jeo srinivasa raju
-
ఇకపై సర్వదర్శనానికి టైం స్లాట్ : జేఈఓ
సాక్షి, తిరుమల : తిరుమలలో ఇకపై సర్వదర్శనానికి కూడా టైమ్ స్లాట్‌ను కేటాయించనున్నారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి అవలంభిస్తున్న ఈ సౌకర్యాన్ని గత ఏడాది నడక మార్గం ద్వారా వచ్చే భక్తులకు కూడా కల్పించారు. టైం స్లాట్ పక్రియ ద్వారా ఎక్కువ సమయం క్యూ లైన్లలో వేచి ఉండకుండా నిర్ణయించిన సమయానికే భక్తులకు స్వామివారి దర్శనం అవుతుంది. తాజాగా సర్వదర్శనం(ఉచిత దర్శనం) భక్తులకు కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నమని జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు(గురువారం) ముహూర్తం బాగుందని దీనిని ప్రారంభించామన్నారు. మే మొదటి వారం నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని వెల్లడించారు. సర్వదర్శనం స్లాట్‌కి ఆధార్ లేదా ఓటర్ కార్డు తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ పథకం అమల్లోకి వచ్చే వరకు రోజుకు 1000 టికెట్లు ఇస్తూ ప్రయోగత్మక పరిశీలన చేస్తామని తెలిపారు. -
వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం
సాక్షి, తిరుమల: తిరుమల లో శ్రీవారి స్వర్ణ రథోత్సవం వైభవంగా సాగింది. వసం తోత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం ఉదయం 8 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై మాడ వీధుల్లో ఊరేగారు. మహిళలు గోవింద నామ స్మరణలతో ఉత్సాహంగా రథాన్ని ముందుకు లాగారు. వేలాదిమంది భక్తులు ఊరేగింపులో పాల్గొని స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్నారు. స్వర్ణరథోత్సవం ముగిసిన తర్వాత స్వామివారిని ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంత మంటపానికి వేంచేపు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు జీయర్ నేతృత్వంలో రామకృష్ణ దీక్షితులు ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహిం చారు. వసంతోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు పట్టువస్త్రం, ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి సేవలో జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం వేకువజామున అభిషేక సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత టీటీడీ ఈవో అనిల్కుమార్సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజులతో కలిసి స్వర్ణరథోత్సవంలో పాల్గొన్నారు. -
వార్షిక వసంతోత్సవాలకు తిరుమల ముస్తాబు
-
నేటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
తిరుపతిఅర్బన్: తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలను గురువారం నుంచి శనివారం వరకు 3 రోజులు నిర్వహించనున్నట్లు తిరుమల జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. బుధవారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏడాది చైత్ర పౌర్ణిమకు ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తొలిరోజైన గురువారం ఉద యం 8 గంటలకు శ్రీదేవి–భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు 4 మాడ వీధుల్లో ఊరేగింపుగా వసంతోత్సవ మండపానికి వేంచేస్తారని తెలిపారు. అక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు, ఆస్థానం పూర్తయిన తర్వాత తిరిగి ఆలయానికి చేరుకుంటారన్నారు. రెండోరోజైన శుక్రవారం నాడు మలయప్పస్వామివారు ఉదయం 8 నుంచి 9 వరకు స్వర్ణ రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శమివ్వనున్నట్లు చెప్పారు. చివరిరోజున మలయప్పస్వామి వారితో పాటు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంత మండపానికి ఊరేగింపుగా వెళ్లి వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయాన్ని చేరుకుంటారని వివరించారు. వసంతోత్సవాలను పురస్కరించుకొని 3 రోజుల్లో నిర్వహించాల్సిన ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసినట్లు చెప్పారు. గురువారం తిరుప్పావడ సేవ, శుక్రవారం తోమాలసేవ, అర్చన, నిజపాద దర్శన సేవలను కూడా రద్దు చేసినట్లు తెలిపారు. -
శ్రీవారి సేవలకు 10,737 టిక్కెట్ల కేటాయింపు
తిరుమల: ఆన్ లైన్లో సేవా టిక్కెట్లు లక్కీ డిప్‌కు96,837 మంది భక్తులు రిజిష్టర్ చేసుకున్నారని జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. లక్కీ డిప్ ద్వారా సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజ పాదదర్శనం, విశేష పూజ సేవలకు 10, 737 టిక్కెట్లు కేటాయించామని వివరించారు. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు విచ్చేసే భక్తులకు ఆధార్ కార్డు తప్పనిసరి చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన అన్నారు. భక్తులలో 94 శాతం మంది ఆధార్ కార్డు తీసుకొస్తున్నట్లు సర్వే ద్వారా వెల్లడైందన్నారు. సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయింపు జూలై 1వ తేదీ నుంచి పునరుద్దరిస్తామని చెప్పారు. బ్రేక్ దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా ఆధార్ ను గుర్తింపుగా కార్డుగా చూపాలని అన్నారు. వసతి గదులు పొందిన భక్తులు 12 గంటలలోపు ఖాళీ చేస్తే సగం నగదు తిరిగి చెల్లించేలా ఏర్పాట్లు చేశామని జేఈఓ చెప్పారు. -
'శ్రీవారి సన్నిధిలో ఆధార్ తప్పనిసరి’
తిరుమల: శ్రీవారి సన్నిధిలో అంగ ప్రదక్షిణ పొందాలనుకునే భక్తులు ఆధార్ కార్డు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని జేఏవో శ్రీనివాసరాజు కోరారు. వచ్చే గురువారం నుంచి ఈ నిబంధనను అమల్లోకి తేనున్నట్లు చెప్పారు. దీంతో పాటు బూందీపోటులో ఇకపై ప్రతి పౌర్ణమి, అమావాస్యకు శుద్ధి కార్యక్రమం చేపడతామన్నారు. శ్రీవారి కానుకల లెక్కింపునకు అధునాతన కాంప్లెక్స్ నిర్మించనున్నట్లు వివరించారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా తిరుమలలో వ్యర్థాలను పూర్తి స్థాయిలో తొలగించనున్నట్లు వెల్లడించారు. -
భక్త వైకుంఠం
-
'వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి'
-
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి: జేఈవో
తిరుమల: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు పురస్కరించుకుని తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ప్రత్యేక అలంకరణ ఏర్పాట్లు పూర్తయ్యయని తిరుమల జేఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు వెల్లడించారు. ఏకాదశి రోజున స్వర్ణరథం, ద్వాదశికి శ్రీవారి చక్రస్నానం కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సామాన్య భక్తులే అధిక ప్రాధాన్యతగా ఆయన పేర్కొన్నారు. ఏకాదశి, ద్వాదశి రోజుల్లో 48 గంటలపాటు వైకుంఠద్వారం తెరిచే ఉంటుందన్నారు. ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు, సిఫారసు లేఖలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. సామాన్య భక్తులను ఆదివారం(రేపు) ఉదయం 11 గంటలకు కంపార్ట్మెంట్లలోకి అనుమతిస్తామన్నారు. ఏకాదశి రోజున ఒంటిగంటలకు వీఐపీ దర్శనాలు ప్రారంభమవుతాయని జేఈఓ చెప్పారు. వీఐపీతో పాటు ముగ్గురికి వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతి లభిస్తుందని తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని వైకుంఠం క్యాంప్లెక్స్ నుంచి 5 కిలోమీటర్ల మేర క్యూలైన్ ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. అంతేకాకుండా క్యూలెన్‌లో ఉండే భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రామరాజు, సీతా నిలయంలో వీఐపీలకు దర్శన వసతి ఏర్పాట్లు చేయనున్నట్టు జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. -
శ్రీవారి సేవలో తమిళనాడు గవర్నర్ రోశయ్య
సాక్షి, తిరుమల : తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య శుక్రవారం తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం ఆయన ఆలయానికి వచ్చారు. ముందుగా మహాద్వారానికి మొక్కుకున్నారు. తర్వాత శ్రీవారిని, వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం చేయగా, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు పట్టువస్త్రంతో సత్కరించి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట డెప్యూటీ ఈవోలు సాగి వేణుగోపాల్, కోదండరావు ఉన్నారు. రుతువులు సక్రమంగా ఉండాలని శ్రీవారు దీవిస్తారు తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందని గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. ప్రతి సారి కుటుంబ సభ్యులతో వచ్చే ఆనవాయితీ ఉందని, ఈ సారి మాత్రం ఒంటరిగానే వచ్చి ఏడుకొండలవాడిని దర్శించుకున్నానన్నారు. రాష్ట్రంలో వాతావరణం బాగా వేడిగా ఉందని, రుతువులు సక్రమంగా ఉంటూ ప్రజలంందరూ సుఖంగా ఉండేలా భగవంతుడు దీవిస్తాడని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన తిరుచానూరు చేరుకుని పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి సేవలో రోశయ్య తిరుచానూరు: తిరుచానూ రు శ్రీపద్మావతి అమ్మవారిని తమిళనాడు గవర్నర్ కే.రోశయ్య శుక్రవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆయనకు ఆల యం ఎదుట టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్, ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఏఈవో నాగరత్న, సూపరింటెండెంట్ వరప్రసాద్, ఎన్టీఆర్ రవి, పసుపర్తి గోపి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కుంకుమార్చన సేవలో ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వాద మండపంలో గవర్నర్‌కు ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. -
'జరగని ఘటనను మీడియాకు అందించటం దురదృష్టకరం'
తిరుపతి : కలియుగ దైవం శ్రీనివాసుడికి సుప్రభాత సేవ ఆలస్యమైందంటూ వచ్చిన వార్తలపై టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు వివరణ ఇచ్చారు. బంగారు వాకిలి తాళం చెవి విరిగిపోవటంతో వాటిని వాటిని పగలగొట్టి ఉదయం 2.30 గంటలకు తెరిచామని ఆయన తెలిపారు. సుప్రభాత సేవను యథావిధిగానే తెల్లవారుజామున మూడు గంటలకు నిర్వహించామని, ఎక్కడా ఆలస్యం జరగలేదని జేఈవో తెలిపారు. జరగని ఘటనను మీడియా సమాచారం అందించటం దురదృష్టకరమన్నారు. కాగా సుప్రభాత సేవ సమయంలో బంగారు వాకిలి తలుపులు త్వరగా తెరవలేదంటూ సిబ్బందితో పాటు అర్చకులపైనా టీటీడీ ఈవో సాంబశివరావు మండిపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై టీటీడీ అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. -
తిరుమల జేఈవోను తరిమిన పోలీసు కుటుంబాలు
తిరుమల జేఈవో శ్రీనివాసరాజుకు చేదు అనుభవం ఎదురైంది. వైకుంఠ ఏకాదశి, కొత్త సంవత్సరం సందర్భంగా భద్రత కోసం వచ్చిన పోలీసు కుటుంబాలు.. తమకు దర్శనం కల్పించలేదని తీవ్ర ఆగ్రహానికి గురయ్యాయి. టీటీడీ ఉద్యోగులకు మాత్రం విడిగా దర్శనం కల్పించిన జేఈవో.. పోలీసులను మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. చివరకు జేఈవోను పోలీసు కుటుంబాల సభ్యులు తరుముకెళ్లారు. దాంతో జీఈవో శ్రీనివాసరాజు తిరుమల వీధుల్లో పరుగులు తీయాల్సి వచ్చింది. 24 గంటలు విధి నిర్వహణలో ఉంటున్న పోలీసులను అధికారులు పట్టించుకోలేదని వాళ్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.