
ఆ చానల్ ప్రారంభించడం అభినందనీయం
గవర్నర్ నరసింహన్
సాక్షి, తిరుమల: తమిళ భక్తుల కోసం టీటీడీ ఎస్వీబీసీ చానల్–2 ప్రారంభించడం అభినందనీయమని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అన్నారు. దీనివల్ల శ్రీవారి నిత్యకైంకర్యాలతోపాటు ప్రత్యేక ఉత్సవాలను భక్తులు కనులారా తిలకించే అవకాశం ఉందని, అందుకు చొరవ చూపిన టీటీడీ ఈవో సాంబశివరావును గవర్నర్ అభినందించారు. శనివారం గవర్నర్ మరోసారి శ్రీవారిని దర్శించుకున్నారు.