టీటీడీకి రూ. కోటి విలువైన ఆస్తి విరాళం | One Crore valuable asset donation to TTD | Sakshi
Sakshi News home page

టీటీడీకి రూ. కోటి విలువైన ఆస్తి విరాళం

Published Sun, Jan 29 2017 3:10 AM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM

One Crore valuable asset donation to TTD

భక్తిని చాటుకున్న తిరుపతికి చెందిన బసవపున్నయ్య

తిరుపతి అర్బన్‌: తిరుపతిలోని కొర్లగుంట మారుతీనగర్‌కు చెందిన అంచ బసవపున్నయ్య అనే భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానంకి రూ.కోటి విలువ చేసే ఆస్తిని విరాళంగా ఇచ్చారు. కొర్లగుంటలోని తన మూడు అంతస్తుల భవనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పత్రాలను టీటీడీ ఈవో సాంబశివరావుకు శనివారం అందజేశారు.

అలాగే బసవపున్నయ్యకు తొట్టంబేడు మండలం తాటిపర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని 222 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని కూడా టీటీడీకి విరాళంగా ఇస్తున్నట్టు తెలిపారు. కాగా భవనం మార్కెట్‌ విలువ ప్రకారం రూ.కోటి అని, ఖాళీ స్థలం విలువ రూ.5 లక్షలు ఉంటుందని దాత బసవపున్నయ్య ఈవోకు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement