సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదర్శనంలో టైంస్లాట్ విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. టీటీడీ ఏర్పాటు చేసిన 14 ప్రాంతాల్లో 117 కౌంటర్ల ద్వారా ఉదయం 8 గంటల నుంచి టికెట్లను జారీ చేశారు. భక్తుల కోసం ఈరోజు 18వ వేల టోకన్లను అందుబాటు ఉంచారు. భక్తుల ఆధార్ కార్డు ఆధారంగా టికెట్లు ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. వారం రోజుల పాటు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.
అనంతరం భక్తుల నుంచి అభిప్రాయాలను సేకరించి లోటుపాట్లను సవరిస్తామని అధికారులు తెలిపారు. భక్తులు కంపార్ట్ మెంట్లలలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నిర్దేశిత సమయానికి దివ్వదర్శనం కాంప్లెక్స్ వద్దకు చేరుకోవచ్చన్నారు. మరోవైపు ఆధార్ కార్డు లేని భక్తులు యథావిధిగా రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి కంపార్ట్ మెంట్లో వేచి ఉండి శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు ఉంది.
టైంస్లాట్ కేంద్రాలు.. ఏర్పాటు చేసిన కౌంటర్లు
- ఎంబీసీ 26 లగేజీ కేంద్రం 05
- సీఆర్‌ఓ అంగప్రదక్షిణం కౌంటర్ల వద్ద 08
- కౌస్తుభం 10
- ఏటీసీ 04
- ఆళ్వారు చెరువు గట్టుపై 14
- పద్మావతి డిపాజిట్ కేంద్రం 06
- ఏఎస్‌సీ కల్యాణకట్ట వద్ద 12
- సన్నిధానం 05
- సప్తగిరిసత్రాలు 10
- శ్రీవారి మెట్టు 04
- అలిపిరి కాలిబాట గాలిగోపురం 10
- కల్యాణవేదిక వద్ద 06
- వరాహస్వామి అతిథిగృహం-1 వద్ద 07
- నందకం 06
- ఆర్టీసీ బస్టాండు వద్ద 10
Comments
Please login to add a commentAdd a comment