
స్వర్ణ రథాన్ని లాగుతున్న జస్టిస్ ఎన్వీ రమణ, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు
సాక్షి, తిరుమల: తిరుమల లో శ్రీవారి స్వర్ణ రథోత్సవం వైభవంగా సాగింది. వసం తోత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం ఉదయం 8 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై మాడ వీధుల్లో ఊరేగారు. మహిళలు గోవింద నామ స్మరణలతో ఉత్సాహంగా రథాన్ని ముందుకు లాగారు. వేలాదిమంది భక్తులు ఊరేగింపులో పాల్గొని స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్నారు. స్వర్ణరథోత్సవం ముగిసిన తర్వాత స్వామివారిని ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంత మంటపానికి వేంచేపు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు జీయర్ నేతృత్వంలో రామకృష్ణ దీక్షితులు ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహిం చారు. వసంతోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు పట్టువస్త్రం, ప్రసాదాలు అందజేశారు.
శ్రీవారి సేవలో జస్టిస్ ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం వేకువజామున అభిషేక సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజులతో కలిసి స్వర్ణరథోత్సవంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment