సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆవిష్కరణల వాతావరణానికి దిక్సూచిగా ఉన్న ‘టి హబ్’కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్’ పథకానికి ఎంపికైంది. కేంద్ర పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ఈ పథకం కింద అర్హత కలిగిన స్టార్టప్‌లకు రూ.5 కోట్లు విడుదల చేస్తుంది. ప్రాథమిక స్థాయిలో ఉన్న స్టార్టప్‌ల ఆవిష్కరణలకు ఊతమిచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రపంచ స్థాయిలో స్టార్టప్‌లు రాణించేలా వాటికి అవసరమైన అన్ని వసతులు సమకూర్చడంపైనే తాము ప్రధానంగా దృష్టి పెడుతున్నట్టు టి హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస్‌రావు ‘సాక్షి’కి వెల్లడించారు. (క్లిక్: 2 గంటల్లో వంట గ్యాస్ సిలిండర్ డెలివరీ.. నిమిషం ఆలస్యమైనా..)
స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్‌కు అర్హత కలిగిన స్టార్టప్‌లను ఎంపిక చేసేందుకు ఇంక్యుబేటర్ సీడ్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఐఎస్‌ఎంసీ)ని ఏర్పాటు చేస్తున్నట్టు టి హబ్ ప్రకటించింది. రిచ్ డైరక్టర్ జనరల్ అజిత్ రంగ్నేకర్, ఫ్రెష్‌వర్క్స్ కో ఫౌండర్ కిరణ్ దరిసి, మైగేట్ వ్యవస్థాపక బృందం సభ్యుడు వింగ్ కమాండర్ ఆంథోని అనిష్‌తో పాటు పలువురు పెట్టుబడిదారులు, ఎంట్రప్రెన్యూర్లు, విద్యావేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు ఐఎస్‌ఎంసీలో సభ్యులుగా ఉంటారు. మూడేళ్ల వ్యవధిలో 15 స్టార్టప్‌లకు ఈ పథకం ద్వారా టి హబ్ నిధులు అందజేస్తుంది. ఆసక్తి ఉన్న స్టార్టప్‌లు సీడ్‌ఫండ్ స్టార్టప్ ఇండియా వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని టి హబ్ సీఈవో సూచించారు. (క్లిక్: పాస్‌పోర్టు అపాయింట్‌మెంట్ల కుదింపు)
Comments
Please login to add a commentAdd a comment