Startup India
-
‘స్టార్టప్ ఇండియా’ లోపభూయిష్టం
గోధ్రా(గుజరాత్): కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచి్చన ‘స్టార్టప్ ఇండియా’ విధానం సరిగ్గా లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ విధానం ఫలితంగా దేశంలో ఒక్కటంటే ఒక్క స్టార్టప్ కూడా లేదన్నారు. ఉన్నవి కూడా విదేశీ సంస్థల నియంత్రణలోనే నడుస్తున్నాయన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర శుక్రవారం గుజరాత్‌లోని గోధ్రాకు చేరుకుంది. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన సభలో రాహుల్ మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే స్టార్టప్‌లకు ఊతమిచ్చేందుకు రూ.5 వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా, 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. బడా పారిశ్రామిక వేత్తలకు రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం రైతులు, విద్యార్థులు, కారి్మకులను మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జోడో యాత్ర గురువారం రాజస్తాన్ నుంచి దహోద్ వద్ద గుజరాత్లో ప్రవేశించింది. రాత్రి దాహోద్‌లో బస చేశారు. శుక్రవారం ఉదయం ఆయన ఝాలోడ్ పట్టణ సమీపంలోని కుంబోయి దామ్‌లో గిరిజనులకు ఆరాధ్యుడైన గోవింద్ గురుకు నివాళులర్పించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పార్టీ మహిళా కార్యకర్తలు అందజేసిన భారీ కేక్‌ను తన ఎస్యూవీ పైనుంచే రాహుల్ కట్ చేశారు. గోధ్రాకు వస్తూ శివాలయంలో ఆయన పూజలు చేశారు. గోధ్రా నుంచి సాయంత్రం పావగఢ్‌కు చేరుకుని మా కొడియార్ ఆలయంలో పూజలు చేశారు. పంచ్‌మహల్ జిల్లా జంబుఘోడా గ్రామంలో రాత్రి బస చేశారు. -
1.14 లక్షల స్టార్టప్‌లు..
ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి 1,14,902 సంస్థలను స్టార్టప్‌లుగా గుర్తించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. 2016 జనవరిలో ప్రవేశపెట్టిన స్టార్టప్ ఇండియా యాక్షన్ ప్లాన్ కింద ప్రయోజనాలను పొందడానికి అర్హత కలిగిన సంస్థలకు అవకాశం కలి్పంచినట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు, అమెరికా, హాంకాంగ్, చైనా వంటి ఎగుమతి దేశాల్లో డిమాండ్ మందగించడం, ముడి పదార్థాల ధరల పెరుగుదల వంటివి రత్నాభరణాల పరిశ్రమకు సవాళ్లుగా మారాయని వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ చెప్పారు. 2022–23లో రత్నాభరణాల ఎగుమతులు అంతక్రితం ఏడాదిలో నమోదైన 39.27 బిలియన్ డాలర్లతో పోలిస్తే సుమారు 3 శాతం క్షీణించి 38.11 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు వివరించారు. -
అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్!
ప్రముఖ ఈకామర్స్ బ్రాండ్ మింత్రా సీఈఓగా అనంత్ నారాయణన్ ఇప్పటికే కార్పొరేట్ వర్గాల్లో పాపులర్. కీలక పదవిలో ఉన్నప్పటికీ తన సొంత కంపెనీ ప్రారంభించే సాహసం చేయడమే కాదు ఆరునెలల్లో ఏకంగా రూ. 9,900 కోట్లకుపైగా సంపదను సాధించడం విశేషం. అతి తక్కువ సమయంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ యూనికార్న్‌గా బిలియన్ డాలర్ల కంపెనీ మెన్సా బ్రాండ్స్ వ్యవస్థాపకుడిగా, రికార్డు సృష్టించిన అనంత్ నారాయణన్ సక్సెస్ స్టోరీ...! కేవలం రెండేళ్ళ వ్యవధిలో రెండు పెద్ద బ్రాండ్ల వ్యవస్థాపకుడిగా ఎంటర్ప్రెన్యూర్ జర్నీని ప్రారంభించిన ఘనత అనంత్నారాయణన్ది. భారతదేశంలో స్టార్టప్‌లకు ఆదరణ లభిస్తున్న సమయంలో అనంత్ నారాయణన్ తన దృష్టిని అటువైపు మళ్లించారు. సౌకర్యవంతమైన పదవిని వదిలేసి భారతదేశపు తొలి ఈ-కామర్స్ 'యునికార్న్' ఆవిష్కారానికి పూనుకున్నారు. కోవిడ్-19 మహమ్మారి అనంతరం 2021లో మే నెలలో మెన్సా కంపెనీని స్థాపించారు. ఈ వెంచర్ ఒక నెలలోనే తొలి ఫండింగ్‌గా 50 మిలియన్ల డాలర్లను అందుకుంది. ఆరువాతి ఐదు నెలలకే 135 మిలియన్ల డాలర్ల నిధులను సేకరించిన తర్వాత కంపెనీ వాల్యూ బిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం. (స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు) Too many flights this week. Mumbai- bangalore- Coimbatore - Delhi - Mumbai - bangalore ! #startuplife pic.twitter.com/mKq17QVRvC — Ananth Narayanan (@ANarayanan24) February 3, 2023 అనంత్ మద్రాస్ మిచిగాన్ విశ్వవిద్యాలయాల నుండి ఉన్నత విద్యాను అభ్యసించారు . ప్రముఖ మెకిన్సే కంపెనీకి కీలక పదవుల్లో పనిచేశారు. ఆ తర్వాత ఫ్యాషన్ రీటైలర్ మింత్రాకి సీఈవోగాను పనిచేశారు. సీఈవోగా అధిక జీతం ఇచ్చే ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరీ మెడ్‌లైఫ్.కామ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓగా ఉన్నారు. అయితే అనంత్ తొలి వెంచర్‌ను ఫార్మసీ కొనుగోలు చేసింది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!) అమెరికన్ యునికార్న్ ప్రేరణతో అనంత్ మెన్సా అనే సొంత బ్రాండ్‌తో ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టారు. ముఖ్యంగా చిన్న వ్యాపారుల ఉత్పత్తులను ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా విక్రయిస్తుంది. మెన్సా అనే పదానికి గ్రీకులో కాన్స్టెలేషన్ అని అర్థం. డిజిటల్-ఫస్ట్ బ్రాండ్ల క్లస్టర్ మోడల్‌గా మెన్సాను తీర్చి దిద్దారు. డజనుకు పైగా బ్రాండ్లతో భాగస్వామ్యం కలిగి ఉంది. సంవత్సరానికి 100శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. ప్రారంభించిన ఆరు నెలల్లోనే బిలియన్ డాలర్లు, అంతకంటే ఎక్కువ విలువైన భారతీయ యునికార్న్ గ్రూపులో అత్యంత వేగంగా ప్రవేశించిన స్టార్టప్‌గా నిలిచింది.ఇప్పటికే డజన్ల బ్రాండ్లను కొనుగోలు చేసింది.మెన్సా తన పోర్ట్‌ఫోలియో వృద్ధికి నిధులను ఉపయోగించాలని భావిస్తోందని ఇటీవల నారాయణన్ స్వయంగా వెల్లడించారు. ఇలాంటి మరెన్నో సక్సెస్ స్టోరీలు, ప్రేరణాత్మక కథనాలకోసం చదవండి: సాక్షి బిజినెస్ -
టి హబ్‌కు స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆవిష్కరణల వాతావరణానికి దిక్సూచిగా ఉన్న ‘టి హబ్’కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్’ పథకానికి ఎంపికైంది. కేంద్ర పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ఈ పథకం కింద అర్హత కలిగిన స్టార్టప్‌లకు రూ.5 కోట్లు విడుదల చేస్తుంది. ప్రాథమిక స్థాయిలో ఉన్న స్టార్టప్‌ల ఆవిష్కరణలకు ఊతమిచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రపంచ స్థాయిలో స్టార్టప్‌లు రాణించేలా వాటికి అవసరమైన అన్ని వసతులు సమకూర్చడంపైనే తాము ప్రధానంగా దృష్టి పెడుతున్నట్టు టి హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస్‌రావు ‘సాక్షి’కి వెల్లడించారు. (క్లిక్: 2 గంటల్లో వంట గ్యాస్ సిలిండర్ డెలివరీ.. నిమిషం ఆలస్యమైనా..) స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్‌కు అర్హత కలిగిన స్టార్టప్‌లను ఎంపిక చేసేందుకు ఇంక్యుబేటర్ సీడ్ మేనేజ్మెంట్ కమిటీ (ఐఎస్ఎంసీ)ని ఏర్పాటు చేస్తున్నట్టు టి హబ్ ప్రకటించింది. రిచ్ డైరక్టర్ జనరల్ అజిత్ రంగ్నేకర్, ఫ్రెష్‌వర్క్స్ కో ఫౌండర్ కిరణ్ దరిసి, మైగేట్ వ్యవస్థాపక బృందం సభ్యుడు వింగ్ కమాండర్ ఆంథోని అనిష్‌తో పాటు పలువురు పెట్టుబడిదారులు, ఎంట్రప్రెన్యూర్లు, విద్యావేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు ఐఎస్ఎంసీలో సభ్యులుగా ఉంటారు. మూడేళ్ల వ్యవధిలో 15 స్టార్టప్‌లకు ఈ పథకం ద్వారా టి హబ్ నిధులు అందజేస్తుంది. ఆసక్తి ఉన్న స్టార్టప్‌లు సీడ్‌ఫండ్ స్టార్టప్ ఇండియా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని టి హబ్ సీఈవో సూచించారు. (క్లిక్: పాస్‌పోర్టు అపాయింట్మెంట్ల కుదింపు) -
రూ.1,000 కోట్లతో స్టార్టప్ సీడ్ ఫండ్
న్యూఢిల్లీ: వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వచ్చే స్టార్టప్‌లకు వెన్నుదన్నుగా నిలిచేందుకు కేంద్రం మరో విడత ప్రత్యేక నిధిని ప్రకటించింది. రూ.1,000 కోట్లతో ‘స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్’ను ఏర్పాటు చేస్తున్నట్టు.. ప్రధాని నరేంద్ర మోదీ ‘స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సు’ ప్రారంభం సందర్భంగా వెల్లడించారు. 2016లో మోదీ సర్కారు స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సును ఆరంభించగా.. ఇది ఈ ఏడాదితో ఐదో వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది. స్టార్టప్‌ల వృద్ధితో ఎన్నో ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, ప్రజల జీవితాల ఉన్నతికి తోడ్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ‘‘స్టార్టప్‌లకు నిధులు అందించేందుకు రూ.1,000 కోట్లతో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నాము. ఇది నూతన స్టార్టప్‌ల ఏర్పాటుకు, వాటి వృద్ధికి సాయపడుతుంది’’ అని మోదీ ప్రకటించారు. ఈ ఫండ్ ఆఫ్ ఫండ్ పథకాన్ని స్టార్టప్‌లకు మూలధన నిధులు అందించేందుకు వినియోగించనున్నట్టు చెప్పారు. ఇకపై స్టార్టప్‌ల రుణ సమీకరణకూ మద్దతు ఉంటుందని ప్రకటించారు. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ (సదుపాయాలు)గా ఉందని తెలియజేస్తూ.. వినూత్నమైన టెక్నాలజీలు, ఆలోచనల తో వచ్చి, పెద్ద సంస్థలుగా అవతరించేందుకు ఇది తోడ్పడుతుందని చెప్పారు. -
‘వి–హబ్’తో మహిళా సాధికారత..
సాక్షి, హైదరాబాద్ : సామాజిక కట్టుబాట్లు, ఆర్థిక స్వాతంత్య్రం, విద్య అందుబాటులో లేకపోవడం తదితర కారణాలతో ఇన్నాళ్లూ మహిళల్లో దాగిఉన్న ప్రతిభ వెలుగుచూడలేదని, మహిళా సాధికారత లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ‘వి–హబ్’ను ఏర్పాటు చేసిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొందరు మహిళా వ్యాపారవేత్తలు మాత్రమే ఉన్నారని, మహిళల్లోని ప్రతిభను ఇటీవల ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు వెలుగులోకి తెస్తున్నాయని కితాబిచ్చారు. ‘వి–హబ్’, స్టార్టప్ ఇండియా సంయుక్త భాగస్వామ్యంలో చేపడుతున్న ‘వింగ్’ కార్యక్రమాన్ని కేటీఆర్ ప్రారంభించారు. కేంద్ర పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణకు చెందిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు అవసరమైన సాయం అందుతుందన్నారు. దేశంలో 14 శాతం మాత్రమే మహిళా వ్యాపారవేత్తలు ఉన్నారని, 95 శాతం స్టార్టప్‌లను పురుషులే నెలకొల్పుతున్నారని చెప్పారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా, గణాంకాల పరంగా చూస్తే సాధించాల్సింది ఎంతో ఉందని వ్యాఖ్యానించారు. మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు రూ.15 కోట్ల కార్పస్ ఫండ్‌తో పాటు రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు గ్రాంటు రూపంలో ఇస్తున్నట్లు వివరించారు. వి–హబ్ పనితీరు స్ఫూర్తిదాయకం రాష్ట్రంలో స్టార్టప్ వాతావరణం పుంజుకోవడంలో వి–హబ్ కీలకపాత్ర పోషిస్తోందని, జీఐజీ ఆస్ట్రేలియన్ హైకమిషన్ వంటి అంతర్జాతీయ సంస్థలతో, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, ప్రాక్టర్ అండ్ గాంబుల్, హెచ్డీఎఫ్సీ వంటి కార్పొరేట్ సంస్థలతో వి–హబ్ భాగస్వామ్యం హర్షణీయమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మహిళా ఎంట్రప్రెన్యూర్స్ తమ ఆలోచనలను ఆచరణలోకి తెచ్చేందుకు అవసరమైన సాధన సంపత్తి సమకూర్చి ఉత్పత్తి దశకు తెచ్చేందుకు అవసరమైన విధానాలను ప్రభుత్వం రూపొందిస్తుందని చెప్పారు. టీఎస్‌ఐపాస్‌లో మహిళలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్న తరహాలో వి–హబ్ ఎంట్రప్రెన్యూర్స్‌కు భూమి, పెట్టుబడి తదితరాలకు సంబంధించి సాయం అందిస్తామన్నారు. స్టార్టప్ ఇండియా భాగస్వామ్యంతో ప్రారంభమైన ‘వింగ్’ కార్యక్రమం మరింత మంది మహిళా ఎంట్రప్రెన్యూర్స్‌ను వెలుగులోకి తెచ్చేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని అనుసరించి స్టార్టప్ ఉత్పత్తులకు తాము మొదటి వినియోగదారుడిగా ఉంటూ, విజయవంతమైతే మరింత ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించారు. వి–హబ్ పురోగతిని సంస్థ సీఈవో దీప్తి రావుల వివరించగా, జాతీయ స్థాయిలో స్టార్టప్ అవార్డులను అందజేశారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, స్టార్టప్ ఇండియా హబ్ సీనియర్ మేనేజర్ జస్లీన్ లాంబా తదితరులు పాల్గొన్నారు. -
స్టార్టప్ ఇండియాను వాడుకోండి..
న్యూయార్క్: ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక కీలక సవాళ్లకు ‘స్టార్టప్ ఇండియా’ను ఒక పరిష్కార వేదికగా ఉపయోగించుకోవాలని గ్లోబల్, అమెరికా దిగ్గజ సీఈఓలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ముఖ్యంగా పోషకాహారం, వర్థాల నిర్వహణ వంటి అంశాల్లో నెలకొన్న సవాళ్లకు స్టార్టప్ ఇండియా నుంచి వస్తున్న నవకల్పనలు చేదోడునందిస్తాయని చెప్పారు. ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశాల్లో పొల్గొనేందుకు అమెరికా పర్యటనలో ఉన్న మోదీ... బుధవారమిక్కడ 20 రంగాలకు చెందిన 42 మంది గ్లోబల్ సీఈఓలతో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన రౌండ్‌టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భారత్‌లో ఇప్పుడు రాజకీయ స్థిరత్వం కొనసాగుతోంది. స్థిరమైన పన్నుల విధానం, అభివృద్ధి కాంక్షతో కూడిన సర్కారు కొలువైఉంది. వృద్ధికి ఊతమిచ్చే చర్యలను చేపడుతున్నాం. పర్యాటకాభివృద్ధి, ప్లాస్టిక్ రీసైక్లింగ్, వ్యర్థాల నిర్వహణతో పాటు చిన్న,మధ్యతరహా వ్యాపార సంస్థలకు దన్నుగా నిలుస్తున్నాం. ప్రధానంగా రైతులు, వ్యవసాయ రంగాల్లో మరిన్ని అవకాశాలను సృష్టించే సంస్థలను ప్రోత్సహిస్తున్నాం’ అని మోదీ వివరించారు. భారత్‌లో పెట్టుబడి అవకాశాలను వివరించడంతో పాటు ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచేందుకు చేపట్టే చర్యలపై కార్పొరేట్ దిగ్గజాలతో మోదీ సమాలోచనలు జరిపారని ప్రధాని కార్యాలయం(పీఎంఓ) ట్వీట్ చేసింది. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం... భారత్ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కీలకమైన పాలసీ చర్యలు తీసుకుంటున్నట్లు మోదీ సీఈఓలకు తెలియజేశారు. భారత్ వృద్థి పథంపై ప్రపంచ కార్పొరేట్ రంగం చాలా సానుకూల దృక్పథంతో ఉందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రావీష్ కుమార్ ట్వీట్లో పేర్కొన్నారు. వ్యాపారాలకు సానుకూల పరిస్థితులు(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) కల్పించడంలో భారత్ చర్యలను గ్లోబల్ సీఈఓలు ప్రశంసించారు. మోదీ సర్కారు అమలు చేసిన చాలా సంస్కరణలు ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచుతున్నాయని కూడా సీఈఓలు మోదీకి కితాబిచ్చాని పీఎంఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ‘భారత్‌లో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నాం. మరింత విస్తరించేందుకు అవసరమైన చర్యలు కొనసాగిస్తాం’ అని కార్పొరేట్ దిగ్గజాలు స్పష్టం చేసినట్లు తెలిపింది. స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా, అందరికీ ఆర్థిక ఫలాలు, పర్యావరణానుకూల ఇంధనాలు వంటి రంగాలకు చేయూతనందించే విషయంలో కీలక సూచనలను కూడా ఇచ్చారని పేర్కొంది. ఎవరెవరు పాల్గొన్నారంటే... గ్లోబల్ సీఈఓల రౌండ్‌టేబుల్‌లో ఐబీఎం చైర్మన్, సీఈఓ గినీ రోమెటీ; వాల్‌మార్ట్ ప్రెసిడెంట్, సీఈఓ డగ్లస్ మెక్‌మిలన్; కోకకోలా చైర్మన్, సీఈఓ జేమ్స్ క్విన్సీ; లాక్‌హీడ్ మార్టిన్ సీఈఓ మారిలిన్ హ్యూసన్; జేపీ మోర్గాన్ చైర్మన్, సీఈఓ జేమీ డైమన్; అమెరికన్ టవర్ కార్పొరేషన్ సీఈఓ, ఇండియా–యూఎస్ సీఈఓ ఫోరం కో–చెయిర్ జేమ్స్ టైక్లెట్; మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ బంగా తదితరులు పాల్గొన్నారు. వీరితోపాటు యాపిల్, గూగుల్, మారియట్, వీసా, 3ఎం, వార్బర్గ్ పింకస్, ఏకామ్, రేథియాన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా–మెరిల్ లించ్, పెప్సీ కంపెనీలకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న కంపెనీల మొత్తం విలువ(నెట్‌వర్త్) 16.4 ట్రిలియన్ డాలర్లు కాగా, భారత్‌లో వాటి కార్యకలాపాల విలువ 50 బిలియన్ డాలర్లుగా అంచనా. భారత్ అభివృద్ధికి సంబంధించి ప్రధాని మోదీ విజన్ చాలా గొప్పగా ఉంది. వృద్ధికి ఊతమిచ్చేందుకు వీలుగా చేపట్టిన వ్యాపార సానుకూల విధానాలు, ఇతరత్రా సంస్కరణలను మేం స్వాగతిస్తున్నాం. ఇందుకు మేం కూడా మా పూర్తి సహకారాన్ని అందిస్తాం. భారత్ గురించి మా క్లయింట్లు, కస్టమర్ల నుంచి వస్తున్న సానుకూలతను చూస్తుంటే... కచ్చితంగా దేశం పురోగమిస్తుందన్న విశ్వాసం కలుగుతోంది. – బ్రియాన్ మోనిహన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా సీఈఓ భారత్ మాకు ప్రపంచంలో ఐదో ముఖ్య మార్కెట్‌గా ఉంది. రానున్న కాలంలో ఇది మూడో స్థానానికి చేరే అవకాశం ఉంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టే విషయంలో మేం చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఈ విషయంలో మోదీ ప్రభుత్వ వృద్ధి ఎజెండాకు మద్దతుగా నిలుస్తాం. – జేమ్స్ క్విన్సీ, కోకకోలా చైర్మన్, సీఈఓ ఇన్వెస్టర్లను భారత్‌కు ఆహ్వానించే విధంగా ప్రధాని మోదీ... సమర్థవంతంగా, హృదయపూర్వకంగా ప్రసంగించారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యం, జనాభా, డిమాండ్, నిర్ణయాత్మకత.. ఈ నాలుగు అంశాలు(ఫోర్ డీ) పెట్టుబడుల విషయంలో భారత్‌కున్న బలానికి నిదర్శనం అంటూ ప్రధాని చాలా సమర్థంగా తన వాణిని వినిపించారు. ఈ విషయాన్ని మేం ఎప్పుడో విశ్వసించాం. అంతేకాదు మా కంపెనీ వృద్ధికి భారత్ చాలా కీలకం కూడా. అందుకే ఇక్కడ పెట్టుబడులను కొనసాగిస్తాం. – బెన్ వాన్ బీర్డన్, షెల్ సీఈఓ ప్రధాని నరేంద్ర మోదీతో రౌండ్‌టేబుల్ భేటీ అత్యద్భుతంగా జరిగింది. భారత్ విషయంలో చాలా ఆశావహ దృక్పథంతో ఈ సమావేశానికి హాజరయ్యా. భేటీ తర్వాత ఆశావాదం మరింత పెరిగింది. ప్రతిఒక్కరి సలహాలు, సూచనలను ఎంతో సుహృద్భావంతో మోదీ విన్నారు. వ్యాపార సానుకూలతకు చేస్తున్న చర్యలు ఇరువర్గాలకూ మేలు చేకూరుస్తాయి. ఆయన ఒక నిజమైన నాయకుడు. – గినీ రోమెటీ, ఐబీఎం సీఈఓ సీఈఓలతో చర్చలకు ప్రధాని మోదీ అత్యంత ఆసక్తి కనబరిచారు. సమావేశం చాలా బాగా జరిగింది. భారత్ అనుసరిస్తున్న వృద్ధి ప్రోత్సాహక విధానాలను అభినందిస్తున్నా. భారత్‌లో ప్రాజెక్టుల విషయంలో మేం చాలా సానుకూల దృక్పథంతో ఉన్నాం. పెట్టుబడులకు చాలా అనుకూల వాతావరణం నెలకొందని భావిస్తున్నా. – మారిలిన్ హ్యూసన్,లాక్‌హీడ్ మార్టిన్ సీఈఓ -
‘స్టార్టప్ ఇండియా’ ఇంకా స్టార్టింగ్‌లోనే !!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 2016, జనవరి నెలలో ‘స్టార్టప్ ఇండియా’ పేరిట కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రారంభించారు. పారిశ్రామిక రంగంలో ఔత్సాహికులను అన్ని విధాలుగా ప్రోత్సహించి భారత్‌ను అతిపెద్ద పారిశ్రామిక దేశంగా అభివృద్ధి చేయడం ఈ విధానం లక్ష్యం. దీని కింద ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు మోదీ ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలతో ఓ కార్పస్ నిధిని కూడా ఏర్పాటు చేసింది. స్టార్టప్ ఇండియా కింద పన్ను మినహాయింపులను ఇవ్వడంతోపాటు అనేక రాయితీలను కల్పించింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి వచ్చే పెట్టుబడులకు అనుగుణంగా నిధులను విడుదల చేసేందుకు ఏర్పాటు చేసిన కార్పస్ నిధి నుంచి నిధులను అందించే బాధ్యతను భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకుకు అప్పగించింది. కార్పస్ నిధి కింద ఏర్పాటు చేసిన పదివేల కోట్ల రూపాయలను నాలుగేళ్ల కాలంలో ఖర్చుచేయాల్సి ఉంది. ఈ స్టార్టప్ ఇండియా పట్ల పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉత్సాహాన్ని చూపాయి. దీన్ని ప్రారంభించి ఇప్పటికీ దాదాపు రెండేళ్లు కావొస్తుండగా, కేవలం 33 వేల స్టార్టప్‌ల ఏర్పాటుకే ఔత్సాహికవేత్తలు ముందుకు వచ్చారు. వాటిలో డిసెంబర్ 18వ తేదీ నాటికి 75 స్టార్టప్ కంపెనీలు మాత్రమే కార్యరూపం దాల్చాయి. వాటికి దాదాపు 605 కోట్ల రూపాయలను కార్పస్ ఫండ్ కింద విడుదల చేయడానికి అంగీకరించిన బ్యాంకు రూ.90.62 కోట్లను మాత్రమే విడుదల చేసింది. అందుకు బదులుగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దాదాపు 337 కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టారు. ఈ వివరాలను వాణిజ్య, పారిశ్రామిక శాఖ సహాయ మంత్రి సీఆర్ చౌధరి ఈనెల 18న లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. నాలుగేళ్ల కాలంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయంగా అందించేందుకు పదివేల కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించగా, రెండేళ్ల కాలంలో కేవలం రూ. 605 కోట్ల విడుదలకు ప్రతిపాదనలు అందడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కనీసం 33 వేల స్టార్టప్ కంపెనీలు కార్యరూపం దాలుస్తాయని భావిస్తే 75 కంపెనీలే రావడాన్ని ఎలా పరిశీలించాలి? -
మహిళ మాకు ఆది'శక్తి'
భారత్‌లో, ఆ మాటకొస్తే దక్షిణాసియాలోనే తొలిసారిగా జరుగుతున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు హైదరాబాద్‌లో మంగళవారం అట్టహాసంగా ఆరంభమయింది. హైదరాబాద్ హెచ్ఐసీసీలో గురువారం వరకు జరగనున్న ఈ మూడు రోజుల సదస్సును ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్ కలిసి ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన కంపెనీ తయారు చేసిన ‘మిత్ర’ రోబో వేదికపైకి నడుచుకుంటూ రాగా, ఆ రోబో తాలూకు కంప్యూటర్‌పై భారత, అమెరికా చిహ్నాల్ని మోదీ, ఇవాంకా టచ్ చేశారు. దీంతో సదస్సు ప్రారంభమైనట్లు రోబో ప్రకటించింది. అనుకున్న సమయానికి కాస్త ఆలస్యంగా సాయంత్రం 4.45గంటల ప్రాంతంలో ఆరంభమైన సదస్సులో కాసేపు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. హైదరాబాద్ ప్రాశస్త్యాన్ని తెలిపే వీడియోలతో పాటు భారత ఔన్నత్యాన్ని, మేకిన్ ఇండియా లక్ష్యాలను తెలిపే వీడియోలను ప్రదర్శించారు. చివరిగా, సదస్సులో చర్చించే ముఖ్యాంశాలైన హెల్త్‌కేర్–లైఫ్ సైన్సెస్, డిజిటల్ ఎకానమీ–ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఎనర్జీ–ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీడియా–ఎంటర్టైన్మెంట్... ఈ నాలుగింటి విశేషాలనూ తెలియజేస్తూ చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్వాగతోపన్యాసం చేయగా మోదీ, ఇవాంకా సదస్సును ఆరంభించి మాట్లాడారు. చివరిగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వందన సమర్పణతో ఆరంభ కార్యక్రమం ముగిసింది. అనంతరం ‘బీ ద చేంజ్.. విమెన్స్ ఎంట్రప్రెన్యురల్ లీడర్షిప్’ అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో ఇవాంకా, జాన్ చాంబర్స్ (సిస్కో), మార్కస్ వాలెన్‌బర్గ్ (సెబ్), రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఎస్ఆర్ఎస్ ఏవియేషన్ వ్యవస్థాపకురాలు షిబోంగ్లీ రిజోయ్స్ పాల్గొన్నారు. సాక్షి, బిజినెస్ బ్యూరో ప్రతినిధి: భారతీయ పురాణాల్లో మహిళను శక్తి అవతారంగా అభివర్ణించారని, సమాజాభివృద్ధికి మహిళా సాధికారత అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. దేశంలోని నాలుగు అత్యంత పురాతనమైన హైకోర్టులకుగాను మూడింటికి మహిళలే నేతృత్వం వహిస్తున్నారని, అంగారకుడిపైకి రోవర్‌ను పంపిన యాత్రలోనూ మహిళల పాత్రే ప్రధానమని, క్రీడల్లోనూ మహిళలే గర్వకారణంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. మంగళ వారమిక్కడ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన ప్రసంగించారు. దక్షిణాసియాలో తొలిసారి జరుగుతున్న ఈ సదస్సు.. ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలు, విద్యా వేత్తలు, మేధావులు, ఇతర ముఖ్యుల్ని ఒకచోటికి చేర్చి, పరిశ్రమలకు కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేయటానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఇది సిలికాన్ వ్యాలీని, హైదరాబాద్‌ను కలపటమే కాకుండా.. భారత్–అమెరికా బంధాల్ని మరింత దృఢతరం చేస్తుందని వ్యాఖ్యానించారు. భారత చరిత్రలో చెరగని చోటు భారతదేశ చరిత్రలో మహిళలకు చెరిగిపోని చోటుందని ప్రధాని అన్నారు. ‘‘క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలోనే వేద విద్యావంతురాలైన గార్గి ఓ మహా మునిని వేదవిద్యలో సవాల్ చేసింది. ఆ కాలంలో ఇది ఊహలకు కూడా అందని విషయం. ఇక రాణి అహల్యాబాయి, రాణి లక్ష్మీబాయి వారి సామ్రాజ్యాల రక్షణకు ప్రాణాలొడ్డి పోరాడారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలోనూ మహిళలది కాదనలేని పాత్ర. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ వంటి భారతీయ సంతతి మహిళలు అమెరికా అంతరిక్ష కార్యక్రమంలోనూ భాగమయ్యారు. ఈ హైదరాబాద్ నుంచి సైనా నెహ్వాల్, పీవీ సింధు, సానియా మీర్జా వంటి క్రీడారత్నాలు భారత్‌కు వన్నెతెచ్చారు. మహిళలకు అట్టడుగు స్థాయి నుంచీ విధాన నిర్ణయాల్లో భాగమివ్వాలనే ఉద్దేశంతో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు మూడోవంతు స్థానాలు రిజర్వు చేశాం’’ అని వివరించారు. దేశంలో వ్యవసాయ, అనుబంధ పరిశ్రమల్లో 60 శాతానికి పైగా మహిళలేనంటూ.. గుజరాత్లో సహకార ఉద్యమానికి ఊపిరులూదిన లిజ్జత్ పాపడ్ కథ వినిపించారు. అనాదిగా పారిశ్రామికతత్వం భారతదేశం పురాతన కాలం నుంచీ ఆవిష్కరణలకు కేంద్రమని, పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించిందని మోదీ చెప్పారు. ‘‘ప్రపంచానికి ఆయుర్వేదాన్ని పరిచయం చేసింది చరక సంహిత. యోగా మరో ఆవిష్కరణ. ఇప్పుడు ఎందరో పారిశ్రామికవేత్తలు యోగాను, ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ డిజిటల్ యుగానికి ఆధారం బైనరీ సిస్టమే. ఈ బైనరీకి సున్నాతోనే పునాది పడింది. దాన్ని కనుగొన్నది ఆర్యభట్ట. పన్ను వ్యవస్థలకు మూలం కౌటిల్యుడి అర్థ శాస్త్రం’’ అని వివరించారు. పారిశ్రామికవేత్తలకు ఉండాల్సిన లక్షణాలను వివరిస్తూ.. ‘‘తన ఆలోచనను సాకారం చేసుకునే నైపుణ్యం, విజ్ఞానంతో పాటు ప్రతికూలంలోనూ అవకాశాల్ని వెదుక్కోవాలి. అంతిమంగా వినియోగదారుడికి మరింత సులువైన పరిష్కారాన్ని అందించాలి’’ అంటూ స్వామి వివేకానందను ఉదహరించారు. భారత్‌లో ఇప్పుడు 80 కోట్ల మందికి పారిశ్రామికవేత్తలుగా మారే సత్తా ఉందని... వీరంతా కలిసి ప్రపంచాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దగలరని చెప్పారాయన. మొబైల్ యూజర్ల సంఖ్య పెరుగుతోందంటూ... ఇది ఉద్యోగాల కల్పనకు సహకరిస్తుందన్నారు. డిజిటల్‌కు మూలం... ఆధార్ ప్రపంచంలో అతిపెద్ద బయోమెట్రిక్ ఆధారిత డేటాబేస్‌గా నిలుస్తున్న ఆధార్‌ను ప్రధాని ప్రస్తావించారు. ‘‘దీంట్లో ఇపుడు 115 కోట్ల మంది చేరారు. రోజుకు దీని ఆధారంగా 4 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ఆధార్ సాయంతో కేంద్ర పథకాల్ని నేరుగా లబ్ధిదారుకే అందిస్తున్నాం. జన్‌ధన్ ఖాతాలతో 68,500 కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి. వీటిలో 53 శాతం ఖాతాలు మహిళలవే’’ అని మోదీ వివరించారు. భీమ్ యాప్ గురించి ప్రస్తావిస్తూ.. మెల్లగా తక్కువ నగదున్న వ్యవస్థలోకి వెళుతున్నామని, ఇపుడు భీమ్‌తో రోజుకు 28 లక్షల లావాదేవీలు సాగుతున్నాయని వివరించారు. గ్రామాలకు విద్యుత్ కనెక్షన్లిచ్చే సౌభాగ్య పథకాన్ని, హైస్పీడ్ ఇంటర్నెట్ లక్ష్యాలను, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆవిష్కరణల కోసమే స్టార్టప్ ఇండియా... పారిశ్రామికవేత్తల ఆవిష్కరణల్ని ప్రోత్సహించడానికే స్టార్టప్ ఇండియాను ఆరంభించామని ప్రధాని మోదీ చెప్పారు. దీనికోసం 1200 కాలం చెల్లిన చట్టాలను రద్దు చేశామని, 21 రంగాల్లో ఎఫ్‌డీఐ నిబంధనల్ని సడలించి ఆన్లైన్ అనుమతుల్ని ప్రవేశపెట్టామని వివరించారు. ప్రపంచబ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ర్యాంకింగ్ మెరుగుపడి 100కు చేరటాన్ని ప్రధాని గుర్తు చేశారు. దీంతో సంతృప్తి చెందడం లేదని, 50వ ర్యాంకుకు చేరుకోవటానికి శ్రమిస్తామన్నారు. ముద్రా రుణాల పథకాన్ని ప్రారంభించాక ఇప్పటిదాకా 4.28 లక్షల కోట్ల రూపాయల్ని 9 కోట్ల మందికి ఇచ్చామని, వారిలో 7 కోట్ల మంది మహిళలేనని ప్రధాని వివరించారు. పెట్టుబడుల కోసమే సంస్కరణలు పారదర్శక పాలసీలు, చట్టం దృష్టిలో అందరూ సమానమేనని చెప్పడం ద్వారా పారిశ్రామికవేత్తల్ని పెంచవచ్చనేది తమ ప్రభుత్వం గుర్తించిందని, అందుకే పన్నుల వ్యవస్థను ప్రక్షాళించేందుకు జీఎస్టీని తెచ్చామని, దివాలా చట్టాన్ని అమలు చేస్తున్నామని ప్రధాని వివరించారు. నల్లధనాన్ని అడ్డుకునేందుకు చేపట్టిన చర్యల్ని వివరించారు. ఇవన్నీ గుర్తించే మూడీస్ సంస్థ రేటింగ్‌ను పెంచిందని గుర్తుచేశారు. ‘‘చివరిగా భారతీయ యువ పారిశ్రామికవేత్తలకు నేను చెప్పేదొక్కటే. 2022 నాటికి కొత్త భారతాన్ని సృష్టించాలి. దానికి మీలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేయగలరు. భారత మార్పునకు మీరే సారథులు. రండి!! భారత్‌లో తయారీ చేపట్టండి. ఇక్కడ పెట్టుబడి పెట్టండి. భారత వృద్ధిలో భాగస్వాములు కావాలంటూ మీలో ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నా. దీనికి మా మద్దతుంటుందని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నా’’ అంటూ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. -
వీసా లేకుండానే భారత్ వచ్చా: ఉబెర్ సీఈవో
న్యూఢిల్లీ: ఉబెర్ సర్వీసుల కార్యనిర్వాహణాధికారి ట్రావిస్ కలానిక్ వీసా లేకుండానే భారతకు వచ్చి చిక్కుల్లో పడ్డారు. వీసా లేకపోవటంతో వెనక్కి పంపేదుకు ఢిల్లీ విమానాశ్రయాధికారులు యత్నించారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవటంతో భారత్‌లో కాలుపెట్టేందుకు అనుమతి లభించింది. ఇది ఈ ఏడాది జనవరిలో జరిగింది. స్టార్టప్ ఇండియా ఈవెంట్లో పాల్గొనేందుకు బీజింగ్ నుంచి కలానిక్ ఢిల్లీకి వచ్చారు. ‘పొరపాటున వీసా లేకుండానే బీజింగ్ నుంచి ఢిల్లీ వచ్చేశాను. అధికారులు ఆపేశారు. నా మిత్రుడు, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్.. ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఆ తర్వాతే అధికారులు నన్ను బయటకు వదిలారు’ అని కలానిక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. -
ఈ ఆదివారం ఎస్బీఐ పనిచేస్తుంది
చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహమందించే లక్ష్యంతో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా రానున్న ఆదివారాన్ని (జూలై 24) ఎస్ఎంఈ సండేగా ప్రకటించింది. హైదరాబాద్ పరిధిలోని శాఖలన్నీ ఆ రోజున పనిచేస్తాయని ఎస్బీఐ డీజీఎం రాజేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. స్టార్టప్ ఇండియా, స్టాండ్‌అప్ ఇండియా కార్యక్రమాలకు ఊతమిచ్చే లక్ష్యంతో దీన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. జూలై 24న ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ బ్యాంకు శాఖలు తెరిచి ఉంటాయని, స్టార్టప్‌లతోపాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అన్ని రుణాల వివరాలు తెలుసుకోవాలనుకునే వారు బ్యాంకు అధికారులను సంప్రదించవచ్చునని ఆయన చెప్పారు. విశాఖపట్నంలో ఈ తరహా కార్యక్రమాన్ని ఇటీవలే విజయవంతంగా నిర్వహించామని, హైదరాబాద్‌లోని ఔత్సాహికులు కూడా ఎస్ఎంఈ సండేను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
స్టార్టప్స్‌కు మూడేళ్ల ట్యాక్స్ హాలిడే అవసరం
యువ పారిశ్రామికవేత్తలు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ‘స్టార్టప్ ఇండియా’ కార్యక్రమం కింద స్టార్టప్స్‌కు 1-3 ఏళ్ల పాటు ట్యాక్స్ హాలిడేను ప్రకటించాలని యువ పారిశ్రామికవేత్తలు కోరారు. కొత్త కంపెనీల ఏర్పాటుకు సింగిల్ విండో క్లియరెన్స్ ఆవశ్యకమని తెలిపారు. భారత్ మెల్లగా విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ దిశగా పయనిస్తోందన్నారు. స్టార్టప్స్‌కు ప్రాధాన్యమివ్వడం వల్ల దేశీ పరిస్థితులు మెరుగుపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ, టైర్-2, టైర్-3 పట్టణాలు స్వయం సమృద్ధి దిశగా పయనించాలంటే, వాటిని చేయూత అవసరమని తెలిపారు. ఆరోగ్య సంబంధిత సేవల్ని అందించే మెడికోవ్ యాప్ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీవల ్సమ్ మీనన్ మాట్లాడుతూ.. స్టార్టప్ ఇండియా కార్యక్రమ ప్రారంభం వల్ల దేశంలో టెక్నాలజీ వినియోగం పెరుగుతుందని, స్టార్టప్ అనుకూల పరిస్థితుల ఏర్పాటు జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం వ్యవసాయ రంగం, హెల్త్‌కేర్ బిజినెస్, సామాజిక-ఆర్థిక అంశాలకు సంబంధించిన కార్యకలాపాలు, గ్రామీణ ఉపాధి వంటి అంశాలకు అధిక ప్రాధాన్యమివ్వాలని కోరారు. ప్రభుత్వం నిబంధనలు అమలయ్యే అన్ని రంగాలు ప్రయోజనం పొందుతాయని 360రైడ్ వ్యవస్థాపకుడు, సీఈవో లోకేశ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం టెక్నాలజీ ఆధారిత కంపెనీల ఏర్పాటు ట్రెండ్ నడుస్తోందని ఫన్టూట్ సీఈవో రాజీవ్ పథక్ తెలిపారు. ప్రధాని మోదీ జనవరి 16న టెక్నాలజీ ఆధారిత స్టార్టప్స్ కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. -
సృజనాత్మక యువతరం కోసం!
జనవరి 16న ‘స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా’ యాక్షన్ ప్లాన్ ఆవిష్కరణ ♦ నూతన ఆవిష్కరణల కోసం యువతకు ప్రోత్సాహం, రుణ సహకారం ♦ ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: యువ ఔత్సాహిక వ్యాపారవేత్తలకు సంపూర్ణ సహకారం అందించే దిశగా ‘స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా’ పథకానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను 2016, జనవరి 16న ఆవిష్కరిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు. ఈ పథకం ఐటీకో లేక ఏ కొంతమందికో, లేక ఏ కొన్ని నగరాలకో పరిమితం కాదని, దేశవ్యాప్తంగా నలుమూలలా ఉన్న యువతకు తమ వ్యాపార సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు సాధనంగా నిలుస్తుందని అన్నారు. దీనికి దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించాలని రాష్ట్రాలను కోరారు. మనదేశ పరిస్థితులకు తగ్గట్టు సమాజంలోని అత్యంత దిగువస్థాయిలో ఉన్న యువతకూ ప్రయోజనం కలిగేలా దీని విధివిధానాలు రూపొందాయన్నారు. ప్రతినెలా ఇచ్చే రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’లో మోదీ ఆదివారం ఈ విషయాలు తెలిపారు. గత పంద్రాగస్టున తాను ‘‘స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా’ గురించి సూచనప్రాయంగా చెప్పానని, తర్వాత ‘భారత్ స్టార్టప్ రాజధానిగా కాగలదా? రాష్ట్రాల్లోని యువతలోని సృజనాత్మకతకు స్టార్టప్‌ల రూపంలో వ్యాపార అవకాశాలను అందించగలమా?’ వంటి వాటిపై అధ్యయనం జరిగిందన్నారు. ‘జనవరి 16న ఈ పథకానికి సంబంధించిన పూర్తి కార్యాచరణ ప్రణాళికను మీ ముందుంచుతాం. దీన్ని దేశంలోని అన్ని ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ వర్సిటీ, ఎన్ఐటీలతో అనుసంధానిస్తాం. లైవ్ కనెక్టివిటీ ద్వారా యువత ఎక్కడున్నా వారిని ప్రత్యక్షంగా అనుసంధానిస్తాం. స్టార్టప్‌లకు బ్యాంక్‌లు రుణాలు అందించేలా చూస్తాం. ఇతర ప్రయోజనాలూ కల్పిస్తాం’ అని తెలిపారు. దీన్ని మరింత మెరుగ్గా మార్చేందుకు సూచనలివ్వాలని ప్రజలను కోరారు. ఓ పేదకూలీకి సహకరించేలా యువత ఏదైనా ఆవిష్కరిస్తే, దానిని స్టార్ట్ అప్‌గా భావిస్తానని, అలాంటివారికి రుణ సదుపాయం కల్పించాలని బ్యాంకులను కోరతానని తెలిపారు. తెలివితేటలు నగర యువతకే పరిమితం కాదని, భారత యువతీయువకులందరిలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయన్నారు. వికలాంగులు కాదు.. దివ్యాంగులు వికలాంగులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరిస్తూ.. ‘వారిలో అత్యద్భుతమైన సామర్థ్యాలు ఉంటాయి. సాధారణ వ్యక్తుల్లో లేని ప్రత్యేక సామర్థ్యాలు వారిలో ఉంటాయి. అందుకే వారిని వికలాంగులు అనకుండా దివ్యాంగులు అనాలి. అదే పేరుకు ప్రాచుర్యం కల్పించాలి’ అన్నారు. స్వామి వివేకానంద జయంతి రోజైన జనవరి 12న ప్రారంభమై జనవరి 16 వరకు రాయిపూర్(ఛత్తీస్‌గఢ్)లో జాతీయ యువజనోత్సవం ‘భారతీయ యువతలో అభివృద్ధి నైపుణ్యాలు, సామరస్యం’గా జరుగుతాయని తెలిపారు. దీనిపై అభిప్రాయాలను నరేంద్ర మోదీ యాప్ ద్వారా తనతో పంచుకోవచ్చన్నారు. దేశప్రజలకు క్రిస్మస్, కొత్త శుభాకాంక్షలు తెలుపుతూ.. ఒక పండుగ ముగియకముందే మరో పండుగ రావడం భారత్ ప్రత్యేకత అన్నారు. ‘ఒక్కోసారి మన దేశానిది పర్వదిన ఆధారిత ఆర్థిక వ్యవస్థ అనిపిస్తుంద’న్నారు. ఆ మేస్త్రీది గొప్ప ఆదర్శం మధ్యప్రదేశ్‌లో ఉచితంగా టాయిలెట్లు నిర్మించి ఇస్తున్న ఒక మేస్త్రీని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. భోజ్పుర గ్రామానికి చెందిన 65 ఏళ్ల దిలీప్ సింగ్ మాలవీయ తన గ్రామస్తులకు టాయిలెట్ల అవసరాన్ని వివరించి, వారికి ఉచితంగా నిర్మించి ఇస్తున్నాడు. నిర్మాణానికి అవసరమైన సామగ్రిని మాత్రం వారిని కొనక్కోమని చెప్పి, తన పనికి డబ్బులు తీసుకోకుండా నిర్మించి ఇస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన100 మరుగుదొడ్లను నిర్మించాడు. ఇదే విషయాన్ని మోదీ ప్రస్తావిస్తూ.. ‘దిలీప్ సింగ్ మామూలు మేస్త్రీనే. కానీ ఆయన పని ఆదర్శనీయమైనది. ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు’ అన్నారు. మోదీ ప్రసంగంలోని ఇతర ముఖ్యాంశాలు.. ► నరేంద్ర దీ యాప్‌ను మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని నాతో అనుసంధానం కావచ్చు. మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలియచేయవచ్చు. అనేక విషయాలను నేను యాప్‌లో షేర్ చేస్తుంటాను. ► మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడంలో చూపుతున్న శ్రద్ధను వాటి నిర్వహణలో చూపడం లేదు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహనీయుల విగ్రహాలను, వాటి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దండి. ► ఎల్పీజీ సబ్సీడీలో ప్రత్యేక నగదు బదిలీ పథకం ద్వారా 15 కోట్ల మంది లబ్ధి పొందారు. ఈ పహల్ పథకం గిన్నిస్ బుక్‌లో కూడా చోటు సంపాదించింది. ► పార్లమెంట్లో జరిగిన ఇటీవలి రాజ్యాంగదినోత్సవ చర్చలో పౌరుల హక్కుల విషయంపై విసృ్తతంగా చర్చించారు. అలాగే, పౌరుల విధులు, బాధ్యతల గురించి కూడా చర్చించాల్సిన అవసరం ఉంది.