
రాజేశ్, ప్రజ్వాల్
‘‘ఖోఖో, ఫ్లా్లష్ న్యూస్, వెతికా నేను నా ఇష్టంగా’ వంటి చిత్రాలతో ప్రతిభ ఉన్న నటుడిగా నిరూపించుకున్న రాజేశ్‌కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ప్రేమ అంత ఈజీ కాదు’. కన్నడలో మూడు విజయవంతమైన సినిమాల్లో నటించిన ప్రజ్వాల్ పువ్వామా ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఈశ్వర్ దర్శకత్వం వహించారు. టి.అంజయ్య సమర్పణలో పారిజాత మూవీ క్రియేషన్స్ పతాకంపై టి.నరేశ్, టి.శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ప్రేమ నేపథ్యంలో సాగే కథ ఇది. మనసుకి నచ్చిన వ్యక్తి ప్రేమను గెలుచుకోవడం ఎంత కష్టమో తెలుపుతుంది. ప్రేమ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మధ్య సాగే డ్రామా ఇది. అవుట్‌పుట్ బాగా వచ్చింది. త్వరలో పాటల్ని విడుదల చేసి, ఈ నెలాఖరులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని అన్నారు. ధన్‌రాజ్, రాంప్రసాద్, ముక్తార్‌ఖాన్ నటించిన ఈ చిత్రానికి కెమెరా: చక్రి, సంగీతం: జై.యం.
Comments
Please login to add a commentAdd a comment