Tamil devotees
-
ఆ చానల్ ప్రారంభించడం అభినందనీయం
గవర్నర్ నరసింహన్ సాక్షి, తిరుమల: తమిళ భక్తుల కోసం టీటీడీ ఎస్వీబీసీ చానల్–2 ప్రారంభించడం అభినందనీయమని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అన్నారు. దీనివల్ల శ్రీవారి నిత్యకైంకర్యాలతోపాటు ప్రత్యేక ఉత్సవాలను భక్తులు కనులారా తిలకించే అవకాశం ఉందని, అందుకు చొరవ చూపిన టీటీడీ ఈవో సాంబశివరావును గవర్నర్ అభినందించారు. శనివారం గవర్నర్ మరోసారి శ్రీవారిని దర్శించుకున్నారు. -
తిరుమలకు పోటెత్తిన తమిళభక్తులు
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో సోమవారం భక్తులు రద్దీ ఒక్కసారిగా పెరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉండడంతో ఏఐడీఎంకే పార్టీ కార్యకర్తలు, అమ్మ అభిమానులు, తమిళభక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. అమ్మ కోలుకోవాలంటూ శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో లండన్ వైద్యులు, ఎయిమ్స్ వైద్య బృందాలు జయలలిత ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. -
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం..ఇద్దరికి గాయాలు
తిరుమల ఘాట్ రోడ్డులో 32వ కిలోమీటర్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. కొండపైకి వెళ్తున్న జీపు ప్రమాదవశాత్తూ కల్వర్టును ఢీకొట్టడంతో ఇద్దరు తమిళ భక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. -
మహిళలకు మత్తు మందు ఇచ్చి..
తిరుమలలో ఇద్దరు మహిళలకు మత్తుమందు ఇచ్చి బంగారునగలను దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. గురువారం తమిళనాడుకు చెందిన సత్యవతి, సుస్మితకుమారి అనే ఇద్దరు మహిళలు బుధవారం శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల వచ్చారు. తిరుమల అన్నదానసత్రం వద్ద ఓ వ్యక్తి వీరికి పరిచయమయ్యాడు. మహిళలతో సన్నిహితంగా ఉంటూ అన్నం పెట్టించాడు. ఉండటానికి కౌస్తుభం అతిధి భవనంలో రూం నెం235 ఏర్పాటు చేశాడు. గురువారం ఉదయం సదరు మహిళలకు మత్తు మందు ఇచ్చి ఒంటిపై ఉన్న రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. స్పృహ వచ్చాక విషయం తెలుసుకున్న మహిళలు తిరుమల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడ్ని పట్టుకోవడానికి సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.