
సాక్షి, తిరుమల : తిరుమలలో ఇకపై సర్వదర్శనానికి కూడా టైమ్ స్లాట్‌ను కేటాయించనున్నారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి అవలంభిస్తున్న ఈ సౌకర్యాన్ని గత ఏడాది నడక మార్గం ద్వారా వచ్చే భక్తులకు కూడా కల్పించారు. టైం స్లాట్ పక్రియ ద్వారా ఎక్కువ సమయం క్యూ లైన్లలో వేచి ఉండకుండా నిర్ణయించిన సమయానికే భక్తులకు స్వామివారి దర్శనం అవుతుంది.
తాజాగా సర్వదర్శనం(ఉచిత దర్శనం) భక్తులకు కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నమని జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు(గురువారం) ముహూర్తం బాగుందని దీనిని ప్రారంభించామన్నారు. మే మొదటి వారం నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని వెల్లడించారు. సర్వదర్శనం స్లాట్‌కి ఆధార్ లేదా ఓటర్ కార్డు తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ పథకం అమల్లోకి వచ్చే వరకు రోజుకు 1000 టికెట్లు ఇస్తూ ప్రయోగత్మక పరిశీలన చేస్తామని తెలిపారు.