మహిళలకు మత్తు మందు ఇచ్చి.. | theft at Tirumala | Sakshi
Sakshi News home page

మహిళలకు మత్తు మందు ఇచ్చి..

Published Thu, Sep 24 2015 1:49 PM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

theft at Tirumala

తిరుమలలో ఇద్దరు మహిళలకు మత్తుమందు ఇచ్చి బంగారునగలను దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే..  గురువారం తమిళనాడుకు చెందిన సత్యవతి, సుస్మితకుమారి అనే ఇద్దరు మహిళలు బుధవారం శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల వచ్చారు. తిరుమల అన్నదానసత్రం వద్ద ఓ వ్యక్తి వీరికి పరిచయమయ్యాడు.

మహిళలతో సన్నిహితంగా ఉంటూ అన్నం పెట్టించాడు. ఉండటానికి కౌస్తుభం అతిధి భవనంలో రూం నెం235 ఏర్పాటు చేశాడు.  గురువారం ఉదయం సదరు మహిళలకు మత్తు మందు ఇచ్చి ఒంటిపై ఉన్న రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో ఉడాయించాడు.
స్పృహ వచ్చాక విషయం తెలుసుకున్న మహిళలు తిరుమల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడ్ని పట్టుకోవడానికి సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement