
శ్రీవారి సేవలకు 10,737 టిక్కెట్ల కేటాయింపు
తిరుమల: ఆన్ లైన్‌లో సేవా టిక్కెట్లు లక్కీ డిప్‌కు96,837 మంది భక్తులు రిజిష్టర్ చేసుకున్నారని జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. లక్కీ డిప్ ద్వారా సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజ పాదదర్శనం, విశేష పూజ సేవలకు 10, 737 టిక్కెట్లు కేటాయించామని వివరించారు. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు విచ్చేసే భక్తులకు ఆధార్ కార్డు తప్పనిసరి చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
భక్తులలో 94 శాతం మంది ఆధార్ కార్డు తీసుకొస్తున్నట్లు సర్వే ద్వారా వెల్లడైందన్నారు. సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయింపు జూలై 1వ తేదీ నుంచి పునరుద్దరిస్తామని చెప్పారు. బ్రేక్ దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా ఆధార్ ను గుర్తింపుగా కార్డుగా చూపాలని అన్నారు. వసతి గదులు పొందిన భక్తులు 12 గంటలలోపు ఖాళీ చేస్తే సగం నగదు తిరిగి చెల్లించేలా ఏర్పాట్లు చేశామని జేఈఓ చెప్పారు.