
శ్రీవారికి ఒడిశా భక్తుడి భారీ కానుక
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ఓ భక్తుడు భారీ కానుకను సమర్పించాడు. ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన ట్రిజాల్ ఎంటర్‌ప్రైజెస్ డైరెక్టర్ రాజేష్ కుమార్ రెండు స్వర్ణ హారాలను విరాళంగా ఇచ్చాడు.
5.5 కిలోల బంగారంతో రెండు సుదర్శన సాలిగ్రామ హారాలను రాజేష్ తయారు చేయించారు. వాటిని టీటీడీ ఈవో సాంబశివరావుకు బుధవారం ఉదయం ఆయన అందజేశారు. వీటి విలువ సుమారు రూ.1.15కోట్ల ఉంటుందని తెలుస్తుంది. ఈ రెండు హారాలను ఉత్సవ సమయాల్లో ఒకటి మూలవిరాట్‌కు రెండోది మలయప్ప స్వామికి అలంకరించనున్నారు.