స్నేహితులకు అంకితం | Prema Antha Easy Kaadu movie Friendship Day special song Release | Sakshi
Sakshi News home page

స్నేహితులకు అంకితం

Published Mon, Aug 6 2018 12:35 AM | Last Updated on Mon, Aug 6 2018 12:35 AM

Prema Antha Easy Kaadu movie Friendship Day special song Release - Sakshi

రాజేష్‌ కుమార్, ప్రజ్ఞు

రాజేశ్‌ కుమార్, ప్రజ్జు హీరో హీరోయిన్లుగా ఈశ్వర్‌ దర్శకత్వంలో తెరక్కెక్కుతున్న చిత్రం ‘ప్రేమ అంత ఈజీ కాదు’. టి. అంజయ్య సమర్పణలో టి. నరేశ్‌ కుమార్, టి. శ్రీధర్‌ నిర్మిస్తున్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని ఫ్రెండ్‌షిప్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘సినిమా షూటింగ్‌ ఆల్మోస్ట్‌ 80 శాతం కంప్లీట్‌ అయింది. రాజేశ్, ప్రజ్ఞు బాగా నటిస్తున్నారు. మా సినిమాలోని ఫ్రెండ్‌షిప్‌ సాంగ్‌ని ఫ్రెండ్స్‌ అందరికీ అంకితం ఇస్తున్నాం’’ అన్నారు. ఈ సినిమాలో ధనరాజ్, ‘జబర్దస్‌’ అవినాష్, రాంప్రసాద్‌ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement