ఆదిలాబాద్: విద్యార్థులకు రాగి జావా పంపిణీలోని ర్వాహకుల అశ్రద్ధ, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం.. ఓ చిన్నారి ఆయువు తీసింది. పాఠశాలలో ఉదయం అల్పాహారంగా రాగిజావా ఇవ్వాల్సి ఉండగా, మధ్యాహ్నం వరకు నిర్వాహకుల పంపిణీ చేయలే దు. పేరెంట్స్, టీచర్ మీటింగ్‌లో పడి ఆ విషయాన్ని ఉపాధ్యాయులూ నిర్లక్ష్యం చేశారు. మీటింగ్ తర్వాత రాగిజావ పంపిణీకి తయారు చేశారు. పంపిణీ కోసం ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో వేడి గిన్నెను పాఠశాల ఆవరణలో ఉంచారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన ఒకటో తరగతి విద్యార్థిని ప్రజ్ఞ(6) అందులో పడింది. చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా మామడ మండలం కొరిటికల్ గ్రామంలో జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి..
గ్రామానికి చెందిన కోండ్ర అశోక్, శిరీష దంపతుల కుమార్తె ప్రజ్ఞ (6) స్థానికంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతు ంది. చిన్నారి చదువులోనూ, స్నేహితులతో ఆ డుతూ హుషారుగా ఉంటుంది. పాఠశాలలో శనివారం జరిగిన పోషకుల సమావేశానికి చిన్నారి తల్లి ఉపర్పంచ్ శిరీష హాజరై మాట్లాడారు. విద్యార్థులు పాఠశాలకు పూర్తిస్థాయిలో హాజరయ్యేలా తల్లిదండ్రులు చూడాలని కోరారు. చదువులో ప్రజ్ఞ ప్రతిభ కనబరుస్తుందని ఉపాధ్యాయులు శిరీషకు వివరించారు. ప్రజ్ఞకు జ్వరం కారణంగా వారం రోజులుగా పాఠశాలకు రాలేదని శనివారం వచ్చిందని ఇంటికి పంపించాలని తల్లి కోరింది. తరగతుల అనంతరం పంపిస్తామని చెప్పాడంతో ఆమె ఇంటికి వెళ్లింది.
ప్రమాదవశాత్తు పడి..
ఉదయం 11.30 గంటల తర్వాత పోషకుల సమావేశం ముగిసింది. ఈ క్రమంలో వేడి రాగిజావాను పెద్దపాత్ర నుంచి బకెట్‌లో వేరు చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో విద్యార్థులు వచ్చారు. ప్రజ్ఞ వరుసలో ఉండి వెనుకకు తిరిగి స్నేహితులతో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు వేడిరాగిజావా పాత్రలో పడింది. కేకలు వేయడంతో ఉన్నత పాఠశాల విద్యార్థి ఆమెను బయటకు తీశాడు. ఉపాధ్యాయులు, కుటుంబీకులు జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతిచెందింది. కాగా, ప్రజ్ఞ మృతితో కుటుంబంలో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. శనివారం పాఠశాల నుంచి కూతురిని ఇంటికి తీసుకువచ్చిన బతికేదని తల్లిదండ్రులు కన్నీరుపెట్టడం కలిచివేసింది.
పాఠశాలలో విచారణ..
పాఠశాలలో తహసీల్దార్ సర్పరాజ్ ఆదివారం విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులు, మధ్యా హ్న భోజన నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకుని ఉన్నతాధికారులకు నివేదించారు. కలెక్టర్ ఆదేశాలతో డీఈవో రవీందర్‌రెడ్డి చర్యలు చేపట్టారు. ఇన్‌చార్జి హెచ్‌ఎం రమను సస్పెన్షన్ చేయడంతోపాటు ముగ్గురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మధ్యాహ్న భోజన ఏజెన్సీని తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎంఈవోని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment