సాక్షి, అమరావతి: జగనన్న గోరుముద్ద ద్వారా బడి పిల్లలకు వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. తాజాగా రాగి జావ కోసం ఏటా మరో రూ.86 కోట్లు కలిపి మొత్తం రూ.1,910 కోట్లు వెచ్చిస్తూ పిల్లలకు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది.
సీఎం జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే
►దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా పాల్గొంటున్న ప్రతి ఒక్క పాపకూ, బాబుకూ, వారి తల్లిదండ్రులకూ, ఉపాధ్యాయులరూ, ఇతర సిబ్బందికీ, రుచికరంగా వండిపెడుతున్న అమ్మలకు.. ప్రతి ఒక్కరికీ నా అభినందనలు: మనం అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచి కూడా అనేక అడుగులు వేశాం.
►బడిమానేసే పిల్లల సంఖ్యను తగ్గించడం ఎలా? స్కూళ్లలో సదుపాయాలను కల్పించడం ఎలా? మేథోవికాసాన్ని పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని అలోచించి అనేక చర్యలు చేపట్టాం. గర్భవతులైన మహిళల దగ్గరనుంచి చిన్నారుల వరకూ వచ్చే వరకూ సంపూర్ణ పోషణద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. తర్వాత ఇంగ్లిషు మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్, బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్, ఐఎఫ్‌ఎపీ ప్యానెల్స్ ఆరోతరగతినుంచి ఏర్పాటు, ౮వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇవ్వడం… ఇలా ప్రతి అడుగులోనూ పిల్లలను చేయిపట్టి నడిపిస్తున్నాం
►అమ్మ ఒడి, విద్యాకానుక అమలు చేస్తున్నాం. పై చదువుల్లో కూడా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. మన పిల్లలు అందర్నీకూడా భావి ప్రపంచంతో పోటీపడేలా… వారు నెగ్గేలా ఈ కార్యక్రమాలు చేపట్టాం. గోరుముద్ద కార్యక్రమాన్ని మరింతగా పటిష్టంగా అమలు చేసేలా అడుగులు. ఇవ్వాళ్టి నుంచి రాగిజావ కూడా పిల్లలకు అందిస్తాం. గోరుముద్దను మరింత మెరుగ్గా చేయడానికే ఈ ప్రయ్నతాలు. పిల్లలకు ఐరన్ కాని, కాల్షియం కాని పెరగడానికి ఈ ఆహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. 1 నుంచి 10 తరగతి పిల్లలకు దాదాపు 38లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం
►మన ప్రభుత్వం రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒక సారి తేడాను గమనించండి. మొత్తం సంవత్సం అంతా కలిపినా కూడా గతంలో ఏడాదికి కేవలం రూ.450 కోట్లు కూడా ఖర్చు చేయలేని పరిస్థితి. ఆయాలకు 8-10 నెలలు బకాయిలు పెట్టే పరిస్థితి. సరుకులు కూడా 6-8 నెలలుగా బకాయిలు పెట్టే పరిస్థితి. ఇలా బకాయిల పెడితే… క్వాలిటీ అనేది ఉండదు. గోరు ముద్దద్వారా ప్రతిష్ట్మాతకంగా మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఇప్పుడు ఏడాదికి రూ.1824 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం.
►రోజుకో మెనూతో పిల్లలకు భోజనం పెడుతున్నాం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పిల్లలు ఏం తింటూ ఉన్నారు అనే ఆలోచన చేసిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. పిల్లలకు మంచి మేనమామలా.. ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మనం చేయకపోతే.. ఇంకెవరు చేస్తారన్న దీంతో గోరుముద్దను చేపట్టాం. మొత్తం 15 రకాల ఆహార పదార్థాలు పిల్లలకు గోరుముద్ద అందిస్తున్నాం. వారంలో 5 రోజులపాటు ఉడికించిన గుడ్లు ఇస్తున్నాం. మూడు రోజులు చిక్కి ఇస్తున్నాం. మిగిలిన మూడు రోజులు మంగళ, గురువారం, శనివారాల్లో రాగి జావ ఇప్పుడు ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో సత్యాసాయి ట్రస్టు భాగస్వాములు కావడం సంతోషకరం.
►శ్రీ సత్యసాయి స్వామి వారి ఆశీస్సులు కూడా ఈ కార్యక్రమానికి ఉంటాయని భావిస్తున్నాను. పరీక్షలు రాయబోతున్న పిల్లలందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ తెలియజేస్తున్నాను. ఏడాదికి రూ.84 కోట్లు రాగిజావ కోసం ఖర్చు చేస్తున్నాం, దీంతో గోరుముద్దకోసం చేస్తున్న ఖర్చు రూ.1910 కోట్లకుపైగా ఖర్చు అవుతుంది
మధ్యాహ్న భోజనానికి సీఎం జగన్ ఓ రూపం తీసుకొచ్చారు: మంత్రి బొత్స
మధ్యాహ్న భోజనానికి సీఎం జగన్ ఓ రూపం తీసుకొచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. స్కూళ్లలో సుమారు 15 వైరైటీలతో రోజుకో మెనూ అమలు చేస్తున్నామన్నారు. పిల్లలు పౌష్టికాహార లోపంతో ఉండకూడదనే సీఎం ఆశయం అని మంత్రి బొత్స అన్నారు.
►జగనన్న గోరుముద్ద ద్వారా బడి పిల్లలకు వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 37,63,698 మంది విద్యార్ధులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఏటా రూ.86 కోట్ల అదనపు వ్యయంతో రాగి జావ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బలవర్థకమైన ఆహారానికి ఏటా రూ.1,910 కోట్లు
►మధ్యాహ్న భోజన పథకానికి గత సర్కారు సగటున రూ.450 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇప్పుడు జగనన్న గోరుముద్ద ద్వారా దాదాపు నాలుగు రెట్లు అధికంగా ఏటా రూ.1,824 కోట్లు వ్యయం చేస్తున్నారు. తాజాగా రాగి జావ కోసం ఏటా మరో రూ.86 కోట్లు కలిపి మొత్తం రూ.1,910 కోట్లు వెచి్చస్తూ పిల్లలకు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది.
►మధ్యాహ్న భోజన పథకంలో ఇప్పటికే సమూల మార్పులు చేపట్టి జగనన్న గోరుముద్ద ద్వారా ప్రతి రోజూ రుచికరమైన మెనూతో బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందచేస్తోంది. ఐరన్, కాల్షియం లాంటి పోషకాలు అందించి విద్యార్థుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు వారానికి మూడు రోజులు (మంగళ, గురు, శని) బెల్లంతో కూడిన రాగిజావను అందించనున్నారు.
చదవండి: రాగిజావను పాలు, బెల్లం, యాలకుల పొడితో కలిపి కాచుకుని తాగే అలవాటు ఉందా.. అయితే
►ఇక మిగిలిన 3 రోజులు గోరుముద్దలో బలవర్థకమైన చిక్కీని పిల్లలకు ఇస్తున్నారు. జగనన్న గోరుముద్దలో వారానికి 15 వెరైటీలు ఉండగా ఐదు రోజుల పాటు కోడిగుడ్డు, 3 రోజులు చిక్కీ ఇస్తున్నారు. ఇకపై మూడు రోజులు రాగిజావ కూడా అందనుంది. ఈ ఏడాది అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం కావడం, చిరుధాన్యాలను పండించే రైతులను ప్రోత్సహించే లక్ష్యంతో పథక నిర్వహణలో భాగంగా శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్ట్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నారు.
నాడు నాసిరకం తిండి..
►నాడు నాసిరకం ఆహారం, ఉడికీ ఉడకని అన్నం, రుచిపచీ లేని కూరలతో మధ్యాహ్న భోజన పథకాన్ని టీడీపీ సర్కారు నీరుగార్చింది. పిల్లలకు ఏమాత్రం రుచించని విధంగా ప్రతి రోజూ సాంబారు అన్నంతో కూడిన ఒకే రకమైన మధ్యాహ్న భోజనం సరఫరా చేయడంతో తినలేక అవస్థలు పడ్డారు.
►ఇక వంట సహాయకులకు గౌరవ భృతి నెలకు కేవలం రూ.1,000 మాత్రమే చెల్లించగా ఆయాల జీతాలు, సరుకుల బిల్లులు సైతం 8–9 నెలలు పెండింగ్‌లోనే ఉన్న దుస్థితి. గత సర్కారు హయాంతో పోలిస్తే ఇప్పుడు మూడు రెట్లు అధికంగా వంట సహాయకులకు నెలకు రూ. 3,000 చొప్పున గౌరవ భృతితోపాటు క్రమం తప్పకుండా గోరుముద్ద బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తోంది.
చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ
Comments
Please login to add a commentAdd a comment