Stand Up India
-
‘పరిశ్రమల స్థాపన’లో స్టాండ్–అప్ ఇండియా స్కీమ్ చేయూత
న్యూఢిల్లీ: క్షేత్ర స్థాయిలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడంలో స్టాండ్–అప్ ఇండియా పథకం కీలక పాత్ర పోషిస్తోంది. గడచిన నాలుగు సంవత్సరాల్లో ఈ పథకం కింద 1.80 లక్షల మంది లబ్ధిదారులకు బ్యాంకులు రూ.40,700 కోట్లకు పైగా మంజూరు చేశాయి. ఆర్థిక సాధికారత, ఉద్యోగ కల్పనపై దృష్టి సారించి 2016 ఏప్రిల్ 5, స్టాండ్ అప్ ఇండియా పథకం ప్రారంభమైంది. 2025 వరకూ దీనిని పొడిగించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళలు పరిశ్రమల స్థాపనకు రుణాలను ఇవ్వడానికి అన్ని బ్యాంకు శాఖలను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం. ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ వర్గాలు, మహిళలు పరిశ్రమలు సాధించాలన్న తమ కలను సాకారం చేసుకోవడంలో ఎదుర్కొనే సవాళ్లను గుర్తించడం, లక్ష్యాన్ని సాకారం చేయడానికి తగిన ప్రోత్సాహం అందించడం వంటి పలు అంశాలు ఈ పథకంలో ఇమిడి ఉన్నాయి. వ్యాపార రంగం, వ్యవసాయం, తయారీ వంటి రంగాల్లో ఆయా వర్గాలు ముందడుగు వేయడానికి ఈ పథకం ఎంతో దోహదపడుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గర్వకారణం... 1.8 లక్షలకు పైగా మహిళలు, ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా మారడానికి రూ. 40,600 కోట్లు మంజూరు చేయడం నాకు గర్వకారణం. సంతృప్తి కలిగించే విషయం. అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు శాఖల నుండి రుణాలను పొందడం ద్వారా కీలక వర్గాలు పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టడానికి ఈ పథకం తగిన సహాయ సహకారాలను అందిస్తోంది. ఈ దిశలో ఒక సులభతర వాతావరణాన్ని ఏర్పాటు చేస్తోంది. – నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రి ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ మూడవ స్తంభం స్టాండ్–అప్ ఇండియా పథకం.. నేషనల్ మిషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (అందరికీ ఆర్థిక ఫలాలు అందడం, వృద్ధి అన్ని వర్గాలకూ చేరడం) మూడవ స్తంభం. నిధులు లేని వారికి వాటిని అందించడం లక్ష్యంగా ఈ పథక రూపకల్పన జరిగింది. – భగవత్ కిసన్‌రావ్ కరాద్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి -
బంపరాఫర్, మీరు ఏదైనా బిజినెస్ ప్రారంభించాలని అనుకుంటున్నారా!
న్యూఢిల్లీ: క్షేత్ర స్థాయిలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు, మహిళా వ్యాపారవేత్తలకు ఆర్థిక సాధికారత, ఉపాధి కల్పన కోసం ఉద్దేశించిన స్టాండప్ ఇండియా స్కీము కింద గత ఆరేళ్లలో రూ. 30,160 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. ఇప్పటిదాకా 1,33,995 ఖాతాదారులకు ఈ లోన్లు ఇచ్చినట్లు పథకం ప్రారంభించి ఆరేళ్లయిన సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 1లక్ష మందిపైగా మహిళా ప్రమోటర్లు ఈ స్కీముతో ప్రయోజనం పొందినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలు (ఎంట్రప్రెన్యూర్లు) కేవలం సంపదను సృష్టించడమే కాకుండా ఉపాధి కూడా కల్పించడం ద్వారా ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడగలరని గుర్తించిన ప్రభుత్వం తదనుగుణంగా వారిని ప్రోత్సహిస్తోందని ఆమె తెలిపారు. మరోవైపు, దేశంలో వ్యవస్థాపకత సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయని, మరింత పురోభివృద్ధి సాధించే దిశగా ఆ స్ఫూర్తిని మళ్లించడంలో స్టాండప్ ఇండియా తోడ్పడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ.. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ట్వీట్ చేశారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్న తీరును ’మైగవ్ఇండియా’ ట్విటర్లో వివరించింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలు, మహిళలు రూ. 10 లక్షల నుండి రూ. 1 కోటి వరకూ బ్యాంక్ రుణాలు పొందేందుకు స్టాండప్ ఇండియా స్కీము ఉపయోగపడుతుంది చదవండి: అంతా మోదీ చలవే! దేశంలో పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం! -
మహిళల కోసం ప్రత్యేకంగా ఉన్న ఈ పథకం గురించి మీకు తెలుసా?
ఇంటికే పరిమితం.. భర్త, పిల్లలు, కుటుంబ పోషణ మాత్రమే ఆమె విధి..అంటూ కొన్నేళ్ల క్రితం మహిళలకు సంబంధించి పరిచయ వాక్యాలు ఉండేవి. కానీ ఇప్పుడు.. ఇంటా మేమే, బయటా మేమే అన్నట్లుగా అన్ని రంగాల్లోనూ మహిళలు ప్రతిభ కనబరుస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక, ఉద్యోగ రంగాల్లోనే కాదు..వృత్తి, వ్యాపారాల్లోనూ మహిళలు సాధిస్తున్న విజయాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల్ని అందుబాటులోకి తెచ్చింది. అందులో స్టాండప్ మిత్రా స్కీం (స్టాండప్ ఇండియా) ఒకటి. చాలా మంది మహిళలు తమకాళ్లపై తాము నిలబడాలని ప్రయత్నిస్తుంటారు. అవకాశాలు లేని చోట అవకాశాల్ని క్రియేట్ చేసుకోవాలని భావిస్తుంటారు. కానీ ఆర్ధిక ఇబ్బందుల వల్ల వంటింటికే పరిమితం అవుతుంటారు. అలాంటి వారు ఈ స్టాండప్ మిత్రా స్కీం ను వినియోగించుకోవాలని కేంద్రం చెబుతోంది. 2016లో ప్రధాని మోదీ ఈ స్టాండప్ మిత్రా పథకాన్ని ప్రారంభించారు. ఇందులో ఎస్సీ లేదా ఎస్టీ, పరిశ్రమలు స్థాపించాలనుకునే మహిళలకు రూ.10లక్షల నుంచి రూ.కోటి వరకు రుణాల్ని మంజూరు చేస్తుంది. ప్రత్యేకంగా మ్యానిఫ్యాక్చరింగ్, సర్వీస్,అగ్రి కల్చర్ సంబంధిత వ్యాపారలకు రుణాలిస్తుంది. అర్హతలు, అప్లయ్ చేసే విధానం ఇందులో 18సంవత్సారాలు నిండి నలుగురికి ఉపాధి కల్పిస్తే చాలు. సంబంధిత https://www.standupmitra.in/Home/SUISchemes వెబ్సైట్లోకి వెళ్లి అప్లయ్ చేసుకోవాలి. దీంతో కేంద్రం అర్హత ఆధారంగా వారికి బ్యాంక్ ఇంట్రస్ట్ రేట్లకే రుణాల్ని మంజూరు చేస్తుంది. అర్హతలకు అనుగుణంగా 18 నెలల నుండి 7 సంవత్సరాల వరకు రుణాల్ని చెల్లించే అవకాశం కల్పించ్చింది. చదవండి: 'డొనేట్-ఏ-పెన్షన్' కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి -
ఈ ఆదివారం ఎస్బీఐ పనిచేస్తుంది
చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహమందించే లక్ష్యంతో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా రానున్న ఆదివారాన్ని (జూలై 24) ఎస్ఎంఈ సండేగా ప్రకటించింది. హైదరాబాద్ పరిధిలోని శాఖలన్నీ ఆ రోజున పనిచేస్తాయని ఎస్బీఐ డీజీఎం రాజేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. స్టార్టప్ ఇండియా, స్టాండ్‌అప్ ఇండియా కార్యక్రమాలకు ఊతమిచ్చే లక్ష్యంతో దీన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. జూలై 24న ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ బ్యాంకు శాఖలు తెరిచి ఉంటాయని, స్టార్టప్‌లతోపాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అన్ని రుణాల వివరాలు తెలుసుకోవాలనుకునే వారు బ్యాంకు అధికారులను సంప్రదించవచ్చునని ఆయన చెప్పారు. విశాఖపట్నంలో ఈ తరహా కార్యక్రమాన్ని ఇటీవలే విజయవంతంగా నిర్వహించామని, హైదరాబాద్‌లోని ఔత్సాహికులు కూడా ఎస్ఎంఈ సండేను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
యూపీపై గురిపెట్టిన మోదీ!
నోయిడా: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ దృష్టి పెట్టింది. ఆ రాష్ట్ర జనాభాలో 20 శాతం ఉన్న దళితుల ఓట్లను సాధించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ పావులు కదుపుతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని 80 పార్లమెంట్ స్థానాల్లో 71 సీట్లను సాధించిన బీజేపీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే మంగళవారం నోయిడాలో 'స్టాండప్ ఇండియా స్కీమ్'ను మోదీ ప్రారంభించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, దళిత మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడమే ఆ పథకం ఉద్దేశం. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు యూపీ దళిత ప్రజాప్రతినిధులు 17 మంది పాల్గొననున్నారు. ఈ పథకంలో భాగంగా వ్యవసాయేతర రంగాలకు రూ. 10 లక్షల వరకు రుణంగా అందిచనున్నారు. పెట్టుబడిదారులకు రూపీ డెబిట్ కార్డులను ఇవ్వనున్నారు. ఇందుకోసం చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సీఐడీబీఐ)కు రూ. 10వేల కోట్లను కేటాయించారు. అదేవిధంగా 5100 'ఈ-రిక్షాలు' అందించడానికి రిజిస్ట్రేషన్ కోసం 'ప్రధానమంత్రి ముద్రా యోజనా స్కీమ్' వెబ్సైట్ ను సైతం మోదీ మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో యూపీ గవర్నర్ రామ్ నాయక్, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి మహేశ్ శర్మ, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.