
సాక్షి, హైదరాబాద్: చిన్నారుల మానసిక ఎదుగుదలకు ఇంటి వాతావరణం అత్యంత కీలకమని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ప్రజ్ఞాపరాన్డే పేర్కొన్నారు. ఆదివారం సక్షమ్, యూనిసెఫ్ సంయుక్తంగా నిర్వహించిన ‘ఆర్యజనని’ప్రారంభ కార్యక్రమంలో ఆమె వర్చువల్ పద్ధతిలో మాట్లాడారు. బాలల సంరక్షణ కార్యక్రమాల్లో తండ్రి కూడా భాగస్వామిగా ఉండాలన్నారు. మహిళలు గర్భిణిగా ఉన్నప్పటి నుంచే యోగా, ధ్యానం చేయాలని, దీంతో శిశువు సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.
తల్లిపాలను తప్పనిసరిగా పట్టించడం తల్లి బాధ్యత అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, రామకృష్ణ మఠం చైర్మన్ స్వామి శితికంఠానంద, సక్షమ్ జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సుకుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment