Time slot
-
తిరుమల: మే నెల దర్శన టికెట్ల తేదీల విడుదల
తిరుపతి: మే నెల తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల తేదీలను టీటీడీ విడుదల చేసింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాను విడుదల చేసింది. అలాగే, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక.. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మే నెల ఆన్లైన్ కోటాను రేపు(ఫిబ్రవరి 23) ఉదయం 11 గంటలకు, అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు టీటీడీ దేవస్థానం ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. మే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు, 24 మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదులకు సంబంధించిన కోటాను ఆన్లైన్లో పెట్టనుంది. దీంతోపాటు 27న ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, మధ్యాహ్నం 2 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్లైన్లో అందుబాటులోకి టీటీడీ దేవస్థానం తీసుకురానుంది. ఇక.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 13 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న (బుధవారం) 69,191 మంది స్వామివారిని దర్శించుకోగా 22,295 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.60 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది 13 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 14 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న (మంగళవారం) 62,304 మంది స్వామివారిని దర్శించుకోగా 20,261 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.61 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది 6 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 10 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
ఏపీ: పేదల ముంగిటకు ఉచిత రేషన్
సాక్షి, అమరావతి: లాక్డౌన్ నేపథ్యంలో రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా రెండో విడత అందిస్తున్న సరుకుల పంపిణీ గురువారం సజావుగా ప్రారంభమైంది. రేషన్ దుకాణాల వద్ద రద్దీని నివారించేందుకు టైం స్లాట్‌తో కూడిన కూపన్లు జారీ చేయడంతో నిర్దేశించిన సమయానికి చేరుకుని వేచి చూడాల్సిన పని లేకుండా సరుకులు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో కుటుంబానికి కిలో శనగలు, రేషన్ కార్డులో నమోదైన ప్రతి సభ్యుడికి 5 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందచేశారు. కరోనా వైరస్ ప్రభావంతో రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో ప్రభుత్వం నేరుగా లబ్ధి్దదారుల ఇళ్లకే ఉచిత రేషన్ సరుకులను అంద చేసింది. బయోమెట్రిక్ లేకుండా భౌతిక దూరాన్ని పాటించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. లాక్డౌన్ వల్ల పేదలు ఆకలితో వస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ ఈ నెలలో మూడు దఫాలు ఉచితంగా రేషన్ సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. మొదటి విడత సరుకులను గత నెల 29 నుంచి ఈ నెల 15 వరకు పంపిణీ చేశారు. పంపిణీ ఇలా.. ► కొందరు డీలర్లు ఉదయం ఆరు గంటల నుంచే సరుకుల పంపిణీ ప్రారంభించారు. పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ ఉదయం 5 గంటలకే కమాండ్ కంట్రోల్ రూం నుంచి ఎప్పటికప్పుడు జాయింట్ కలెక్టర్లతో పర్యవేక్షించారు. ► రెండో విడత ఉచిత సరుకులను మొదటిరోజు 18,33,245 కుటుంబాలకు పంపిణీ చేశారు. ► పోర్టబిలిటీ ద్వారా 3,51,185 కుటుంబాలు సరుకులు తీసుకున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 56,659, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 10 కుటుంబాలు పోర్టబిలిటీని వినియోగించుకున్నాయి. ► రాష్ట్రవ్యాప్తంగా 26,712.441 టన్నుల బియ్యం, 1,714.302 టన్నుల శనగలు తొలిరోజు పంపిణీ చేశారు. ► రేషన్ షాపుల వద్ద శానిటైజర్, సబ్బు, నీటిని అందుబాటులో ఉంచారు. రెడ్ జోన్లలో ఇంటికే రేషన్ – విశాఖ జిల్లాలో 2,179 రేషన్ దుకాణాలతో పాటు 1,817 తాత్కాలిక కౌంటర్ల ద్వారా ఉచిత సరుకుల పంపిణీ చేపట్టారు. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా 1,15,014 మందికి సరుకులు అందచేశారు. రెడ్‌జోన్ ప్రాంతాలైన పద్మనాభం మండలం రేవిడి వెంకటాపురం, పాయకరావుపేట, నర్సీపట్నం ప్రాంతాల్లో లబిŠాధ్దరులకు ఇంటి వద్దే వలంటీర్లు ఉచిత సరుకులు పంపిణీ చేశారు. – కరోనా కేసులు అధికంగా నమోదు కావడంతో రెడ్ జోన్‌గా ప్రకటించిన ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఇస్లాంపేటలో వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి ఉచిత రేషన్ సరుకులు అందజేశారు. పేదింటిని కాపాడారు.. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం జగన్నాయకులపాలేనికి చెందిన భూమాడి సత్తిరాజు చేనేత కార్మికుడు. ఆయన పనిచేసే బట్టల దుకాణం లాక్‌డౌన్‌తో మూత పడటంతో ఆందోళనకు గురయ్యాడు. ప్రభుత్వం ఉచితంగా రేషన్ సరుకులు అందించడంతో పాటు రూ.వెయ్యి నగదు సాయం కూడా చేయడంపై పేదింటిని కాపాడిన దేవుడు ముఖ్యమంత్రి జగన్ అని కృతజ్ఞతలు తెలిపాడు. కరోనా ఉన్నా ఆగలేదు.. ‘కష్టకాలంలో ప్రభుత్వం ఉచితంగా బియ్యం, పప్పులు అందించి ప్రజలను అదుకుంది. మా గ్రామంలో నలుగురికి కరోనా సోకడంతో వలంటీర్ల ద్వారా రేషన్ సరుకులు ఉచితంగా ఇంటివద్దే అందచేశారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు’ – ఎం.నాగరాజు, వెంకటాపురం, పద్మనాభం మండలం, విశాఖ జిల్లా గుడివాడలో డోర్ టు డోర్ పంపిణీ గుడివాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా త్వరలో ప్రారంభించనున్న డోర్ టు డోర్ రేషన్ సరుకుల పంపిణీలో లోటుపాట్లను గుర్తించేందుకు కృష్ణా జిల్లాలోని గుడివాడతోపాటు కొన్ని ప్రాంతాల్లో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) ఒక ప్రకటనలో తెలిపారు. కార్డుదారుల ఎదురుగానే తూకం వేసి వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు రేషన్ సరుకులు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 56 లక్షల టన్నుల ధాన్యం పండిందని, దీనిలో 33 లక్షల టన్నులు పౌరసరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. ధాన్యం విక్రయించదలచిన రైతులు గ్రామ సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కొడాలి నాని ఇంటికే వచ్చింది ప్రకాశం జిల్లా ఒంగోలు ఇస్లాంపేటలో ఇంటింటికి వెళ్లి ఉచిత రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేస్తున్న వలంటీర్లు తూర్పుగోదావరి జిల్లా వీఆర్ పురం మండలం ఉమ్మిడివరంలో తన ఇంటివద్ద వలంటీర్ రామకృష్ణ అందిస్తున్న బియ్యాన్ని తీసుకుంటున్న పాయం రాధ -
నల్ల బ్యాడ్జీలతో రావొద్దు: టీటీడీ జేఈఓ
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదర్శనంలో టైంస్లాట్ కోటా విధింపు విధానం శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. టీటీడీ జేఈఓ శ్రీనివాస రాజు గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... శనివారం, ఆదివారల్లో 30 వేల టోకన్లు, సోమ, శుక్రవాల్లో 20 వేలు, మంగళ, బుధ, గురువారల్లో 17 వేల టోకన్లు కేటాయింపు జరిగిందని జేఈఓ తెలిపారు. ఈ నిబంధనలు రేపు అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని, భక్తులు టైంస్లాట్ కౌంటర్లు సౌకర్యాలు సులభంగా పొందేందుకు ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలని ఆయన సూచించారు. టీటీడీ ఉద్యోగులు ఆలయం లోపల నిరసనలు తెలపకుండా ఆంక్షలు విధించారు. స్వామి వారి అభరణాల్లో కొన్ని కనిపించకుండా పోయాయని మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపణలు నేపథ్యంలో నిజాలు నిగ్గు తేల్చాలంటూ టీటీడీ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. దీనిపై భక్తుల నుంచి అభ్యంతరాలు రావడంతో ఆలయ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ఆలయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపరాదంటూ జేఈఓ శ్రీనివాస రాజు ఆదేశాలు జారీ చేశారు. -
ఇకపై సర్వదర్శనానికి టైం స్లాట్ : జేఈఓ
సాక్షి, తిరుమల : తిరుమలలో ఇకపై సర్వదర్శనానికి కూడా టైమ్ స్లాట్‌ను కేటాయించనున్నారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి అవలంభిస్తున్న ఈ సౌకర్యాన్ని గత ఏడాది నడక మార్గం ద్వారా వచ్చే భక్తులకు కూడా కల్పించారు. టైం స్లాట్ పక్రియ ద్వారా ఎక్కువ సమయం క్యూ లైన్లలో వేచి ఉండకుండా నిర్ణయించిన సమయానికే భక్తులకు స్వామివారి దర్శనం అవుతుంది. తాజాగా సర్వదర్శనం(ఉచిత దర్శనం) భక్తులకు కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నమని జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు(గురువారం) ముహూర్తం బాగుందని దీనిని ప్రారంభించామన్నారు. మే మొదటి వారం నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని వెల్లడించారు. సర్వదర్శనం స్లాట్‌కి ఆధార్ లేదా ఓటర్ కార్డు తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ పథకం అమల్లోకి వచ్చే వరకు రోజుకు 1000 టికెట్లు ఇస్తూ ప్రయోగత్మక పరిశీలన చేస్తామని తెలిపారు. -
టైంస్లాట్ సర్వదర్శనం ప్రారంభం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదర్శనంలో టైంస్లాట్ విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. టీటీడీ ఏర్పాటు చేసిన 14 ప్రాంతాల్లో 117 కౌంటర్ల ద్వారా ఉదయం 8 గంటల నుంచి టికెట్లను జారీ చేశారు. భక్తుల కోసం ఈరోజు 18వ వేల టోకన్లను అందుబాటు ఉంచారు. భక్తుల ఆధార్ కార్డు ఆధారంగా టికెట్లు ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. వారం రోజుల పాటు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. అనంతరం భక్తుల నుంచి అభిప్రాయాలను సేకరించి లోటుపాట్లను సవరిస్తామని అధికారులు తెలిపారు. భక్తులు కంపార్ట్ మెంట్లలలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నిర్దేశిత సమయానికి దివ్వదర్శనం కాంప్లెక్స్ వద్దకు చేరుకోవచ్చన్నారు. మరోవైపు ఆధార్ కార్డు లేని భక్తులు యథావిధిగా రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి కంపార్ట్ మెంట్లో వేచి ఉండి శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు ఉంది. టైంస్లాట్ కేంద్రాలు.. ఏర్పాటు చేసిన కౌంటర్లు - ఎంబీసీ 26 లగేజీ కేంద్రం 05 - సీఆర్ఓ అంగప్రదక్షిణం కౌంటర్ల వద్ద 08 - కౌస్తుభం 10 - ఏటీసీ 04 - ఆళ్వారు చెరువు గట్టుపై 14 - పద్మావతి డిపాజిట్ కేంద్రం 06 - ఏఎస్సీ కల్యాణకట్ట వద్ద 12 - సన్నిధానం 05 - సప్తగిరిసత్రాలు 10 - శ్రీవారి మెట్టు 04 - అలిపిరి కాలిబాట గాలిగోపురం 10 - కల్యాణవేదిక వద్ద 06 - వరాహస్వామి అతిథిగృహం-1 వద్ద 07 - నందకం 06 - ఆర్టీసీ బస్టాండు వద్ద 10 -
టైం స్లాట్ దర్శనానికే టీటీడీ మొగ్గు
తిరుమల: శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లలో గంటల తరబడి ఎదురుచూసే విధానానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) క్రమంగా స్వస్తి పలుకుతోంది. రూ.300 టికెట్ల తరహాలోనే కాలిబాట భక్తులకు కూడా ప్రత్యేక దర్శనం కోసం టైం స్లాట్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. భక్తులకు కేటాయించిన సమయం ప్రకారం స్వామివారిని దర్శించుకోవచ్చు. 2017 అర్థ సంవత్సరం లెక్కల ప్రకారం.. రోజూ 80 వేల మంది శ్రీవారిని దర్శించు కుంటున్నారు. ఇందులో రూ. 300 టికెట్ (టైం స్లాట్ విధానంలో) ద్వారా రోజుకు 15 వేల నుంచి 25 వేల మందికి టీటీడీ శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. ఇదే విధానా న్ని ఈ నెల 17 నుంచి కాలిబాట భక్తులకూ వర్తింపజేసింది. అలిపిరి మార్గంలో రోజుకు 14 వేల టికెట్లు, శ్రీవారి మెట్టు మార్గంలో మరో 6 వేల టికెట్లు ఇస్తున్నారు. ఆ టికెట్లపై ఉన్న సమయం ప్రకారం భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. -
త్వరలోనే ఆన్‌లైన్‌లోకి మరో 7 వేల టికెట్లు
* దివ్యదర్శనం, సర్వదర్శనానికి టైంస్లాట్ * సంప్రదాయ దుస్తులు తప్పనిసరి * టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం అమలు చేస్తున్న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్లైన్ టికెట్ల విధానం విజయవంతంగా కొనసాగుతోందని, దీనికి మరో 7 వేల టికెట్లను అనుసంధానం చేస్తామని టీటీడీ జేఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు చెప్పారు. తిరుమలలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 7 వేల టికెట్లను ఆన్లైన్ లోకి మళ్లించాక తిరుమలలో కరెంట్ బుకింగ్ ఉండదన్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా దర్శనంలో మార్పులు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా సర్వదర్శనం కోసం తిరుమలలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి నిర్ణీత సమయం ప్రకారం టికెట్లు కేటాయించి స్వామి దర్శనం కల్పిస్తామని చెప్పారు. కాలిబాటల్లో వచ్చే భక్తులను సైతం రోజులో పరిమిత సంఖ్యలోనే దర్శనానికి అనుమతించేందుకు వీలుగా టికెట్లపై నిర్ణీత సమయం కేటాయిస్తామన్నారు. రాబోయే రెండు నెలల్లో దాదాపు అన్ని రకాల దర్శనాల్లోనూ మార్పులు వస్తాయని తెలిపారు. టీటీడీ నిబంధనల ప్రకారం రూ.300 ఆన్లైన్ టికెట్ల భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని చెప్పారు. ఫ్యాంటుపై పంచె కట్టుకుంటే అనుమతించేది లేదన్నారు. భక్తులు కూడా టీటీడీకి సంపూర్ణంగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.