు (కోశాధికారి). కార్యవర్గ సభ్యులుగా ఎం.బాబురావు, పి.అశోక్, వి.విజేందర్‌రెడ్డి, ఆదర్శ గోస్వామి, జి.బాలరాజ్, పి.నారాయణ, టి.ప్రేమావతి సింగ్, డాక్టర్ జె.సందీప్, పి. సాల్మాన్, జె.సంజీవ, సి.ఆర్.భీమ్ సింగ్, వెంకటేశ్వర్రావు, జి.ఎస్.ప్రభు కిరణ్, జె.మేషక్ బాబు, వి.రవీందర్ నియమితులయ్యారు. -
‘భారతరత్న’కు సచిన్ అర్హుడే
చెన్నై, సాక్షి ప్రతినిధి: భారతరత్న అవార్డుకు సచిన్ అర్హుడేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. సచిన్‌కు ప్రకటించిన ఈ అవార్డు నిబంధనలకు వ్యతిరేకమంటూ మద్రాస్ హైకోర్టులో ఇటీవల న్యాయవాది కనకసబై ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయగా సోమవారం కేంద్రం తమ వాదనను వినిపించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజేష్‌కుమార్, న్యాయమూర్తి రవిచంద్రబాబుతో కూడిన బెంచ్ సోమవారం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ అదనపు సొలిసిటర్ పి.విల్సన్ ఒక ప్రకటనను సమర్పించారు. సాహిత్య, సాంస్కృతిక, శాస్త్ర సాంకేతిక రంగాలతోపాటు ఇతర రంగాల్లో విశిష్ట నైపుణ్యాన్ని కనబరిచిన వారికి సైతం భారతరత్న అవార్డును ప్రదానం చేయవచ్చంటూ 2011 నవంబరు 16న రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారని ఇందులో పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు కేసును మంగళవారానికి వాయిదా వేశారు. -
రెవెన్యూ శాఖలో బదిలీలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలోని రెవెన్యూ విభాగంలో బదిలీల వ్యవహారానికి ఎట్టకేలకు తెరపడింది. ఊహించిన ట్లే భారీ సంఖ్యలో తహసీల్దార్లకు స్థానచలనం కల్పించారు. ఒత్తిళ్లు వస్తాయని ముందే పసిగట్టిన అధికారులు బదిలీల ఉత్తర్వులను తహసీల్దార్ల చేతిలో పెట్టే వరకూ విషయం బయటకు పొక్కకుండా గోప్యం పాటించారు. మూడు రోజులపాటు కసరత్తు చేసినప్పటికీ ఒకటి, రెండు పోస్టింగ్‌ల విషయంలో ఒత్తిళ్లకు తలొగ్గక తప్పలేదని రెవెన్యూ ఉద్యోగుల ద్వారా తెలిసింది. బదిలీ అయిన 26 మందిలో 19 మంది తహసీల్దార్లు ఉండగా.... ఏడుగురు డిప్యూటీ తహసీల్దారు ఉన్నారు. అయితే పని ఒత్తిళ్ల దృష్ట్యా ఏడుగురు డీటీల్లో ఆరుగురికి అఫీషియేటింగ్పై తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ బదిలీ చేశారు. ఒక డీటీకి అదే హోదాపై స్థానచలనం గావించారు. ఉదయం 7 గంటల నుంచే ఫోన్ కాల్స్ బదిలీల ప్రక్రియకు సంబంధించిన తతంగాన్ని మంగళవారం రాత్రి ముగించిన అధికారులు... స్థానచలనం పొందిన అధికారులకు బుధవారం ఉదయం డీఆర్ఓ సీసీ ద్వారా సమాచారం ఇచ్చారు. సుమారు 7 గంటల నుంచి అందరికీ ఫోన్ కాల్స్ ప్రారంభమయ్యాయి. ‘సార్.. డ్రాట్, ఎలక్షన్స్‌పై కలెక్టర్ ఆర్డ్‌ర్స్ ఇచ్చారు... ఉదయం 9.30 గంటలకు డీఆర్ఓ కార్యాలయంలో విధిగా తీసుకోవాలి’ అని వర్తమానం అందింది. ఈ మేరకు ఒక్కొక్కరు వచ్చేసరికే బదిలీ ఉత్తర్వులు సిద్ధం చేసి అందించారు. ఉత్తర్వులు అందుకునే వరకూ అసలు విషయం తెలియకపోవడంతో కొందరు తహసీల్దార్లు ఓకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. కలెక్టర్‌ను కలిసిన ఉద్యోగ సంఘాలు బదిలీల విషయంలో తమ అభ్యర్థనలు పరిశీలించాలని కోరుతూ జిల్లా ఉద్యోగ సంఘాల నేతలు పరిటాల సుబ్బారావు, రాజేష్‌కుమార్, కుమారస్వామి తదితరులు కలెక్టర్‌ను కలిశారు. సంఘం ప్రతినిధులుగా ఉన్నవారికి సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు వారి విజ్ఞప్తిని కలెక్టర్ పరిగణనలోకి తీసుకుంటే... తుది జాబితాలో ఒకటి, రెండు మార్పులు జరిగే అవకాశముంది. త్వరలో డీటీల బదిలీలు ? ప్రస్తుతం భారీ సంఖ్యలో తహసీల్దార్లను బదిలీ చేసిన యంత్రాంగం... త్వరలో డిప్యూటీ తహసీల్దార్లకు స్థానచలనం కల్పించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అఫీషియేటింగ్ వల్ల ఖాళీ అయిన స్థానాలను సర్దుబాటు చేయాల్సి ఉంది. అదేవిధంగా అధికారుల వద్ద నెలల కాలంగా పెండిగ్లో ఉన్న అర్జీలను పరిశీలించే అవకాశం ఉంది.