సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ త్వరలో ముగియనుండటంతో కొద్ది రోజులుగా నిలిచిపోయిన పథకాలు, కార్యక్రమాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మంగళవారం తన కార్యాలయ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్చి, ఏప్రిల్ నెలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పథకాలపై చర్చించి అమలు తేదీలను ఖరారు చేశారు. ఎన్నికల కోడ్‌తో సంబంధం లేనందున మార్చి 10వ తేదీ నుంచి మధ్యాహ్న భోజనంలో రాగి జావ అమలును ప్రారంభించాలని నిర్ణయించారు.
పిల్లల్లో ఐరన్, కాల్షియం లోపాలను నివారించే లక్ష్యంతో మధ్యాహ్న భోజన పథకం మెనూలో రాగి జావను చేర్చిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ కారణంగా కొద్దిగా ఆలస్యమైన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను ఏప్రిల్ 6 నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ట్రయల్ రన్ ఇప్పటికే మొదలై విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మార్చి 14వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణ అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచి్చంది. బీఏసీ సమావేశంలో చర్చించి సమావేశాల షెడ్యూలును ఖరారు చేయనున్నారు.
మార్చి, ఏప్రిల్‌లో షెడ్యూల్ ఇలా..
మార్చి 18న సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు. జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటీ పద్ధతిలో నగదు జమ.
మార్చి 22న ఉగాది సందర్భంగా ఉత్తమ సేవలందించిన వలంటీర్ల పేర్ల ప్రకటన. ఏప్రిల్ 10న అవార్డులు, రివార్డులు ప్రదానం.
మార్చి 23న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం.
మార్చి 25 నుంచి వైఎస్సార్ ఆసరా. ఏప్రిల్ 5 వరకూ కొనసాగనున్న కార్యక్రమం
మార్చి 31న జగనన్న వసతి దీవెన.
ఏప్రిల్ 6న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో అమలు
ఏప్రిల్ 18న ఈబీసీ నేస్తం.
ఏప్రిల్ 10న ఉత్తమ సేవలందించిన వలంటీర్లకు సన్మానం
Comments
Please login to add a commentAdd a comment