![Stand Up India Sanctioned To Rs 30,000 Crore For Who Doing Business - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/6/9666.jpg.webp?itok=lpatdpZx)
న్యూఢిల్లీ: క్షేత్ర స్థాయిలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు, మహిళా వ్యాపారవేత్తలకు ఆర్థిక సాధికారత, ఉపాధి కల్పన కోసం ఉద్దేశించిన స్టాండప్ ఇండియా స్కీము కింద గత ఆరేళ్లలో రూ. 30,160 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. ఇప్పటిదాకా 1,33,995 ఖాతాదారులకు ఈ లోన్‌లు ఇచ్చినట్లు పథకం ప్రారంభించి ఆరేళ్లయిన సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
1లక్ష మందిపైగా మహిళా ప్రమోటర్లు ఈ స్కీముతో ప్రయోజనం పొందినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలు (ఎంట్రప్రెన్యూర్‌లు) కేవలం సంపదను సృష్టించడమే కాకుండా ఉపాధి కూడా కల్పించడం ద్వారా ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడగలరని గుర్తించిన ప్రభుత్వం తదనుగుణంగా వారిని ప్రోత్సహిస్తోందని ఆమె తెలిపారు.
మరోవైపు, దేశంలో వ్యవస్థాపకత సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయని, మరింత పురోభివృద్ధి సాధించే దిశగా ఆ స్ఫూర్తిని మళ్లించడంలో స్టాండప్ ఇండియా తోడ్పడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ.. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో ట్వీట్ చేశారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్న తీరును ’మైగవ్‌ఇండియా’ ట్విటర్‌లో వివరించింది. ఎస్సీ, ఎస్‌టీ వర్గాలు, మహిళలు రూ. 10 లక్షల నుండి రూ. 1 కోటి వరకూ బ్యాంక్ రుణాలు పొందేందుకు స్టాండప్ ఇండియా స్కీము ఉపయోగపడుతుంది
చదవండి: అంతా మోదీ చలవే! దేశంలో పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం!
Comments
Please login to add a commentAdd a comment