టీటీడీ సిబ్బంది తీరుపై ఈవో సాంబశివరావు మండిపడ్డారు.
తిరుమల: టీటీడీ సిబ్బంది తీరుపై టీటీడీ ఈవో సాంబశివరావు మండిపడ్డారు. సుప్రభాత సేవ సమయంలో బంగారు వాకిలి తలుపులు త్వరగా తెరవలేదంటూ సిబ్బందితో పాటు, అర్చకులపై ఆయన బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన వచ్చిన సమయంలో బుధవారం వేకువజామన ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై టీటీడీ అధికారులు విచారణ చేస్తున్నట్టు సమాచారం. కాగా, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కుటుంబ సమేతంగా మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న సంగతి తెలిసిందే.