pragna
-
అమ్మా.. లేవే బడికి టైమవుతోంది.. త్వరగా రెడీ అవ్వు!
ఆదిలాబాద్: విద్యార్థులకు రాగి జావా పంపిణీలోని ర్వాహకుల అశ్రద్ధ, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం.. ఓ చిన్నారి ఆయువు తీసింది. పాఠశాలలో ఉదయం అల్పాహారంగా రాగిజావా ఇవ్వాల్సి ఉండగా, మధ్యాహ్నం వరకు నిర్వాహకుల పంపిణీ చేయలే దు. పేరెంట్స్, టీచర్ మీటింగ్‌లో పడి ఆ విషయాన్ని ఉపాధ్యాయులూ నిర్లక్ష్యం చేశారు. మీటింగ్ తర్వాత రాగిజావ పంపిణీకి తయారు చేశారు. పంపిణీ కోసం ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో వేడి గిన్నెను పాఠశాల ఆవరణలో ఉంచారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన ఒకటో తరగతి విద్యార్థిని ప్రజ్ఞ(6) అందులో పడింది. చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా మామడ మండలం కొరిటికల్ గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన కోండ్ర అశోక్, శిరీష దంపతుల కుమార్తె ప్రజ్ఞ (6) స్థానికంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతు ంది. చిన్నారి చదువులోనూ, స్నేహితులతో ఆ డుతూ హుషారుగా ఉంటుంది. పాఠశాలలో శనివారం జరిగిన పోషకుల సమావేశానికి చిన్నారి తల్లి ఉపర్పంచ్ శిరీష హాజరై మాట్లాడారు. విద్యార్థులు పాఠశాలకు పూర్తిస్థాయిలో హాజరయ్యేలా తల్లిదండ్రులు చూడాలని కోరారు. చదువులో ప్రజ్ఞ ప్రతిభ కనబరుస్తుందని ఉపాధ్యాయులు శిరీషకు వివరించారు. ప్రజ్ఞకు జ్వరం కారణంగా వారం రోజులుగా పాఠశాలకు రాలేదని శనివారం వచ్చిందని ఇంటికి పంపించాలని తల్లి కోరింది. తరగతుల అనంతరం పంపిస్తామని చెప్పాడంతో ఆమె ఇంటికి వెళ్లింది. ప్రమాదవశాత్తు పడి.. ఉదయం 11.30 గంటల తర్వాత పోషకుల సమావేశం ముగిసింది. ఈ క్రమంలో వేడి రాగిజావాను పెద్దపాత్ర నుంచి బకెట్లో వేరు చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో విద్యార్థులు వచ్చారు. ప్రజ్ఞ వరుసలో ఉండి వెనుకకు తిరిగి స్నేహితులతో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు వేడిరాగిజావా పాత్రలో పడింది. కేకలు వేయడంతో ఉన్నత పాఠశాల విద్యార్థి ఆమెను బయటకు తీశాడు. ఉపాధ్యాయులు, కుటుంబీకులు జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతిచెందింది. కాగా, ప్రజ్ఞ మృతితో కుటుంబంలో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. శనివారం పాఠశాల నుంచి కూతురిని ఇంటికి తీసుకువచ్చిన బతికేదని తల్లిదండ్రులు కన్నీరుపెట్టడం కలిచివేసింది. పాఠశాలలో విచారణ.. పాఠశాలలో తహసీల్దార్ సర్పరాజ్ ఆదివారం విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులు, మధ్యా హ్న భోజన నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకుని ఉన్నతాధికారులకు నివేదించారు. కలెక్టర్ ఆదేశాలతో డీఈవో రవీందర్‌రెడ్డి చర్యలు చేపట్టారు. ఇన్చార్జి హెచ్ఎం రమను సస్పెన్షన్ చేయడంతోపాటు ముగ్గురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మధ్యాహ్న భోజన ఏజెన్సీని తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎంఈవోని ఆదేశించారు. -
చిన్నారుల మానసిక ఎదుగుదలకు ఇంటి వాతావరణమే కీలకం
సాక్షి, హైదరాబాద్: చిన్నారుల మానసిక ఎదుగుదలకు ఇంటి వాతావరణం అత్యంత కీలకమని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ప్రజ్ఞాపరాన్డే పేర్కొన్నారు. ఆదివారం సక్షమ్, యూనిసెఫ్ సంయుక్తంగా నిర్వహించిన ‘ఆర్యజనని’ప్రారంభ కార్యక్రమంలో ఆమె వర్చువల్ పద్ధతిలో మాట్లాడారు. బాలల సంరక్షణ కార్యక్రమాల్లో తండ్రి కూడా భాగస్వామిగా ఉండాలన్నారు. మహిళలు గర్భిణిగా ఉన్నప్పటి నుంచే యోగా, ధ్యానం చేయాలని, దీంతో శిశువు సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. తల్లిపాలను తప్పనిసరిగా పట్టించడం తల్లి బాధ్యత అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, రామకృష్ణ మఠం చైర్మన్ స్వామి శితికంఠానంద, సక్షమ్ జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సుకుమార్ పాల్గొన్నారు. -
స్నేహితులకు అంకితం
రాజేశ్ కుమార్, ప్రజ్జు హీరో హీరోయిన్లుగా ఈశ్వర్ దర్శకత్వంలో తెరక్కెక్కుతున్న చిత్రం ‘ప్రేమ అంత ఈజీ కాదు’. టి. అంజయ్య సమర్పణలో టి. నరేశ్ కుమార్, టి. శ్రీధర్ నిర్మిస్తున్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని ఫ్రెండ్షిప్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ 80 శాతం కంప్లీట్ అయింది. రాజేశ్, ప్రజ్ఞు బాగా నటిస్తున్నారు. మా సినిమాలోని ఫ్రెండ్షిప్ సాంగ్‌ని ఫ్రెండ్స్ అందరికీ అంకితం ఇస్తున్నాం’’ అన్నారు. ఈ సినిమాలో ధనరాజ్, ‘జబర్దస్’ అవినాష్, రాంప్రసాద్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. -
వాటర్‌షెడ్ పనులు పూర్తిచేయాలి
చేవెళ్ల: వాటర్‌షెడ్ ద్వారా 2013-14 సంవత్సరానికి నిర్దేశించిన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని చేవెళ్ల క్లస్టర్ వాటర్‌షెడ్ ప్రాజెక్టు అధికారి ప్రజ్ఞ సూచించారు. మండల కేంద్రంలోని నీటియాజమాన్య సంస్థ కార్యాలయంలో సోమవారం చేవెళ్ల, షాబాద్, పూడూరు మండలాల పరిధిలోని వాటర్‌షెడ్ టెక్నికల్ అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వాటర్‌షెడ్ పనుల పురోగతిపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రజ్ఞ మాట్లాడుతూ చేవెళ్ల క్లస్టర్‌లోని ఐదు వాటర్‌షెడ్ గ్రామాలలో 250 ఎకరాలలో పండ్లతోటలను పెంచాలని లక్ష్యంగా నిర్ణయించినా ఇప్పటికి కేవలం 40 ఎకరాలలో మాత్రమే పూర్తిచేయగలిగామని తెలిపారు. కూలీల కొరత, రైతులు ముందుకు రాకపోవడం తదితర కారణాలతో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని ఆమె ఆదేశించారు. గత 2013-14 వాటర్‌షెడ్ ద్వారా చేయాల్సిన పనుల సమయం ఈ నెలాఖరు వరకే ఉన్నదని, వచ్చే నెల కొత్త సంవత్సరం, కొత్త లక్ష్యాలు ఉంటాయని వివరించారు. వాటర్‌షెడ్ గ్రామాలలో సోలార్ వీధి దీపాలు, వాటర్ప్ల్లాంటు ఏర్పాటు, పాఠశాలల్లో బెంచీల సౌకర్యం, మినీవాటర్ ట్యాంకుల నిర్మాణానికి ప్రభుత్వం 80శాతం నిధులను సమకూరుస్తుందని, మిగతా 20 శాతం నిధులను గ్రామస్తులు కంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. చేవెళ్ల మండలంలోని దేవునిఎర్రవల్లిలో సోలార్ వీధిదీపాల ఏర్పాటు పూర్తి కావచ్చిందని, త్వరలోనే వీటిని ప్రారంభిస్తామని చెప్పారు. వాటర్‌షెడ్ పనులు చేయడానికి కూలీల కొరత కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయని టెక్నికల్ అసిస్టెంట్లు పీఓ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో క్లస్టర్ జేఈలు వెంకటేశ్వర్‌రెడ్డి, రాంచంద్రన్, పలు మండలాల టెక్నికల్ అధికారులు, అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
ఎవరికి ఎవరు మూవీ ఓపెనింగ్