Ragi Ambali
-
రాగిముద్ద-నాటుకోడి పులుసు సూపర్ కాంబో
మిల్లెట్లతో చేసుకునే ఆరోగ్యకరమైన ఆహారం అనగానే ముందుగా గుర్తొచ్చే వాటిల్లో ఒకటి రాగులు. రాగులు లేదా ఫింగర్ మిల్లెట్స్‌తో రక రకాల వంటకాలను చేసుకోవచ్చు. ఇపుడు మాత్రం రాగిముద్దను ఎలా చేసుకోవాలో చూద్దాం.చిరుధాన్యాల్లో అతి ముఖ్యమైన రాగులలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, అయోడిన్ ఎక్కువగా లభిస్తాయి. కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆహారం. గ్లూటెన్ లోపంతో బాధపడేవారు దీన్ని తీసుకోవచ్చు. ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. చాలా సులభంగా జీర్ణమవుతుంది కూడా.కావలసిన పదార్థాలు : రాగుల పిండి - 2 కప్పులు, నెయ్యి - 1 టేబుల్ స్పూన్, ఉప్పు - రుచికి తగినంతతయారీముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లను బాగా మరిగించాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి. ఇంతలో రాగి పిండి కొద్ది నీళ్లు పోసి కలపుకావాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో రాగి పిండిని మెల్లగా వేయాలి. మిశ్రమం చిక్కగా బుడగలొస్తాయి. ఇపుడు మంటను పూర్తిగా తగ్గించి, మరికొంచెం పిండిని కలపాలి. గట్టి చెక్క కర్ర లేదా గరిటె అయితే కలపడానికి ఈజీగా ఉంటుంది. తక్కువ మంటతో నెమ్మదిగా కలుపుతూ ఉంటే పిండి ముద్దగా అవుతుంది. కావాలనిపిస్తే ఇంకొంచెం పిండి కలుపుకోవచ్చు. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారాక చేతిలో నెయ్యి రాసుకుని నిదానంగా మెత్తగా ముద్దలా చేసుకోవాలి. అంతే రాగి ముద్ద రెడీ. పర్ఫెక్ట్గా చేసిన రాగి ముద్ద వేళ్లతో తాకినప్పుడు అంటుకోకుండా ఉంటుంది. ఇదే తరహాలో మరికొందరు రాగుల పిండిలో నూకలు లేదా బియ్యంతో కలిపి కూడా రాగిముద్ద లేదా సంకటి చేసుకుంటారు.ఎలా చేసినా వేడి వేడి నాటుకోడి పులుసు, మటన్ సూప్‌తో రాగిముద్దను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇంకా పప్పు లేదా సాంబారు, గోంగూర పచ్చడి కాంబినేషన్ కూడా అదిరి పోతుంది. ఇదీ చదవండి: భార్యామణికోసం ఏకంగా ఐలాండ్నే కొనేసిన వ్యాపారవేత్త?! -
ఆంధ్ర స్పెషల్ 'రాగి దిబ్బ రొట్టు'..ఎన్ని లాభాలో తెలుసా..!
భారతదేశం అనేక వినూత్నమైన అల్పాహార వంటకాలకు నిలయంగా ఉంది. అన్ని పోషకమైన, ఆరోగ్యకరమైన ప్రయోజనాలకు ప్రసిద్ధి. దక్షిణ భారతదేశంల ఆంధ్రప్రదేశ్‌లో దీన్ని సాధారణంగా మినపప్పుతో తయారు చేస్తారు. అయితే ఆరోగ్యకరంగా మార్చేలా మిల్లెట్‌తో జోడించి శక్తిమంతమైన పోషకాలు కలిగిన దానిగా, ఆరోగ్యప్రదాయినిగా ఉపయోగిస్తున్నారు. ఈ రాగి దిబ్బరొట్టు ఆ ప్రాంతం వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. దీన్ని 'ఫింగర్ మిల్లెట్'గా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ప్రధానమైన ధాన్యం, అధిక పోషక విలువలు ఆరోగ్య ప్రయోజనాకు పేరుగాంచింది. ఈ ఆరోగ్యకరమైన పదార్థం మిల్లెట్ కాల్షియం, ఐరన్, డైటరీ ఫైబర్‌తో నిండి ఉంది. సమతుల్య ఆహారాన్ని కొనసాగించాలనుకునే వారికి ఇది ప్రీతికరమైన పదార్థంగా ఉంటుంది. ఇక్కడ "దిబ్బరొట్టు అంటే మందపాటి రొట్టు అని అర్ధం. సాంప్రదాయంగా బియ్యం మినప్పులతో తయారు చేస్తారు. ఈ ఆంధ్రా శైలి వంటకానికి రాగి పిండిని జోడించడంతో ప్రత్యేకమైన రుచి తోపాటు పోషకాహార ప్రొఫైల్‌ను మెరుగుపరుస్తుంది. ఈ రాగిదిబ్బ రొట్టుని తయారు చేయడం సులభం అయినప్పటికీ ఒక ప్రత్యేకమైన ఆకృతిలో సంతృప్తినిచ్చే మృదువైన మెత్తటి వంటకంగా తయారు చేస్తారు. ఈ వంటక కేవలం పాక ఆనందం, రుచినే గాక సమాయనుకూల ఆరోగ్యకర వంకంగా పేరుగాంచింది. దీన్ని అక్కడ ప్రజలు ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం అల్పాహారంగా తీసుకుంటుంటారు. ఈ రాగిదిబ్బ రొట్టుకి కావాల్సిన పదార్థాలు:రాగి పిండి ( మిల్లెట్ పిండి) 1 కప్పుబియ్యం 1/2 కప్పుఉరద్ పప్పు (నలుపు) 1/4 కప్పుజీలకర్ర గింజలు 1/2 టీస్పూన్2 పచ్చిమిర్చి, సన్నగా తరిగినవి1 చిన్న ఉల్లిపాయ, సన్నగా తరిగిన (ఐచ్ఛికం)కొన్ని కరివేపాకు, తరిగినవిరుచికి ఉప్పువంట కోసం నూనెతయారుచేయు విధానం..బియ్యం,పప్పును నీటిలో 4 గంటలు నానబెట్టండి. నానబెట్టిన తర్వాత, నీటిని తీసివేసి, కొద్దిపాటి నీటిని ఉపయోగించి మెత్తటి పిండిలా అయ్యే వరకు రుబ్బాలి. ఒక పెద్ద గిన్నెలో, రుబ్బిన బియ్యం, మినపప్పు పిండిలో రాగి పిండిని కలపండి. మందపాటి, మృదువైన పిండిని రూపొందించడానికి బాగా కలపండి.ఇప్పుడు పిండిలో ఉప్పు, జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మరియు కరివేపాకు వేసి బాగా కలపాలి. గిన్నెపై మూతపెట్టి పరిసర ఉష్ణోగ్రతను బట్టి పిండిని 6-8 గంటలు లేదా రాత్రిపూట పులియనివ్వండి. కిణ్వన ప్రక్రియ పిండికి కొంచెం లూజ్‌నెస్ తెస్తుంది.మీడియం వేడి మీద భారీ అడుగు ఉన్న పాన్ లేదా కడాయిని వేడి చేయండి. ఒక టేబుల్‌స్పూన్ నూనె వేసి, చుట్టూ తిప్పండి. ఆ తర్వాత దానిలో గరిటెల పోసి పిండిని పోసి, మందపాటి గుండ్రని ఆకారంలో వేయండి. 4-5 నిమిషాల దిగువన బంగారు గోధుమ రంగు వచ్చే వరకు కాలనివ్వాలి. రోటీని జాగ్రత్తగా తిప్పి, మరొక వైపు కూడా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు ఉడికించాలి. ఇక్కడ దిబ్బరొట్టి రుచిగా వచ్చేలా అంచుల చుట్టూత కొద్దిగా నూనె జోడించాలి. దీన్ని చట్నీ, సాంబార్‌తో కలిపి తింటే ఆ రుచే వేరేలెవెల్..!(చదవండి: నీరజ్ చోప్రా ఫిట్నెస్ రహస్యం ఇదే..!) -
Jagananna Gorumudda-Ragi Java: బడి పిల్లలకు మరో పోషకాహారం.. ఉదయం పూట రాగి జావ (ఫొటోలు)
-
విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా.. సమూల మార్పులు తీసుకొస్తున్నాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: జగనన్న గోరుముద్ద ద్వారా బడి పిల్లలకు వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. తాజాగా రాగి జావ కోసం ఏటా మరో రూ.86 కోట్లు కలిపి మొత్తం రూ.1,910 కోట్లు వెచ్చిస్తూ పిల్లలకు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. సీఎం జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే ►దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ద్వారా పాల్గొంటున్న ప్రతి ఒక్క పాపకూ, బాబుకూ, వారి తల్లిదండ్రులకూ, ఉపాధ్యాయులరూ, ఇతర సిబ్బందికీ, రుచికరంగా వండిపెడుతున్న అమ్మలకు.. ప్రతి ఒక్కరికీ నా అభినందనలు: మనం అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచి కూడా అనేక అడుగులు వేశాం. ►బడిమానేసే పిల్లల సంఖ్యను తగ్గించడం ఎలా? స్కూళ్లలో సదుపాయాలను కల్పించడం ఎలా? మేథోవికాసాన్ని పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని అలోచించి అనేక చర్యలు చేపట్టాం. గర్భవతులైన మహిళల దగ్గరనుంచి చిన్నారుల వరకూ వచ్చే వరకూ సంపూర్ణ పోషణద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. తర్వాత ఇంగ్లిషు మీడియం, సీబీఎస్ఈ సిలబస్, బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్, ఐఎఫ్‌ఎపీ ప్యానెల్స్ ఆరోతరగతినుంచి ఏర్పాటు, ౮వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇవ్వడం… ఇలా ప్రతి అడుగులోనూ పిల్లలను చేయిపట్టి నడిపిస్తున్నాం ►అమ్మ ఒడి, విద్యాకానుక అమలు చేస్తున్నాం. పై చదువుల్లో కూడా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. మన పిల్లలు అందర్నీకూడా భావి ప్రపంచంతో పోటీపడేలా… వారు నెగ్గేలా ఈ కార్యక్రమాలు చేపట్టాం. గోరుముద్ద కార్యక్రమాన్ని మరింతగా పటిష్టంగా అమలు చేసేలా అడుగులు. ఇవ్వాళ్టి నుంచి రాగిజావ కూడా పిల్లలకు అందిస్తాం. గోరుముద్దను మరింత మెరుగ్గా చేయడానికే ఈ ప్రయ్నతాలు. పిల్లలకు ఐరన్ కాని, కాల్షియం కాని పెరగడానికి ఈ ఆహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. 1 నుంచి 10 తరగతి పిల్లలకు దాదాపు 38లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం ►మన ప్రభుత్వం రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒక సారి తేడాను గమనించండి. మొత్తం సంవత్సం అంతా కలిపినా కూడా గతంలో ఏడాదికి కేవలం రూ.450 కోట్లు కూడా ఖర్చు చేయలేని పరిస్థితి. ఆయాలకు 8-10 నెలలు బకాయిలు పెట్టే పరిస్థితి. సరుకులు కూడా 6-8 నెలలుగా బకాయిలు పెట్టే పరిస్థితి. ఇలా బకాయిల పెడితే… క్వాలిటీ అనేది ఉండదు. గోరు ముద్దద్వారా ప్రతిష్ట్మాతకంగా మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఇప్పుడు ఏడాదికి రూ.1824 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ►రోజుకో మెనూతో పిల్లలకు భోజనం పెడుతున్నాం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పిల్లలు ఏం తింటూ ఉన్నారు అనే ఆలోచన చేసిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. పిల్లలకు మంచి మేనమామలా.. ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మనం చేయకపోతే.. ఇంకెవరు చేస్తారన్న దీంతో గోరుముద్దను చేపట్టాం. మొత్తం 15 రకాల ఆహార పదార్థాలు పిల్లలకు గోరుముద్ద అందిస్తున్నాం. వారంలో 5 రోజులపాటు ఉడికించిన గుడ్లు ఇస్తున్నాం. మూడు రోజులు చిక్కి ఇస్తున్నాం. మిగిలిన మూడు రోజులు మంగళ, గురువారం, శనివారాల్లో రాగి జావ ఇప్పుడు ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో సత్యాసాయి ట్రస్టు భాగస్వాములు కావడం సంతోషకరం. ►శ్రీ సత్యసాయి స్వామి వారి ఆశీస్సులు కూడా ఈ కార్యక్రమానికి ఉంటాయని భావిస్తున్నాను. పరీక్షలు రాయబోతున్న పిల్లలందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ తెలియజేస్తున్నాను. ఏడాదికి రూ.84 కోట్లు రాగిజావ కోసం ఖర్చు చేస్తున్నాం, దీంతో గోరుముద్దకోసం చేస్తున్న ఖర్చు రూ.1910 కోట్లకుపైగా ఖర్చు అవుతుంది మధ్యాహ్న భోజనానికి సీఎం జగన్ ఓ రూపం తీసుకొచ్చారు: మంత్రి బొత్స మధ్యాహ్న భోజనానికి సీఎం జగన్ ఓ రూపం తీసుకొచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. స్కూళ్లలో సుమారు 15 వైరైటీలతో రోజుకో మెనూ అమలు చేస్తున్నామన్నారు. పిల్లలు పౌష్టికాహార లోపంతో ఉండకూడదనే సీఎం ఆశయం అని మంత్రి బొత్స అన్నారు. ►జగనన్న గోరుముద్ద ద్వారా బడి పిల్లలకు వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 37,63,698 మంది విద్యార్ధులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఏటా రూ.86 కోట్ల అదనపు వ్యయంతో రాగి జావ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బలవర్థకమైన ఆహారానికి ఏటా రూ.1,910 కోట్లు ►మధ్యాహ్న భోజన పథకానికి గత సర్కారు సగటున రూ.450 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇప్పుడు జగనన్న గోరుముద్ద ద్వారా దాదాపు నాలుగు రెట్లు అధికంగా ఏటా రూ.1,824 కోట్లు వ్యయం చేస్తున్నారు. తాజాగా రాగి జావ కోసం ఏటా మరో రూ.86 కోట్లు కలిపి మొత్తం రూ.1,910 కోట్లు వెచి్చస్తూ పిల్లలకు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ►మధ్యాహ్న భోజన పథకంలో ఇప్పటికే సమూల మార్పులు చేపట్టి జగనన్న గోరుముద్ద ద్వారా ప్రతి రోజూ రుచికరమైన మెనూతో బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందచేస్తోంది. ఐరన్, కాల్షియం లాంటి పోషకాలు అందించి విద్యార్థుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు వారానికి మూడు రోజులు (మంగళ, గురు, శని) బెల్లంతో కూడిన రాగిజావను అందించనున్నారు. చదవండి: రాగిజావను పాలు, బెల్లం, యాలకుల పొడితో కలిపి కాచుకుని తాగే అలవాటు ఉందా.. అయితే ►ఇక మిగిలిన 3 రోజులు గోరుముద్దలో బలవర్థకమైన చిక్కీని పిల్లలకు ఇస్తున్నారు. జగనన్న గోరుముద్దలో వారానికి 15 వెరైటీలు ఉండగా ఐదు రోజుల పాటు కోడిగుడ్డు, 3 రోజులు చిక్కీ ఇస్తున్నారు. ఇకపై మూడు రోజులు రాగిజావ కూడా అందనుంది. ఈ ఏడాది అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం కావడం, చిరుధాన్యాలను పండించే రైతులను ప్రోత్సహించే లక్ష్యంతో పథక నిర్వహణలో భాగంగా శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్ట్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నారు. నాడు నాసిరకం తిండి.. ►నాడు నాసిరకం ఆహారం, ఉడికీ ఉడకని అన్నం, రుచిపచీ లేని కూరలతో మధ్యాహ్న భోజన పథకాన్ని టీడీపీ సర్కారు నీరుగార్చింది. పిల్లలకు ఏమాత్రం రుచించని విధంగా ప్రతి రోజూ సాంబారు అన్నంతో కూడిన ఒకే రకమైన మధ్యాహ్న భోజనం సరఫరా చేయడంతో తినలేక అవస్థలు పడ్డారు. ►ఇక వంట సహాయకులకు గౌరవ భృతి నెలకు కేవలం రూ.1,000 మాత్రమే చెల్లించగా ఆయాల జీతాలు, సరుకుల బిల్లులు సైతం 8–9 నెలలు పెండింగ్‌లోనే ఉన్న దుస్థితి. గత సర్కారు హయాంతో పోలిస్తే ఇప్పుడు మూడు రెట్లు అధికంగా వంట సహాయకులకు నెలకు రూ. 3,000 చొప్పున గౌరవ భృతితోపాటు క్రమం తప్పకుండా గోరుముద్ద బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తోంది. చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ -
10 నుంచి రాగి జావ
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ త్వరలో ముగియనుండటంతో కొద్ది రోజులుగా నిలిచిపోయిన పథకాలు, కార్యక్రమాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మంగళవారం తన కార్యాలయ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్చి, ఏప్రిల్ నెలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పథకాలపై చర్చించి అమలు తేదీలను ఖరారు చేశారు. ఎన్నికల కోడ్‌తో సంబంధం లేనందున మార్చి 10వ తేదీ నుంచి మధ్యాహ్న భోజనంలో రాగి జావ అమలును ప్రారంభించాలని నిర్ణయించారు. పిల్లల్లో ఐరన్, కాల్షియం లోపాలను నివారించే లక్ష్యంతో మధ్యాహ్న భోజన పథకం మెనూలో రాగి జావను చేర్చిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ కారణంగా కొద్దిగా ఆలస్యమైన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను ఏప్రిల్ 6 నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ట్రయల్ రన్ ఇప్పటికే మొదలై విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మార్చి 14వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణ అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచి్చంది. బీఏసీ సమావేశంలో చర్చించి సమావేశాల షెడ్యూలును ఖరారు చేయనున్నారు. మార్చి, ఏప్రిల్‌లో షెడ్యూల్ ఇలా.. మార్చి 18న సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు. జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటీ పద్ధతిలో నగదు జమ. మార్చి 22న ఉగాది సందర్భంగా ఉత్తమ సేవలందించిన వలంటీర్ల పేర్ల ప్రకటన. ఏప్రిల్ 10న అవార్డులు, రివార్డులు ప్రదానం. మార్చి 23న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం. మార్చి 25 నుంచి వైఎస్సార్ ఆసరా. ఏప్రిల్ 5 వరకూ కొనసాగనున్న కార్యక్రమం మార్చి 31న జగనన్న వసతి దీవెన. ఏప్రిల్ 6న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో అమలు ఏప్రిల్ 18న ఈబీసీ నేస్తం. ఏప్రిల్ 10న ఉత్తమ సేవలందించిన వలంటీర్లకు సన్మానం -
జగనన్న గోరుముద్ద మెనూలో మరో న్యూట్రియెంట్ ‘రాగిజావ’
సాక్షి, అమరావతి: జగనన్న గోరుముద్దలో మరో న్యూట్రియెంట్ రాగిజావ చేరింది. మధ్యాహ్న భోజన పథకంలో మార్చి 2 నుంచి రాగిజావ ఇవ్వనున్నారు. పిల్లలకు ఐరన్, కాల్షియం లోపాలు లేకుండా నివారించడానికి రాగిజావను చేరుస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి ఛారిటబుల్ ట్రస్టు భాగస్వామ్యం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో విద్యాశాఖ అధికారులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టు ప్రతినిధులు ఎంఓయూ చేసుకున్నారు. జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజన పథకం) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమం. బడి ఈడు పిల్లల్లో ఎన్‌రోల్‌మెంట్‌ను పెంచడంతో పాటు వారిలో ధారణ సామర్ధ్యం మెరుగుపర్చి, డ్రాపౌట్స్‌ను తగ్గించే కార్యక్రమాల్లో భాగంగా వారికి స్కూళ్లోనే రుచికరమైన పౌష్టికాహారాన్ని మధ్యాహ్న భోజనంలో అందిస్తోంది. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 44,392 స్కూళ్లలో.. 37,63,698 విద్యార్ధులకు పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ఈ పథకాన్ని 1 నుంచి 10 వ తరగతి వరకూ అమలు చేస్తోంది. జనవరి 2020 న నిర్వహించిన సమీక్షలో... పిల్లలకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా మిడ్ డే మీల్స్‌పై ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమీక్షించి... వారికి అందిస్తున్న మెనూలో పలు మార్పులు చేపట్టారు. అందులో భాగంగా రోజు వారీ అందిస్తున్న మెనూతో పాటు పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి వారంలో 5 రోజులు గుడ్డు, మూడు రోజులు బెల్లం, పల్లీ చిక్కీ ఇవ్వాలని నిర్దేశించారు. బెల్లం, పల్లీ చిక్కీ ఇవ్వని రోజుల్లో పిల్లలకు తగినంత ఐరన్, కాల్షియం అందించేందుకు వీలుగా చిరుధాన్యాలను మధ్యాహ్న భోజనపథకంలో భాగం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ... జగనన్న గోరుముద్దలో రాగిజావ అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మధ్యాహ్న భోజనంలో చిక్కీ ఇవ్వని రోజుల్లో అందుకు బదులుగా రాగిజావను మెనూలో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. వారానికి మూడు రోజుల పాటు రాగిజావను మిడ్ డే మీల్స్‌లో భాగం చేశారు. ఈ కార్యక్రమం అమలు కోసం వివిధ స్వచ్ఛంద సంస్ధల భాగస్వామ్యం కూడా తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మిడ్ డే మీల్స్‌లో పిల్లలకు రాగిజావ అందించే కార్యక్రమంలో భాగస్వామి అయింది. ఇందులో భాగంగానే ఇవాళ క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో విద్యాశాఖ అధికారులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రతినిధులు ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే...: ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. శ్రీ సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులకు ధన్యవాదాలు. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమంలో భాగస్వామ్యులైనందుకు మీకు ధన్యవాదాలు. గోరుముద్ద కార్యక్రమంలో రాగిజావను అదనంగా చేర్చడం ద్వారా మరింత పౌష్టిహాకారం పిల్లలకు అందుతుంది. కేవలం గోరుముద్ద కార్యక్రమానికే రూ.1700 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మూడున్నరేళ్ల క్రితం గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించాం. గతంలో కేవలం రూ.600 కోట్లు మాత్రమే మధ్యాహ్న భోజన పథకానికి ఖర్చు పెడితే మన ప్రభుత్వ హయాంలో ఆ ఖర్చు దాదాపు మూడు రెట్లు పెరిగింది. విద్యారంగంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టాం. తల్లులు తమ పిల్లలను బడికి పంపించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్నివ్వడానికి ఉద్దేశించిన అమ్మఒడి దగ్గర నుంచి మొదలు పెడితే.. నాడు– నేడు ద్వారా స్కూళ్ల వ్యవస్ధను మార్పు చేసే కార్యక్రమం చేస్తున్నాం. 6వతరగతి ఆ పై తరగతుల్లో ప్రతి తరగతి గదిలో డిజిటిల్ స్క్రీన్ ఐఎఫ్పి ఏర్పాటు చేస్తున్నాం. 30,230 తరగతి గదుల్లో ఈ ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్(ఐఎఫ్పి)లను ఏర్పాటు చేస్తున్నాం. నాడు–నేడు తొలిదశ పూర్తి చేసుకున్న సుమారు 15వేల స్కూళ్లలో ఈ జూన్ నాటికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. నాడు –నేడులో ఆఖరు కాంపొనెంట్ 6వతరగతి ఆపై తరగతులను డిజిటలైజ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. అంతకంటే దిగువ తరగతుల వారికి స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేస్తున్నాం. చదవండి: మెరుగైన పనితీరు కనబర్చాలి: సీఎం జగన్ వీటితో పాటు పిల్లలకు విద్యాకానుక, గోరుముద్ద, ఇంగ్లిషు మీడియం, సీబీఎస్ఈ సిలబస్, బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్, 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్, 8వతరగతి పిల్లలకు ట్యాబులు పంపిణీ వంటి అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపడతున్నాం. పిల్లల కరిక్యులమ్‌ను బైజూస్ కంటెంట్‌తో అనుసంధానం చేస్తూ.. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నాం. మరోవైపు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పిల్లల కోసం విద్యాదీవెన– 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్, రూ.20 వేల వరకు వసతి దీవెనను అమలు చేస్తున్నాం. తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తున్నాం. మరోవైపు విదేశీ విద్యా దీవెనను కూడా అమలు చేస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ –50 కాలేజీలలో, 21 రకాల విభాగాలు, లేదా కోర్సులకు సంబంధించి సీట్లు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.1.25 కోట్ల వరకు ఈ పథకం కింద ప్రభుత్వం అందిస్తుంది. మిగిలిన వారికి రూ.1 కోటి వరకు అందిస్తుంది. రేపు కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ పథకంలో అర్హత పొందాలంటే కనీసం పదోతరగతి పాస్ కావాలనే నిబంధన విధించాం. ఇవన్నీ విద్యాంగంలో గొప్ప మార్పులు తీసుకొచ్చే అడుగులు. గోరుముద్ద మెనూలో రాగిజావను అమలు చేసే ప్రయత్నంలో సత్యసాయి ట్రస్టు భాగస్వామ్యం కావడం మంచి పరిణామం. సత్యసాయి ట్రస్టు భాగస్తులు కావడం ద్వారా.. భగవాన్ సత్యసాయి కూడా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి ముందుకు తీసుకుపోతున్నారని చెప్పవచ్చు. మనం కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం మెరుగైన సమాజం దిశగా ఉపయోగపడుతుంది. అందరికీ అభినందనలు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ జే. రత్నాకర్‌లు మాట్లాడారు. బొత్స సత్యనారాయణ, విద్యాశాఖమంత్రి మీ ఆలోచనలు, ఆదేశాలతో మార్చి 2 వ తేదీ నుంచి రాగిజావను జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా అందించాలని నిర్ణయించారు. దీనికి రూ.86 కోట్లు ఖర్చవుతుంది. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్ధలను భాగస్వామ్యం చేయాలన్న ఆలోచనతో సత్యసాయి ట్రస్టును ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగింది. దీనికి అవసరమైన రాగి పిండి, బెల్లం పిండి సత్యసాయి ట్రస్టు సరఫరా చేస్తుంది. దీని ఖరీదు సుమారు రూ.42 కోట్లు ఉంటుంది. మూడు సంవత్సరాల పాటు సరఫరా చేస్తారు. దీనికి సంబంధించి ఇవాళ ఒప్పందం చేసుకుంటున్నాం. వారికి కృతజ్ఞతలు. భారతదేశంలో మిడ్ డే మీల్స్‌ను ఇంత సమర్ధవంతంగా అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. రత్నాకర్, శ్రీ సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ సత్యసాయి సేవా సంస్ధలు సేవానిరతితో పనిచేస్తున్నాయి. బాబా గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. విద్యాశాఖ మంత్రి, అధికారులు మిడ్ డే మీల్స్‌లో రాగిజావ అందించే కార్యక్రమం గురించి చెప్పినప్పుడు .... ట్రస్టు బృందం సభ్యులందరూ దీనిని చాలా మంచి కార్యక్రమమని ప్రోత్సహించారు. అందుకే ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చాం. ముఖ్యమంత్రిగా మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగాంలో చేస్తున్న కృషి కచ్చితంగా విద్యకు పునరుజ్జీవనం తీసుకొస్తుంది. మీరు చెప్తున్న ప్రతి మాటను అక్షరాలా అమలు చేసి చూపిస్తున్నారు. విద్యా రంగంలో మీరు అమలు చేస్తున్న పథకాలు వింటున్నాం.. చూస్తున్నాం. మీరు మధ్యాహ్న భోజనానికి పెట్టిన జగనన్న గోరుముద్ద పేరు చాలా బాగుంది. అమ్మ చేతి గోరు ముద్ద గుర్తుకు వచ్చేలా మంచి పేరు ఎంపిక చేశారు. మీరు అమలు చేస్తున్న అమ్మఒడి, ఆసరా ఇలా అన్నీ మంచి పథకాలు. మీరు చేస్తున్న కార్యక్రమాల్లో అన్నింటి కంటే నాడు–నేడు కార్యక్రమం అందరి కళ్లకూ ప్రత్యక్షంగా కనిపిస్తున్న మంచి, గొప్ప కార్యక్రమం. ఈ దేశం, రాష్ట్రం సురక్షితమైన భవిష్యత్తుకు పిల్లల చదువులు చాలా ముఖ్యం. పేద పిల్లలను చదువుకునే ప్రభుత్వ బడులను.. మీరు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మారుస్తున్నారు. చివరిగా.. నూతనంగా ఏర్పడిన జిల్లాకు శ్రీ సత్యసాయి జిల్లాగా నామకరణం చేయడంపై మీకు ఈ రాష్ట్రం, దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సాయి భక్తుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది కేవలం మీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఈ నిర్ణయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సీ ఎన్ దీవాన్‌రెడ్డి, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిధి మీనా, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పి బసంత్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు. -
Hyderabad: వహ్వా.. జావ!.. అంబలి కేంద్రాలకు క్యూ కడుతున్న జనం
సాక్షి, హైదరాబాద్: మన ఆరోగ్యం తనం తీసుకునే ఆహార అలవాట్లలో ముడిపడి ఉంటుందన్నది జగ మెరిగి న సత్యం. గతంలో మంచి ఆహారపు అలవాట్లకు దూరంగా ఉన్న నగర వాసులు కరోనా మహమ్మా రి పుణ్యమాని తమ ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా ఏదైనా పార్కులో వాకింగ్, వ్యాయామం చేయడం వంటి వాటిపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇలా నగర వ్యాప్తంగా ఏ పార్కులు, కాలనీల్లోని రోడ్లపై ఉదయం వేళల్లో చూస్తే వేలాది మంది జాగింగ్, వాకింగ్, వ్యాయామాలు చేస్తూ కనిపిస్తుంటారు. వీటితో పాటు తినే ఆహారంపై సైతం ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. నడక ముగిసిన తరువాత జావ(అంబలి)ని తీసుకుంటున్నారు. అంబలి తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తోందని వైద్యులు సైతం సలహాలు ఇవ్వడంతో ఆ దిశగా అలవాటు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్లలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉద్యోగాల కోసం కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో నిరాశ, బడలిక నుంచి విముక్తి పొందేందుకు జావ తాగుతూ సేద తీరుతున్నారు. వీరి కోసం వాకింగ్ సెంటర్లు, పార్కుల వద్ద రాగి, జొన్నలతో తయారు చేస్తున్న జావ సెంటర్లు వెలుస్తున్నాయి. నిజాంపేట్ పరిధిలో పదుల సంఖ్యలో.. నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని పలు పార్కు లు, చెరువుల వద్ద జావ విక్రమ కేంద్రాలు ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయి. ప్రగతినగర్, నిజాంపేట్, బాచుపల్లి ప్రాంతాల్లోని ఉదయం, సాయంత్రం వేళల్లో జాగింగ్, ఓపెన్ జిమ్‌లలో వ్యాయామం చేసే వారు ఎక్కువగా జావను తీసుకుంటున్నారు. వీటితో పాటు జ్యూస్‌లు, గ్రీన్ టీలను సైతం నిర్వాహకులు అందుబాటులో ఉంచుతున్నారు. ఓపెన్ జిమ్‌లో వ్యాయామం చేస్తూ.. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉత్తమ ఆహారం.. జొన్న జావ డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. రాగి, జొన్న వంటివి తినడం వల్ల పిల్లల నుంచి పెద్దల వరకు శక్తిని ఇస్తా యి. పిల్లల ఎదుగుదలకు దోహదం చేస్తాయి. ఇందులో కాల్షియం తదితర పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉత్తమ ఆహారంగా పేర్కొనవచ్చు. పోషక విలువలుండే ఆహారం ఎంతో అవసరం జావ, జ్యూస్‌లు, గ్రీన్ టీ వంటివి వాకర్లకు ఎంతో అవసరం. పురాతన కాలంలో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగించిన ఆ హార పదార్థాలనే నేడు అందరూ ఉపయోగిస్తున్నారు. అత్యధిక పోషక విలువలుండే రాగులు, జొన్నలు మన శరీరానికి ఎంతో అవసరం. నేడు చాలా మంది మధుమేహం వ్యాధిన పడుతున్నారు. రోజు వాకింగ్ చేసిన తరువాత ఒక గ్లాస్ జావ తాగితే దాన్ని నివారించవచ్చు. – చంద్రయ్య, బాచుపల్లి జొన్న, రాగి జావలను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి జావను ఒక రోజు తాగా, మంచి రుచిగా అనిపించడంతో ప్రతి రోజు అల్లం టీ తాగే అలవాటును మానుకుని జావ తాగుతున్నాను. వాకింగ్ తరువాత జావ తాగితే శరీరం అంతగా అలసట అనిపించడం లేదు. శరీరానికి శక్తిని ఇచ్చే జొన్న, రాగి జావలను ప్రతి ఒక్కరూ సేవించాలి. – సుధాకర్, ప్రగతినగర్ నిత్యం జావ తాగే వారు పెరుగుతున్నారు జొన్న, రాగులతో చేసిన జావను వాకింగ్ చేసిన తరువాత తాగాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామం చేసిన అనంతరం తాగితే మంచిది. తాను తయారు చేస్తున్న జావతో పాటు సజ్జ లడ్డూలను సైతం ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ప్రగతినగర్ ప్రాంతంలో గత ఐదేళుŠాల్గ జావ విక్రయాలు చేపడుతున్నాను. నిత్యం జావ తాగే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. – శ్రీరాములు, జొన్న, రాగి జావ విక్రయదారుడు -
Summer Tips: అంబలి తాగుతున్నారా.. స్థూలకాయం, మధుమేహం.. ఇంకా
వేసవిలో మరో అద్భుతమైన ఆహారం అంబలి. సాధారణంగా రాగిపిండితో అంబలిని తయారు చేస్తారు. ఒక్కోసారి ఇతర తృణధాన్యాల పిండిని కూడా వాడతారు. రాగిపిండితో జారుగా తయారు చేసుకునే జావను అంబలి అని, రాగిజావ అని రాగిమాల్ట్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. అంబలిలో మజ్జిగ కలుపుకొని తీసుకుంటే, వేసవి తీవ్రతను తట్టుకునే శక్తి వస్తుంది. అంబలి సర్వకాలాల్లోనూ తీసుకోదగినదే అయినా, వేసవిలో దీనిని తీసుకోవడం ఆరోగ్యరీత్యా చాలా అవసరం. బరువు తగ్గాలనుకునేవారు కాలాలతో నిమిత్తం లేకుండా, ప్రతిరోజూ అంబలి తీసుకోవచ్చు. అంబలి తీసుకుంటే త్వరగా ఆకలి కాకుండా ఉంటుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉండటమే కాకుండా, కేలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల స్థూలకాయానికి, దానివల్ల తలెత్తే మధుమేహం వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు అంబలి చక్కని విరుగుడు. చద్దన్నం మాదిరిగానే అంబలి వినియోగం కూడా కొంతకాలం వెనుకబడినా, ఇటీవలి కాలంలో దీని వినియోగం బాగా పెరిగింది. చదవండి: Sugarcane Juice Health Benefits: చెరకురసం తీసేప్పుడు అల్లం, నిమ్మకాయ, పుదీనా కూడా కలిపి నలగ్గొడుతున్నారా.. అయితే -
మాస్టారు కడుపు చల్లగా.
మెదక్‌రూరల్: సేవ చేయాలనే తపన ఉంటే ఎదో ఒక రూపంలో చేయవచ్చని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడు నిరూపిస్తున్నాడు. ఆరేళ్లుగా వేసవిలో విద్యార్థులకు సొంత ఖర్చుతో అంబలి అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతనే మెదక్ మండలం మక్తాభూపతిపూర్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం తారక సత్యనారాయణ. 2011 నుంచి.. 2011లో ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ మండుటెండలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న విద్యార్థులను చూసి చలించారు. ఏదో రకంగా సేవచేయాలని ఆలోచించి 2012–13 నుంచి ప్రతి ఏడాది వేసవిలో ఒంటిపూట బడులు ప్రారంభం అయిన నాటి నుంచి విద్యార్థులకు ఉచితంగా అంబలిని అందిస్తున్నాడు. 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 150 మంది విద్యార్థులకు ఉదయం 10 నుండి 11 గంటల సమయంలో అంబలిని ఇస్తున్నారు. రాగులతో తయారుచేసిన అంబలిలో పోషక పదార్థాలు, కాల్షియం ఉంటాయని, అవి ఇస్తే విద్యార్థులు ఆదర్శంగా ఉంటారని హెచ్ఎం సత్యనారాయణ చెబుతున్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులకుప్రోత్సాహం.. సేవాకార్యక్రమాలు చేయడంతో పాటు ప్రతిభ గల విద్యార్థులకు సత్యనారాయణ ప్రోత్సాహం అందిస్తున్నాడు. పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులలో ప్రతీ ఏడు చివరి పరీక్షలలో మొదటి స్థానంలో నిలిచే ఒక్కో విద్యార్థి«కి రూ. 200 చొప్పున ప్రోత్సాహక బహుమతిగా అందిస్తున్నాడు. ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలలో మూడు స్థానాల్లో నిలిచిన ముగ్గురు విద్యార్థులకు ఏటా రూ. 500 చొప్పున బహుమతిగా అందిస్తూ ప్రోత్సహిస్తున్నాడు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని.. ఎండాకాలంలో రాగులతో తయారు చేసిన అంబలి విద్యార్థులకు ఆరోగ్యకరం. అంబలిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అంబలి సేవించడంతో రక్తం శుద్ధి కావడంతో పాటు ఎముకలు గట్టిపడుతాయి. నేను పనిచేస్తున్న పాఠశాలలో చదవుకునే విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఉండాలన్న ఉద్ధేశ్యంతో నా వంతు సహాకారం అందిస్తున్నాను. విద్యార్థులకు వేసవిలో ఉపశమనం కలిగేలా అండలి అందించడం ఆనందంగా ఉంది. –సత్యనారాయణ, హెచ్ఎం, మక్తాభూపతిపూర్ -
ఆరాగించండి
మాగిన పండులా మేను మిలమిలలాడటం ఎలా? ఒళ్లు చేయకుండా తీగలా సాగడం ఎలా? ఆరోగ్యం కోటలో పాగా వేయడం ఎలా? రాగులతో చేసిన వంటలు తింటే చాలు! మరి... అవి వండుకోవడం ఎలా? ఏముంది మన ఫ్యామిలీ చదివితే చాలు. రాగి అంబలి కావలసినవి: రాగిపిండి - అరకప్పు; ఉల్లి తరుగు- అరకప్పు పచ్చిమిర్చి తరుగు- ఒక చెంచా; జీలకర్ర పొడి- ఒక చెంచా కరివేపాకు- ఒక రెమ్మ ; కొత్తిమీర తరుగు - ఒక కప్పు ఉప్పు- తగినంత; మజ్జిగ- రెండు కప్పులు తయారీ: రాగిపిండిలో ఒక కప్పు నీరు కలపాలి. ఈ ద్రవాన్ని అరలీటరు మరుగుతున్న నీటిలో పోసి అడుగు పట్టకుండా గరిటెతో కలుపుతూ ఐదారు నిమిషాల సేపు ఉడికించాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మజ్జిగ, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, జీలకర్ర పొడి, కొత్తిమీర, కరివేపాకు కలపాలి. రుచి ఇనుమడించాలంటే కొద్దిగా నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇది ఎండాకాలం వేసవి తాపాన్ని తగ్గించడానికి బాగా పనికొస్తుంది. రాగి- మెంతి రొట్టె కావలసినవి: రాగిపిండి - ఒక గ్లాసు గోధుమ పిండి- పావు గ్లాసు; ఉప్పు - తగినంత ఉల్లి తరుగు- అర కప్పు; మెంతి ఆకులు- ఒక కప్పు పచ్చిమిర్చి తరుగు- రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక చెంచా; జీలకర్ర- ఒక చెంచా నూనె లేదా నెయ్యి - కాల్చడానికి తగినంత తయారీ: వెడల్పాటి గిన్నెలో రాగిపిండి, గోధుమపిండి తీసుకుని అందులో ఉల్లితరుగు, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, మెంతికూర, జీలకర్ర, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి, నీటిని పోస్తూ చపాతీల పిండిలా కలపాలి. పిండి మీద తడి వస్త్రాన్ని కప్పి 15 నిమిషాల సేపు పక్కన ఉంచాలి. ఆ తర్వాత పిండిని పెద్ద నిమ్మకాయంత గోళీలు చేసుకోవాలి. అట్ల పెనం వేడి చేయాలి. పిండి ముద్దలను రొట్టెలుగా వత్తి పెనం మీద వేసి కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ రెండు వైపులా కాల్చాలి. వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. ఘాటుగా కావాలంటే చట్నీతో తినవచ్చు. గమనిక: ఈ రొట్టెలను వత్తడం చాలా నైపుణ్యంతో కూడిన పని. అరిటాకు మీద వేసి చేత్తో వత్తుకోవచ్చు. చపాతీల పీట మీద రొట్టెల కర్రతోనూ చేసుకోవచ్చు. గోధుమ పిండి లేకుండా కూడా చేసుకోవచ్చు. కానీ కేవలం రాగి పిండితో చేస్తే పెళుసుగా విరిగిపోతుంటాయి. కాబట్టి గోధుమపిండి కలుపుకుంటే రొట్టెలు విరగవు. మధుమేహంతో బాధపడే వాళ్లు ఆహారంలో ఒక పూట రాగి రొట్టెను చేర్చుకోవచ్చు. రాగిలడ్డు కావలసినవి: రాగిపిండి- ఒక కప్పు; బెల్లం- ఒక కప్పు వేయించిన నువ్వులు- అర కప్పు; నెయ్యి- మూడు చెంచాలు ఏలకుల పొడి- ఒక చెంచా; జీడిపప్పు, కిస్మిస్ - పిడికెడు తయారీ: * మందపాటి బాణలిలో రాగిపిండిని (నూనె లేకుండా) దోరగా వేయించాలి. * నేతిలో జీడిపప్పు, కిస్మిస్ వేయించి రాగిపిండిలో వేయాలి. * పావు కప్పు నువ్వులను మిక్సీలో కాస్త పలుకుగా పొడి చేసుకోవాలి. అందులోనే బెల్లం తురుము, ఏలకుల పొడి వేసి మరోసారి బ్లెండ్ చేస్తే సమంగా కలుస్తుంది. నువ్వులలోని నూనె, బెల్లంలోని తేమ కలిసి మిశ్రమం ముద్దగా అవుతుంది. ఈ మిశ్రమాన్ని రాగిపిండిలో వేసి బాగా కలపాలి. * ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని మిశ్రమాన్ని లడ్డులుగా చేయాలి. లడ్డును వేయించిన నువ్వులలో ముంచి, నువ్వులు లడ్డుకు పట్టించాలి. గమనిక: మిశ్రమం తయారైన తర్వాత అది లడ్డు కట్టడానికి అనువుగా లేదనిపించే ప్రమాదం లేకపోలేదు. పిండి మరీ గట్టిగా ఉంటే మరిగించిన పాలను వేసి కలుపుకోవాలి. మరీ జారుడుగా ఉంటే మరి కొంత రాగిపిండిని లేదా నువ్వుల పొడిని కలుపుకోవాలి. పాలు వేసి కలిపినప్పుడు ఎక్కువ రోజులు నిల్వ చేయరాదు. రాగిజావ కావలసినవి: రాగిపిండి- ఒకకప్పు బెల్లం పొడి- ఒక కప్పు ఏలకుల పొడి- అరచెంచా బాదంపప్పు, పిస్తా- నాలుగు పలుకులు కాచిన పాలు - ఒక కప్పు తయారీ: రాగిపిండిని ఆరు కప్పుల నీటిలో వేసి కలపాలి. తర్వాత మీడియం మంట మీద పెట్టి పిండి అడుగుకు అంటకుండా గరిటెతో కలుపుతూ ఐదు నిమిషాల సేపు ఉడికించాలి. ఇందులో బెల్లం పొడి, ఏలకుల పొడి, బాదం, పిస్తా పలుకులు వేసి సన్నమంట మీద మరో మూడు నిమిషాల సేపు ఉడికించి దించేయాలి. చల్లారిన తర్వాత పాలు కలుపుకుంటే రాగి మాల్ట్ లేదా రాగి జావ రెడీ. గమనిక: మధుమేహం ఉన్న వాళ్లు రాగిమాల్ట్ బెల్లం లేకుండా చేసుకోవచ్చు. పిల్లలు మరింత తియ్యగా ఇష్టపడతారనుకుంటే బెల్లం మోతాదు పెంచుకోవచ్చు. మాల్ట్ తయారీ: రాగిమాల్ట్ తయారీకి రాగిపిండి తయారు చేసుకునే విధానం వేరుగా ఉంటుంది. రాగులను కడిగి రాత్రంతా నానబెట్టి వడబోసి నూలు వస్త్రంలో మూటగట్టాలి. మొలకలు వచ్చిన తర్వాత ఎండబెట్టి మరపట్టించాలి. మొలకెత్తిన రాగుల పిండితో చేసిన జావను మాత్రమే మాల్ట్ అనాలి. మొలకెత్తించిన ధాన్యంలో పోషకాలు పెరుగుతాయి. రాగి కుడుములు కావలసినవి: రాగిపిండి- ఒక కప్పు; బెల్లం - ఒక కప్పు కొబ్బరి కోరు- అర కప్పు; నెయ్యి - రెండు చెంచాలు ఏలకుల పొడి- అర చెంచా తయారీ: రాగిపిండిని బాణలిలో వేసి సన్నమంట మీద (నూనె లేకుండా) దోరగా వేయించాలి. అందులో కొబ్బరి కోరు కలిపి పక్కన ఉంచాలి. * బెల్లాన్ని లేతపాకం పట్టాలి. ఇప్పుడు అందులో రాగిపిండి- కొబ్బరి మిశ్రమం, ఏలకుల పొడి, నెయ్యి వేసి కలపాలి. చపాతీల పిండిలా ఉండాలి. అవసరమైతే పిండి కలిపేటప్పుడు మరికొంత వేడి నీటిని చల్లుకోవచ్చు. * చేతికి నెయ్యి రాసుకుని పిండిని నచ్చిన ఆకారంలో చేసుకుని ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి మీద పది నిమిషాల సేపు ఉడికించాలి. పాకం తయారీ: బెల్లంలో పావు కప్పు నీటిని పోసి కరిగిన తర్వాత వడపోయాలి. బెల్లంలో చిన్న రాయి, చెరకు పీచు వంటివి ఉంటే వేరవుతాయి. ఇప్పుడు స్వచ్ఛమైన బెల్లం నీటిని మీడియం మంట మీద కలుపుతూ ఉడికించాలి. మిశ్రమాన్ని వేళ్లతో తాకినప్పుడు వేళ్లకు అతుక్కోవాలి. షెఫ్ : రాంబాబు కర్టెసీ : క్రాంతి కుమార్ రెడ్డి, హైదరాబాద్