వెతికా నేను నా ఇష్టంగా | Rajeshkumar's first movie 'Vetika nenu na ishtamga' | Sakshi
Sakshi News home page

వెతికా నేను నా ఇష్టంగా

Published Sat, Sep 21 2013 1:06 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

వెతికా నేను నా ఇష్టంగా - Sakshi

వెతికా నేను నా ఇష్టంగా

రాజేష్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ తేజస్విని క్రియేషన్స్ పతాకంపై కమ్యూనిస్ట్ ఆంజనేయులు సమర్పణలో తిరుమలరావు నిర్మించిన చిత్రం ‘వెతికా నేను నా ఇష్టంగా’. శేఖర్‌బాషా దర్శకుడు. హేమంతిని, సునీత కథానాయికలు.
 
 దసరా కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకు ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. వాటిలో కొన్ని మాత్రమే విజయం సాధించాయి. ఆ కొన్నింట్లో మా చిత్రం చేరుతుందనే నమ్మకం ఉంది. 
 
 ఓ వినూత్న కథాంశంతో రూపొందించిన చిత్రం ఇది. రాజేష్‌కుమార్‌కి తొలి చిత్రం అయినప్పటికీ ఫైట్స్, డాన్స్ ఎంతో ఈజ్‌తో చేశాడు. మల్లిక్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు. ‘‘ఫస్ట్ కాపీ చూశాక నమ్మకం పెరిగింది. దసరాకి విడుదలయ్యే చిత్రాల్లో మా చిత్రానికి కూడా మంచి పేరొస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement