ఈ ఆదివారం ఎస్‌బీఐ పనిచేస్తుంది | SBI functioning this Sunday | Sakshi
Sakshi News home page

ఈ ఆదివారం ఎస్‌బీఐ పనిచేస్తుంది

Published Tue, Jul 19 2016 7:39 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

ఈ ఆదివారం ఎస్‌బీఐ పనిచేస్తుంది

ఈ ఆదివారం ఎస్‌బీఐ పనిచేస్తుంది

చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహమందించే లక్ష్యంతో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా రానున్న ఆదివారాన్ని (జూలై 24) ఎస్‌ఎంఈ సండేగా ప్రకటించింది. హైదరాబాద్ పరిధిలోని శాఖలన్నీ ఆ రోజున పనిచేస్తాయని ఎస్‌బీఐ డీజీఎం రాజేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

 

స్టార్టప్ ఇండియా, స్టాండ్‌అప్ ఇండియా కార్యక్రమాలకు ఊతమిచ్చే లక్ష్యంతో దీన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. జూలై 24న ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ బ్యాంకు శాఖలు తెరిచి ఉంటాయని, స్టార్టప్‌లతోపాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అన్ని రుణాల వివరాలు తెలుసుకోవాలనుకునే వారు బ్యాంకు అధికారులను సంప్రదించవచ్చునని ఆయన చెప్పారు. విశాఖపట్నంలో ఈ తరహా కార్యక్రమాన్ని ఇటీవలే విజయవంతంగా నిర్వహించామని, హైదరాబాద్‌లోని ఔత్సాహికులు కూడా ఎస్‌ఎంఈ సండేను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement