Congratulated Rajesh Kumar, son of a PMO staff member, on clearing civil services exam. A proud accomplishment! pic.twitter.com/wLlDEe4FQ7
— Narendra Modi (@narendramodi) June 25, 2014
న్యూఢిల్లీ: సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణుడైన విద్యార్ధి రాజేశ్ కుమార్ ను ప్రధాని నరేంద్రమోడీ అభినందించారు. ప్రధానమంత్రి కార్యాలయంలో సేవలందిస్తున్న ఓ ఉద్యోగి కుమారుడు సివిల్స్ పరీక్షలో ఉత్తమ ర్యాంకును సంపాదించుకున్నారు.
బుధవారం సౌత్ బ్లాక్ లోని ప్రధాని కార్యాలయంలో మోడీని రాజేశ్ కుమార్ కలుసుకున్నారు. గొప్ప ఘనతను సాధించావని, యువతకు సూర్తిని అందించేలా సేవలందించాలని రాజేశ్ కుమార్ ను అభినందించినట్టు ప్రధానమంత్రి కార్యాలయం ట్విటర్ లో ఓ సందేశంతోపాటు ఫోటోను పోస్ట్ చేసింది.
సివిల్స్ సర్వీస్ విజేతకు మోడీ అభినందన!
Published Wed, Jun 25 2014 4:10 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement