మిల్లెట్లతో చేసుకునే ఆరోగ్యకరమైన ఆహారం అనగానే ముందుగా గుర్తొచ్చే వాటిల్లో ఒకటి రాగులు. రాగులు లేదా ఫింగర్ మిల్లెట్స్‌తో రక రకాల వంటకాలను చేసుకోవచ్చు. ఇపుడు మాత్రం రాగిముద్దను ఎలా చేసుకోవాలో చూద్దాం.
చిరుధాన్యాల్లో అతి ముఖ్యమైన రాగులలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, అయోడిన్ ఎక్కువగా లభిస్తాయి. కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆహారం. గ్లూటెన్ లోపంతో బాధపడేవారు దీన్ని తీసుకోవచ్చు. ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. చాలా సులభంగా జీర్ణమవుతుంది కూడా.
కావలసిన పదార్థాలు :
రాగుల పిండి - 2 కప్పులు, నెయ్యి - 1 టేబుల్ స్పూన్, ఉప్పు - రుచికి తగినంత
తయారీ
ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లను బాగా మరిగించాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి. ఇంతలో రాగి పిండి కొద్ది నీళ్లు పోసి కలపుకావాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో రాగి పిండిని మెల్లగా వేయాలి. మిశ్రమం చిక్కగా బుడగలొస్తాయి. ఇపుడు మంటను పూర్తిగా తగ్గించి, మరికొంచెం పిండిని కలపాలి. గట్టి చెక్క కర్ర లేదా గరిటె అయితే కలపడానికి ఈజీగా ఉంటుంది. తక్కువ మంటతో నెమ్మదిగా కలుపుతూ ఉంటే పిండి ముద్దగా అవుతుంది. కావాలనిపిస్తే ఇంకొంచెం పిండి కలుపుకోవచ్చు. దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. చల్లారాక చేతిలో నెయ్యి రాసుకుని నిదానంగా మెత్తగా ముద్దలా చేసుకోవాలి. అంతే రాగి ముద్ద రెడీ. పర్ఫెక్ట్‌గా చేసిన రాగి ముద్ద వేళ్లతో తాకినప్పుడు అంటుకోకుండా ఉంటుంది.
ఇదే తరహాలో మరికొందరు రాగుల పిండిలో నూకలు లేదా బియ్యంతో కలిపి కూడా రాగిముద్ద లేదా సంకటి చేసుకుంటారు.
ఎలా చేసినా వేడి వేడి నాటుకోడి పులుసు, మటన్ సూప్‌తో రాగిముద్దను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇంకా పప్పు లేదా సాంబారు, గోంగూర పచ్చడి కాంబినేషన్ కూడా అదిరి పోతుంది.
ఇదీ చదవండి: భార్యామణికోసం ఏకంగా ఐలాండ్‌నే కొనేసిన వ్యాపారవేత్త?!
Comments
Please login to add a commentAdd a comment