యూపీపై గురిపెట్టిన మోదీ! | With Eye On Uttar Pradesh Polls, PM Modi Picks Noida To Launch 'Stand Up India' | Sakshi
Sakshi News home page

యూపీపై గురిపెట్టిన మోదీ!

Published Tue, Apr 5 2016 2:26 PM | Last Updated on Thu, Sep 19 2019 8:40 PM

With Eye On Uttar Pradesh Polls, PM Modi Picks Noida To Launch 'Stand Up India'

నోయిడా: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ దృష్టి పెట్టింది. ఆ రాష్ట్ర జనాభాలో 20 శాతం ఉన్న దళితుల ఓట్లను సాధించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ పావులు కదుపుతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని 80 పార్లమెంట్ స్థానాల్లో 71 సీట్లను సాధించిన బీజేపీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే మంగళవారం నోయిడాలో 'స్టాండప్ ఇండియా స్కీమ్'ను మోదీ ప్రారంభించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, దళిత మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడమే ఆ పథకం ఉద్దేశం. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు యూపీ దళిత ప్రజాప్రతినిధులు 17 మంది పాల్గొననున్నారు.

ఈ పథకంలో భాగంగా వ్యవసాయేతర రంగాలకు రూ. 10 లక్షల వరకు రుణంగా అందిచనున్నారు. పెట్టుబడిదారులకు రూపీ డెబిట్ కార్డులను ఇవ్వనున్నారు.  ఇందుకోసం చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సీఐడీబీఐ)కు రూ. 10వేల కోట్లను కేటాయించారు. అదేవిధంగా 5100 'ఈ-రిక్షాలు' అందించడానికి రిజిస్ట్రేషన్ కోసం 'ప్రధానమంత్రి ముద్రా యోజనా స్కీమ్' వెబ్‌సైట్ ను సైతం మోదీ మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో యూపీ గవర్నర్ రామ్ నాయక్, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి మహేశ్ శర్మ, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement