Ragi Java
-
రాగిజావ రోజూ తాగుతున్నారా? ఇవి తెలుసుకోండి!
ఇటీవలి కాలంలో ఆహారం, ఆరోగ్యంపై అందరికీ శ్రద్ధ పెరుగుతోంది. ఈ క్రమంలో ఆర్గానిక్ ఫుడ్, మిలెట్స్పై మరింత ఆసక్తి చూపిస్తున్నారు జనం. అలాంటి వాటిల్లో ఒకటి రాగులు లేదా ఫింగర్ మిల్లెట్స్. దీనిలోని ప్రయోజనాల కారణంగా మరింత ప్రజాదరణ పొందాయి. చవకగా దొరుకుతాయి కూడా. రాగుల జావ లేదా మాల్ట్ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం!జీర్ణశక్తిని పెంచుకోవాలనుకున్నా, మధుమేహాన్ని తట్టుకోవాలనుకున్నా, లేదా మీ ఆహారాన్ని మరింత ఉత్సాహంగా మార్చుకోవాలనుకున్నా, అవసరమైన అన్ని పోషకాలతో నిండిన సూపర్‌ఫుడ్ రాగుల పిండితో చేసుకొనే జావ.రాగుల లడ్డు, రాగుల పిండితో మురుకులు ఇలా రాగులతో తయారు చేసే పదార్థాల్లో రాగిజావ, రాగి ముద్ద బాగా పాపులర్. రాగి జావ తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలనుంచి విముక్తి లభిస్తుంది. సీ, ఈ విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్లు, కొవ్వులు, ప్రొటీన్ పుష్కలంగా లభిస్తాయి. బి కాంప్లెక్స్, థయామిన్, రిబోఫ్లావిన్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, అలాగే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి.రాగి జావతో ఆరోగ్య ప్రయోజనాలుజీర్ణక్రియకు మంచిది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. రాగిజావలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతినిస్తుంది. ఆందోళన, డిప్రెషన్, నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి.మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది. రాగి జావలో పాలీఫెనాల్స్, డైటరీ ఫైబర్,మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రిస్తాయి. గుండె కండరాల పనితీరు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రాగి జావ సహజ ఇనుముకు గొప్ప మూలం. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.ఎముకలు బలోపేతం: రాగుల్లో కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. దంతాల అభివృద్ధికి సహాయపడుతుంది.అధిక బరువుకు చెక్ చెబుతుంది. కాలేయ వ్యాధులను తగ్గిస్తుంది. రాగి జావ తయారీరాగులను శుభ్రంగా కడిగి ఎండబెట్టుకొని పొడి చేసుకోవాలి. మరుగుతున్న ఒక గ్లాసు నీళ్లలో, ఒక టీ స్పూన్ రాగుల పిండి వేసి, కలుపుతూ ఉడికించుకోవాలి. దీనికి మజ్జగ, ఉప్పు కలుపుకొని తాగవచ్చు. లేదా పచ్చిమిర్చి ఉల్లిపాయల ముక్కలతో కలిపి తాగవచ్చు. బెల్లం, నెయ్యి వేసి ఇస్తే పిల్లలు ఇష్టంగా తాగుతారు. రాగులను మొలకలు వచ్చేలా చేసి, వాటిని ఎండబెట్టి, పొడి చేసుకొని కూడా జావ చేసుకోవచ్చు. ఈ పొడిని తడిలేని గాజు సీసాలో భద్రం చేసుకోవచ్చు. -
అమ్మా.. లేవే బడికి టైమవుతోంది.. త్వరగా రెడీ అవ్వు!
ఆదిలాబాద్: విద్యార్థులకు రాగి జావా పంపిణీలోని ర్వాహకుల అశ్రద్ధ, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం.. ఓ చిన్నారి ఆయువు తీసింది. పాఠశాలలో ఉదయం అల్పాహారంగా రాగిజావా ఇవ్వాల్సి ఉండగా, మధ్యాహ్నం వరకు నిర్వాహకుల పంపిణీ చేయలే దు. పేరెంట్స్, టీచర్ మీటింగ్‌లో పడి ఆ విషయాన్ని ఉపాధ్యాయులూ నిర్లక్ష్యం చేశారు. మీటింగ్ తర్వాత రాగిజావ పంపిణీకి తయారు చేశారు. పంపిణీ కోసం ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో వేడి గిన్నెను పాఠశాల ఆవరణలో ఉంచారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన ఒకటో తరగతి విద్యార్థిని ప్రజ్ఞ(6) అందులో పడింది. చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా మామడ మండలం కొరిటికల్ గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన కోండ్ర అశోక్, శిరీష దంపతుల కుమార్తె ప్రజ్ఞ (6) స్థానికంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతు ంది. చిన్నారి చదువులోనూ, స్నేహితులతో ఆ డుతూ హుషారుగా ఉంటుంది. పాఠశాలలో శనివారం జరిగిన పోషకుల సమావేశానికి చిన్నారి తల్లి ఉపర్పంచ్ శిరీష హాజరై మాట్లాడారు. విద్యార్థులు పాఠశాలకు పూర్తిస్థాయిలో హాజరయ్యేలా తల్లిదండ్రులు చూడాలని కోరారు. చదువులో ప్రజ్ఞ ప్రతిభ కనబరుస్తుందని ఉపాధ్యాయులు శిరీషకు వివరించారు. ప్రజ్ఞకు జ్వరం కారణంగా వారం రోజులుగా పాఠశాలకు రాలేదని శనివారం వచ్చిందని ఇంటికి పంపించాలని తల్లి కోరింది. తరగతుల అనంతరం పంపిస్తామని చెప్పాడంతో ఆమె ఇంటికి వెళ్లింది. ప్రమాదవశాత్తు పడి.. ఉదయం 11.30 గంటల తర్వాత పోషకుల సమావేశం ముగిసింది. ఈ క్రమంలో వేడి రాగిజావాను పెద్దపాత్ర నుంచి బకెట్లో వేరు చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో విద్యార్థులు వచ్చారు. ప్రజ్ఞ వరుసలో ఉండి వెనుకకు తిరిగి స్నేహితులతో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు వేడిరాగిజావా పాత్రలో పడింది. కేకలు వేయడంతో ఉన్నత పాఠశాల విద్యార్థి ఆమెను బయటకు తీశాడు. ఉపాధ్యాయులు, కుటుంబీకులు జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతిచెందింది. కాగా, ప్రజ్ఞ మృతితో కుటుంబంలో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. శనివారం పాఠశాల నుంచి కూతురిని ఇంటికి తీసుకువచ్చిన బతికేదని తల్లిదండ్రులు కన్నీరుపెట్టడం కలిచివేసింది. పాఠశాలలో విచారణ.. పాఠశాలలో తహసీల్దార్ సర్పరాజ్ ఆదివారం విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులు, మధ్యా హ్న భోజన నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకుని ఉన్నతాధికారులకు నివేదించారు. కలెక్టర్ ఆదేశాలతో డీఈవో రవీందర్‌రెడ్డి చర్యలు చేపట్టారు. ఇన్చార్జి హెచ్ఎం రమను సస్పెన్షన్ చేయడంతోపాటు ముగ్గురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మధ్యాహ్న భోజన ఏజెన్సీని తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎంఈవోని ఆదేశించారు. -
హెల్తీగా రాగి డోనట్స్ చేసుకోండిలా..!
రాగి డోనట్స్కి కావలసినవి: మైదాపిండి – 1 కప్పు పంచదార పొడి – 1 కప్పు వైట్ వెనిగర్, వెనీలా ఎసెన్స్ బేకింగ్ సోడా – 1 టీ స్పూన్ చొప్పున ఉప్పు – అర టీ స్పూన్ మజ్జిగ – 1 కప్పు గుడ్లు – 2 రాగి పిండి– 2 కప్పులు నూనె – 2 టేబుల్ స్పూన్లు తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదాపిండి, పంచదార పొడి, బేకింగ్ సోడా, వెనీలా ఎసెన్స్, గుడ్లు, నూనె, వైట్ వెనిగర్, రాగిపిండి, తగినంత ఉప్పు వేసుకుని.. కొద్దికొద్దిగా మజ్జిగ పోస్తూ బాగా కలిపి పెట్టుకోవాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్లూ కలుపుకోవచ్చు. డోనట్స్ మేకర్‌కి కొద్దిగా నూనె రాసి, కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసి ఓవెన్లో బేక్ చేసుకోవాలి. అభిరుచిని బట్టి చాక్లెట్ క్రీమ్, డ్రైఫ్రూట్స్‌తో నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. (చదవండి: పచ్చి మిర్చిని పచ్చిగా తినడమా? అనుకోవద్దు!.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా!) -
TS: విద్యార్థులకు అల్పాహారంగా రాగిజావ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 20న నిర్వహించే తెలంగాణ విద్యా దినోత్సవం మొదలు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అల్పాహారంగా రాగిజావ అందించనున్నట్లు విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రతిరోజూ ప్రార్థనా సమయానికి ముందు విద్యార్థులకు 250 మిల్లీలీటర్ల చొప్పున రాగిజావ ఇస్తారని చెప్పారు. దీనివల్ల 28,606 ప్రభుత్వ పాఠశాలల్లోని 25,26,907 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. గురువారం తన కార్యాలయంలో విద్యా శాఖ పనితీరును మంత్రి సమీక్షించారు. తెలంగాణ విద్యా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘మన ఊరు..మన బడి’, ‘మన బస్తీ.. మన బడి’కింద సకల వసతులతో ఆధునీకరించిన వెయ్యి ప్రభుత్వ పాఠశాలలను మంత్రులు, శాసనసభ్యులు ప్రారంభిస్తారని సబిత తెలిపారు. రాష్ట్రంలో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు చదువుతున్న 16,27,457 మంది విద్యార్థులకు మూడేసి చొప్పున వర్క్ బుక్స్, ఆరు నుంచి పదవ తరగతి చదువుతున్న 12,39,415 మంది విద్యార్థులకు సబ్జెక్టుకు ఒక్కో నోటు పుస్తకం చొప్పున అందించనున్నామన్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు, సమాచార బదలాయింపు కోసం రాష్ట్రంలోని 20 వేల మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 1,600 పాఠశాలల్లో ఏర్పాటు చేసిన 4,800 డిజిటల్ తరగతులను విద్యా దినోత్సవం సందర్భంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే 10 వేల గ్రంథాలయాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు మొదలు వర్సిటీల వరకు విద్యా దినోత్సవం రోజున సభలు, సమావేశాలు నిర్వహించాలని, రాష్ట్రంలో విద్యా రంగంలో సాధించిన విజయాలను వివరించాలని సూచించారు. రూ.190 కోట్లతో పాఠ్య పుస్తకాలు రూ.190 కోట్లు వ్యయం చేసి 30 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తున్నామని, ఈ పుస్తకాలను ఇప్పటికే జిల్లా కేంద్రాలకు తరలించామని మంత్రి సబిత తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 26 లక్షల మంది విద్యార్థులకు రూ.150 కోట్లు వెచి్చంచి ఒక్కో విద్యారి్థకి రెండేసి జతల చొప్పున యూనిఫామ్‌లు అందిస్తున్నామని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు దేవసేన తదితరులు పాల్గొన్నారు. -
సర్కార్ బడుల్లో ఇక రాగి జావ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ప్రధాన మంత్రి పోషణ్’పథకాన్ని ఇక్కడ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విద్యార్థులకు ఐరన్, ఇతర సూక్ష్మ పోషకాలతో కూడిన ఆహారాన్ని ఇవ్వాలన్నది ఈ పథకం ఉద్ధేశం. ఈ క్రమంలోనే పోషకాలతో కూడిన రాగి జావను అన్ని తరగతుల విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్‌గా అందించనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే.. రాష్ట్రంలోని 16.82 లక్షల మంది విద్యార్థులకు ఏడాదిలో 110 రోజుల పాటు రాగిజావను పంపిణీ చేస్తారు. ఇప్పటికే స్కూళ్లలో ఇస్తున్న మధ్యాహ్న భోజనానికి అదనంగా.. ఉదయమే ఈ రాగి జావను అందిస్తారు. 2023–24 విద్యా సంవత్సరంలో దీని అమలుకు సంబంధించి ఇటీవల జరిగిన సమావేశంలో పీఎం పోషణ్ అభియాన్ ప్రాజెక్ట్ ఆమోదిత మండలి (పీఏబీ) ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసింది. ఈ సమావేశం సందర్భంగా ఎందరు విద్యార్థులకు రాగి జావ అందించాల్సి ఉంటుంది? ఇందుకోసం చేయాల్సిన ఏర్పాట్లు, ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను సమర్పించింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం.. 2023–24లో రాష్ట్రంలో మొత్తంగా 16.82 లక్షల మంది విద్యార్థులకు 110 రోజుల పాటు రాగి జావ అందజేసేందుకు ఆమోదం తెలిపింది. దీనికి రూ.27.76 కోట్లు వ్యయం కానుండగా.. కేంద్రం 16.18 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.11.58 కోట్లు భరించనున్నాయి. మధ్యాహ్న భోజనం 231 రోజులు సర్కారు బడుల్లో విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరంలో 231 రోజుల పాటు మధ్యాహ్న భోజనాన్ని అందించనున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, బాల వాటికల్లో 231 రోజులు, స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లలో 293 రోజులపాటు మధ్యాహ్న భోజన పథకం అమలుకు పీఏబీ ఆమోదం తెలిపింది. ఈ పథకం అమలుకు రూ.323.71 కోట్లను వెచ్చించనుండగా.. కేంద్రం రూ.203.76 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 119.95 కోట్లను భరించనున్నాయి. కేంద్రం మధ్యాహ్న భోజనం కుక్ కమ్ హెల్పర్లకు నెలకు వెయ్యి రూపాయలు మాత్రమే పారితోíÙకం ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2 వేలు అదనంగా కలిపి.. 54,232 మంది సిబ్బందికి నెలకు రూ. 3వేల పారితోషికం ఇస్తోంది. ఈ చొరవను కేంద్రం ప్రశంసించింది. ఆరోగ్య విశ్లేషణ అనంతరం.. కోవిడ్ తర్వాత దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ఓ సర్వే చేపట్టింది. విద్యార్థుల్లో పోషకాహార లోపం ఉందని, అందుకే చదువుపై సరైన శ్రద్ధ చూపలేకపోతున్నారని అందులో గుర్తించింది. ఈ క్రమంలో విద్యార్థులకు పౌష్టికాహారం ఇచ్చే దిశగా చర్యలు చేపట్టింది. -
రాగి జావ ఉపయోగాలు శాస్త్రవేత్తల మాటల్లో
-
Ragi Java Benefits: జగనన్న గోరుముద్ద-రాగి జావతో ఎన్నెన్నో ప్రయోజనాలు..
-
Jagananna Gorumudda-Ragi Java: బడి పిల్లలకు మరో పోషకాహారం.. ఉదయం పూట రాగి జావ (ఫొటోలు)
-
చదువులకు ‘బలం’
మన ప్రభుత్వం రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడెలా ఉన్నాయి? ఒక్కసారి తేడాను గమనించండి. మధ్యాహ్న భోజనానికి గతంలో ఏటా రూ.450 కోట్లు కూడా ఇవ్వని దుస్థితి. ఇప్పుడు గోరుముద్దకు ఏడాదికి రూ.1,824 కోట్లు.. రాగి జావకు అదనంగా మరో రూ.86 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పిల్లలు ఏం తింటున్నారని ఓ ముఖ్యమంత్రి ఆలోచించిన పరిస్థితి గతంలో లేదు. కానీ ఇప్పుడు మంచి మేనమామలా 15 రకాల పదార్థాలతో పిల్లలకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: మన విద్యార్థులంతా భావి ప్రపంచంతో పోటీపడి రాణించేలా ప్రతి అడుగులోనూ వారికి అండదండలు అందిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పిల్లలకు మంచి మేనమామలా వారికి అందించే ఆహారం నుంచి ఉన్నత చదువులు, ఉద్యోగాల దాకా అన్ని విషయాల్లోనూ వారి బాగోగులే లక్ష్యంగా నడుస్తున్నామన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ కూడా పిల్లల బాగు కోసం ఇంత తపన పడలేదన్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. ‘మన ప్రభుత్వం రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడెలా ఉన్నాయి..? ఒక సారి తేడాను గమనించండి. పిల్లలు ఏం తింటున్నారు? అని ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేసిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారన్న మంచి ఆలోచనతో గోరుముద్దను చేపట్టాం. పిల్లలకు మంచి మేనమామలా 15 రకాల ఆహార పదార్థాలతో రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నాం. మధ్యాహ్న భోజనానికి గతంలో ఏడాదికి కేవలం రూ.450 కోట్లు కూడా ఖర్చు చేయని దుస్థితి. ఇప్పుడు గోరుముద్ద కోసం ఏడాదికి రూ.1,824 కోట్లు ఖర్చు చేస్తున్నాం’ అని తెలిపారు. ఇప్పుడు దీనికి అదనంగా రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే 37,63,698 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తూ ఏటా రూ.86 కోట్ల అదనపు వ్యయంతో ఉదయం పూట రాగిజావ అందించే కార్యక్రమాన్ని మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. ఏప్రిల్‌లో పదో తరగతితో పాటు మిగిలిన పిల్లలకు పరీక్షలు జరగనున్న నేపధ్యంలో వారందరికీ ఓ మేనమామగా ఆల్ ద వెరీ బెస్ట్ చెబుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే... మొదటి రోజు నుంచే.. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క పాప, బాబు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి, గోరుముద్దలో భాగంగా పరిశుభ్రంగా, రుచికరంగా వండి పెడుతున్న అమ్మలకు.. ప్రతి ఒక్కరికీ నా అభినందనలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి చదువులను సంస్కరించడంపై దృష్టి పెట్టాం. బడి మానేసే పిల్లల సంఖ్యను ఎలా తగ్గించాలి? స్కూళ్లలో సదుపాయాలు మెరుగుపర్చడం ఎలా? పిల్లల మేథో వికాసానికి కావాల్సిన వాతావరణాన్ని కల్పించడం ఎలా? పెద్ద చదువులు చదివేలా ప్రోత్సహించడమెలా? అనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రతి అడుగులోనూ మార్పులు తీసుకొచ్చాం. అందులో భాగంగానే గర్భిణులు, బాలింతలు, ఆరేళ్ల లోపు చిన్నారులకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. అడుగడుగునా ప్రోత్సాహం.. చదువుకునే విద్యార్థులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి, విద్యాకానుక, నాడు–నేడు, ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ సిలబస్, బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు అందిస్తున్నాం. 8వ తరగతిలోకి వచ్చిన వెంటనే పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తున్నాం. ఇక 6వ తరగతి నుంచి ప్రతి తరగతి గదిలోనూ ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ ప్యానెల్స్) ద్వారా డిజిటల్ బోధనను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు నాడు – నేడు పూర్తైన స్కూళ్లలో జూన్ నుంచి అమలులోకి తీసుకొస్తాం. ఇలా ప్రతి అడుగులోనూ పిల్లలను చేయిపట్టి నడిపిస్తున్నాం. సమున్నత మార్పులు.. ఉన్నత విద్యలో సమూల మార్పులు చేపట్టి జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్ తీసుకొచ్చాం. ఇంటర్న్‌షిప్ తప్పనిసరిచేస్తూ ఆన్లైన్ వర్టికల్స్‌ని కరిక్యులమ్‌కు అనుసంధానం చేస్తున్నాం. విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. మన పిల్లలంతా భావి ప్రపంచంతో పోటీ పడి నెగ్గుకొచ్చేలా ప్రతి అడుగు వేస్తున్నాం. అందులో భాగంగానే విద్యాకానుక అమలు చేస్తున్నాం. మరింత బలవర్ధకంగా గోరుముద్ద గోరుముద్దను ఇప్పటికే రోజుకొక మెనూతో రుచికరంగా అమలు చేస్తున్నాం. ఇప్పుడు మరింత బలవర్ధకంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాం. అందులో భాగంగా ఇవాళ్టి నుంచి పిల్లలకు రాగిజావ కూడా అందిస్తూ గోరుముద్దను మరింత పుష్టికరంగా తీర్చిదిద్దుతున్నాం. రాగి జావ పిల్లల్లో సమృద్ధిగా ఐరన్, కాల్షియం కంటెంట్ పెరిగేలా దోహదపడుతుంది. నాడు అద్వాన్నం... నేడు నోరూరేలా మిడ్ డే మీల్స్ అంటూ గత ప్రభుత్వ హయాంలో మొత్తం సంవత్సరం అంతా కలిపినా కూడా ఏడాదికి రూ.450 కోట్లు కూడా మధ్యాహ్న భోజనానికి ఖర్చు చేయని దుస్థితి. వండి పెట్టే ఆయాలకు రూ.1,000 ఇస్తూ అది కూడా 8–10 నెలలు బకాయిలు పెట్టిన పరిస్థితి ఉంది. చివరకు సరుకులు కూడా 6–8 నెలలుగా బకాయిలు పెట్టే పరిస్థితి. ఇలా బకాయిలు పెడితే క్వాలిటీ అనేది ఉండదు. అలాంటి అధ్వాన్నమైన పరిస్థితుల నుంచి గోరుముద్ద అనే కార్యక్రమం ద్వారా రోజుకొక మెనూతో పూర్తిగా మార్చి ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. గతంలో రూ.450 కోట్లు మాత్రమే ఉన్న బడ్జెట్‌ను ఇప్పుడు ఏడాదికి రూ.1,824 కోట్లకు పెంచి గోరుముద్ద కోసం ఖర్చు చేస్తున్నాం. ఇప్పుడు రాగి జావ కోసం అదనంగా మరో రూ.86 కోట్లు ఇస్తున్నాం. రోజుకో మెనూతో పిల్లలకు రుచికరమైన భోజనం అందిస్తున్నాం. వారానికి 15 రకాలతో మెనూ... గోరుముద్ద మెనూలో ప్రతి సోమవారం వేడిగా పొంగళి, ఉడికించిన గుడ్డు దగ్గర నుంచి కూరగాయల పలావ్, గుడ్డు కూర, వేరుశెనగ చిక్కీ అందిస్తున్నాం. మంగళవారం రోజు పులిహోర, టమోట పచ్చడి, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు ఇస్తుండగా బుధవారం నాడు కూరగాయలు అన్నం, బంగాళదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, వేరుశెనగ చిక్కీ ఇస్తున్నారు. గురువారం మెనూలో సాంబార్ బాత్ లేదా లెమన్‌రైస్ విత్ టమోట పచ్చడి, ఉడికించిన గుడ్డు ఉంటాయి. శుక్రవారం నాడు అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, వేరుశెనగ చిక్కీ అందిస్తున్నారు. శనివారం నాడు పప్పు, ఆకుకూర అన్నం, తీపి పొంగల్ ఇస్తున్నాం. ఇలా వారంలో మొత్తం 15 రకాల ఆహార పదార్థాలను గోరుముద్దలో భాగంగా పిల్లలకు అందిస్తున్నాం. వారంలో ఐదు రోజులపాటు ఉడికించిన గుడ్లు, మూడు రోజులు చిక్కీ ఇస్తున్నాం. చిక్కీ ఇచ్చే మూడు రోజులు కాకుండా మిగిలిన మూడు రోజుల పాటు మంగళ, గురువారం, శనివారాల్లో ఇప్పుడు రాగి జావ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సత్యసాయి ట్రస్టు సహకారంతో.. పిల్లలకు రాగిజావ అందించే కార్యక్రమంలో సత్యసాయి ట్రస్టు భాగస్వామి కావడం నిజంగా మంచి పరిణామం. ఈ కార్యక్రమానికి శ్రీసత్యసాయి స్వామి వారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. ఏటా దాదాపు రూ.86 కోట్లు ఖర్చయ్యే రాగి జావ కోసం సత్యసాయి ట్రస్టు రూ.42 కోట్లు అందిస్తుండగా మిగిలిన రూ.44 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సమకూరుస్తూ మంచి కార్యక్రమానికి ముందడుగు వేస్తున్నాం. ఇందుకు సత్యసాయి ట్రస్టుకు ప్రత్యేకంగా హృదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పిల్లలకు మంచి జరగాలని తపన పడుతున్న మనందరి ప్రభుత్వానికి దేవుడి చల్లని దయ, తల్లిదండ్రుల దీవెనలు ఉండాలని మనసారా కోరుకుంటూ రాగిజావ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. -
మేనమామగా అందిస్తున్నా.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: జగనన్న గోరుముద్ద ద్వారా బడి పిల్లలకు వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్వీట్ చేశారు. చదవండి: విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా.. సమూల మార్పులు తీసుకొస్తున్నాం: సీఎం జగన్ ‘‘పౌష్టికాహారంతోనే ఆరోగ్యం, చక్కటి విద్యాభ్యాసం సాధ్యమని నమ్ముతున్నా.. ఒక మేనమామగా మధ్యాహ్న భోజన కార్యక్రమం "గోరుముద్ద”లో భాగంగా ఇవ్వాళ్టి నుంచి రాగిజావ అందిస్తున్నాం. గుడ్డు, చిక్కీ సహా అందిస్తున్న 15 ఆహార పదార్థాలకు ఇది అదనం. భాగస్వామి అయిన సత్యసాయి ట్రస్టుకు నా ధన్యవాదాలు’’ అని సీఎం జగన్ ట్వీట్టర్లో పేర్కొన్నారు. పౌష్టికాహారంతోనే ఆరోగ్యం, చక్కటి విద్యాభ్యాసం సాధ్యమని నమ్ముతూ ఒక మేనమామగా మధ్యాహ్న భోజన కార్యక్రమం “గోరుముద్ద”లో భాగంగా ఇవ్వాళ్టి నుంచి రాగిజావ అందిస్తున్నాం. గుడ్డు, చిక్కీసహా అందిస్తున్న 15 ఆహార పదార్థాలకు ఇది అదనం. భాగస్వామి అయిన సత్యసాయి ట్రస్టుకు నా ధన్యవాదాలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) March 21, 2023 -
విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా.. సమూల మార్పులు తీసుకొస్తున్నాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: జగనన్న గోరుముద్ద ద్వారా బడి పిల్లలకు వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. తాజాగా రాగి జావ కోసం ఏటా మరో రూ.86 కోట్లు కలిపి మొత్తం రూ.1,910 కోట్లు వెచ్చిస్తూ పిల్లలకు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. సీఎం జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే ►దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ద్వారా పాల్గొంటున్న ప్రతి ఒక్క పాపకూ, బాబుకూ, వారి తల్లిదండ్రులకూ, ఉపాధ్యాయులరూ, ఇతర సిబ్బందికీ, రుచికరంగా వండిపెడుతున్న అమ్మలకు.. ప్రతి ఒక్కరికీ నా అభినందనలు: మనం అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచి కూడా అనేక అడుగులు వేశాం. ►బడిమానేసే పిల్లల సంఖ్యను తగ్గించడం ఎలా? స్కూళ్లలో సదుపాయాలను కల్పించడం ఎలా? మేథోవికాసాన్ని పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని అలోచించి అనేక చర్యలు చేపట్టాం. గర్భవతులైన మహిళల దగ్గరనుంచి చిన్నారుల వరకూ వచ్చే వరకూ సంపూర్ణ పోషణద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. తర్వాత ఇంగ్లిషు మీడియం, సీబీఎస్ఈ సిలబస్, బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్, ఐఎఫ్‌ఎపీ ప్యానెల్స్ ఆరోతరగతినుంచి ఏర్పాటు, ౮వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇవ్వడం… ఇలా ప్రతి అడుగులోనూ పిల్లలను చేయిపట్టి నడిపిస్తున్నాం ►అమ్మ ఒడి, విద్యాకానుక అమలు చేస్తున్నాం. పై చదువుల్లో కూడా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. మన పిల్లలు అందర్నీకూడా భావి ప్రపంచంతో పోటీపడేలా… వారు నెగ్గేలా ఈ కార్యక్రమాలు చేపట్టాం. గోరుముద్ద కార్యక్రమాన్ని మరింతగా పటిష్టంగా అమలు చేసేలా అడుగులు. ఇవ్వాళ్టి నుంచి రాగిజావ కూడా పిల్లలకు అందిస్తాం. గోరుముద్దను మరింత మెరుగ్గా చేయడానికే ఈ ప్రయ్నతాలు. పిల్లలకు ఐరన్ కాని, కాల్షియం కాని పెరగడానికి ఈ ఆహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. 1 నుంచి 10 తరగతి పిల్లలకు దాదాపు 38లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం ►మన ప్రభుత్వం రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒక సారి తేడాను గమనించండి. మొత్తం సంవత్సం అంతా కలిపినా కూడా గతంలో ఏడాదికి కేవలం రూ.450 కోట్లు కూడా ఖర్చు చేయలేని పరిస్థితి. ఆయాలకు 8-10 నెలలు బకాయిలు పెట్టే పరిస్థితి. సరుకులు కూడా 6-8 నెలలుగా బకాయిలు పెట్టే పరిస్థితి. ఇలా బకాయిల పెడితే… క్వాలిటీ అనేది ఉండదు. గోరు ముద్దద్వారా ప్రతిష్ట్మాతకంగా మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఇప్పుడు ఏడాదికి రూ.1824 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ►రోజుకో మెనూతో పిల్లలకు భోజనం పెడుతున్నాం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పిల్లలు ఏం తింటూ ఉన్నారు అనే ఆలోచన చేసిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. పిల్లలకు మంచి మేనమామలా.. ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మనం చేయకపోతే.. ఇంకెవరు చేస్తారన్న దీంతో గోరుముద్దను చేపట్టాం. మొత్తం 15 రకాల ఆహార పదార్థాలు పిల్లలకు గోరుముద్ద అందిస్తున్నాం. వారంలో 5 రోజులపాటు ఉడికించిన గుడ్లు ఇస్తున్నాం. మూడు రోజులు చిక్కి ఇస్తున్నాం. మిగిలిన మూడు రోజులు మంగళ, గురువారం, శనివారాల్లో రాగి జావ ఇప్పుడు ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో సత్యాసాయి ట్రస్టు భాగస్వాములు కావడం సంతోషకరం. ►శ్రీ సత్యసాయి స్వామి వారి ఆశీస్సులు కూడా ఈ కార్యక్రమానికి ఉంటాయని భావిస్తున్నాను. పరీక్షలు రాయబోతున్న పిల్లలందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ తెలియజేస్తున్నాను. ఏడాదికి రూ.84 కోట్లు రాగిజావ కోసం ఖర్చు చేస్తున్నాం, దీంతో గోరుముద్దకోసం చేస్తున్న ఖర్చు రూ.1910 కోట్లకుపైగా ఖర్చు అవుతుంది మధ్యాహ్న భోజనానికి సీఎం జగన్ ఓ రూపం తీసుకొచ్చారు: మంత్రి బొత్స మధ్యాహ్న భోజనానికి సీఎం జగన్ ఓ రూపం తీసుకొచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. స్కూళ్లలో సుమారు 15 వైరైటీలతో రోజుకో మెనూ అమలు చేస్తున్నామన్నారు. పిల్లలు పౌష్టికాహార లోపంతో ఉండకూడదనే సీఎం ఆశయం అని మంత్రి బొత్స అన్నారు. ►జగనన్న గోరుముద్ద ద్వారా బడి పిల్లలకు వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 37,63,698 మంది విద్యార్ధులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఏటా రూ.86 కోట్ల అదనపు వ్యయంతో రాగి జావ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బలవర్థకమైన ఆహారానికి ఏటా రూ.1,910 కోట్లు ►మధ్యాహ్న భోజన పథకానికి గత సర్కారు సగటున రూ.450 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇప్పుడు జగనన్న గోరుముద్ద ద్వారా దాదాపు నాలుగు రెట్లు అధికంగా ఏటా రూ.1,824 కోట్లు వ్యయం చేస్తున్నారు. తాజాగా రాగి జావ కోసం ఏటా మరో రూ.86 కోట్లు కలిపి మొత్తం రూ.1,910 కోట్లు వెచి్చస్తూ పిల్లలకు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ►మధ్యాహ్న భోజన పథకంలో ఇప్పటికే సమూల మార్పులు చేపట్టి జగనన్న గోరుముద్ద ద్వారా ప్రతి రోజూ రుచికరమైన మెనూతో బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందచేస్తోంది. ఐరన్, కాల్షియం లాంటి పోషకాలు అందించి విద్యార్థుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు వారానికి మూడు రోజులు (మంగళ, గురు, శని) బెల్లంతో కూడిన రాగిజావను అందించనున్నారు. చదవండి: రాగిజావను పాలు, బెల్లం, యాలకుల పొడితో కలిపి కాచుకుని తాగే అలవాటు ఉందా.. అయితే ►ఇక మిగిలిన 3 రోజులు గోరుముద్దలో బలవర్థకమైన చిక్కీని పిల్లలకు ఇస్తున్నారు. జగనన్న గోరుముద్దలో వారానికి 15 వెరైటీలు ఉండగా ఐదు రోజుల పాటు కోడిగుడ్డు, 3 రోజులు చిక్కీ ఇస్తున్నారు. ఇకపై మూడు రోజులు రాగిజావ కూడా అందనుంది. ఈ ఏడాది అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం కావడం, చిరుధాన్యాలను పండించే రైతులను ప్రోత్సహించే లక్ష్యంతో పథక నిర్వహణలో భాగంగా శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్ట్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నారు. నాడు నాసిరకం తిండి.. ►నాడు నాసిరకం ఆహారం, ఉడికీ ఉడకని అన్నం, రుచిపచీ లేని కూరలతో మధ్యాహ్న భోజన పథకాన్ని టీడీపీ సర్కారు నీరుగార్చింది. పిల్లలకు ఏమాత్రం రుచించని విధంగా ప్రతి రోజూ సాంబారు అన్నంతో కూడిన ఒకే రకమైన మధ్యాహ్న భోజనం సరఫరా చేయడంతో తినలేక అవస్థలు పడ్డారు. ►ఇక వంట సహాయకులకు గౌరవ భృతి నెలకు కేవలం రూ.1,000 మాత్రమే చెల్లించగా ఆయాల జీతాలు, సరుకుల బిల్లులు సైతం 8–9 నెలలు పెండింగ్‌లోనే ఉన్న దుస్థితి. గత సర్కారు హయాంతో పోలిస్తే ఇప్పుడు మూడు రెట్లు అధికంగా వంట సహాయకులకు నెలకు రూ. 3,000 చొప్పున గౌరవ భృతితోపాటు క్రమం తప్పకుండా గోరుముద్ద బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తోంది. చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ