
టీటీడీ ఈవోగా ఏకే సింఘాల్
సాక్షి, తిరుమల: టీటీడీ నూతన ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 10.56కు తిరుమల ఆలయం లోని రంగనాయకుల మండ పంలో బదిలీ అయిన ఈవో డి.సాంబశివరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు. భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల విరాళం ఫైలుపై ఆయన తొలి సంతకం చేశారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు.