కలియుగ దైవం శ్రీనివాసుడికి సుప్రభాత సేవ ఆలస్యమైందంటూ వచ్చిన వార్తలపై టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు వివరణ ఇచ్చారు.
తిరుపతి : కలియుగ దైవం శ్రీనివాసుడికి సుప్రభాత సేవ ఆలస్యమైందంటూ వచ్చిన వార్తలపై టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు వివరణ ఇచ్చారు. బంగారు వాకిలి తాళం చెవి విరిగిపోవటంతో వాటిని వాటిని పగలగొట్టి ఉదయం 2.30 గంటలకు తెరిచామని ఆయన తెలిపారు. సుప్రభాత సేవను యథావిధిగానే తెల్లవారుజామున మూడు గంటలకు నిర్వహించామని, ఎక్కడా ఆలస్యం జరగలేదని జేఈవో తెలిపారు.
జరగని ఘటనను మీడియా సమాచారం అందించటం దురదృష్టకరమన్నారు. కాగా సుప్రభాత సేవ సమయంలో బంగారు వాకిలి తలుపులు త్వరగా తెరవలేదంటూ సిబ్బందితో పాటు అర్చకులపైనా టీటీడీ ఈవో సాంబశివరావు మండిపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై టీటీడీ అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.